శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ సంచలనాత్మక ఆరోపణ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని, ఒక్క ఓటమి తమ పార్టీని నిలువరించబోదన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. తన ఒక్కడి ఓటమి కోసమే రూ.150 కోట్లు ఖర్చు చేస్తే, రాష్ట్రమంతా ఎంత ఖర్చు పెట్టారో ఆలోచిస్తూనే భయం వేస్తుందని అన్నారు. పరాజయాన్ని అంగీకరించని తాను గెలిచేవరకూ పోరాటం చేస్తూనే ఉంటానని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

pk 09062019 1

‘నా జీవితం రాజకీయాలకు అంకితం. మళ్లీ చెబుతున్నా... నా శవాన్ని నలుగురు మోసుకువెళ్లే వరకు నేను జనసేనను మోస్తా. నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని. 25 సంవత్సరాల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఓటమి ఎదురైతే తట్టుకోగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించా’ అని పవన్‌ చెప్పారు. ఈవీఎంల అక్రమాలు, ధన ప్రలోభం వంటివి తాజా ఓటమికి కారణాలుగా చెబుతున్నారని, వీటన్నింటినీ తాను పట్టించుకోబోనని పేర్కొన్నారు. వైకాపా పాలన ఎలా ఉంటుందో చూద్దామని అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ జనసేన గుర్తు కనబడాలని, ప్రజలకు మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని చెప్పారు.

pk 09062019 1

‘మీరు ఉంటారా వెళ్లిపోతారా అని సమీక్షకు వచ్చిన ప్రతి అభ్యర్థిని నేను అడుగుతున్నాను. వెంట ఉండేందుకే ఇక్కడి వరకు వచ్చామని వారు చెబుతున్నారు. ఇంతకుమించిన విజయం ఏం కావాలి? ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటపడుతుంది. ఓటమి ఎదురైనప్పుడే అవతలివారు మనవారా? పరాయివారా అన్న విషయం అర్థమవుతుంది. ఈ పార్టీ కార్యాలయం అందరిదీ. ఎవరు ఎప్పుడయినా రావచ్చు. అందరినీ కలిసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తాను’ అని వివరించారు. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులతోను పవన్‌ సమావేశమయ్యారు. జిల్లాల వారీగా అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చించారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో జనం సమస్యలపై సమగ్ర అవగాహనకు రావాలని ఉద్బోధించారు. పంచాయతీ, జడ్పీ, పురపాలక ఎన్నికల్లో దీటుగా పోరాడదామన్నారు.

పోలీస్‌ వాహనంలో అడిగిన వెంటనే డీజిల్‌ అప్పుపై పోయలేదని పెట్రోలు బంకులో పనిచేసే కార్మికుణ్ని గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై ఎం.రాంబాబు చితకబాదారు. బాధితుని కథనం ప్రకారం..శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్‌ పోయించుకు రమ్మని స్థానిక ఓంనమశివాయ పెట్రోలు బంకుకు పంపారు. డ్రైవరు వచ్చి డీజిల్‌ పోయమని అడగ్గా.. తన యజమాని చెబితేనే పోస్తానని కార్మికుడు హుమాయూన్‌ చెప్పాడు. అదే విషయాన్ని డ్రైవరు ఎస్సైకు ఫోన్ లో వివరించాడు. ఆగ్రహించిన ఎస్సై వాహనాన్ని వెనక్కి పిలిపించి అదే వాహనంలో బంకుకు వచ్చి కార్మికుడిని కొట్టారు. అనంతరం స్టేషన్‌కి తీసుకెళ్లి కూడా కొట్టారని.. అదేమని అడిగితే అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు.

guntur 09062019 3

ఈ ఘటనను నిరసిస్తూ ఎస్సైకు వ్యతిరేకంగా బంకు కార్మికులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. దీనిపై ఎస్సై రాంబాబును వివరణ కోరగా తాము నెలనెలా బిల్లు చెల్లిస్తామని, డీజిల్‌ కోసం వాహనం పంపితే కార్మికుడు డ్రైవరుతో దురుసుగా మాట్లాడాడని అన్నారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సంఘటన విషయాన్ని యజమానుల దృష్టికి తీసుకెళ్లామని కార్మికులు తెలిపారు.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ముఖ్య‌నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేయ‌గా..తాజాగా మాజీ సభాపతి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ ఆ పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్‌ అమెరికా పర్యటనలో ఉన్నందువల్లే సమావేశానికి హాజరు కాలేకపోయారని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

nadendla 09062019

ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని వెల్లడించింది. నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిశోర్‌బాబు జనసేన పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వ్యవహరించారు. గ‌త ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీలో మ‌నోహ‌ర్ చేరారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టిన సమయంలోను ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, తిరిగి పుంజుకుంటున్న సమయంలో ఆయ‌న జ‌న‌సేన వెళ్ల‌డంపై చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచి జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

చిత్తూరు సమీపంలోని హెరిటేజ్‌ ప్లాంటుపై శనివారం రాత్రి దాడి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలంలోని ఎన్టీఆర్‌ కాలనీ సమీపంలో ఉన్న హెరిటేజ్‌ ప్లాంటు వద్దకు రాత్రి 7.30 గంటలకు చిత్తూరు కట్టమంచికి చెందిన మనోజ్‌ అనే వ్యక్తి పెరుగు కోసం వచ్చాడు. పాల పదార్థాల విక్రయ కేంద్రం మూసేసి ఉండటంతో సెక్యూరిటీ ఆఫీస్‌ వద్దకెళ్లాడు. కేంద్రం మూసేశామని.. ఆదివారం వచ్చి పెరుగు తీసుకోవాలని వారు సూచించారు. ఆదివారం కట్టమంచిలో కర్మక్రియలు నిర్వహిస్తున్నామని.. ఇప్పుడే పెరుగు కావాలని వాగ్వాదానికి దిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మనోజ్‌ ఈ విషయాన్ని కట్టమంచివాసులకు తెలియజేశాడు. కొంతసేపటికి దాదాపు 20 మంది కట్టమంచివాసులు వచ్చి సెక్యూరిటీ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ప్లాంటు లోపలకు వెళ్లి వర్కర్లను బెదిరించారు.

heritage 0906 2019 1

హెరిటేజ్‌ సిబ్బంది వెంటనే జీడీ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగసౌజన్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులను బయటికి పంపించారు. సెక్యూరిటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆమె పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read