ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలలో 55 శాతం మంది నేరచరితులు ఉన్నట్లు ఎన్నికల నిఘావేదిక రాష్ట్రసమన్వయకర్త డాక్టర్‌ పీసీ.సాయిబాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారిలో 32 శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. పార్టీల వారీగా చూస్తే వైసీపీలో 86 శాతం మంది, టీడీపీలో 39 శాతం మంది నేరచరితులుగా ఉన్నారన్నారు. జనసేన నుంచి ఎన్నికైన ఒక శాసనసభ్యుడు కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నూతన శాసనసభ్యులలో 94 శాతం మంది కోటీశ్వర్లుగా ఉన్నారన్నారు. వైసీపీ శాసనసభ్యులలో 93 శాతం మంది, టీడీపీలో 96శాతం మంది కోటీశ్వర్లు కాగా జనసేన ఎమ్మెల్యే కూడా కోటీశ్వరుడే అన్నారు. శాసనసభ్యుల సగటు ఆస్తి రూ.27.87 కోట్లు కాగా వారిలో వైసీపీ వారి సగటు రూ.22.41 కోట్లు, టీడీపీ వారి సగటు రూ.66.41 కోట్లుగా ఉందన్నారు.

నూతన ఎమ్మెల్యేలలో 64 శాతం మంది గ్రాడుయేట్‌లు కాగా 34 శాతం మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారన్నారు. ఇక లోక్‌ సభ విషయానికి వస్తే, లోక్‌సభ కు ఎన్నికైన ఎంపీల్లో సుమారు 50% మందికి నేర చరిత్ర ఉన్నట్లు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో వారు తెలిపిన వివరాల ప్రకారం వీటిని విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 233 మందిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులున్నాయి. 2009 లోక్‌ సభ కంటే ఇది 44% ఎక్కువ కావడం గమనార్హం. కేరళలోని ఇడుక్కి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియాకోసేపై 204 కేసులున్నట్లు ఆయన తన నామినేషన్‌లో పేర్కొన్నారు.

 

2014 ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో 185 మందిపై కేసులున్నట్లు వెల్లడి కాగా.. ఇక 2009లో 162 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు వెల్లడైంది. కొత్త ఎంపీల్లో 159 మంది(29శాతం)పై తీవ్ర నేర కేసులున్నాయి. వీటిలో అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళా వేధింపులు తదితరాలున్నాయి. 2014లో 112(21%)మందిపై తీవ్ర నేర కేసులున్నాయి. 2009లో 76(14%) మంది ఎంపీలపై తీవ్ర నేర కేసులున్నాయి. ఇక ఈ ఎంపీల్లో 10మంది దోషులుగాతేలిన వాళ్లున్నారు. 11మంది ఎంపీలు హత్య కేసుల్లో దోషులుగా ఉన్నారు. మరో 30 మంది విజేతలు హత్యా ప్రయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఎన్డీయేకి చెందిన ఎంపీల్లో నేర చరిత్ర కలిగిన వాళ్లు అత్యధికంగా ఉన్నారు. భాజపా తరఫున గెలిచిన 303 మంది ఎంపీల్లో 116 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 29 మందిపై, డీఎంకేకి చెందిన 10 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయి.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, వెంటనే బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు కొద్ది రోజుల క్రితం స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు విన్నవించుకున్నారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బీజేపీ ఉందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి. బీఎస్‌పీకి చెందిన ఎమ్మెల్యే రమాబాయి మీడియాతో మాట్లాడుతూ తనను భారతీయ జనతా పార్టీలోకి రమ్మంటూ ఫోన్ కాల్స్ వచ్చాయని, తనకు మంత్రి పదవి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇలానే చాలా మందికి బీజేపీ నేతలు ఫోన్ చేసి చెబుతున్నారని, అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరేది లేదని ఆమె స్పష్టం చేశారు.

bjp 27052019

బీజేపీలోకి కేవలం మూర్ఖులు మాత్రమే వెళ్తారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్‌పీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే ఇద్దరికీ బీజేపీ నేతలు ఫోన్ చేసి మంత్రి పదవులతో పాటు 50-60 కోట్ల రూపాయల డబ్బు ఆశచూపారని రమాబాయి తెలిపారు. ఇలాగే మిగతా ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక కర్ణాటకలోని జెడిఎస్‌-సంకీర్ణ ప్రభుత్వానికి సంకట పరిస్థితి ఎదురైంది. తాజా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..బిజెపి నేత ఎస్‌ఎం కృష్ణను కలవడం చర్చనీయాంశమైంది.. రమేష్‌ జర్కిహోలి, సుధాకర్‌లు ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

bjp 27052019

ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్‌ యడ్డ్యూరప్ప కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ రాజకీయ పరమైనదని కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయానికి అభినందనలు తెలుపడానికి వచ్చామని కాంగ్రెస్‌ నేత రమేష్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా మాండ్య స్థానం నుండి గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థి సుమలత కూడా కృష్ణను ఆయన నివాసంలోనే కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానని అన్నారు. రాష్ట్రంలో 28లోక్‌సభ స్థానాల్లో బిజెపి 25 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన మూడు స్థానాలు కాంగ్రెస్‌, జెడిఎస్‌, స్వతంత్య్ర అభ్యర్థి చెరో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి..

పెట్రోల్ వడ్డన ఆగట్లేదు. దేశీ ఇంధన ధరలు ఐదు రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. సోమవారం (మే 27) పెట్రోల్ ధర 11 పైసలు పైకి కదిలింది. డీజిల్ ధర మాత్రం నిలకడగా కొనసాగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.12కు చేరింది. డీజిల్ ధర రూ.72.47 వద్ద స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మిశ్రమంగా స్పందించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కేవలం ఒకే ఒక పైసా పెరుగుదలతో రూ.71.77కు చేరింది. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.66.64 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 10 పైసలు ఎగసింది. డీజిల్ ధర నిలకడగా ఉంది.

petrol 27052019

దీంతో పెట్రోల్ రూ.77.38కు చేరితే.. డీజిల్ ధర రూ.69.83 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.75.86కు చేరింది. డీజిల్‌ ధర రూ.71.82 వద్దే కొనసాగుతోంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.75.51కు పెరిగింది. డీజిల్ ధర రూ.71.50 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.19 శాతం పెరుగుదలతో 67.60 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.36 శాతం తగ్గుదలతో 58.60 డాలర్లకు క్షీణించింది.

ఏపీలో మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పోలీస్ శాఖలో మార్పులు-చేర్పులు మొదలయ్యాయి. ఏపీ డీజీపీగా ఠాకూర్‌ స్థానంలో సీనియర్ ఐపీఎస్ గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో భద్రతలో కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయన్న చర్చ మొదలయ్యింది. ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ల పేర్లు తెరపైకి వస్తున్నా.. తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర పేరు కొత్తగా తెరపైకి వచ్చింది.

andhra 27052019

స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆయనకు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జగన్ విజ్ఞ‌ప్తి మేరకు స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై తెలుగు రాష్ట్రాల పోలీస్‌శాఖ నుంచి అధికారిక సమాచారం మాత్రం లేదు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా పని చేశారు. అయితే తెలంగాణాలో ఉన్న కీలక అధికారిని, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఇంటలిజెన్స్ పదవి ఇవ్వటం పై, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

andhra 27052019

ఇప్పటికే ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisements

Latest Articles

Most Read