జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, వాన్‌పిక్ కేసులో సహా నిందుతుడు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈ రోజు సెర్బియా దేశంలో, అక్కడి పోలీసులు అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. ఇక్కడ సిబిఐ, ఈడీ కేసులు స్లో అయితే, అంతర్జాతీయంగా, మనోళ్ళు చేసిన పనికి మాత్రం, వీళ్ళు దొరికిపోతున్నారు. అక్కడ చట్టాలు ఖటినంగా ఉంటాయి కాబట్టి, తప్పించుకోవటం కుదరదు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిమ్మగడ్డ ప్రసాద్‌‌ సెర్బియా దేశంలో హాలిడే ఎంజాయ్ చెయ్యటానికి వెళ్లారు. అయితే ఆయన్ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నారు.

 nimmagadda 30072019 1

అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని, నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన అరెస్ట్ అయ్యి రెండు రోజులు అయినట్టు సమాచారం. ఈ సమాచారం చాలా లేట్ గా ఈ రోజు బయటకు వచ్చింది. అది కూడా వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే తెలిసింది. అక్కడ విహార యాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డను రెండు రోజుల క్రితం అరెస్ట్ చెయ్యటంతో, తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వైసిపీ నేతలు రంగంలోకి దిగారు. ఎక్కడ ఏమి తమ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో, కేంద్రానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. నిమ్మగడ్డ సెర్బియాలో అరెస్ట్ అయ్యారని, ఆయన్ను వెంటనే భరత్ రప్పించే ప్రయత్నం చెయ్యాలని, వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి.

 nimmagadda 30072019 1

ఇదే విషయం పై, వైసీపీ ఎంపీలు, సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు లేఖ రాసారు. దీంతో ఈ వ్యవహారం బయట పడింది. నిమ్మగడ్డ అరెస్ట్ అయితే, వైసీపీ ఎంపీలకు ఎందుకు అనే అనుమానం చాలా మంది తెలియని వాళ్లకు వచ్చే అనుమానం. నిజానికి నిమ్మగడ్డకు, జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ కంపనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్, 854 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం సంచలనం అయ్యింది. తరువాత వాన్పిక్ కేసులు అరెస్ట్ అవ్వటం, సిబిఐ కేసులు, ఇవన్నీ మనం చూసాం. పోయిన ఏడాది, పనామా పేపర్స్ లీక్స్ లో కూడా, నిమ్మగడ్డ, జగన్ వ్యవహారం ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ అరెస్ట్ అవ్వటం, అదీ దేశం బయట అరెస్ట్ అవ్వటంతో, ఏమి అవుతుందా అనే టెన్షన్ వైసీపీ వర్గాలో వ్యక్తం అవుతుంది.

వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, మన రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు చూస్తున్నాం. చంపటం, కొట్టటం, ఇళ్ళకు అడ్డుగా గోడలు కట్టటం, ఇలా అనేక విధాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. అయితే తెలంగాణా రాష్ట్రం కూడా మాదే, మా నాయకుడుకి, కేసీఆర్ స్నేహితుడు, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో కాని, వీరి దౌర్జన్యం తెలంగాణాకు కూడా పాకింది. కాని అక్కడ పోలీసులు మాత్రం, వీరి ఆటలు సాగనివ్వలేదు. నిన్న హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కొడుకు, తనను అడ్డుకున్నందుకు, మాదాపూర్ లో, ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను కాలుతో తన్ని, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. దీంతో అతని పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

udayabhanu 30072019 2

ఈ వార్తా పై పూర్తీ వివరాలను, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి, నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద డ్యూటీలో ఉన్నారు. విధి నిర్వహణలో భగంగా, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ, హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న ట్రాఫిక్ ను కొద్ది సేపు ఆపారు. అయితే అటుగా వచ్చిన ఒక కారు మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండటంతో, కానిస్టేబుల్‌ కృష్ణ వారిని వారించి, కార్ ఆపారు. నా కారే ఆపుతావా, నీకు ఎంత ధైర్యం అంటూ, కారులోంచి దిగిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను కుమారుడు సామినేని ప్రసాద్‌ కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు.

