రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఒక కొత్త పధ్ధతిని తీసుకోవచ్చింది. అదే రివర్స్ టెండరింగ్. అయితే ఈ రివర్స్ టెండరింగ్ తో లాభామా, నష్టమా అంటే, ఎవరి వాదన వారికి ఉంది. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అయితే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ రివర్స్ టెండరింగ్ ను, జగన్ పాలనకు ఆపాదిస్తూ, రివర్స్ పాలన అంటూ, తుగ్లక్ పాలన అంటూ, ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులు కూడా కొన్ని అలాగే ఉండటంతో, ప్రజలు కూడా ఆ విమర్శలకు కనెక్ట్ అవుతున్నారు. తాజాగా మరో సంఘటన ఇలాగే జరిగింది. అయితే ఇది ప్రభుత్వంలో జరిగిన సంఘటన కాదు, అధికార వైసిపీ పార్టీ నాయకులు చేసిన ఘటన. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతి పరులు, విజయసాయి రెడ్డి లాంటి వారు, ఎలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారో, చూపించారు.

jogi 08102019 2

బూతులు తిడుతూ, అసభ్యకర భాష వాడుతూ, పెడుతున్న పోస్టింగ్ లు చూపిస్తూ, ఇలాంటి వారిని అరెస్ట్ చెయ్యకుండా, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేసి, అరెస్ట్ చెయ్యటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. చంద్రబాబు అన్ని వివరాలు చెప్పటం, ప్రెజంటేషన్ చూపించటంతో, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాయి. దీంతో, వైసిపీ కూడా కౌంటర్ స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ దగ్గర ఉండి, తమ పార్టీ నాయకుల పై అసభ్యంగా పోస్ట్ లు పెట్టిస్తున్నారని, నిన్న జోగి రమేష్, డీజీపీని కలిసి ఫిర్యాదు చేసారు. వారి పై చర్యలు తీసుకోవాలని, పోలీసులను కోరారు. వెంటనే వారిని ఆరెస్ట్ చెయ్యాలని కోరారు.

jogi 08102019 2

హైదరాబాద్ లో ఉన్న బాలకృష్ణ ఆఫీస్ నుంచి, 2 వేల మండి పని చేస్తూ, ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అయితే, బాలకృష్ణ ఇలాంటి పనులు చేపిస్తున్నారంటే ఎవరూ నమ్మరు. అదీ కాకా, వైసీపీ రివర్స్ స్ట్రాటజీ ఇక్కడ కనిపిస్తుంది. గతంలో, షర్మిల పై, అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారి పై, హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చింది వైసిపీ. అయితే, ఇప్పుడు హైదరాబాద్ లో, బాలకృష్ణ ఆఫీస్ లో, అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారని, అమరావతిలో కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి ఈ కంప్లైంట్ ఇవ్వాల్సింది హైదరాబాద్ లో. అక్కడ అయితే పోలీసులు నిజాన్ని నిగ్గు తేలుస్తారని, ఇది కేవలం రాజకీయ పరంగా ఇచ్చిన డమ్మీ కంప్లైంట్ కాబట్టి, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి, వార్తల్లో ఒక వార్త వేసారనుకోవాలి. ఇలా ఉంటాయి, వైసీపీ చేసే రివర్స్ పనులు, అని టిడిపి అంటుంది.

వైసీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి చేసిన చర్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎందుకు ఇలా చేసారు అంటూ, తీవ్ర చర్చ నడుస్తుంది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, ఆయన సతీమణి దేవికారాణి విషయంలో విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చూసి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. రవిప్రకాశ్‌ వందలాది కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడ్డారాని, అతని పై సిబిఐ, ఈడీ చేత విచారణ చేపించాలని, విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు. ఆర్‌బీఐ, ఐటీ నిబంధనలు, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, విదేశీ బ్యాంకుల్లో రవి ప్రకష్ వేల కోట్ల నల్ల డబ్బు దాచుకున్నారని విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు. రవిప్రకాశ్‌ తన హోదాను ఉపయోగించుకుని బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలకు పాల్పడ్డారని, న్యూస్‌ చానళ్లు, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని , వేల కోట్ల డబ్బులు వెనకేసుకున్నాడని, విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు.

