వీళ్ళు అధికారంలోకి రాకపోతేనే ఇలా ఉన్నారు.. ఇక పొరపాటున అధికారంలోకి వస్తే, నరమేధం సృస్తిసారు.. ఇంతకీ ఎవరు వారు అంటారా ? ఇంకా ఎవరండీ వైసీపీ పార్టీ బ్యాచ్.. వాళ్ళ పార్టీ నాయకుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి అంటాడు... ముఖ్యమంత్రి ఉరి వేసి చంపేయాలి అంటాడు... ఐఏఎస్ ఆఫీసర్ లని జైలుకి తీసుకుపోతా అంటాడు.. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని ఇలాగే అన్నాడు జగన్. మా నాయకుడే ఇలా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో, జగన్ పార్టీలో నాయకులు కూడా ఇలాగే రేచ్చిపోతూ ఉంటారు. అనేక సందర్భాలో వీళ్ళ అరాచకాలు చూసాం. ప్రజలని ఎలా భయబ్రాంతులకు గురి చేసారో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే కడపలో జరిగింది. ఏకంగా పోలీసుల పైనే రెచ్చిపోయారు.

kadapa 28012019

తన పార్టీ వారిని అదుపులోకి తీసుకొని కొట్టారంటూ పది మందితో కలిసి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న తన అనుచరుల వద్దకు దూసుకెళ్లారు. సీఐ జీఆర్‌యాదవ్‌ అడ్డుచెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిరసన వ్యక్తం చేస్తూ స్టేషన్‌ బయట బైఠాయించారు. టీటీడీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో వైసీపీకి చెందిన కొందరు తప్పుడు సమాచారం పెట్టడంతో ఆ పార్టీ నాయకులు శనివారం మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వారిలో కొంతమందిని స్టేషన్‌‌కు తీసుకొచ్చారు. ఈ విషయం ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి తెలియడంతో పార్టీ నాయకులు, అనుచరులతో పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అంతలో సీఐ లేచి ఎమ్మెల్యే వద్దకు చేరుకుని ఏంటిదీ.. ఇంత దౌర్జన్యమా.. నా అనుమతి లేకుండా నిందితుల వద్దకు ఎలా పోయారన్నారు.

kadapa 28012019

దీంతో రఘురామిరెడ్డి, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బయటకు వెళ్లండి అంటూ సీఐ, పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ‘మమ్మల్నే రావద్దంటావా.. షూట్‌ చేస్తానంటావా.. ఎంతమందిని షూట్‌ చేస్తావు రా..’ అంటూ స్టేషన్‌ వద్ద బైఠాయించారు. దీంతో వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఎమ్మెల్యే, తన న్యాయవాది జ్వాలా నరసింహశర్మతో కలిసి సీఐ వద్దకు వెళ్లి చర్చించారు. తిరిగి నాయకులతో కలిసి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీఐ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన అనుమతి లేకుండానే విచారణలో ఉన్న నిందితుల వద్దకు సుమారు 30, 40 మందితో దౌర్జన్యంగా వెళ్లడం ఏంటన్నారు. ఎమ్మెల్యే అని గౌరవం ఇచ్చానన్నారు. ఎంత చెప్పినా ఆయన పార్టీ కార్యకర్తలు వినక పోవడంతో అందరినీ బయటకు పంపించామన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియచేశానని ఆయన వివరించారు.

ఇదేమన్నా సాంప్రదాయమో, లేక సెంటిమెంటో కాని, వైసీపీలో ఎవరు చేరినా, రెండో రోజే వారికి జర్క్ ఇవ్వటం, వైసీపీ పార్టీ స్టైల్. ఇది వరకు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు తాజగా దగ్గుబాటి వంతు. అలా జగన్ కు కలిసారో లేదో, రెండో రోజే, వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చుపెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. అంతేకాదు దగ్గుబాటి కుంటుంబానికి వ్యతిరేకంగా పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దగ్గుబాటి చేరికకు వ్యతిరేకంగా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

daggu 28012019 2

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. తొలుత తన కుమారుడు హితేష్‌ను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం గతంలో తాను రాసిన మూడు పుస్తకాలను దగ్గుబాటి జగన్‌కి అందజేశారు.

daggu 28012019 3

పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి హితేష్‌ను రంగంలోకి దించుతానని ఆయన మరోసారి చెప్పగా అందుకు జగన్‌ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే దగ్గుబాటి రాకను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు రోటరీ భవన్‌లో వైకాపా నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని.. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్‌ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి దగ్గుబాటి ఎంట్రీతో వైసీపీని నమ్ముకుని, ఇన్నాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు చుక్కలు చూపించాడు జగన్.

