ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన పనితో, ఆంధ్రప్రదేశ్ పరువు జాతీయ స్థాయిలో పోయింది. జాతీయ మీడియాలో కధనాలు రావటంతో, ఏపి పోలీసుల చేత ప్రభుత్వం, చేపించిన పని చూసి, జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏఎన్ఐ, బిజెనెస్ స్టాండర్డ్ లాంటి పత్రికల్లో కూడా, ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక విషయానికి వస్తే, ఆటోలు ఉన్న వారికి, వాహన మిత్ర పధకం కింద, ఏడాదికి 10 వేలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు కూడా. అయితే లబ్దిదారుల విషయంలో భారీగా కోత పడింది అనే విమర్శలు వచ్చాయి. 6 లక్షల మందికి పైగా ఆటోలు ఉన్నవారు ఉంటే, అనేక నిబంధనలు సాకుగా చూపి, కేవలం లక్షకు పైగా మాత్రమే ఈ పధకం అమలు చెయ్యటం పై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నించినా, ప్రభుత్వం మాత్రం వీటికి సమాధానం చెప్పకుండా, ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటుంది.

police 08102019 2

ఈ కార్యక్రమం ప్రారంభించిన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆటోల వెనుక జగన్ ఫోటో అంటించుకొండి, మీ పై పోలీసులు ఎటువంటి కేసులు పెట్టరు, మిమ్మల్ని ఆపరు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారో, లేక ప్రభుత్వం ఆదేశించిందో కాని, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జగన్ మోహన్ రెడ్డి స్టికర్లు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చారు పోలీసులు. వచ్చే పోయే ఆటోలను ఆపుతూ, వారికి ఇష్టం లేకపోయినా, చివరకు వారికి 10 వేలు రాకపోయినా సరే, స్టికర్ లు అంటించి వేసారు. కృష్ణా జిల్లలో, రవాణా శాఖ సిబ్బంది, పోలీసులు, ఖాకీ యునిఫారం ధరించి మరీ, జగన్ మోహన్ రెడ్డి స్టికర్లు అంటిస్తూ వీడియోకి చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

police 08102019 3

విజయవాడ బందరు రోడ్డులో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో రవాణా, పోలీసు సిబ్బంది ఈ పని చేసారు. పోలీసులు ఉండటంతో, అటోవాలాలకు ఇష్టం లేకపోయినా తప్పలేదు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు, నేషనల్ మీడియాలో కూడా ఈ భాగోతం వచ్చింది. ‘మా గురించి ఆలోచన చేసిన జగనన్నకు థ్యాంక్యూ - వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర’ అనే స్టిక్కర్లను, ఆటలను ఆపి మరీ, వీరు అంటించటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏపి పోలీసులకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని, అలంటి పోలీసుల చేత, ఇలా ఆటోలకు స్టికర్లు అంటించే పని చెయ్యటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసే ఎక్ష్సైజ్ పోలీసుల చేతే, మద్యం అమ్మించటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేసి, ఇదేదో రాజ్యపాలన అన్నట్టు చేస్తున్నారు. వారు కట్టిన భవనాలు అయితే అనుకోవచ్చు, గతంలో వివధ ప్రభుత్వ హయంలో కట్టిన వాటికి కుడా, తామే ఏదో కట్టాం అన్నట్టు, అన్నిటికీ రంగులు వేసి పడేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కాని, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాని, కేంద్రం కాని, ఇలనాటి ధోరణితో ఎప్పుడు ఇలా చెయ్యలేదు. పంచాయతీ భవనాలు, మునిసిపల్ భవనాలు, వాటర్ ట్యాంక్లు, స్మసానాలు, బెంచీలు, బోరులు, ఇలా ఒక్కటేమిటి, ఏది దొరికితే అది, ఏది పడితే అది, అన్నిటికీ వైసిపీ జెండా రంగులు వేసేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ భవనాలకు, ఒక పార్టీ రంగు వెయ్యటం పై, తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. పంచాయతీ ఆఫీస్ కాని, మునిసిపల్ ఆఫీస్లు కాని, ప్రజలందరూ వచ్చే చోటు అని, అదేమీ పార్టీ భవనం కాదని అంటున్నారు.