vsreddy 08102019 1

అంతే కాదు, మొసద్దీలాల్‌ జువెలర్స్‌కు చెందిన సుకేశ్‌ గుప్తాతో కలిసి పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, సతీష్ సానాతో కూడా లింకులు ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నిజానికి సతీష్ సానా, జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుకున్న కోనేరు మధుకు, బెయిల్ ఇప్పించటం కోసం, లంచాలు తీసుకున్నారని, అతని పై ఆరోపణలు ఉన్నాయి. దానికి బొత్సా, షబ్బీర్ అలీ కూడా సాక్ష్యం అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా, ఇప్పుడు విజయసాయి రెడ్డి చర్య ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ముందుగా ఏదైనా కంప్లైంట్ ఉంటే, కేంద్రానికి కాని, సిబిఐ , ఈడీలకు కాని చెప్తారు. వాళ్ళు పట్టించుకోక పొతే అప్పుడు సుప్రీం కోర్ట్ కు వెళ్తారు. అది కూడా పిటీషన్ రూపంలో కేసు ఫైల్ చేస్తారు.

vsreddy 08102019 1

ఇక్కడ విజయసాయి రెడ్డి మాత్రం లేఖ రాసారు. జగన్ కేసులో కూడా, అన్ని ఆధారాలతో కోర్ట్ లో పిటీషన్ వేస్తే, అప్పుడు కోర్ట్ ముందుకు వెళ్ళింది. మరి ఇక్కడ విజయసాయి రెడ్డి ఇలా ఎందుకు చేసారు అనే చర్చ కొనసాగుతుంది. అందులోను, ప్రస్తుతం కేంద్రంలో విజయసాయి రెడ్డికి పలుకుబడి ఉంది. మరి కేంద్రంతో చెప్పి, రవి ప్రకాష్ మీద అన్ని ఆధారాలు చూపించి, సిబిఐ, ఈడీ విచారణ కోరవచ్చు. అలా ఎందుకు చెయ్యలేదు ? కేంద్రంలో విజయసాయి రెడ్డి మాట వినటం లేదా ? సుప్రీంలో కేసు వెయ్యకుండా, లేఖ ఎందుకు రాసారు ? కేవలం ప్రచారం కోసమేనా ? ప్రస్తుతం రవి ప్రకాష్ కు, తెలంగణాలో ఉన్న మేఘా, రామేశ్వర రావుకి యుద్ధం జరుగుతుంది. అందులో భాగంగానే, రవి ప్రకాష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కేసిఆర్ మెప్పు పొందటానికి, విజయసాయి ఇలా చేసారా ? అయినా ఇప్పటికే తన పై ఉన్న 11 సిబిఐ, 5 ఈడీ కేసుల విషయంలో విచారణ ఎదుర్కుంటూ, ఇలా ఇతరుల పై కేసులు పెడితే, అవతలి వారు నమ్ముతారా ? చూద్దాం ఏమి జరుగుతుందో ?

