జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఈ రెండు నెలల్లో జగన్ మార్క్ పరిపాలన ఏమైనా చూసామా అంటే, ఏమి లేదనే చెప్పాలి. యువకుడుని అని చెప్పుకుంటూ, జగన్ మొహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లి, అధికారం సంపాదించుకున్నారు. అయితే ఈ రెండు నెలల్లో మాత్రం, చెప్పుకోదగ్గ మార్పు, లేకపోతే సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, కనిపించే స్పష్టమైన పాలసీ చేంజ్ అయితే కనిపించలేదని చెప్పాలి. 5గురు డిప్యూటీ సియంలు అంటూ మొదలు పెట్టిన జగన్, తరువాత తరువాత, మొత్తం చంద్రబాబు పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ప్రజా వేదిక ఇవ్వమని అడిగితే, వెళ్లి దాన్ని కూల్చేసారు. చంద్రబాబు పై ప్రతి విషయంలో ఎంక్వయిరీ కమిషన్ కు వేసుకుంటూ వెళ్తున్నారు.

moneycontrol 26072019 2

ఇక గత రెండు వారాలుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో, అధికార పక్ష ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి రెండు నెలలు అధికారం పూర్తీ చేసుకోవటంతో, సహజంగానే ఆయన పాలన పై విశ్లేషణలు వస్తాయి. ఇదే కోవలో ప్రముఖ బిజినెస్ ఛానెల్, మనీ కంట్రోల్, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పాలన పై, ఎడిటోరియల్ కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు, దేశానికీ ఎలా శాపంలాగా అయ్యాయి అంటూ, ఆ ఎడిటోరియల్ నడిచింది. ముఖ్యంగా జగన మోహన్ రెడ్డి తీసుకున్న మూడు నిర్ణయాల పై మనీ కంట్రోల్ తన విశ్లేషణను అందించింది. కేవలం సంక్షేమం అంటూ, కూర్చుని, యాంటీ కరప్షన్ అని చెప్పుకుంటే, దాన్ని పరిపాలన అనరు అంటూ విమర్శలు గుప్పించింది.

moneycontrol 26072019 3

చంద్రబాబు ప్రభుత్వంలో, ప్రాజెక్ట్ లు ఇచ్చి, ఇప్పటికి 25 శాతం అవ్వకపోతే, పనులు ఆపెయ్యాలి అని జగన్ మొహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు బట్టింది. ఇప్పటికే అమరావతిలో, ఎల్ అండ్ టీ సంస్థ, ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయిందని చెప్పింది మనీ కంట్రోల్. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు, అందుకే అమరావతిని ఇలా ఆపేస్తున్నారు అని విమర్శించింది. మరో పక్క చంద్రబాబు హయంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చెయ్యటం, అతి పెద్ద తప్పుగా అభివర్ణించింది. ఇది కూడా చంద్రబాబు మీద రాజకీయ కక్షతో చేస్తున్న పని అని, దీని వల్ల పెట్టుబడి దారులు రారని చెప్పింది. ఇక రెండు రోజుల క్రిందట, పరిశ్రమల్లో 75 శాతం లోకల్ రిజర్వేషన్లను, పొలిటికల్ స్టంట్ గా అభివర్ణించింది. దీని వల్ల పెట్టుబడులు రావని, మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే ఆలోచిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుందని, మనీ కంట్రోల్ విశ్లేషించింది. మరి జగన్ గారు, వీరు చెప్పినవి పాజిటివ్ గా తీసుకుంటారో, లేక ఆ రెండు పత్రికల్లో, దీన్ని కూడా చేర్చి బ్యాన్ చేస్తారో చూడాలి.

జగన్ మోహన్ రెడ్ది ప్రభుత్వం పై, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పై జరుగుతున్న దాడులు పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వానికి 48 గంటలు డెడ్లైన్ ఇస్తున్నామని, లేకపోతే నేరుగా రంగంలోకి దిగుతాం అని అన్నారు. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి వత్తాసు పలికి, మమ్మల్ని జగన్ కాపాడుతాడులే అనుకంటే, కుదరదని అన్నారు.గుంటూరు జిల్లా, ఫిరంగిపురం, పునుగుపాడు గ్రామాల్లో, దారికి అడ్డంగా గోడ కట్టి, వారికి అసౌకర్యం కలిగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే దీని పై అనేక ఫిర్యాదులు చేసినా, పోలీసులు పట్టించుకోవటం లేదని అన్నారు. తెలుగుదేశం సానుభూతిపరులు, ఇళ్ళ ముందు ఇలా చేస్తున్నారని అన్నారు.

