కేంద్రంలో రెండోసారి సత్తా చాటిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో చతికిలపడింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటూ రాలేదు. పైగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన బీజేపీ రెండు లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు మంత్రులుగా కూడా పనిచేశారు. అయితే ఈ పొత్తును మొదటి నుంచీ వ్యతిరేకించిన పార్టీలోని ఒక వర్గం.. బీజేపీ సొంతంగా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని ఆనాడు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కమలనాథులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు దేశమే ముఖ్యమని, ఆ దిశగా చేసిన ప్రయత్నంలో మోదీకి రెండోసారి అవకాశం దక్కిందని బీజేపీలోని అసలైన పార్టీ వాదులు సంతృప్తి పడుతున్నారు.

bjp 25052019 1

పార్టీలోకి వలస వచ్చిన వారు మాత్రం డిపాజిట్లు రాక, తమకు ఎక్కడా విలువ ఉండదని పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్న ప్రధాని మోదీ చివరి బడ్జెట్‌లో దానిని చేర్చలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకొచ్చింది. అక్కడ సుజనా, అశోక్‌గజపతిరాజు, ఇక్కడ కామినేని, పైడికొండల తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ విధంగా టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా బలపడాలని భావించిన అధిష్ఠానం కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేసిన కన్నాకు డిపాజిట్‌ దక్కలేదు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లలో చేయని సాయం ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ప్రచారానికి వచ్చి కేంద్రసాయంపై తలోమాట, తమకు తోచిన లెక్కలు చెప్పారు.

bjp 25052019 1

చివరకు రైల్వేజోన్‌ విషయంలో చేసిన ప్రకటననూ ప్రజలు విశ్వసించలేదు. బీజేపీని ఎక్కువగా ఆదరించిన విశాఖ (ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) వాసులు.. ఈ ఎన్నికల్లోనూ కరుణిస్తారని భావించి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ఎంపీగా బరిలో దించారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మినహా బీజేపీ అభ్యర్థిని విశాఖ వాసులు గుర్తించలేదు. ఇదే వైఖరి 25 లోక్‌సభ, ఆ పార్టీ పోటీ చేసిన 174 అసెంబ్లీ స్థానాల్లోనూ కనిపించింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ‘పొత్తు లేకుండా ఒంటరిగా ఆంధ్రప్రదేశ్‌లో గెలవలేం’ అని ఈ ఫలితాలను చూసిన కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. 1999లోనూ టీడీపీతో పొత్తుపెట్టుకునే గెలిచామని గుర్తు చేస్తున్నారు. పొత్తు వద్దని వారించిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు.

ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, తుది ఫలితాల్లో ప్రకటించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఈ తేడా వందల్లో ఉండగా... మరికొన్ని చోట్ల వేలల్లో ఉంది. అధికారిక గణాంకాల్లోనే ఇలా తేడాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. ఏ శాసనసభ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న గణాంకాలను అందులో పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే చాలా నియోజకవర్గాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే ఫలితాలు ప్రకటించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండగా. ..మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది.

evm 25052019

ఒంగోలులో 1,92,664 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,90,731 ఓట్లు మాత్రమే తేలాయి. గురజాలలో 2,24,218 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 2,24,055 ఓట్లు మాత్రమే తేలాయి. డోన్ లో 1,73,403 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,484 ఓట్లు తేలాయి. చిలకలూరిపేటలో 1,91,390 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,484 ఓట్లు మాత్రమే తేలాయి. పొన్నూరులో 1,88,893 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,89,066 ఓట్లు మాత్రమే తేలాయి. తాడిపత్రిలో 1,90,728 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,780 ఓట్లు మాత్రమే తేలాయి. గుంటూరు తూర్పులో 1,61,177 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,61,239 ఓట్లు మాత్రమే తేలాయి. ఇలా అనేక చోట్ల తేడా వచ్చాయి.

