సురేంద్ర బాబు ఐపీఎస్... ఈ పేరు వింటేనే, నేరస్థులు పారి పోతారు. రాజకీయ నాయకులు గడగడలాడతారు. బెజవాడలో రౌడీలు రెచ్చిపోతున్న టైంలో, తాట తీసి, అందరినీ లైన్ లో పెట్టారు. తనమన అనే బేదాలు ఉండవు. అధికార పక్షం అని కూడా చూడరు. కేవలం రూల్స్ తో పని చేస్తూ, నిజాయితీగా నిష్పక్షపాతంగా పని చేసే నైజం ఆయనది. ప్రతి ఒక్క యంగ్ ఐపీఎస్ కి ఆయాన ఆదర్శం. చంద్రబాబు హయంలో డీజీ ర్యాంక్ వచ్చింది. చంద్రబాబు ఆయన్ను ఆర్టీసీ ఎండీగా చేసారు. తరువాత డీజీపీ కూడా చేస్తారనే వార్తలు వచ్చాయి, కాని ఈ లోపే ప్రభుత్వం మారింది. ఆర్టీసి ఎండీగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాగే కార్మికులకు, రిటైర్మెంట్‌ రోజే సెటిల్‌మెంట్లు ఇవ్వటం, పే స్కేలు చెయ్యటంతో కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వటంతో కార్మికులకు కూడా దగ్గర అయ్యారు. అలాగే, ఆర్టీసిని అప్పుల నుంచి గట్టెక్కించే సంస్కరణలు కూడా చేసారు.

surendrababu 26092019 2

అయితే రాత్రికి రాత్రి జగన ప్రభుత్వం, సురేంద్ర బాబుని తప్పించటం పై, ఈ రోజు వార్త పత్రికల్లో పలు కధనాలు వచ్చాయి. సురేంద్ర బాబు లాంటి సీనియర్ ఆఫీసర్ ని, డీజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ని తప్పించి, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవటం పై, అందరూ ఆశ్చర్యపోతున్న వేళ, ఈ కధనాలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న,ఆర్టీసి బస్సుల స్థానంలో, ఎలేక్టిక్ బస్సులు తేవటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బస్సులను కొనకుండా, అద్దెకు తీసుకుంటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఈ నెల 11న టెండర్లు పిలిచారు. అయితే ఈ టెండర్ లో పెద్ద పెద్ద కంపెనీలు అయిన, టాటా, అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌ వంటి సంస్థలు పాల్గొంటాయని అందరూ భావిస్తే, కేవలం గోల్డ్‌స్టోన్‌ అనే సంస్థ మాత్రమే పాల్గుంది. ఈ గోల్డ్‌స్టోన్‌ పై ఇప్పటికే తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇది మేఘా సంస్థ అని, పోలవరంలో మిగిలింది, ఇక్కడ కవర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే, ఇక్కడ కేవలం గోల్డ్ స్టోన్ మాత్రమే టెండర్ వేసింది.

surendrababu 26092019 3

అయితే ఈ అద్దెను రూ.60కి తగ్గకుండా ఇవ్వాలన్న ప్రతిపాదన, ఈ కంపెనీ ఆర్టీసి ముందు పెట్టింది. అయితే ఇందుకు, ఆర్టీసి ఎండీగా ఉన్న సురేంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. ప్రుస్తుతం ఉన్న అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.38 ఇస్తున్నాం అని, అయినా ఇక్కడ 5 రూపాయల నష్టం వస్తుందని, అలాగే ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె తెలంగాణలో రూ.36తో గోల్డ్‌ స్టోన్‌ సంస్థ ఇప్పటికే దక్కించుకుందని తెలిపారు. మనకు అంతకంటే ఎక్కువకు నేను ఒప్పుకోను, టెండర్ వెయ్యండి, ఎవరు తక్కువకు వస్తే వాళ్ళకు ఇస్తాం అని సురేంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి కీలక చర్చలు ఈ రోజు జరగనుంది. అయితే అనూహ్యంగా, సురేంద్ర బాబు నిన్నే బదిలీ అయిపోయారు. సహజంగా ఇలాంటి పెద్ద డీల్ జరుగుతునప్పుడు, ఆ చీఫ్ నే బదిలీ చెయ్యటం జరగదు. కాని ఇక్కడ పై నుంచి ఒత్తిడులు రావటంతో సురేంద్రబాబుని రాత్రికి రాత్రి బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ విషయమై ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు పెద్దలు మంగళవారం సురేంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సురేంద్ర బాబు ఉంటే, తాము అనుకున్న రేట్లకు టెండర్ రాదనీ, కొంత మంది ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, సురేంద్రబాబుని బదిలీ చేసారని ఈ రోజు పత్రికల్లో కధనాలు వచ్చాయి.

