జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పై, టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా లెక్కలతో సహా చూపించి కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల్లో, చంద్రబాబు అక్రమాలు చేసారని, దీని పై ఒక కమిటీ వేసి చంద్రబాబుని జైలుకు పంపించాలని జగన కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. దీని పై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విద్యుత్ కొనగాళ్ల ఒప్పందాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావొద్దని కేంద్రం సూచించినా, చంద్రబాబు పై అవినీతి ముద్ర వేయాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. లోకేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ.... ‘‘నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్ర‌మాస్తుల కేసులో ఏ1 అవినీతిపై క‌మిటీ వేశారు. ఏ2 విజయ్ సాయిరెడ్డి విచార‌ణ చేస్తార‌ట‌! క‌లికాలం కాక‌పోతే అక్ర‌మాల విక్ర‌మార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!! వైఎస్ హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ తండ్రి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శ‌నిక నేతో తెలుసుకోడానికి. "

"అన్న‌య్య‌లూ.. నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా రూ. 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుంచి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం. గడిచిన 5 ఏళ్లలో రూ.36 వేల కోట్ల పెట్టుబడి,13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా? నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది.’’ అంటూ జగన్ చేసిన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అన్ని అనుమతులూ ఉన్నాయని, అవన్నీ చూసిన తరువాతే చంద్రబాబు ఆ ఇంట్లోకి వెళ్ళారని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తెలుగుదేశం పార్టీ నేతలు ఆధారాలుతో సహా బయటపెట్టారు. మీడియాతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్ని వివరాలు చెప్పారు. "2015 తర్వాత సీఆర్డీఎ కొత్త చట్టం తెచ్చింది. 2015 కంటే ముందు పాత చట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ఉంటున్న భవనం 2011కు ముందు కట్టారు . అప్పుడు సీఆర్డీఎ అనేది లేదు. గ్రామ పంచాయతీ దగ్గర అనుమతులు తీసుకుని కట్టారు. ఆరోజే ఈ భవన యాజమాని, వన్ ప్లస్ వన్ గా ఈ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆనాడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొంటే సరిపోతుంది అనేది, వీళ్ళు గుర్తుంచు కోవాలి. ఇన్ని వివరాలు ఇచ్చినా, ఈ ప్రభుత్వం పెద్దలకు ఇదంతా తెలిసినా వినరు, ఎందుకంటె, వీరికి చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ధ్యేయం ఉంది."

"అందుకే ఈ విషయాలు అన్నీ ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుని , ప్రజలకే చెప్తున్నాం. ఈ భవనం కట్టడానికి, 2011 లో, అప్పటి పంచాయతీ తీర్మానం తీసుకుని, రివర్ కన్వర్జేషన్ యాక్టు ప్రకారం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే ఈ భవన యజమాని, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోడానికి, ఒక భవనం కట్టుకోడానికి అనుమతి తీసుకున్నారు. ఇది వ్యవసాయ భూమి కావటంతో, ఇకక్డ భవనం కట్టాలంటే కన్వర్షన్ చేసుకోవాలి. అందుకని వ్యవసాయ భూమిని, వాణిజ్య భూమిగా మార్చే కన్వర్షన్ కోసం, సుమారు రూ. 18లక్షలు నాలా పన్ను కట్టారు. ఇన్ని వాస్తవాలు ఉంటే చంద్రబాబునాయుడు అనుమతి లేని భవనంలో ఉంటున్నారని,ప్రచారం చేస్తున్నారు." అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. పంచాయతీ తీర్మానం, నాలా పన్ను రసీదు , రివర్ కన్జర్వేషన్ యాక్టు నో అబ్జషణ్ సర్టిఫికేట్ లను మీడియాకు అందజేశారు.

అధికారంలోకి వచ్చిన తరువాత, రోజు రోజుకీ వైసీపీ నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఒక పక్క రాజకీయ దాడులు, హత్యలు, బెదిరింపులు, ఇలా ఒక్కటేమిటి, వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఈ రోజు ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతు పురాణం విన్నాం. ఏకంగా జర్నలిస్ట్ లనే, నడి రోడ్డు మీద నరికేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులు ఒక పక్క జరుగుతుంటే, దందాలకు కూడా అడ్డు లేకుండా పోతుంది. మొన్నటి వరకు నిర్వహిస్తున్న  క్వారీలు కూడా బెదిరించి లాక్కుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చేసి వెళ్ళిపొండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎవరైనా అడ్డు చెప్తే, తమదైన శైలి రుచి చూపించి మరీ లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఈ రోజు  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఇదే రకమైన దందా చేసారు వైసీపీ నాయకులు. ఇబ్రహింపట్నం క్వారీల వద్ద ఈ రోజు స్థానికంగా ఉండే వైసీపీ నేతలు హల్‌చల్‌ చేసి, అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారు.

