ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మల్యే, పార్టీ మారితే, నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. స్థానిక క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉంటుంది. పార్టీతో ఉండే వారు కొందరు అయితే, ఆ పార్టీ మారిన నాయకుడితో వెళ్ళే వారు మరి కొందరు. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. మాకు పట్టిన దరిద్రం వదిలింది అంటూ, ఈ రోజు నియోజకవర్గం అంతా తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంకి రాజీనామా చేస్తున్నా ని చెప్పి, జగన్ మొహన్ రెడ్డిని కలవగానే, అందరూ పండుగ చేసుకున్నారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే, ఆమంచి జగన్ ను కలిసిన తరువాత మాట్లాడిన మాటలు.

amanchi 13022019

"జగన్మోహన్ రెడ్డి నీతివంతుడుగా ఉంటాడు, నాలాంటి నీతిమంతులు అందరూ జగన్మోహన్ రెడ్డితో నడవాలి, నీతివంతమైన రాజకీయాలకు నేను పెట్టింది పేరు" అంటూ ఆమంచి చెప్పిన ఈ డైలాగ్ తో, రాష్ట్రమంతా పడి పడి నవ్వుతుంది. ఇది ఇలా ఉంటే ఆమంచి జగన్ ను కలుస్తున్నాడు అని తెలియగానే, చంద్రబాబు రంగంలోకి దిగారు. తక్షణమే రంగంలోకి మాజీ మంత్రి కరణం బలరాంను దించారు. చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. అలాగే కరణం బలరాంకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

amanchi 13022019

ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందంటూ ఫ్లెక్సీల్లో ముద్రించడంతో చీరాల ఎమ్మెల్యే టిక్కెట్ ఆయనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మనల్ని నమ్మించి వంచించిన నాయకులకు బుద్ధిచెప్పాలే తిరగబడ్డ తెలుగుబిడ్డ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరాం టీడీపీ తరఫున బరిలోకి దిగుతారనే టాక్ వినబడుతోంది. కరణం బలరాంను చీరాల నుంచి బరిలోకి దింపితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కరణం వర్గాల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదైనా ఆమంచి దరిద్రం వదిలినందుకు, తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.

సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడం, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థికసాయం.. ఇలా వివిధ వర్గాలపై ఇటీవల వరాలజల్లు కురిపించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే బాటలో రైతాంగాన్ని ఆదుకునేందుకు భారీ పథకాన్ని ప్రకటించింది. రైతుల ఆర్థిక వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై కేబినెట్‌లో చర్చించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా ఆ పథకం విధివిధానాలపై చర్చించి ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చేదానితో కలిపి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.

farmer 1322019

అలాగే ఖరీఫ్‌, రబీలో రెండు దఫాలుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా త్వరగా చేపట్టాలని.. కుటుంబానికి రూ.10వేలు ఇస్తే మొత్తంగా రూ.7,621కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. అలాగే వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. కేంద్రం పథకంలో అనేక ఆంక్షలు ఉన్నాయని.. 5 ఎకరాల లోపు వారే అర్హులుగా, మూడు వాయిదాలలో చెల్లించే విధంగా, కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసిందని, కానీ తాము రైతులు అందరికీ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే అర్హులకు మాత్రమే కాకుండా, మిగిలిన రైతులకు కూడా ఈ సహాయం అందనుంది.

farmer 1322019

అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. కష్టాల్లో ఉన్న రైతుల్ని వెంటనే ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరానికి రూ.5000 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే 2 వేలకు తోడు, 3 వేలు రాష్ట్రం ఇచ్చి, మొత్తం 5 వేలు ఇప్పుడే ఇస్తారు. కేంద్రం ఇచ్చే పధకం అర్హులు కాని వారికి, 5 వేలు మొత్తం రాష్ట్రమే భరిస్తుంది. ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది. కేంద్రం ఇచ్చే పధకం ద్వారా, 53 లక్షల మంది మాత్రమె అర్హులు అవుతారు...