గోదావరిలో పడవప్రమాదం జరిగి 26మంది చనిపోతే, ఆ దుర్ఘటనపై ప్రభుత్వం కిందిస్థాయి అధికారులు, పోలీసులతో తూతూమంత్రపు ప్రకటనలు చేయిస్తూ, ప్రమాదానికి కారకులైన అసలు దొంగలను కాపాడాలని చూస్తోందని మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తమవారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న పడవ ప్రమాదబాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితోనే వ్యవహరిస్తోందన్నారు. తమవారి మృతదేహాలు అప్పగించాలని కోరుతూ మృతుల కుటుంబాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా, అధికారులు మంత్రులు స్పందించకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగి రెండు వారాలవుతున్నా కూడా ప్రభుత్వం నీళ్లల్లో మునిగిన పడవను బయటకు తీయలేకపోయిందన్న ఆయన అన్నారు.

chinrarappa 25092019 1

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 21మంది చనిపోతే, రెండ్రోజుల్లోనే పడవను వెలికితీసి, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల వంతున (ఒక్కో కుటుంబానికి) పరిహారం అందించి న్యాయంచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారని నిమ్మకాయల తెలిపారు. పడవ ప్రమాదంపై పర్యాటకశాఖా మంత్రి రోజుకోలా మాట్లాడితే, జలవనరుల శాఖా మంత్రేమో, ప్రమాద ప్రాంతంలో ఒక్కరోజు హడావుడి చేసి కనిపించకుండా పోయాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ప్రమాదానికి గురైన పడవను వెలికితీయడం చేతగాని ప్రభుత్వం, దాన్ని తీసేవారు ఎవరైనాఉంటే ఆ జిల్లా అధికారులను కలవాలని కోరుతూ సోషల్‌మీడియాలో ప్రకటనలివ్వడం రాష్ట్రప్రభుత్వ అసమర్థతకు సంకేతం కాదా అని నిమ్మకాయల ప్రశ్నించారు.

chinrarappa 25092019 1

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైనా దుర్ఘటనలు, ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు జరిగితే ప్రభుత్వాలపై నిందలు వేసే జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదేపద్ధతిని కొనసాగించడం ఆయనలోని మానసిక జాడ్యాన్ని సూచిస్తోందన్నారు. గోదావరిలో మునిగిన పడవను తీయడంచేతగాని రాష్ట్రజలవనరుల మంత్రి అనిల్‌, పోలవరం ప్రాజెక్ట్‌ని అప్పుడు పూర్తిచేస్తాం... ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చినరాజప్ప దెప్పిపొడి చారు. పోలవరంలో 75శాతం పనులు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిచేశాక, ఇప్పుడొచ్చిన వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు అప్పగించడానికి వాటితో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. పోలవరం పనుల్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి అనిల్‌, నవయుగ సంస్థను కాదని, అనుభవం లేని మెగాసంస్థకు ప్రాజెక్ట్‌ పనులు అప్పగించడం వెనకున్న లోగుట్టుని ప్రజలకు తెలియచేయాలని మాజీహోం మంత్రి సూచించారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా, రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం సహకరించకపోయినా, ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా, 24 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించారు. ఇవి అయుదు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించుకుని, మూడు విడతలుగా, దాదపుగా 16 వేల కోట్లు దాకా విడుదల చేసారు కూడా. నాలుగు, అయుదు విడతల రుణమాఫీకి దాదపుగా 7 వేల కోట్లు సిద్ధం చేసి, జీవో కూడా విడుదల చేసారు. ఈ జీవో ఇచ్చిన తరువాత, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అయితే ఇవి విడుదల చెయ్యకుడదు అంటూ జగన్ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లారు. ఇది నోటిఫికేషన్ కు ముందే, విడుదల చేసిన జీవో అని, అప్పటి ప్రభుత్వం ఎంత చెప్పినా, నిధులు రెడీ చేసి పక్కన పెట్టినా, రుణ మాఫీ అవ్వకుండా, ఆ నిధులు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దీంతో అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ పూర్తిగా చెయ్యలేక పోయారు.

