దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కూల్చే ప్రయత్నాలు చూస్తున్నాం, గవర్నర్లను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని, రాష్ట్రాల పై ఎలా కక్ష సాదిస్తున్నారో చూస్తున్నాం. ప్రత్యేక్ష ఉదాహరణ కర్నాటకలో జరుగుతున్న రచ్చ. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ ప్రభుత్వాన్ని పడేయటానికి ఎంతో రచ్చ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలను కొనే బాధ్యత ఏకంగా ఢిల్లీ పెద్దలే తీసుకున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ సంగతి అయితే సరే సరి. ఇప్పుడు తాజాగా జీవీఎల్ నరసింహారావు, మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నారు.

gvl 21012019

చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. గుంటూరులో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు చెప్పారు. ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివీడులో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్క గడ్కరీ మంత్రిత్వశాఖ నుంచే రూ.3లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు.

gvl 21012019

చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్‌ హెచ్చరించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాతో పెట్టుకుని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే, రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తా అని హెచ్చరిస్తుంటే ఏమి చెయ్యాలి ?

ఆరుగాలాలు కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలను మరింతగా ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలనే విషయమై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలతోపాటు కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతోందనే అంశాన్ని నిశితంగా గమనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టే పథకం.. ఇతర రాష్ట్రాల పథకాల కంటే గొప్పగా, కొత్తగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అధికారులకు స్పష్టంచేశారు. అన్నదాతకు అండగా ‘రైతు రక్ష’ పేరిట సరికొత్త పథకం అమలు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

raituraksha 21012019

వచ్చే ఖరీఫ్‌ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. నగదు రూపంలో అందించే సహాయాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సోమవారం కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం పక్కాగా నిక్షిప్తం చేసింది. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.30 కోట్ల మంది రైతులున్నట్లు అంచనా! ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటికీ ‘రైతు రక్ష’ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల సంఖ్య అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16 లక్షల మంది వరకు ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 60 శాతంపైనే కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. కౌలు రైతులు 90 శాతానికిపైగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీరికి పంట రుణాలు అందించడానికే ప్రభుత్వం బ్యాంకులపై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు దేశంలోనే అత్యధికంగా రూ.5 వేల కోట్ల వరకు రుణాలుగా ఇప్పించింది. ఇప్పుడు పెట్టుబడి నిధి కూడా వీరికి చెందేలా చేయాలంటే ఏం చేయాలనే విషయమై ప్రస్తుతం ఆలోచిస్తోంది.

raituraksha 21012019

మరోవైపు రాష్ట్రంలో ఉండే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఈ కార్డులను అందించారు. బ్యాంకులనుంచి తేలిగ్గా రుణాలు వచ్చేందుకు ఈ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీవంటి ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు రక్ష పథకానికి కూడా ఈ కార్డులు ఉపకరిస్తాయి. నిజానికి... నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

హంద్రీనీవా కల సాకారమై, చిత్తూరు జిల్లాలోకి మొదటిసారి ప్రవేశిస్తున్న కృష్ణమ్మను చూసి, ఒక రైతు ఎంతో ఉద్వేగంతో అంటున్న మాటలు ఇవి.. "కృష్ణమ్మా.. నీ తడి.. మా కరవు నేలను ముద్దాడగానే.. మా పుడమి పులకించింది. మది ఎగిరిగంతేసింది.. నీ జలం మాకు బలం కానుందని.. కరవు ఛాయలు మాయమవుతాయని.. కన్నీళ్లు ఇక మా కళ్లలోనే ఒదిగిపోతాయనే విషయం తెలిసి.. శరీరంలోని నవనాడులు ఆనంద తాండవం చేస్తున్నాయి.. ఎందుకంటావా కృష్ణమ్మా..! ఏళ్లుగా మా ప్రాంతంలో మెరుపు జాడలేదు.. ఉరుము అరుపు లేదు.. చినుకు రాలలేదు.. ఫలితం.. వాగు ఆరిపోయింది.. చేను ఒరిగిపోయింది.. జలం పాతాళంలోకి చేరిపోయింది.. మేడి అటకెక్కింది.. కాడెద్దు కనుమరుగైంది.. "