ycp 07102019 2

రేపు ఎన్నికలు వస్తాయి. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ప్రకారం, ఇలా రంగులు వేసిన బిల్డింగ్లలో ఓటు వెయ్యటానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు. మరి అప్పుడు, మళ్ళీ వీటి అన్నిటికీ, తెల్ల రంగు వేస్తారా ? మళ్ళీ ఇది ఒక ఖర్చా ? ఇలాంటి వాటికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందొ లేదో మరి. అయితే ఇదే విషయం పై ఇప్పుడు కేంద్రం ద్రుష్టి పెట్టింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై కేంద్రం సీరియస్‌ అయింది. గ్రామ సచివాలయ పరిపాలన రాజకీయాలకు అతీతంగా జరగాలని, ఆ భవనాలకు రాజకీయ రంగు పులమడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

ycp 07102019 3

వైసీపీ చేస్తున్న పనుల పై ఆదివారం టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో కేంద్రమంత్రి తోమర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం పై, రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మెమో జారీ చేయాలంటూ తన జాయింట్‌ సెక్రటరీ రిజ్వీని ఆదేశించారు. ఇది ఒక్కటే కాకుండా, రాష్ట్రంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని కూడా కేంద్రాన్ని, టిడిఫై ఎంపీలు కోరారు. తెలుగుదేశం హయంలో చేసిన ఉపాధి హామీ పనులకు గాను, కేంద్ర ప్రభుత్వం, రూ.1845 కోట్లు విడుదల చేసిందని, దీనికి మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.615 కోట్లు కలిపి మొత్తం రూ.2,460 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి వరకు, ఎలాంటి చెల్లింపులు చెయ్యలేదని, కేంద్రం ఇచ్చిన .1845 కోట్లు , దారి మళ్ళించారని, ఫిర్యాదు చేసారు.

అది ఎంతో ప్రతిష్టాత్మికంగా జరగాల్సిన కార్యక్రమం. ఒక్క చిన్న పొరపాటు కూడా జరగటానికి వీలు లేదు. అందుకు తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేసామని, అధికారులు, ప్రభుత్వం చెప్పింది. చివరకు స్టేజ్ పైన, గవర్నర్, హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్, జగన్ మోహన్ రెడ్డి ఉండగానే, రాష్ట్ర పరువు గంగలో కలిసింది. అధికారుల నిర్లక్ష్యానికి, జాతీయ మీడియా సమక్షంలో, మన రాష్ట్ర పరువు పోయింది. ఆంధ్రపదేశ్ ప్రజలు సిగ్గు పడే విధంగా, అధికారుల చేసిన పొరపాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు పని తీరుకు, ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తూ, చివరకు ఇలా చేసారు ఏంటి అని, అందరూ అడిగే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇది ప్రభుత్వ పెద్దల అలసత్వంతో, అధికార యంత్రాంగం చేసిన పనిగా చూడాలా ? లేక కేవలం ఈ తప్పు అధికారుల మీదకు తోసేసి, బాధ్యుల పై చర్య తీసుకుంటే అయిపోతుందా ?

cj 07102019 2

ఇక విషయానికి వస్తే, అది హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రామాణస్వీకర కార్యక్రమం. హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూర్తీ బాధ్యత తీసుకోవాలి. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా, అపాయింట్ చేసిన చీఫ్ జస్టిస్ చేత, మన రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేపిస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా, మన అధికారుల చేసిన అతి పెద్ద తప్పిదంతో, అందరూ అవాక్కయ్యారు. ఏకంగా గవర్నర్, సియం స్టేజ్ మీద ఉండగానే, ఈ పొరపాటు జరిగింది. మన రాష్ట్రం పేరు కూడా సరిగ్గా టైపు చెయ్యలేని, అతి పెద్ద పొరపాటు. హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ కి ఇచ్చిన ప్రమాణ పత్రంలో, "ఆంధ్రప్రదేశ్"కు బదులు "మధ్యప్రదేశ్" అని రాసి ఇచ్చారు, మన అధికారులు.

