సరిగ్గా 27 రోజులు... రాజకీయ పరిస్థితులన్నీ సమూలంగా మారాయి. ప్రస్తుతం సామాన్యుడి నోట చంద్రబాబు మాటే పదేపదే వినిపిస్తోంది. నలుగురు మహిళలు ఒక చోటచేరినా.. ఏ ఇద్దరు వృద్ధులు ఎదురుపడినా వారి మాటల్లోనూ బాబు ప్రస్తావనే.. కిల్లీ కొట్టు నుంచి పొలంగట్ల వరకు సీఎం చంద్రబాబు పథకాలపైనే చర్చ జరుగుతోంది. కారణం... 27 రోజుల వ్యవధిలో ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా పరిధిలోని 55 శాతం మంది ఓటర్లు ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. ఫిబ్రవరి ఆరంభం నుంచి ఒక పథకం గురించి మరచిపోకముందే మరోవరంతో చంద్రబాబు ప్రజలను మురిపిస్తున్నారు. ఊహకందని విధంగా అధికార పార్టీకి పెరుగుతున్న అనుకూలతను చూసి, టీడీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. కంగుతిన్న ప్రతిపక్షాలు మౌనంగా పరిస్థితిని అంచనా వేస్తున్నాయి.

pulivendula 0802019

జనవరి 11వ తేదీ కావలి పర్యటనలో సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేరోజు సీజెఎఫ్‌ఎస్‌ భూముల పట్టాల పంపిణీ జరిగింది. సెంటు భూమిలేని వేలాదిమంది నిరుపేదలను భూ యజమానులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటి గురించి చర్చ ముగియకముందే త్వరలో చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారనే వార్తలు వచ్చాయి. అందరూ ఆశించిన విధంగానే ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెంచిన వృద్ధాప్య పింఛన్లతో పాటు పసుపు- కుంకుమ పథకం కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10వేల ఆర్థిక సాయం అందించే భారీ పథకానికి బాబు శ్రీకారం చుట్టారు.

pulivendula 0802019

ఈ తీపి జ్ఞాపకాల నుంచి తేరుకోకమునుపే 5వ తేదీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక వర్గాల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి, వాటికి నిధులు కేటాయించారు. ఇలా గడచిన 27 రోజులుగా ఒకటి తరువాత మరొకటిగా వరుస సంక్షేమ పథకాలు అమలులోకి తేవడంతో మెజారిటీ వర్గాల ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎక్కడ ఏ నలుగురు గుమికూడినా చంద్రబాబు ప్రవేశపెట్టిన కొత్త పథకాల గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మొత్తం ఓటర్లలో సుమారు 55 శాతం మంది ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. కుటుంబాల పరంగా పరిశీలిస్తే పేద, మధ్య తరగతికి చెందిన మెజారిటీ కుటుంబాలు ఒకటి నుంచి నాలుగు రకాల లబ్ధిని పొందాయి. కొద్ది రోజుల వ్యవధిలో ఊహకందని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కొత్త రూపు సంతరించుకుంది. కొత్త పథకాలు, వాటికి ప్రజల్లో లభిస్తున్న స్పందన గమనించిన వైరి పక్షాలు ఖంగుతిన్నాయి. అంతుపట్టని విధంగా కొత్త పథకాలు ప్రకటించడం, ఆ వెనువెంటనే వాటిని అమలు చేయడం, వీటి ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా లబ్ది పొందుతుండటంతో వీటిని ఎలా ఎదుర్కోవాలో అంతు పట్టక మౌనం దాల్చాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌..! మీరు ఏపీ ప్రజలను మోసగించారు. అంతేకాదు... అవిశ్వాస తీర్మాన సమయంలో నేను లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా బదులివ్వలేకపోయారు. మాకిచ్చిన హామీల గురించి చెబుతారేమోనని నిశ్శబ్దంగా వేచిచూసినా పట్టించుకోకుండా ముందస్తుగా తయారుచేసుకొచ్చిన ప్రసంగాన్ని చదివేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి విస్మరించారు’ అని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంతోపాటు, రాజ్యసభా ముఖంగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల అమలులో ఇంతవరకూ ఏం చేశారన్నదానిపై కేంద్రం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన తెలుగుదేశం తరఫున మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల్లో మరోసారి మోసపోవడానికి దేశ ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరని స్పష్టంచేశారు.

pulivendula 0802019

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అహంకారం.. విజ్ఞత కోల్పోయేలా చేస్తుంది. అంతిమంగా అది అభద్రతకు దారి తీస్తుంది. భాజపా మొత్తం ఆ దారిలోనే సాగుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వం అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతోపాటు, దేశం మొత్తాన్ని మోసగిస్తూ వస్తోంది. ఒకసారి మోసం చేస్తే అది మీకు సిగ్గుచేటు. రెండోసారి మోసపోతే మాకు సిగ్గుచేటు అవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను ఈ ప్రభుత్వం మోసం చేసింది. మరోసారి నేను మోసపోను. నా తోటి భారతీయులు కూడా మోసపోతారని అనుకోను. ఎన్డీయే అధికారంలోకి వస్తే దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన వాగ్దానం ప్రధానికి గుర్తులేదా? అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు సభల్లో చెప్పిన మాట వాస్తవం కాదా?’ అని ప్రశ్నలు గుప్పించారు.

