వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు తరువాత తొలిసారి విశాఖ పర్యటనకు వెళ్లారు. విశాఖలోని శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ఫలాలు సమర్పించారు. సీఎం హోదాలో తనను కలిసేందుకు వచ్చిన జగన్‌ను స్వరూపానంద స్వామి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దాడారు. విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారికి జగన్‌తో ప్రత్యేక పూజలు చేయించారు. సీఎం జగన్‌తో స్వరూపానంద ఏకాంతంగా చర్చలు జరిపారు.విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్‌కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠానికి చేరుకున్న జగన్‌ ..స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

jagan 04062019 1

2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్‌ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులు పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ ఆశీస్సులు పొందారు. ఈ నెల 8న మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో మంత్రుల పేర్ల విషయమై స్వరూపానందేంద్రతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వారం క్రితం జగన్ ప్రమాణస్వీకారానికి అసలు ఖర్చే అవ్వలేదు అంటూ, చేసిన హడావిడి చూసాం. 29 లక్షలు అడ్వాన్స్ ఖర్చుగా ఇచ్చిన జీఓ చూపించి, మొత్తం ఖర్చు 29 లక్షలు మాత్రమే అని హడావిడి చేసారు. అయితే దీని పై ఎవరి వాదన వారిది ఉన్నా, జగన్ కేవలం 29 లక్షలు మాత్రమే ఖర్చు చేసారంటూ, ప్రాచుర్యం పొందింది. ఇది ఇలా ఉంటే, నిన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం తరుపున ఇచ్చిన ఇఫ్తార్ విందు ఖర్చు చూసి, అందరూ అవాక్కయ్యారు. తెలుగు మీడియా ఈ విషయం గురించి ప్రస్తావన చెయ్యకపోయినా, జాతీయ మీడియా ఈ విషయం పై జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. కేవలం 6 వేల మందికి ఇఫ్తార్ విందు అని చెప్పి, అక్షరాల కోటి రూపాయలు ఖర్చు చేసారని, ఇంత దుబారా ఖర్చు ఎందుకు అయ్యింది అంటూ, జాతీయ మీడియా ప్రశ్నించింది.

iftar 04062019 1

ఇదే విషయం పై బీజేపీ కూడా దాడి ప్రారంభించింది. జగన్ నిన్న గుంటూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుపై విమర్శలు వస్తున్నాయి. జగన్ తన ప్రమాణస్వీకారానికి రూ.29 లక్షలు మాత్రమే ఖర్చుగా చూపారని, అంతకంటే తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరైన ఇఫ్తార్ విందుకు మాత్రం రూ.1.1 కోట్లు ఖర్చుగా చూపడం ఏంటని ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. భారతదేశం లౌకికవాద దేశమని, ఇలాంటి దేశంలో ప్రత్యేకంగా ఓ మతపరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించడం సరైన విధానం కాదని విమర్శించారు. మున్ముందు జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనే భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం అని, గత సీఎం చంద్రబాబు పోరాటాలు, ధర్నాలను సైతం విలాసవంతంగా మార్చేసి ఖజానాకు గండికొట్టారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఆయన బాటలో నడవరనే ఆశిస్తున్నానని జీవీఎల్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం దిల్లీ చేరుకున్న నరసింహన్‌ ప్రధాని మోదీతో కొద్దిసేపు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ నిర్వహణలో ఉన్న భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన అంశం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన భేటీ అంశాలు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. అనంతరం కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్‌, సుబ్రహ్మణ్యం జయశంకర్‌, హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలను గవర్నర్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా నరసింహన్‌ సమావేశమైనట్లు సమాచారం. సోమవారం రాత్రి తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాకులో ఆయన బస చేశారు.

కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మంగళవారం సైబర్‌క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సొంత ప్రయోజనం కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌కు పలుమార్లు నోటీసులు జారీచేశారు. రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరుకాకపోగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోరుతూ రవిప్రకాష్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.

ravi 04062019

అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రవి ప్రకాష్ పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. దీంతో రవిప్రకాష్ నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 41ఏ సీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని ఇది వరకే ఆయనకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా ఆయనకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం కూడా తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్‌ విషయాన్ని హైకోర్టే తేల్చాల్సి ఉందని.. అక్కడికే వెళ్లాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. 41(ఏ) నోటీసు కింద పోలీసుల ఎదుట విచారణకు తప్పకుండా హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

ravi 04062019

నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు టీవీ9కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు సినీనటుడు శివాజీ, మూర్తిపైనా కేసులు నమోదు కాగా.. మూర్తిని మాత్రమే పోలీసులు పలు దఫాలుగా విచారించారు. శివాజీ, రవిప్రకాశ్‌ విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టుకే వెళ్లాలని స్పష్టంచేసిన నేపథ్యంలో తమ ఎదుట హాజరైన రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు పలు ప్రశ్నలు సంధించనున్నారు. అలంద మీడియా ఫిర్యాదుతో పోలీసులు టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.

Advertisements

Latest Articles

Most Read