నిన్న దేశంలో ఎగ్జిట్‌పోల్స్‌ చూసి ప్రజలు ఛీ కొడుతున్న విషయం తెలిసిందే. మమతా, నవీన్, మాయవతి, అఖిలేష్,స్టాలిన్, ఇలా ఎవరూ గెలవరని, మొత్తం మోడీనే గెలుస్తున్నారని ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదంతా మోడీ, షా ఎత్తుగడ అనే విషయం రాజకీయం తెలిసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా కాకుండా, వాళ్ళు ఒక్కటి అవ్వకుండా, మోడీ, షా ఆడిన ఆట ఈ ఎగ్జిట్‌పోల్స్‌. అయితే ఇప్పుడు ఈ ఎగ్జిట్‌పోల్స్‌ అడ్డం పెట్టుకుని, ఏకంగా ఒక రాష్ట్రాన్నే పడగొట్టే వికృత క్రీడకు తెర లేపింది బీజేపీ.. మధ్యప్రదేశ్‌లోని 29 పార్లమెంట్‌ స్థానాల్లో 26 నుంచి 28 చోట్ల భాజపాయే విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా నేతలు పాలకపక్షంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

exitpolls 20052019

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు విముఖతతో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వెంటనే అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, అధికార పక్షం బలనిరూపణ చేసుకోవాలని భాజపాకు చెందిన ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 114, భాజపా 107, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. బీఎస్పీతోపాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

exitpolls 20052019

ఇక్కడ ప్రమాణస్వీకారం చేసి 5 నెలలు కాలేదు. ఇంతలో అక్కడి బిజెపి ప్రతిపక్ష నాయకుడు, తమ మాజీ గుజరాతీ బిజెపి సిఎం ఆనందీ బెన్ గర్వర్నర్ గా వుంది కాబట్టి, కాంగ్రెస్స్ కి బలం లేదని మళ్లీ నిరూపించుకోవాల్సిందే అని లేఖ వ్రాసారు. అందులో ఒక హాస్యాస్పద కారణం ఏమంటే, నిన్న చెప్పిన ఎగ్జిట్ పోల్ లో, కాంగ్రెస్స్ కి ఎంపీ సీట్లు రావడం లేదని చెప్పారు కనుక, ప్రజల విశ్వాసం కోల్పోయింది అంట. ఎగ్జిట్ పోల్స్ వచ్చి 24 గంటలు గడవక ముందే, ఈ రకాల కుట్రలకు, బిజెపికి ఏమి పోగాళం అని అనుకోవచ్చు. ఒకటి ప్రాంతీయ పార్టీలు ఏవి మరో కూటమిలోకి వెళ్లినా, ఇలా చేస్తాం అనే అహంకార అధికార దుర్వినియోగ దర్పంతో దడిపించడం. రెండు ఎంపీలో కౌంటింగ్ దగ్గర, కొంచం కమల్ నాథ్ పట్టు సడలిస్తాడనే ఒత్తిడి. అందుకే ఈ నియంతృత్వం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనేది.

ఏపీలో వైసీపీదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ సర్వే మాత్రం టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పింది. ఐతే ఏపీలో జనసేన ప్రభావం పెద్దగా లేదని, ఒకటి రెండుకు మించి ఎక్కువ స్థానాలు రావాలని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ అంచనాలపై జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగా ఏమీ లేదని, ఆ పార్టీకి చాలా స్వల్పంగా మాత్రమే సీట్లు వస్తాయంటోన్న పలు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను తాను పట్టించుకోనన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటానని స్పష్టంచేశారు.

lakshminaraynaa 20052019

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23వరకు వేచి చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. విశాఖ వన్‌టౌన్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌తో మాకేమీ ఆందోళన లేదు. అనవసరంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుంది. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది. గెలుపోటములు సహజం. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నాం. అందువల్ల ఎగ్జిట్‌ పోల్స్‌ వల్ల కలిగే ప్రభావం మాపై ఏమీ కనబడటంలేదు’’ అన్నారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలపై ఆదివారం సాయంత్రం పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ సర్వేలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వే ఫలితాలను కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నమ్ముతుండగా.. మరికొందరు ఇవన్నీ ప్లాప్ అవుతాయని అసలు ఫలితాల కోసం మే-23 వరకు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి స్పందించారు. ఏపీలో నూటికి వెయ్యిశాతం గెలిచేది టీడీపీనేనని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. తాను ఒక్క పిలుపు ఇస్తే వరదలా వచ్చి ఓటేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

cbn reaction 20052019

లైన్ లో ఉండి, అర్ధరాత్రి కూడా ఓటు వేశారంటే, అది జగన్ కోసమా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందన్నారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదని.. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదన్నారు. ఇంకా ఫలితాలు రాక ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఏర్పాటు చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ఆనందం ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.