దసరా పండుగ రోజున, తెలుగుదేశం పార్టీలో గత నాలుగేళ్ళుగా ఉన్న కోవర్ట్ వెళ్లిపోయాడని, పార్టీకి పట్టింది ఈ రోజుతో వెళ్ళిపోయిందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషిస్తున్నారు. ఇన్నాళ్ళు ఇతను కోవర్ట్ అని తెలియక, చంద్రబాబు అతనికి, పార్టీలో టాప్ స్థానం ఇచ్చారని, చివరకు, ఇక్కడవి అన్నీ అక్కడ చేరవేసి, పార్టీకి నష్టం చేసి, ఈ రోజు పార్టీ వదిలి వెళ్లిపోయారని, చంద్రబాబు ఇకనైనా, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. ఆ నేతే జూపూడి ప్రభాకర్. చంద్రబాబు ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎమ్మెల్సీ కూడా చేద్దామని అనుకున్నారు. కాని చివరలో, ఏదో టెక్నికల్ ఇబ్బంది వచ్చి, పదవి చేజారింది. అయినా జూపూడికి ఏదో ఒకటి చెయ్యాలని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ చేసారు చంద్రబాబు. అయితే కొంత మంది అధికారం లేకపోతె ఉండలేరు కదా, అందుకే ఇప్పుడు జూపూడి జంప్ కొట్టారు.

jupudi 08102019 2

ఈ రోజు జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన జూపూడి, తండ్రి లేని జగన్ కు అండగా ఉండటానికి, ఆయన వద్దకే వచ్చానని, నేను దారి తప్పిన గొర్రె లాగా అటు వైపు వెళ్లానని, ఇప్పుడు తప్పు తెలుసుకుని, ఇటు వచ్చానని చెప్పారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్‌ మ్యాన్‌ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. పార్టీని ఎన్నో ఏళ్లగా అంటిపెట్టుకుని ఉన్న నేతలను కాదని, సామాజిక నేపథ్యం దృష్ట్యా, జూపూడి లాంటి వారికి అందలం ఎక్కిస్తే, ఏమవుతుందో, ఇప్పటికైనా అధిష్టానం తెలుసుకోవాలని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. 2014లో వైసీపీ తరుపున ఎమ్మేల్యేగా పోటీ చేసి, ఓడిపోయి, చంద్రబాబు వద్దకు వచ్చి, పదవి పొంది, ఇప్పడు టిడిపి ఓడిపోగానే, అటు జంప్ కొట్టారని, ఇలాంటి రాజకీయం నడుస్తుందని అంటున్నారు.

jupudi 08102019 3

ఇక జూపూడి పార్టీ మార్పు పై, తెలుగుదేశం శాసనసభ్యుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందిస్తూ, " జూపూడికి అధికారమే పరమావధి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండడానికి జూపూడి ప్రయత్నిస్తారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి ప్రభాకర్‌ రావు వైఖరి ఉంది. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారు. 'జగన్‌ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం' అంటూ గతంలో విమర్శించారు. జగన్‌ ఓ సైకో.. అందుకే తండ్రి బతికున్నంత కాలం దూరంగా ఉంచారని నాడు వ్యాఖ్యానించి.. నేడు తండ్రి లేని వ్యక్తికి తోడుగా నిలవడానికి వెళ్తున్నా అనడం జూపూడి ప్రభాకరరావు అవకాశవాదానికి నిదర్శనం. అక్రమాస్తులతో ఏర్పాటైన పార్టీ, అవినీతి పరుల పార్టీ అంటూ వైసీపీని జగన్మోహన్‌ రెడ్డిని గురించి పేర్కొన్న జూపూడి నేడు వారి చెంతకు ఎందుకు వెళ్లినట్లు.? అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయినటువంటి జగన్మోహన్‌ రెడ్డిని ఫెడల్‌ క్యాస్ట్రోతో పోల్చడం సిగ్గుచేటు. జైలుకు వెళ్లొచ్చిన వారంతా ఉద్యమకారులు కాదనే విషయం జూపూడి గుర్తించాలి. జగన్‌ ఏ కారణంగా జైలుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసు. పోలిక విషయంలో అయినా జూపూడి కాస్త ఆలోచించి మాట్లాడాలి. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనని ప్రజలు గుర్తిస్తున్నారు. దళిత నాయకుడిగా జూపూడి వైసీపీలో చేరి అన్యాయం చేశారు. రంగులు మార్చడంలో ఊసరవిల్లితో పోటీపడుతూ... దళితుల్ని నిలువునా వంచిస్తున్నారు. జగన్‌ను నమ్మి వెళ్లడమంటే కుక్కతోక వంకర అనే విషయాన్ని జూపూడి గుర్తించాలి." అని అన్నారు.