evm 25052019

దీనికి సహేతుక కారణాలున్నాయని...అనవసర సందేహాలు అవసరం లేదని రిటర్నింగ్‌, ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అలా వ్యత్యాసాలు ఎందుకొచ్చాయనే దానిపై రిటర్నింగ్‌ అధికారుల నుంచి వివరణ కోరుతామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని ఈవీఎంలు మోరాయించాయి. బ్యాటరీ పనిచేయక మరికొన్నింటిని తెరిచేందుకు వీలు లేకపోయింది. మాక్‌పోల్‌ అనంతరం కంట్రోల్‌ యూనిట్లలోని ఓట్లను జీరో చేయకుండానే...పోలింగ్‌ ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లోని ఈవీఎంలను లెక్కించకుండా పక్కన పెట్టేశారు. కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులకు, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే చివర్లో కూడా వాటిని లెక్కించలేదు. వాటిల్లో పోలైన ఓట్ల వివరాలను ఫలితాల సమయంలో కలపలేదు అని అధికారులు చెప్తున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న గుంటూరు రానున్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై తెదేపా చర్చించింది. ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

cbn 25052019

ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించగలదో లేదో అని సంశయంతో ఉన్నవారిని సైతం తీవ్ర విస్మయానికి గురిచేసే రీతిలో ఆ పార్టీ పరాజయం పాలైంది. అయితే ఇంత ఘోరమైన ఓటమిని చవిచూస్తుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. తెలుగుదేశాన్ని తీవ్రంగా నిరాశపరచిన అంశం ఏమిటంటే- ప్రజలకు భారీయెత్తున నగదు పంపిణీ చేసే పథకాలను అమలుచేసినా ఓటమి తప్పకపోవడం! ‘పసుపు కుంకుమ’ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు 2016లో ఒకసారి, పోలింగుకు కొద్దిరోజుల మందు మరోసారి పదేసి వేల రూపాయల వంతున ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేసింది. ఇలా ప్రయోజనం పొందిన మహిళలు సుమారు 90 లక్షల పైచిలుకు ఉన్నారు.

cbn 25052019

వీరి ఓట్లపైనే తెలుగుదేశం బాగా ఆశలు పెట్టుకుంది. రైతులకోసం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని చేపట్టి 46 లక్షలమంది రైతులకు తొలివిడతగా ఒక్కొక్కరికి నాలుగువేల వంతున పోలింగుకు కొద్దిరోజుల ముందు పంపిణీ చేసింది. వీటికి తోడు పట్టిసీమ నిర్మాణం, పోలవరం పురోగతి, రాజధాని వంటి అంశాల్లో తాము చేసిన కృషి ఎన్నికల్లో విజయానికి పునాది వేస్తుందని తెలుగుదేశం గట్టిగా నమ్మింది. పోలవరం, రాజధాని పనులపై ప్రజలకు సానుకూల అభిప్రాయం ఏర్పడటం కోసం కొద్ది నెలలుగా నిత్యం బస్సుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో సందర్శన యాత్రలు నిర్వహించింది. ప్రభుత్వ ఖర్చుతో ఇలా లక్షల మంది ఆ పనులను చూశారు. రాష్ట్రంలో కియా కార్ల కర్మాగారం ఏర్పాటయ్యేలా చూడటం, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ కంపెనీలను రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేసిన కృషి చాలా ఉంది. ఇంత కృషి సల్పిన తమకే ఓట్లు వేస్తారనే విశ్వాసంతో తెలుగుదేశం వ్యవహరించింది. కాని చివరకు అనేక కారణాల వల్ల, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించారు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. ఆయన విజయవాడలోని పైపుల రోడ్డులో నిర్వహించ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కార్యక్రమానికి సంబంధించిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసిన పోలీసులు... సమావేశం నిర్వహించతలపెట్టిన ప్రదేశం బహిరంగం కావున ఆయనను వ్యతిరేకించే వర్గం వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉందని దీని కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రెస్ క్లబ్ లో గాని మరొక చోట గాని సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే రద్దీ గా ఉండే ప్రాంతం కాబట్టి ఎమర్జెన్సి సర్వీసులు కూడా తిరిగే అవకాశం ఉండటంతో సమావేశ స్థలాన్ని మరొక చోటకి మార్చుకోవాలని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు.

rgv 25052019

అలాగే అక్కడే కొన్ని స్కూళ్ళు కాలేజీలు ఉండటం, గ్రూప్ వన్ పరీక్ష ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్, సెక్షన్ 144 సిఆర్ పీసీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సమావేశం ఇక్కడ నిర్వహించవద్దని ఆయనకు సూచించారు. కాగా ఇటీవల కూడా సమావేశం నిర్వహించాలని చూడగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read