ఆయన జగన్ మోహన్ రెడ్డికి అన్నిట్లో A2. ఆ పార్టీకి ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడంలో దిట్ట అంటూ చెప్పుంటారు. అలాంటి ట్రబుల్ షూటర్ కే ట్రబుల్స్ వస్తే పరిస్థితి ఏంటి...ఎవరికి చెప్పుకోవాలి..ఇంతకీ ఆ ట్రబుల్ షూటర్ ఎవరనుకుంటున్నారా, ఇంకెవరు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆయన ఇంటిపోరును మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారట. జగన్ ను ఎలాగైనా సీఎం చెయ్యాలని ఆయన దృష్టిసారిస్తుంటే ఆయన కొంపలో మెుదలైన కుంపటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేగా మరి, ఎదుటి వాడి కొంపలు అంటిద్దామానుకుంటే, అది మన కొంపకే అంటుకుంటుంది.

vsr 28012019

ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటా రెడ్డి ఇటీవల వైసీపీలో చేర్పించాడు విజయసాయి రెడ్డి. అయితే, విజయసాయి రెడ్డికి షాక్ ఇస్తూ, తాజాగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేర్చేందుకు, కడప ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పావులు కదిపారు. నువ్వు నా బావని తీసుకువెళ్తే, నేను నీ బావమరిది తీసుకు వస్తున్నా అంటూ సోమిరెడ్డి, విజయసాయి నోరు ముపించారు. గత కొంతకాలంగా పార్టీలో సీనియర్ల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో రాయబారం నడిపారు.

vsr 28012019

ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రోజు ఉదయమే ద్వారకనాథ్ రెడ్డి అమరావతికి చేరుకున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ద్వారకనాథ్ రెడ్డికి మంచి పట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పై ఎలాంటి హామీ రాకపోవడం, విజయసాయి రెడ్డి అసలు పట్టించుకోకుండా ఉండటంతో, ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు విమానాల రకాపోకలు సాగించాలాన్న కల త్వరలోనే నెరవేరే అవకాసం కనిపిస్తుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకల నిమిత్తం నూతన టెర్మినల్ ప్రారంబించి, దాదాపుగా మూడున్నర సంవత్సరాలు అయ్యింది. అయితే కేంద్రం సహకారం లేకపోవటంతో, ఇప్పటికి వరకు ఒక్క విమానం కూడా ఎగరలేదు. రేణిగుంట తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గరుడ ఆకృతిలో 191 కోట్లతో అన్ని హనులతో 305 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2015 అక్టోబర్ 22 న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడీ ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి విదేశీ విమానాల రాకపోకలు మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆసలు చిగురిస్తున్నాయి.

tirupati 28012019

తిరుపతి నుంచి విజయవాడ ద్వారా కువైత్‌ దేశానికి విమాన సర్వీసు నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు రాజశేఖర్‌, ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి లక్షలాది మంది కువైత్‌ దేశానికి వెళ్లి జీవనం సాగిస్తున్నారని, వీరిని దృష్టిలో ఉంచుకొని అతి దగ్గర తిరుపతి ఎయిర్‌ పోర్టు నుంచి విజయవాడ మీదుగా కువైత్‌కు విమాన సర్వీసు నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరడం జరిగిందన్నారు. తమ విన్నపాన్ని మన్నించి ప్రజల ద్వారా సర్వే చేసి వచ్చే స్పందనను బట్టి త్వరలో కువైత్‌కు ప్రత్యేక సర్వీసును నడపడానికి ఎయిర్‌ పోర్టు అధికారులు అంగీకరించారన్నారు.

tirupati 28012019

విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇటీవల ప్రారంభించిన విమాన సర్వీసుకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం జరిగిందన్నారు. ప్రతి రోజూ చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అనేక విమానాల ద్వారా కడప, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలకు సంబంధించిన గల్ఫ్‌ దేశాల్లోని ప్రధానంగా కువైత్‌ దేశం నుంచి వేలాది మంది ప్రతి రోజూ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. వీరికి తిరుపతి నుంచి విమానం నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము తెలియజేశామన్నారు. తమ విన్నపాన్ని స్వీకరించి ప్రజలతో సర్వే నిర్వహించి ఆ స్పందనను బట్టి త్వరితగతిన తిరుపతి నుంచి విమాన సర్వీసు నడపడానికి ఏపీ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అంగీకరించారన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా నిర్వహించే సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తే త్వరితగతిన ఈ సౌకర్యం ఏర్పడుతుందన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read