భారతీయ జనతా పార్టీ నేత , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు విజయవాడ పర్యటనలో చుక్కలు కనిపించాయి. ఆయన హోదా పక్కన పెట్టి, వయసును ద్రుష్టిలో పెట్టుకుని అయినా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటన విజయవాడ ఇంద్రకీలాద్రి పై జరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలోనే, కృష్ణం రాజుకి అవమానం జరిగిందని బీజేపీ నేతలు వాపోతునారు. మాజీ కేంద్ర మంత్రి అయినా, కృష్ణంరాజుకి కనీస గౌరవం ఇవ్వడానికి కాని, లేక ఆయన వయసుని ద్రుష్టిలో పెట్టుకుని అయినా, ఆయనకు సహకరించటానికి అధికారులెవరూ సిద్ధపడలేదు. ఇంద్రకీలాద్రిలో ఉన్న ఒక్క కానిస్టేబుల్స్ కాని, దుర్గగుడి అధికారులు కాని, అయన మోర ఆలకించలేదు, ఆయన్ను పట్టించుకోలేదు. కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గుంటానని, తగిన విధంగా సహకరించాలని, ముందుగా దుర్గగుడి అధికారులకు, కృష్ణం రాజు సమాచారం ఇచ్చారు.

krishnamraju 08102019 2

దీంతో ఆయన కుటుంబంతో సహా ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే భక్తులు అధికంగా ఉండటంతో, అధికారులు ఎవరూ ఆయన వద్దకు రాలేదు. అయితే విషయం ఎవరికి చెప్పినా, ఒక్కరంటే ఒక్క అధికారి కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దాంతో ఆయనే స్వయంగా కుటుంబంతో సహా ఆరో అంతస్తుకు వెళ్లారు. వయోభారం కావటంతో, ఆయన అన్ని అంతస్తులు ఎక్కటానికి, తీవ్ర ఇబ్బంది పడ్డారు. సామాన్య భక్తులతో పాటు వెళ్లడంతో, తోపులాటలో, తీవ్ర ఇబ్బంది పడ్డారు. పైకి ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నానని అధికారులకు ఎంత చెప్పినా, ఆయనకు ఎవరూ సహకరించ లేదు. ఆయన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. కుంకుమార్చన జరిగే ప్రదేశానికి వెళ్లడానికి కృష్ణంరాజు చాలా అవస్థలు పడ్డారు. పైకి ఎక్కుతూ, కొన్నిసార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు.

krishnamraju 08102019 3

చివరికి అతి కష్టం మీద పైకి ఎక్కి పూజలు చేసారు. కృష్ణంరాజునుకావాలనే ఇలా ఇబ్బంది పెట్టారని బీజేపీ విమర్సిస్తుంది. ఆయన ఒక మాజీ కేంద్ర మంత్రి అని, అలా కాకపోయినా, కనీసం మానవాతా వాదంతో అయినా స్పందించాలి కదా అని కోరారు. సాచిన్న చిన్న వైసీపీ నేతలు వస్తేనే, హడావిడి చేస్తూ, వారిని, వారి బంధువులకు సకల మర్యాదలు చేస్తున్నఆలయ అధికారులు, మాజీ కేంద్రం మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని, బీజేపీ ప్రశ్నిస్తుంది. సామాన్య భక్తుల కోసం కూడా సరైన ఏర్పాట్లు చేయలేదని వార్తల్లో చూస్తున్నామని, వైసీపీ నేతలు, వారి అనుచరులకు మాత్రం, పెద్ద పీట వేస్తున్నారని, అధికారులు కూడా ఇలా ప్రవర్తించటం దారుణం అని అంటున్నారు. కృష్ణంరాజు ముందస్తుగా సమాచారం పంపినప్పటికీ., ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది.

Advertisements

Latest Articles

Most Read