మైలవరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వసంత వెంకట కృష్ణప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు వరసకు సోదరుడయ్యే వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలు సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో ఎంతో కొంత సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న రాజ్‌కుమార్‌కు, కృష్ణప్రసాద్‌కు ఇటీవల బాగా గ్యాప్‌ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్‌ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. కృష్ణప్రసాద్‌ తన ప్రత్యర్థి అయిన దేవినేని ఉమా మీద ఉన్న రాజకీయ కక్షను తీర్చుకునేందుకు ఉమా సోదరుడు చంద్రశేఖర్‌ను వెంట పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, తన బంధువు, వరసకు తమ్ముడయ్యే రాజకుమార్‌ను దూరం పెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.

konatala 18032019

నియోజకవర్గంలో వసంత నిర్వహిస్తున్న రోడ్డు షోలకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. రాజ్‌కుమార్‌ వసంత వెంట ఉండి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని వారు భావిస్తున్నారు. జ్యేష్ఠ రమేష్‌బాబు మైలవరం సమన్వయ కర్తగాను, జోగి రమేష్‌ పార్టీలో ఉన్న సమయంలో కాజ సొంత ఖర్చులతో షర్మిల, జగన్‌ పాదయాత్రలను విజయవంతం చేశారని, జగన్‌ బావ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్‌ అనిల్‌ నిర్వహించిన క్రైస్తవ సభలకు తానే ఏర్పాట్లు చేయించాడని, పలు చర్చిల నిర్మాణానికి సాయం చేశాడని, అటువంటి రాజ్‌కుమార్‌ను దూరం పెట్టడం కృష్ణ ప్రసాద్‌కు, పార్టీకీ అంత శ్రేయస్కరం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుమార్‌ వైసీపీలో కొనసాగుతారా? తనకు సముచిత స్థానం ఇచ్చే పార్టీలోకి వెళ్లిపోతారా? స్వతంత్ర అభ్యర్థిగా మైలవరం నుంచి రంగంలోకి దిగుతారా? అనేది వేచి చూడాలి.

 

konatala 18032019

ఇది ఇలా ఉంటే, నిన్న నదీ తీర గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ శనివారం చేపట్టిన ప్రచారం జనం లేక వెలవెల బోయింది. దాములూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. కొటికలపూడిలో జరిగిన ప్రచారంలో గ్రామానికి చెందిన స్థానికులు పెద్దగా పాల్గొనకపోవటంతో మండల స్థాయి నాయకులు సైతం ప్రచారం మధ్యలో అభ్యర్థిని వదిలివెళ్లి పోవటం గమనార్హం. వైసీపీ నేతలు మాత్రం అధికార పార్టీ మంత్రి ప్రచారం వలన ఒత్తిడి చేశారని అందుకనే మధ్యాహ్నం సైతం ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని, అందుకని జనం స్పందన తక్కువుగా ఉందని దాటవేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఒక్కరూ కూడ గ్రామాలు వైపు రాకుండా ఓట్లు ఎలా అడుగుతారని, సామాన్య ప్రజలు ప్రశ్నించారు.

వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో.. టికెట్‌ దక్కని నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని చివరి నిమిషంలో అక్కరమాని విజయనిర్మల పేరును ప్రకటించడంతో వంశీకృష్ణ అనుచరులు వైకాపా నగర కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను చించేశారు. పూలకుండీలను పగలగొట్టారు. 16వ వార్డు వైకాపా మహిళా అధ్యక్షురాలు పద్మరాణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. విశాఖ లోక్‌సభ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ కార్యాలయానికి వెళ్లి కుర్చీలు, టేబుళ్లు, అద్దాలను పగలకొట్టారు. భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒత్తిడి కారణంగానే విజయనిర్మలకు సీటిచ్చారంటూ ముత్తంశెట్టి ఇంటి ముందు కూడా ఆందోళన నిర్వహించారు. 

konathala 17032019

విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్‌ రమణమూర్తికి కాకుండా శనివారం పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వడంతో రమణమూర్తి అభిమానులు స్థానిక వైకాపా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో జగన్‌ వంశీకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘వైకాపా ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నా. నాలుగేళ్లుగా సమన్వయకర్తగా ఉన్నా. ఆఖరు నిమిషంలో వేరొకరికి టికెట్‌ ఇచ్చారు. ఇక వైకాపాలో ఉండదలచుకోలేదు. సోమవారం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా’నని వంశీకృష్ణ స్పష్టం చేశారు. పాలకొల్లులో రెండ్రోజుల కిందటే వైకాపాలో చేరిన డాక్టర్‌ బాజ్జీకి టికెట్‌ కేటాయించడంపై అక్కడ పార్టీ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆగ్రహించారు. 