cbnwarning 26072019 2

ఇది సాక్షాత్తు హోం మంత్రి మేకతోటి సుచరిత సొంత మండలం అని, అక్కడే ఇలా జరుగుతుంటే పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. ఇదే విషయం పై శాసనమండలిలో మేము ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకుండా పారిపోయారని అన్నారు. ఫిరంగిపురం గ్రామానికి సంబంధించి 48 గంటల్లో ప్రభుత్వం దీని పై ఎదో ఒక చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించక పొతే, సోమవారం అసెంబ్లీలో ఈ విషయం పై నిలదీసి, మేమే రంగంలోకి దిగుతాం అని చంద్రబాబు అన్నారు. పోలీసులు కూడా వైసిపీని వెనకేసుకుని రాకుండా, చట్ట ప్రకారం వెళ్ళాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి రౌడీయిజం చేస్తాడు మమ్మల్ని కాపాడతాడని పోలీసులు అనుకుంటున్నారు. చట్టం ముందు నేరస్తులంతా దోషులే అనేది గుర్తుంచుకోవాలి అని చంద్రబాబు అన్నారు.

cbnwarning 26072019 3

"గత 2నెలల్లో 7గురు టిడిపి కార్యకర్తలను హత్య చేశారు. 285భౌతిక దాడులకు పాల్పడ్డారు. 65 చోట్ల ఆస్తుల విధ్వంసాలు చేశారు. 11 ప్రాంతాలలో భూకబ్జాలకు పాల్పడ్డారు. 24చోట్ల తప్పుడు కేసులు బనాయించారు.చివరికి ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడితే వాటిని సభ దృష్టికి తెచ్చే అవకాశం కూడా స్పీకర్ కల్పించక పోవడం అతి దారుణం. రైతు దినోత్సవ సభకు టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని ఆహ్వానించి తీరా హాజరైతే అక్కడనుంచి వెళ్లిపోవాలని దౌర్జన్యం చేశారు. రాష్ట్రంలో అధికారుల నిస్స హాయతకు ఈ సంఘటన పరాకాష్ట. మరో టిడిపి ఎమ్మెల్యే బెందాలం అశోక్ శ్రీకాకుళం జిల్లాలో అంగన్ వాడి భవన ప్రారంభోత్సవానికి వెళ్తే దాడికి పాల్పడ్డారు. " అని చంద్రబాబు అన్నారు.

రాజకీయాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఒక్క పూటలోనే ప్లేట్ మార్చేసే కాలం ఇది. అలాంటిది మొన్నటిదాకా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ, మోడీ, అమిత్ షా ల పై విమర్శలు చేసిన సియం రమేష్, నేడు బీజేపీ ఎంపీగా అదే రాజ్యసభలో అమిత్ షా చేత శభాష్ అనిపించుకున్నారు. అలాగే మొన్నటిదాకా సియం రమేష్ ని దొంగ అంటూ సంబోధించిన బీజేపీ, ఈ రోజు మా నాయకుడు సూపర్ అంటూ సియం రమేష్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇందులో ఎవరినీ తప్పుబట్టటానికి లేదు. ప్రజల్లోనే లేనిది, రాజకీయ నాయకుల్లో వస్తుంది అనుకోవటం మన భ్రమ. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న రాజ్యసభలో ఒక కీలక బిల్లు పాస్ అవ్వటానికి, బీజేపీకి సరైన మెజారిటీ లేదు. అదే సమయంలో సియం రమేష్ చక్రం తిప్పటంతో, బీజేపీ బిల్ పాస్ చేసుకో కలిగింది.

ramesh 26072019 2

గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐకు సంబంధించి కీలకమైన సవరణ బిల్లు ఓటింగ్ కు వచ్చింది. అయితే రాజ్యసభలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ సవరణ బిల్ ఆమోదం పొందటం చాలా కష్టం అని అందరూ భావించారు. కాని సియం రమేష్ చొరవతో ఈ సవరణ బిల్ కు రాజ్యసభలో లభించింది. ఈ బిల్ పై అనుకూలంగా వోట్ వెయ్యటానికి సియం రమేష్ గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలను సంప్రదించి, ఈ బిల్లుకు అనుకూలంగా ఒప్పించారు. ముఖ్యంగా బీజేడీ, టీఆర్‌ఎస్‌, వైసిపీ, పీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యటంతో, ఈ సవరణ బిల్ కు రాజ్యసభలో ఆమోదం లభించింది. మొత్తం మీద, ఈ బిల్లు పై అభ్యంతరం తెలుపుతూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన సవరణలను, 117 మంది తిరస్కరించగా, 75 మంది సభ్యులు అనుకూలంగా మద్దతు పలికారు.