udayabhanu 30072019 3

కానిస్టేబుల్‌ ఉద్యోగం చేసుకునే నువ్వు, నన్ను, నువ్వు నువ్వు అంటూ మర్యాద లేకుండా సంభోదిస్తావా అంటూ, కానిస్టేబుల్‌ను ప్రసాద్‌ పై బూతులు వర్షం కురిపించారు. ఈ గొడవ అంతా గమనిస్తూ, పక్కనే ఉన్న ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని ట్రాఫిక్ లో ఉన్నాం అని, ఇలా గొడవ చెయ్యద్దు అంటూ అతన్ని వారించాడు. అయినా సరే అతను వినకుండా, నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకుని, నన్నే అవమానిస్తారా అంటూ వీరగం చేస్తూ ఉండటంతో, ఇక్కడ గొడవ వద్దని, స్టేషన్‌కు రావాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌ కోరారు. వైసిపీ ఎమ్మెల్యే కొడుకుని, నన్నే సేష్టన్‌కు రమ్మంటావా అంటూ విచక్షణ మరిచిపోయి, అధికార మదంతో, ఇన్‌స్పెక్టర్‌ను ఒక్క తోపు తోస్తూ, కాలుతో తన్ని అతన్ని కూడా బూతులు తిట్టాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, వైసిపీ ఎమ్మెల్యే ఉదయభాను కొడుకుని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని పై, 332, 353, 506 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదుచేసి అరెస్ట్ చేసారు.

జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. బిజినెస్ వర్గాలు కలవరపాటుకు గురి చేసే నిర్ణయాలతో, రాష్ట్రం పై నెగెటివ్ ఇమేజ్ వచ్చేలా నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల పై అటు కేంద్రం వద్దు, అది తప్పు అంటున్నా, వాటిని సమీక్షిస్తాం, మా మాట వినకపోతే ఒప్పందాలు రద్దు చేస్తాం అని బెదిరింపు ధోరణిలో వెళ్తుంది. మరో పక్క, జగన్ తీసుకున్న మరో నిర్ణయం పై కూడా దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఏకంగా నీతి ఆయోగ్ చైర్మెన్ కూడా, ఆ నిర్ణయం తప్పు అని అర్ధం వచ్చేలా, పత్రికా కధనాన్ని ట్వీట్ చేసారు అంటే, ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, వాటి పర్యావసానాలు ఎంతో తెలియచేస్తున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గటం లేదు అనుకోండి, అది వేరే విషయం.

nitiaayog 29072019 2

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టె, ఏ కంపెనీ అయినా సరే, 75 శాతం ఉద్యోగాలు అక్కడ స్థానికులకే ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. దీని పై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ఫైనాన్షియాల్ ఎక్ష్ప్రెస్ లో వచ్చిన ఒక కధనాన్ని పోస్ట్ చేస్తూ, ఆ పత్రికలో వచ్చిన ఒక వ్యాఖ్యం పోస్ట్ చేసారు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ, ఏపి తెచ్చిన ఈ బిల్, మన దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ప్రతి పౌరుడికి, ఈ దేశంలో, ఎక్కడైనా జీవించే హక్కు, పని చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, ఈ బిల్ దానికి విరుద్ధం అని, పెట్టుబడులు పెట్టె వాతావరణానికి, ఇది అద్దంకిగా ఉంటుంది, ఫైనాన్షియాల్ ఎక్ష్ప్రెస్ చెప్పిన ఆ వాఖ్యాన్ని, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్వీట్ చేసారు.