konathala 17032019

కార్యకర్తలతో మాట్లడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఐజయ్య (నందికొట్కూరు), జంకె వెంకటరెడ్డి (మార్కాపురం) ఆదివారం ఉదయం నుంచీ ఎవరికీ అందుబాటులోకి రాలేదు. పెద్దాపురంలో తోట వాణికి టికెట్‌ ఇవ్వడంపై అక్కడి పార్టీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. కొండపి టికెట్‌కు అశోక్‌ వద్ద డబ్బు తీసుకుని కూడా వైకాపా నాయకత్వం ఆయనకు టికెట్‌ ఇవ్వలేదంటూ కార్యకర్తలు వైకాపా జెండాలను తగలబెట్టారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్‌ ఇవ్వడంతో అక్కడ పార్టీ సమన్వయకర్త రామనాధం బాబు వైకాపాకు రాజీనామా చేశారు. సోమవారమే తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి అవ్వటమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, అస్త్ర సస్త్రాలు బయటకు తీస్తున్నారు... అక్కడ ఏమున్నాయి అంత చేటు అస్త్రాలు అంటారా... ఇప్పుడు ఇంకో అస్త్రం బయటకు వచ్చింది... అయితే, ఈ అస్త్రం కూడా రోజా, కొడాలి నాని లాంటి అస్త్రాలతో సమానంగా ఉంటుంది... ఆ అస్త్రం ట్రాక్ రికార్డు అలాంటిది... ఈ అస్త్రానికి కూడా పవర్ఫుల్ లెగ్ అనే ట్యాగ్ ఉంది.. మిగతా రెండు అస్త్రాలు లాగే, ఈ అస్త్రం కూడా బూతులు మాత్రమే మాట్లాడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది... దీనికి ఎక్స్ట్రా క్వలిఫికేషన్ ఏంటి అంటే మెంటల్ కూడా కొంచెం ఉంది (అది వారు చెప్పుకుందే)... ఈ అస్త్రం కూడా, చంద్రబాబుని తిట్టటమే పని.... ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, అందుకే ఈ అస్త్రం ఎన్నికలు అయ్యేదాకా దాకా కాంట్రాక్టు కుదుర్చుకుని రంగంలోకి దిగింది... ఆ అస్త్రం పేరే మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ...

posani 18032019 1

అయ్య వారు ఈ మధ్య నాకు జగన్ అంటే ఇష్టం, చచ్చే వరకు జగన్ తోనే అన్నారు... అప్పట్లో 2004లో చంద్రబాబుని, 2009లో చిరంజీవిని కూడా ఇలాగే అన్నారు అనుకోండి... ఇప్పుడు చంద్రబాబుని ఎన్నికల్లో దెబ్బ తియ్యటానికి , హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు వేస్తున్నారు. దీని కోసం చంద్రబాబు పై సినిమా తీస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ, రాం గోపాల్ వర్మ చేత ఒక సినిమా తీపిస్తున్న జగన్, ఇప్పుడు ఇంకో సినిమా కూడా రెడీ చేస్తున్నారు. అయితే, ఇది ఎన్నికల సీజన్ కావటంతో, ఇలాంటి విష సంస్కృతిని ఎలక్షన్ కమిషన్ తోసిపోచ్చుతుంది. అటు రాంగోపాల్ వర్మకి ఎలాంటి షాక్ ఇచ్చిందో, పోసాని కూడా అలంటి షాకే ఇచ్చింది. దీని పై ఈ రోజు పోసాని ప్రెస్ మీట్ పెట్టి, తన బాధ వెళ్లగక్కారు.

posani 18032019 1

తాను తీస్తున్న ‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ సినిమాలో ఎవరినీ తిట్టలేదని విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. సినిమాను ఆపేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి లేఖ రావడంతో పోసాని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరో మోహన్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే తన సినిమాను ఈసీ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా తీశానని పోసాని చెప్పారు. మేనిఫెస్టోలోని అంశాలనే సినిమాలో చూపించానన్నారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తనకు లేఖ పంపించారని, అందుకు సమాధానంగా మూడు పేజీలతో కూడిన వివరణ పంపించానని పోసాని తెలిపారు. సినిమాలో ఏముందో తెలియకుండా లేఖ ఎలా పంపారని ప్రశ్నించారు.

సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్న వివేకానందరెడ్డి సన్నిహితుడు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించడంతో ఆచూకీ వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో తాను కడప సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరినట్లు పరమేశ్వరరెడ్డి మీడియాకు తెలిపాడు. సన్‌షైన్‌ ఆస్పత్రిలో చికిత్స అందించే వైద్యుడు వ్యక్తిగత కారణాలతో తాను మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనని కర్నూలుకు వెళ్లాల్సిందిగా తనకు సూచించినట్లు పరమేశ్వరరెడ్డి చెప్పాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చానన్నాడు.

viveka 18032019

వివేకానందరెడ్డి హత్యతో తనకు ఏ సంబంధం లేదని.. అది ఇంటి దొంగల పనేనని పేర్కొన్నాడు. పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి తనపై నిందలు వేస్తున్నారని పరమేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మంచం దిగే పరిస్థితి లేని వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నారని పరమేశ్వర్‌రెడ్డి భార్య అన్నారు. ఇంటి దొంగలను పట్టుకోవాలి కానీ.. తమకు చెడ్డపేరు తేవడం దారుణమని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి.... పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

viveka 18032019

ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ, తన భర్త కనీసం మంచం దిగి నడవలేని స్థితిలో ఉంటే అన్యాయంగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. హత్యచేసిన వాళ్లను పట్టుకోకుండా తమలాంటి వారిపై నిందలు మోపుతున్నారని బాధను వ్యక్తం చేశారు. కాగా, పరమేశ్వర్ రెడ్డికి కడప సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యం చేసిన డాక్టర్... పరమేశ్వర్ రెడ్డిని కర్నూలులో చికిత్స చేయించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే పరమేశ్వర్ రెడ్డి కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చి సంకల్ప ఆసుపత్రిలో చేరడం గమనార్హం. పరమేశ్వర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా సింహాద్రిపురం. వైఎస్ వివేకాకు సన్నిహితుడిగా పేరుపొందాడు. పరమేశ్వర్ రెడ్డి గతచరిత్ర చూస్తే అతడిపై హత్యకేసులు ఉన్నట్టు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read