రాఫెల్‌ కుంభకోణంలో నరేంద్ర మోడీ అడ్డంగా దొరిపోయారు. సమాధానం చెప్పలేక, పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నారు అంటూ, రాజమౌళి సినిమా కధలు చెప్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీని ఈ విషయంలో మరింత ఇరుకున పెట్టటానికి, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో, బోఫోర్స్‌ పై, అన్న ఎన్టీఆర్ చూపించిన దారిలోనే నడుస్తుందా అంటే అవును అనే సమాచారం వస్తుంది. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు, ఈ రోజు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ పై బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు, దేశంలో ప్రాధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండేది. ఎన్టీఆర్ సూచనల మేరకు, అప్పట్లో రాజీవ్ గాంధీ పై ఒత్తిడి తేవటానికి, విపక్ష ఎంపీలను రాజీనామా చేపించారు ఎన్టీఆర్...

cbn delhi 132022019

అయితే ఇప్పుడు చంద్రబాబు సూచన మేరకు, విపక్షాలు అన్నీ అదే ఫార్ములా ఉపయోగించి, మోడీ పై ఒత్తిడి తేనున్నట్టు సమాచారం. రాఫెల్‌ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయకపోవటంతోనే, మోడీ ఎంత అవినీతి చేసారో అర్ధమవుతుందని, అందుకే మూకుమ్మడి రాజీనామాల దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపాయి. తద్వారా, ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో పడిన నరేంద్ర మోదీ సర్కారును మరింత ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో పావులు కదుపుతున్నారు. నిజానికి, రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, అందుకు మోదీ సర్కారు ససేమిరా అంటోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టబయలు చేయడానికి వీల్లేదని, ఈ మేరకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందని చెబుతూ వస్తోంది.

cbn delhi 132022019

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. లోక్‌సభకు చివరి రోజు అయినా.. మోదీ సర్కారు తీరుపై ఆఖరి పోరాటంగా.. ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యాయనడానికి సంకేతంగా రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఈ లోక్‌సభకు చివరి సమావేశాల్లో చివరి రోజు రాజీనామాలు చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది!? అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడి రాజీనామా నిర్ణయం తీసుకుంటే మోదీ సర్కారు పూర్తిగా చిక్కుల్లో పడినట్లేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

‘‘అలహాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థి నేత ప్రమాణ స్వీకారానికి బయలుదేరాను. కానీ, లఖ్‌నవూ విమానాశ్రయంలోనే నన్ను పోలీసులు అడ్డుకున్నారు. అలహాబాద్‌ వెళ్లకుండా నిలిపివేశారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది’’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్లో పేర్కొన్నారు. యూనివర్సిటీలో కార్యక్రమం తర్వాత కుంభమేళాకు వెళ్లాలని భావించానని, అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో ఆయన పోస్ట్‌ చేశారు. ఎటువంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండానే విమానం ఎక్కకుండా అడ్డుకున్నారన్నారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ దద్దరిల్లింది. తమ నేతను అడ్డుకున్నారని తెలిసిన వెంటనే, అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

akhilesh 13022019

ఎస్పీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే, అఖిలేశ్‌ పర్యటనతో యూనివర్సిటీలోని ప్రత్యర్థి విద్యార్థి సంఘాల మధ్య హింస చెలరేగే అవకాశం ఉందని అలహాబాద్‌ వర్సిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, ఆయన పర్యటనను నిలుపు చేయాలని కోరిందని, ఆ మేరకే ప్రభుత్వం స్పందించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. కేంద్రం జోక్యంతోనే తనను అడ్డుకున్నారని.. ఎయిర్‌పోర్టు కేంద్ర భద్రతా బలగాల చేతిలో ఉంటుందని, అక్కడికి పోలీసులు రాలేరని అఖిలేశ్‌ గుర్తు చేశారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తును చూసి ప్రభుత్వం భయపడుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు.

 

akhilesh 13022019

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌ పట్ల లక్నో అధికారులు వ్యవహరించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు అన్నారు. కాగా అఖిలేష్‌ యాదవ్‌, చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. దీక్షాస్థలికి రాలేకపోయానని, తన మద్దతు ఉందని అన్నారు. త్వరలో కలిసి అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సమావేశానికి అఖిలేష్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను అక్కడికి వెళ్లకుండా యూపీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ 'కుట్ర' చేస్తోందంటూ మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read