jagan 25092019 2

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అప్పటికే చంద్రబాబు 7 వేల కోట్లు సిద్ధం చేసి ఉండటంతో, ఈ నిధులు జగన్ మోహన్ రెడ్డి రాగానే విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కాని జగన్ ప్రభుత్వం నాలుగు, అయుదు విడతల రుణమాఫీ చెయ్యలేదు. నాలుగు నెలలు అవుతున్నా ఎక్కడా అడ్డ్రెస్ లేదు. దీంతో కిసాన్ సెల్ చైర్మెన్ జెట్టి గురునాద్ రెడ్డి హైకోర్ట్ లో వాజ్యం వేసారు. జీవో నెంబర్ 38 ప్రకారం, నాలుగు, అయుదు రుణ విడతల రుణమాఫీ చెయ్యలని, ఆదేశిస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్ట్ ని కోరారు. దీంతో హైకోర్ట్ ఆగష్టు 31న, జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ, జీవో నెంబర్ 38 ప్రకారం, చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని, ఆ పధకం నిబంధనలు ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

jagan 25092019 3

హైకోర్ట్ ఈ ఆదేశాలు ఇచ్చిన 25 రోజులుకు, ఈ రోజు, జగన్ ప్రభుత్వం, ఆ జేవో 38ని రద్దు చేసింది. 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 10శాతం వడ్డీని కలుపుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 38ని జారీ చేసిన దాన్ని ఆపేసారు. అయితే ఈ చర్యలకు హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ జీవో కనుక, కోర్ట్ కు వెళ్ళక ముందే రద్దు చేసి ఉంటే, వేరే లాగా ఉండేది. కోర్ట్ కి వెళ్ళిన తరువాత, కోర్ట్ ఆ జీవో ప్రకారం పధకాన్ని అమలు చెయ్యండి అని చెప్పిన తరువాత, ఇన్ని రోజులకు జీవో రద్దు చెయ్యటంతో, ఇది కంటెంట్ అఫ్ కోర్ట్ కిందకు వచ్చే అవకాసం ఉందని, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాసం ఉందని అంటున్నారు. మరో పక్క, ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు, పధకం మధ్యలో మాకు సంబంధం లేదు అనటం ఏంటి ? నరేంద్ర మోడీ కూడా, ప్రత్యెక హోదాతో, విభజన హామీలతో మాకు ఏమి సంబంధం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అడగండి అంటే, జగన్ గారు ఏమి చేస్తారు ? నిధులు రెడీగా పెట్టి వెళ్ళినా, రుణమాఫీ చెయ్యటానికి, ఇబ్బంది ఏంటి ?

జగన్ ప్రభుత్వానికి, రోజుకి ఒకసారి అయినా, అటు కేంద్రం నుంచి కాని, ఇటు కోర్ట్ ల నుంచి కాని ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. చంద్రబాబుని ఇరికించటానికి, చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద స్కాం జరిగింది అని తెలియ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి, జూలై 25న, ఆరు పేజీల లేఖతో, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అధిక ధరలకు చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు అంటూ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అయితే ఇక్కడ చంద్రబాబుని, కేంద్రం ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు అది తనకే రివర్స్ అయ్యింది. ఆ లేఖ పై సమాధానం ఇస్తూ, మీ ఫిర్యాదు తప్పు అంటూ ఝలక్ ఇచ్చారు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్. విద్యుత్ పీపీఏల ఒప్పందాల్లో గతంలో, ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం తరుపున తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. అన్ని వివరాలు తెలియచేస్తూ, జగన్‌కు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాశారు.

jagan 25092019 1 2

గతంలో చంద్రబాబు పై, ఆరు పేజీల లేఖతో, జగన్, ప్రధానికి చేసిన ఫిర్యాదు పై, కేంద్ర మంత్రి స్పందిస్తూ, బదులు లేఖ రాసారు. రాష్ట్రంలో డిస్కంల నష్టానికి, అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, అధిక రేట్లు కారణం అంటూ జగన్ చేసిన వాదనను, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కొట్టి పడేసారు. డిస్కింల నష్టానికి, ఈ ఒప్పందాలకు సంబంధం లేదని, డిస్కింల నష్టానికి వేరే కారణాలు ఉన్నాయని, దీనికి ముడి పెట్టవద్దు అంటూ ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రేట్లు కంటే, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే ఎక్కువ రెట్లు చెల్లిస్తున్నారని అయన లేఖలో వివరాలు వెల్లడించారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

jagan 25092019 1 3

చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ మీరు చెప్పిన దాంట్లో, నిజం లేదని ఆయన చెప్పారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే వస్తోందని, కానీ రాను రాను బొగ్గు నిల్వలు తగ్గిపోతాని, 20 సంవత్సరాల తర్వాత యూనిట్ ధర రూ.22 అవుతుందని అన్నారు. కాని పవన్ విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందని, అందుకే మన దేశం వాటికి ఎక్కవు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. పీపీఏలపై పునఃసమీక్ష చేస్తే, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టె వారికి, తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా జగన్, తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. నిన్నే హై కోర్ట్ కూడా, ప్రభుత్వం ఇచ్చిన జీవో కొట్టేసిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read