cbn reaction 20052019

చివరికి ఎన్నికల కమిషన్‌లోనే లుకలుకలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేశామని, అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలు ఎత్తుకెళ్లే అవకాశాలు చాలా తక్కువని, ఫ్రీక్వెన్సీ మార్చవచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టి వీవీప్యాట్లు తీసుకొచ్చారన్నారు. ఫామ్‌-7 ద్వారా టీడీపీకి పడే ఓట్లను తొలగించారని విమర్శించారు. ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇవ్వలేదపి, తిసేశామని చెప్పారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. రోజురోజుకు ప్రజల అనుమానాలకు బలం చేకూరుస్తున్నారని బాబు అన్నారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని కనీసం నాలుగు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తుండగా, ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతవరకు నిజం అవుతాయన్న విషయంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగతున్నాయి. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం 2004లో దాదాపు ఇవే సంస్థలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. కానీ అందుకు భిన్నంగా యూపీఏ అధికారంలోకి వచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అంతేకాదు, 2015 ఢిల్లీలో ఎన్నికలు జరిగినప్పుడు ఆప్‌ బొటాబొటీ మెజారిటీ సాధిస్తుందని వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ప్రకటించగా, ఆప్‌ మొత్తం 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించిన విజయం తెలిసిందే. 2015లో బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీయే 100 నుంచి 127 సీట్లు గెలుచుకుంటుందని తేల్చాయి. కానీ 243 మంది సభ్యులున్న బిహార్‌ అసెంబ్లీలో ఎన్డీయేకి 58 సీట్లే లభించాయి.

exit 20052019

గత ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ ప్రధానపక్షాలుగా తలపడిన రాష్ట్రాలు మూడు. ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీనే విజయం సాధించింది. ఇప్పుడు అవే రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను పరిశీలిస్తే.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీ్‌ప చేస్తుందన్నట్లుగానే చెబుతున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌లో సైతం బీజేపీకి గణనీయంగానే సీట్లు వస్తాయని చెబుతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఖైరానా, ఫూల్‌పూర్‌, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అలాంటి యూపీలో గరిష్ఠంగా 73 సీట్ల దాకా కమలనాథులకు వచ్చే అవకాశం ఉందని టుడేస్‌ చాణక్య చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

exit 20052019

2017లో 182 సీట్ల గుజరాత్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్‌ ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. కాంగ్రెస్‌ 77 స్థానాల్లో గెలిచింది. అలాంటి గుజరాత్‌లో సైతం ఈసారి బీజేపీ క్లీన్‌స్వీ్‌ప చేస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేయడం గమనార్హం. 2014 ఎన్నికలప్పుడు కూడా ఏపీ విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పయ్యాయి. ఒక్క లగడపాటి టీమ్‌, చాణక్య-న్యూస్‌ 24 మాత్రమే ఫలితాలను సరిగ్గా వేయగలిగాయి. వీటన్నిటి నేపథ్యంలో.. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే సంస్థల సగటు ఫలితాలు వాస్తవ ఫలితాలకు అందనంత దూరంలోనే ఉంటూ వస్తున్నాయి. ఏకంగా 13 సర్వే సంస్థల సగటు చూసినా ఈసారి ఎన్డీయేకు 303 సీట్లు వస్తాయి. విశేషం ఏమిటంటే, 2009 ఎన్నికల్లో ఎన్టీయేకు సగటున 186 సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అప్పట్లో ఆ కూటమికి వచ్చిన సీట్లు 160 మాత్రమే. యూపీఏకు సగటున 197 వస్తాయని అంచనా వేస్తే, ఆ కూటమి 262 సాధించింది.

Advertisements

Latest Articles

Most Read