cj 07102019 3

గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తున్న పేపర్ లో ఆంధ్రప్రదేశ్ అని ఉండగా, ఛీఫ్ జస్టిస్ పేపర్ లో మాత్రం, మధ్యప్రదేశ్ అని ఉంది. చీఫ్ జస్టిస్ కూడా, అధికారులు రాసిచ్చిన పత్రం ప్రకారం, "ఆంధ్రప్రదేశ్" బదులుగా "మధ్యప్రదేశ్" అని చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి చేత మరోసారి ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు మహేశ్వరి, జగన్ తో పాటు పలువురు ఆహూతులు హాజరయ్యారు. అయితే అధికారులకు ఆ మాత్రం, మన రాష్ట్రం పేరు గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి, మధ్యప్రదేశ్ కి తేడా తెలియకుండా, ఇలా ఏకంగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ చేతే, తప్పుగా చదివించటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు, ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు.

వైజాగ్ టెస్ట్ మ్యాచ్ లో, ఘన విజయం సాధించి, దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు దసరా సంబరాలను రెట్టింపు చేసిన టీం ఇండియాకు, మన వైజాగ్ పోలీసులు పలికిన వీడ్కోలు, విమర్శలకు తావు ఇచ్చింది. ఈ రోజు తిరుగు ప్రయాణం అయిన టీం ఇండియా క్రికెటర్లకు, విశాఖపట్నం విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో సహా ఇబ్బందులు పడ్డారు. వైజాగ్ పోలీసుల అవగాహన లోపంతో, కుటుంబ సభ్యలతో కలిసి, వర్షంలో తడుస్తూ ఎయిర్ పోర్ట్ లోపలకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క లగేజీ, ఒక పక్క కుటుంబ సభ్యులతో, వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. వైజాగ్ లో, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం మ్యాచ్‌ ముగిసింది. దీంతో ఇరు జట్ల క్రీడాకారులు, ఈ రోజు తిరుగు ప్రయాణం అయ్యారు.

vizag 07102019 2

సోమవారం ఇరు జట్లు పుణెకు బయల్దేరాయి. వారు బసచేసిన హోటల్ నుంచి క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన బస్సులో విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్ట్ లో మూడు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. స్థానిక పోలీసుల అవగాహన లోపంతో భారత క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సును మూడో ఫ్లాట్‌ఫారం వద్దకు తీసుకు వెళ్లి ఆపారు. అక్కడ ఎలాంటి షల్టర్ లేదు. బస్సు దిగగానే వర్షం పడుతూ ఉండటంతో, అలాగే తడుచుకుంటూ లోపలకి వెళ్లారు. లగేజీ, కుటుంబ సభ్యులు ఉండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. మరో పక్క, మొదటి ఫ్లాట్‌ఫారంలో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళను దింపారు. అక్కడ షల్టర్ ఉంది. దీంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

vizag 07102019 3

అయితే బస్సు అటు వైపు ఎందుకు పార్క్‌ చేయలేదని ఎయిర్‌పోర్ట్‌ సీఐని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ప్రశ్నించగా, మొదటి ఫ్లాట్‌ఫారంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రయాణిస్తున్న బస్సును నిలిపారని చెప్పారు. అయితే, పెద్ద వర్షం పడుతూ ఉండటం, కుటుంబ సభ్యులు ఉండటంతో, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిన తరువాత, భారత ఆటగాళ్ళను కూడా అటు వైపు నుంచి తీసుకు వెళ్ళకపోవటం పై విమర్శలు వస్తున్నాయి. లేకపోతే కుటుంబ సభ్యలకు గొడుగులు లాంటివి ఇవ్వాల్సింది అనే వాదన వినిపించింది. క్రికెటర్లు ఎప్పుడు వైజాగ్ వచ్చినా, సిటీని పొగుడుతూ ఉండేవారు. అలాంటి వారికి, తగిన గౌరవం మనం ఇవ్వాల్సింది. ఏది ఏమైనా, ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా, యంత్రాంగం చూసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisements

Latest Articles

Most Read