అందిన వివరాలు ప్రకరం, ఇబ్రహీంపట్నంలో చాలా కాలంగా క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటి పై ఎప్పటి నుంచో స్థానిక వైసీపీ నేతలు కన్ను వేసారు. ప్రభుత్వం మారటంతో, అక్రమ క్వారీ అని, ఆపేయాలని కొద్ది రోజులుగా వేదిస్తున్నారు. అంతా సక్రమంగానే చేస్తున్నాం అని, క్వారీ పనులు ఆపకపోవడంతో అక్కడ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాటే వినరా అంటూ, క్వారీ గేటు దగ్గర పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి క్వారీల నుంచి లారీలు, రాకపోకలు సాగించకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ ఆధిపత్యం తట్టుకోలేక, వారితో తలపడలేక క్వారీ యజమానులు చేసేదిలేక పనులను ఆపేశారు. బండరాళ్లను ఎందుకు అడ్డు పెడుతున్నారు అని వైసీపీ నేతలను ప్రశ్నించగా, వచ్చి ఎమ్మెల్యేనుకలవాలని చెప్పారని క్వారీ యజమానులు అంటున్నార. అయితే ఈ ఘటన పై మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో క్వారీ యజమానులు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని, అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

ప్రజా వేదిక కూల్చివేత పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ప్రభుత్వం ఇప్పుడు ద్రుష్టి మరలచటానికి, కరకట్ట పై ఉన్న వివధ కట్టడాల వారికి నోటీసులు ఇస్తుంది. ప్రజల వినతులు వినటానికి, ప్రజా వేదికను ప్రతిపక్ష హోదాలో ఉన్న తనకు ఇవ్వమని చంద్రబాబు అడగటంతో, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక, అది అక్రమ కట్టడం కూల్చేస్తున్నాం అంటూ అనుకున్నదే ఆలస్యం, కూల్చిపడేసింది. ఇప్పుడు పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేసి చంద్రబాబు పై కక్ష సాధింపు ధోరణితో వెళ్ళాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు కరకట్టపై పై చంద్రబాబు ఇంటికి వెళ్ళిన అధికారులు, ఇది అక్రమ కట్టడం దీన్ని వారం రోజుల్లో ఖాళీ చెయ్యండి అంటూ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇంటికి మాత్రమే వెళ్తే కక్ష సాధింపు అనుకుంటారని, మిగతా కట్టడాలు ఉన్న వారి ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.  అయితే నోటీసులు ఇవ్వటానికి వెళ్తున్న సీఆర్డీఏ అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో, ఎలాగు వచ్చాం కాబట్టి నోటీస్ అంటించి వెళ్తున్నారు.
 

కరకట్ట పై నోటీసులు ఇవ్వటానికి, ఏ ఇంటికి వెళ్లినా, తమ కట్టడాలకు అనుమతులు ఉన్నాయంటూ, వారి ఇంటి గేట్ల ముందు బోర్డులు పెట్టుకున్నారు. ఆ బోర్డులు చూసిన అధికారులు అవాక్కయి, ఏమి చెయ్యాలో అర్ధం కాక, తెచ్చిన నోటీసులను అంటించి వెళ్తున్నారు. అయితే అసలు వీరికి అనుమతులు ఎప్పుడు వచ్చయి, ఎలా వచ్చాయి, ఎవరు వీరికి అనుమతి ఇచ్చారు, ఏ ప్రభుత్వ హయాంలో అనుమతి ఇచ్చారు అన్న ప్రశ్నల కోసం, ఇప్పుడు అధికారులు పాత ఫైళ్లను తిరగేస్తున్నారు. సీఆర్డీఏ ఏర్పడక ముందే, వీటిలో కొన్నిటికి విజయవాడ వుడా నుంచి, కొన్ని పంచాయతీ నుంచి అనుమతులు ఇచ్చి ఉంటారని, భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, చందబాబు ఇంటిని మాత్రం వదలటం లేదు. ఆయన్ను ఎలా అయినా ఇంటి నుంచి గెంటటానికి, నోటీసులు ఒక్కటే కాదు, ఆయన ఇంటిని కొలతలు తీసుకోవాలని, ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా మరింత ఒత్తిడి చంద్రబాబు పై పడుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని సర్వేయర్లతో కొలతలు తీయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.

 

Advertisements

Latest Articles

Most Read