nitiaayog 29072019 3

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్ పై జగన్ మోహన్ రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్‌ స్పందించారు. ‘‘బిల్లును మీరు పూర్తిగా చూడలేదని, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. స్థానికులకు అవకాశం కల్పించాలన్నదే మా ఉద్దేశం. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఆలోచన లేదు. బిల్లు మాత్రమే పెట్టాం. నిబంధనలు చూడండి’’ అని రమేష్‌ కౌంటర్ ఇచ్చారు. దీనికి మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇచ్చారు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌. అది పత్రికల్లో వచ్చిన వార్తా, అందుకే కోటేషన్స్ లో పెట్టాను చూసుకోండి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఒక పక్క 75 శాతం లోకల్ రిజర్వేషన్ పై, పెద్ద పెద్ద కంపెనీలు అందరూ వ్యతిరేకిస్తుంటే, ఇప్పుడు ఏకంగా, ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్వీట్ చెయ్యటం చర్చనీయంసం అయ్యింది. అంటే ఈ విషయంలో కేంద్రం కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించటం లేదు అని అర్ధం.

జగన్ మోహన్ రెడ్డి మాట తప్పం, మడం తిప్పం అంటూనే, ఆయన అధికారంలోకి రాగానే ప్రతి అంశం పై మాట తప్పుతూ, మడం తిప్పుతున్నారు. తాజగా మరో సున్నితమైన అంశాన్ని కదిపి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి చేతులారా తెచ్చుకున్నారు. మాదిగా వర్గీకరణ అంశం పై, అసెంబ్లీలో మాట్లాడుతూ, జగన్ మాట మార్చారు. చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకున్నారు అంటూ, చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన అంశం పై, మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డికి అధికారం రాక ముందు వర్గీకరణకు మద్దతు తెలిపారు. 2010లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా, వర్గీకరణకు మద్దతు తెలుపుతూ లేఖలు కూడా రాసారు. అప్పట్లో, ఇది మా నాన్న మాట ఇచ్చిన అంశం అంటూ, జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసే వారు.

mrps 29072019 2

అయితే ఇప్పుడు అధికారం రాగానే మాట మార్చారు. ఇదే అంశం పై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. అయితే జగన్ మాత్రం, ఈ అంశం పై మాట మార్చిన దానికే కట్టుబడి ఉండటంతో, ఎంఆర్పీఎస్ మరోసారి ఉద్యమ బాట పట్టింది. రేపు అసెంబ్లీని ముట్టడించేందుకు ఎంఆర్పీఎస్ పిలుపిచ్చింది. ఈ నేపధ్యంలో, ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎలా అయినా అసెంబ్లీ ముట్టడిని సక్సెస్ చెయ్యాలనే ఉద్దేశంతో, వారు పోలీసులు ముందస్తు ఆర్రేస్ట్ చేస్తారని, ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరో పక్క పోలీసులు వీరి అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు ప్రతివ్యూహంతో ముందుకు వస్తున్నారు. దీంతో రేపు అసెంబ్లీ వద్ద ఏమి జరుగుతుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

mrps 29072019 3

పోలీసులు ఎమ్మార్పీఎస్‌ ముఖ్య కార్యకర్తలు, నాయకుల కోసం ఈ రోజు రాత్రి నుంచే గాలిస్తున్నారు. వారు ఊరు దాటి అమరావతి వైపు రాకుండా చూస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని, ఇటు వైపు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.గుంటూరు అర్బన్‌, రూరల్‌ జిల్లా పరిధిలో 30 పోలీస్‌ యాక్ట్‌తో పాటు 144వ సెక్షన్‌ అమలులో ఉందని, ఇటు వైపు వచ్చి ఆందోళనలు చేస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క, గతంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాజధాని ప్రాంతంలో నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర సభను పోలీసులు అడ్డుకోవటంతో, జీపు దహనంతో పాటు పలు విధ్వంసకర చర్యలు పాల్పడిన చరిత్ర ఉండటంతో, రేపటి అసెంబ్లీ ముట్టడి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అనే టెన్షన్ నెలకొంది. పోలీసులు మాత్రం, ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూస్తామని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read