pulivendula 0802019

‘ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఓట్లేమీలేవు. అక్కడున్న 25 ఎంపీ స్థానాలు మొత్తం లోక్‌సభలో అయిదు శాతమే కదా అని మీరు అనుకొని ఉండొచ్చు. చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. ఆయన తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోవడాన్ని చూశారు. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీయే-1, ఎన్డీయే-2తో సహా ఎన్నో జాతీయ రాజకీయ కూటముల ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకున్న విశ్వసనీయతను మీరు తక్కువ అంచనా వేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలై మొత్తం ప్రతిపక్షం ఏకమైంది. మీరు భారత ప్రజాస్వామ్య శక్తినీ తక్కువగా అంచనావేశారు' అని జయదేవ్‌ ఆరోపించారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అమలుచేసిన సంక్షేమపథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాలతో త్వరలో ఇంటింటికీ సంక్షేమ లబ్ధి పేరిట వినూత్న ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలల కాలవ్యవధిలో అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేరిట కరపత్రాలను ఈ కార్యక్రమం ద్వారా వారి ముందు ఉంచనున్నారు. రియల్‌ టైమ్‌ గవర్నె్‌స(ఆర్‌టీజీఎస్‌) ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆయా మండల పరిషత్‌ల నుంచి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటికి ఆ వివరాలు చేర్చడం ద్వారా ప్రభుత్వం మీ కుటుంబానికి ఇప్పటివరకు ఏం చేసిందనే సంక్షేమ లబ్ధిని స్పష్టం చేయడం ద్వారా వారిని ఆకర్షించనున్నారు.

pulivendula 0802019

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం 57 నెలల కాలవ్యవధిలో ఆయా లబ్ధిదారులకు ఏయే సంక్షేమ కార్యక్రమాలను వర్తింపజేశారో స్పష్టం చేస్తూ ఆర్‌టీజీఎస్‌ ద్వారా సేకరించిన వివరాలను కరపత్రాల రూపంలో ఆ కుటుంబానికి అందించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇప్పటికే మండలంలో 40నుంచి 50 వేల మంది లబ్ధిదారులు ఆయా వర్గాల వారిని బట్టి ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమపథకాల ద్వారా ఏదో రూపంలో లబ్ధిపొందినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణాలు, పసుపు-కుంకుమ, గృహనిర్మాణం, అన్ని కేటగిరిల కింద పంపిణీచేసిన పెన్షన్లు, ఆదరణ-2 లబ్ధిదారుల వివరాలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిపొందినవారి వివరాలు, అభయహస్తం, యువనేస్తం, చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక, ఎస్సీఎస్టీ లబ్ధిదారులకు ఉచిత కరెంట్‌, విదేశీ విద్య, సీఎం సహాయనిధి, ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌తోపాటు అనేక పథకాల ద్వారా లబ్ధిపొందినవారి జాబితాలు సిద్ధమవుతున్నాయి.

pulivendula 0802019

ఒక్కో కుటుంబయజమాని ఇంట్లో ఎవరూ ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారనే సమాచారం క్రోడీకరించి ఆ కుటుంబానికి అందజేస్తారు. గత 57 నెలలకాలంలో ప్రభుత్వపరంగా ఎప్పుడూ ఏఏ విధంగా సహాయసంక్షేమలబ్ధి పొందిందీ ఆ జాబితాలో పొందుపరుస్తారు. ఇప్పటికే వీటన్నింటినీ ఆర్‌టీజీఎస్‌ సహాయంతో మండల పరిషత్‌ కార్యాలయాల ద్వారా జాబితాలను సిద్ధంచేసి పంచాయతీల ద్వారా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందించనున్నారు. అతి త్వరలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా బినామీల పేరిట లబ్ధిపొందేవారి అసలు బండారం కూడా బహిర్గతం కానుంది. ముఖ్యంగా గృహనిర్మాణాలు, ఎస్సీఎస్టీల పేరిట రుణాల వంటి వాటిలో బినామీల బాగోతం బట్టబయలయ్యే అవకాశం కూడా ఉంది.

తనను దున్న అన్నవాడు దున్నపోతని మన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గురువారం మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం అసెంబ్లీకి రాదని, పార్లమెంట్‌లో ఉండదని విమర్శించారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తున్నారని, ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కడుపు మండుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రాకుండా చూసే బాధ్యత చెల్లెమ్మలదేనని చంద్రబాబు అన్నారు. మహిళలకు అన్నగా అండగా ఉంటానని, పసుపు-కుంకుమ కింద డబ్బులు ఇచ్చానని చంద్రబాబు అన్నారు.

pulivendula 0802019

అన్నగా అండగా ఉండాలని, మనది రక్త సంబంధం కాకపోయినా పూర్వ జన్మ అనుబంధమని అన్నారు. అందుకే చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ. 20వేలు రెండు విడతలుగా పసుపు-కుంకుమ కింద ఇచ్చానని చెప్పారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణ విముక్తి చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం పనితీరును ఆయన ప్రశంసించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. రాష్ట్రాంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేశామని, అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే దొంగ జగన్‌ అని చంద్రబాబు అన్నారు.

pulivendula 0802019

కోడి కత్తితో వైసీపీ రాజకీయ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. తనది ఉడుం పట్టని, మోదీని గద్దె దించేవరకు వదలనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు అన్నారు. ‘బిడ్డ గర్భంలో పడినప్పటినుంచి పుట్టుక, బాల్యం, చదువు, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పెళ్లి కానుక, పింఛను, చంద్రన్నబీమా వరకు సాయం చేశాం. ఒకవేళ చనిపోతే గౌరవంగా అంతిమయాత్ర చేసేందుకు మహాప్రస్థానం పెట్టాం. సవాల్‌ చేస్తున్నా.. ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలోనే లేదు. చివరకు సంపన్న రాష్ట్రాలు కూడా ఇంత సంక్షేమం చేయలేదు. ఎక్కడైనా ఉంటే చెప్పండి. వారు చెప్పేదీ వింటా’ అని తెలిపారు. తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని, కేంద్రానికి మానవత్వం లేదని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read