farmers 21012019

"రైతు కుటుంబం చెదిరింది.. ఆ‘కలి’ వేధించింది.. పేగుబంధం కళ్లల్లో కనిపించింది.. పట్టణాలకు వలస దారి పరిచింది.. పల్లె బోసిపోయింది.. పచ్చని లోగిలి మాయమైంది..నాగలికి చెదలు పట్టింది.. నాగరికత మారింది.. శిథిలమైన గ్రామాలు.. కళ తప్పిన చెరువులు.. కుంటలు.. వాగులు.. వంకలు అన్నదాతల సమాధులకు నిలయాలుగా మారాయి.. నాగేటి సాళ్లల్లో స్వేదం చిందించి.. సిరులు పండించి.. అన్నదానం చేసిన చేతులు.. సర్కారు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి.. కానీ.. నువ్వొస్తున్నావని తెలిసి హృదిలో ఆశ చిగురిస్తోంది.. కాడెద్దులు తిరిగొస్తాయని.. లేగదూడలు గెంతులేస్తాయని.. పైరు పచ్చబడుతుందని, ముంగిళ్లు మురుస్తాయని.. మా ఇంట సంతోషం వెల్లివిరుస్తోంది."

farmers 21012019

కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి నీటిని మళ్లించి కర్నూలు జిల్లాలోని హంద్రీ నది మీదుగా చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించే బృహత్‌ ప్రాజెక్టే హంద్రీ-నీవా సుజల స్రవంతి. సర్‌ అర్థర్‌ కాటన్‌ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్‌ హయాంలో తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ హయాంలో కాస్త కదలిక వచ్చినా పురోగతి లోపించింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచడంతో ప్రస్తుతం బ్రాంచి కెనాల్‌ ద్వారా చిత్తూరు సరిహద్దుల వరకు నీటిని తీసుకురాగలిగారు. హంద్రీ-నీవా రెండో దశలో భాగంగా అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ఇటీవల పూర్తిగా నిండింది. అక్కడి నుంచి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌గా వీడిపోతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరికి చేరువలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. ఈ మార్గంలో ఎనిమిది చోట్ల లిప్టుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. ఈ రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. మూడు రోజుల క్రితం నీటిని కిందికి వదలడంతో చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని పెద్దతిప్పసముద్రం మండలం బొంతాలపల్లె పంప్‌హౌస్‌కు చేరుతోంది. ఈ దఫాలో చిత్తూరు జిల్లాకు 1.2 టీఎంసీల నీటిని తరలించనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.దుర్భిక్ష ప్రాంతమైన మదనపల్లె డివిజన్‌కు ఈ కాలువ జీవరేఖ కానుందని భావిస్తున్నారు.

జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆదివారం సాయంత్రం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని.. టికెట్ విషయమై నాలుగు నెలలుగా వేచి చూస్తున్నా ఇంత వరకూ స్పందించలేదని తీవ్ర అసంతృప్తి చేశారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌కు పంపారు. రాధా రాజీనామా లేఖలో జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి తాను పట్టుబడుతున్న విజయవాడ సెంట్రల్‌ సీటుపై వైకాపా నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. సెంట్రల్‌ టికెట్‌ విషయమై హామీ కోసం ఆయన ఏడాదికి పైగా నిరీక్షించారు. అయినా జగన్‌ వైపు నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు.‌

radha 21012019

లేఖలోని విషయాలు.. అన్ని వర్గాల అభిమానుపాత్రుడు, సామాన్యుడి సంఘటితానికి స్పూర్తి అయిన నా తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు ప్రజా క్షేత్రంలో సామాన్య ప్రజల సంక్షేమం, పేద ప్రజల సంరక్షణ కోసం అసువులు అర్పించారు. పేద ప్రజల కోసం నిరంతర పోరాటమే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి ఆకాంక్ష. ఎవరి దాయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి. అణచివేత విధానానికి, దమనకాండకు వ్యతిరేకంగా సర్వ ప్రజాసంక్షేమం కోసం, న్యాయ సంరక్షణ కోసం, వర్గాలకు అతీతంగా ఉద్యమం కొనసాగిస్తాను.

radha 21012019

జగన్ గురించి... "ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను" అని జగన్‌పై రాధాకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాధా లేఖపై వైఎస్ జగన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరుపై ‘రాధా రంగ మిత్రమండలి’ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. వంగవీటి రాధాను వదులుకుంటే వైసీపీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. ‘మాట తప్పను అన్న జగన్.. రంగా కుటుంబాన్ని మోసం చేశారు’ అని అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read