ramesh 26072019 3

మరో పక్క తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఒకరు, కనకమేడల రవీంద్రకుమార్‌, మరొకరు సీతామాలక్ష్మి. చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ బిల్ పై వ్యతిరేకంగా మాట్లాడింది.ఆర్‌టీఐని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. అయితే ఎప్పుడూ లేనిది, సీతామాలక్ష్మి సభకు వచ్చి వోటింగ్ లో పాల్గునటం మాత్రం, ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బిల్లు పై మూజువాణి ఓటు నిర్వహించినపుడు టీడీపీ ఎటు ఓటేసినదీ వెల్లడి కాలేదు. ఆన్ రికార్డు మాత్రం, టిడిపి ఈ బిల్లు పై వ్యతిరేకంగా ఉంది. కాగా టీఆర్ఎస్ మాత్రం మొదట వ్యతిరేకంగా తెలిపినా, తరువాత ఆన్ రికార్డు సమర్ధించింది. అయితే కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలనీ ఒప్పించటంలో సియం రమేష్ కీలక పాత్ర పోషించారని, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, పీయూష్‌గోయల్‌‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు.

ఇప్పటికే అనాలోచిత నిర్ణయంతో, విద్యుత ఒప్పందాల సమీక్ష పై, కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం చెప్పిన న్యూస్ తో మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధన తీసుకువచ్చింది. రాష్ట్ర డిస్కింలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, విద్యుత్ సరఫరా చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఆగష్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున చెల్లింపుల భద్రత చూపితేనే, విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర డిస్కింలు రూ.20 వేల కోట్ల బకాయిలు పడ్డాయి. ఈ బకాయలు ప్రతి నెల పెరుగుతూ పోతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేంద్రం తీసుకు వస్తున్న ఈ నిబంధన అమలులోకి వస్తే, ప్రతి రోజు రాష్ట్ర డిస్కింలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చెయ్యాలి.

current 26072019 1

ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే విద్యుత్ కు, ఆ రోజుకి ఆ రోజు, బ్యాంక్ నుంచి చెల్లించే ఏర్పాటు చెయ్యాలి. ఒకవేళ కనుక డిస్కింలు చెల్లింపులు చెయ్యకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, ఆగష్టు 1 వ తారీఖు నుంచి, కేంద్ర సంస్థల నుంచి మనకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఈ నిబంధన అంగీకరించటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వటం కుదరదు అని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రానికి లేఖ రాసారు. కేంద్రం దానికి ఎలాంటి రిప్లై ఇస్తుంది, ఏమి సూచనలు చేస్తుంది, అసలు ఒప్పుకుంటుందా లేదా అనే దాని గురించి, రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది.

current 26072019 1

ఏపి జెన్కో ద్వారా తీసుకున్న విద్యుత్ ను, డిస్కింల ద్వారా, ఇళ్ళకు, పొలాలకు, కంపెనీలకు సరఫరా చేస్తారు. అయితే, విద్యుత్ బిల్లులు వసూలు చేసి, డిస్కింలు, జెన్కోకు చెల్లించాలి. అయితే బిల్లులు చెల్లింపులు ఆలస్యం అవ్వటం, విద్యుత్ చోర్యం, సాంకేతిక నష్టాలు కారణంగా, ఇప్పటి వరకు డిస్కంల నష్టాలు 20 వేల కోట్లకు చేరాయి. ఇవి తిరిగి చెల్లించే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో విద్యుత్ ఉత్పత్తి భారంగా మారుతుంది. మరో పక్క, బొగ్గు , రవాణా చార్జీలు పెరిగాయి. ఇవన్నీ చూసిన కేంద్రం, బకయాలు భారాన్ని ఇక ఏ మాత్రం మొయ్యటానికి సిద్ధంగా లేదు. అందుకే ఆ బాధ్యతను రాష్ట్రాలకు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. మరి కేంద్రం కనుక దిగి రాక పోతే, పరిస్థితులు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. విద్యుత్ ఒప్పందాల సమీక్షలా కాకుండా, ఇదైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చేస్తుందో లేదో చూద్దాం.

Advertisements

Latest Articles

Most Read