షర్మిల అక్కకి, నిన్న మీరు మీపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ , దోషుల మీద చర్యలు తీసుకోవాలని పక్క రాష్ట్రంలో ఫీర్యాదు చేసారు. మీకు ప్రభాస్ కి సంబంధం లేదని మీ పిల్లలపై ఒట్టు వేసేదాకా రావడం బాధాకరం.ఇది మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అని అడగడం కూడా సరి కాదు, అది మీ ఇష్టం. అసలు సోషల్ మీడియాలో ఇలాంటి విష వృక్షాన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు మొదలెట్టారూ అనే దానిపై చర్చకు సిద్ధమా?? మొదలు పెట్టినవాళ్ళని ఇడుపులపాయలో వేలాడాదిద్దాదామా?? గత 10 ఏళ్లుగా సోషల్ మీడియా వాడేవాడిగా చూస్తున్న మీ పై ఇలాంటి ఆరోపణలు 2013 నుండి షికారు చేస్తున్నాయి. అంతకు ముందు నుండి ఎవరెవరు ఇలాంటి నీచ సంస్కృతిని పోషించారో తెలుసుకుందామా? మీరు వై ఎస్ ఇంటి ఆడపడుచు అయినట్టే, మిగతావారు ఆడపడుచులే కదా..! వారికి కూడా అభిమానం గౌరవం ఉంటాయి కదా..! పసి పిల్లలని కూడా వదలకుండా చేసిన విష ప్రచారం మరిచిపోయారా... మీ లోటస్ పాండ్ నుంచి, కొంత మంది నడిపే పేజీలు ఇంటి ఆడవారిపై కులాల పేర్లు వాడుతూ అక్రమ సంబంధాలు ఆటగట్టిన వైనం మరిచిపోయారా...

sharmila 16012019

అదే పోలీసులు చర్యలు తీసుకుంటామంటే మీ కుటుంబ ఆడిటర్ రాజ్యసభ సభ్యుడు అయిన విజయ సాయి రెడ్డి గారు బహిరంగంగా వారికి మద్దతు పలికి అదేమి తప్పు కాదు అన్నప్పుడు, నేను కూడా పెడతా ఎవడేం చేస్తాడో చూస్తా అన్నప్పుడు వాళ్ళు కూడా ఆడవారు అని గుర్తుకురాలేదా..? అప్పుడు తీసుకోకూడదా పోలీసు చర్యలు? ఇదంతా ఎందుకు అంటే వాళ్లకి జరిగినప్పుడు తెలియని నొప్పి మీకు జరిగీతే తెలుస్తుంది అది సహజం.. అసలీ మార్ఫింగులు ఎవడు ఎక్కడ మొదలెట్టాడో ఎవరు ముందు మొదలెట్టారో చూద్దామా?? అంతెందుకు ఇప్పుడు కూడా ఆ వెధవలు ఇంకా పెడుతున్నారు, అలానే ఉన్నారు, వారిని పోషిస్తూ,వాళ్ళు మా సోషల్ మీడియా మనుషులు అని మిరే చెబుతూ ఇప్పుడు మిపై ఎవడో వెధవలు ఎదో అన్నారని మీ గౌరవం అభిమానం గుర్తుకురావడం గురువింద గింజ నవ్వుకోదా? ఇవన్నీ ఎందుకు అక్కా.. కార్లు మార్చినట్టు పెళ్లాలని మారుస్తాడు అని మీ అన్న పవన్ కళ్యాణ్ ని అన్నప్పుడు, అన్నా అలా అనవద్దు ఇవ్వాళ రేపు ఒకటికి మించి పెళ్లిళ్లు ఎవరు చేసుకోవడం లేదు , అది పరిస్ధితుల ప్రభావమో మనుషుల బలహీనత కారణం అని ఇంకెప్పడు అనవద్దు అని చెప్పలేకపోయారు కదా..

sharmila 16012019

నిజానికి మూడే పెళ్లిళ్లు అయితే మీ అన్న నాలుగు అని ఇంకా ఆజ్యం పోయాలేదా.. ? మీ అన్న కుడా చేసినది ఇలాంటి చిల్లర ప్రచారమే కదా... అంతెందుకు మీ వాళ్ళు ఇప్పటికి తెలుగుదేశం అధికారం ప్రతినిధి అయిన ఒక మహిళపై నా లిస్టులో ఉన్నవారు కూడా ఎంత హీనం గా పోస్టులు పెడుతున్నారో మీకు తెలియకపోవచ్చు, మికా స్క్రీన్ షాట్స్ పంపెదా?? సరే ఇదంతా ఒక ఎత్తు , మీరేమో ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదంటూ తెలంగాణ లో ఫిర్యాదు చేశారు అది మీ ఇష్టం మీరు అక్కడే ఉంటారు కాబట్టి, మీ ఆడిటర్ సాయి గారు ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకున్నంత పోరాట పటిమ లేదంటాడు నిజమే అందుకేనెమో మహుబూబాదులో మీ అన్న పాదయాత్రకు వచ్చిన తిరస్కరణ చూసే మీరు తెలంగాణలో పోటీకి భయపడి ఉండవచ్చు, అది కూడా మీ ఇష్టం..కానీ మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం మమ్మలిని ఎవడు ఏమి అనకూడదు అనడం చెల్లదు, మీ వైపు నుండి మాత్రం ఇలా చిల్లర మార్ఫింగులు చేసే ఎదవలకి మీ నాయకులు ప్రత్యక్షంగా మద్దతు పలుకుతూ ఇప్పుడు మీ పై జరిగే దుష్ప్రచారం ఆగాలంటే ఎలా? ఇకపోతే ఇక్కడ వారు చేసే గలీజు ప్రచారాన్ని వాళ్ళకి మాత్రమే అపాదించారు తప్ప జగన్ రెడ్డికి అంటగట్టలేదు, దాని వెనుక జగన్ ఉన్నాడు అని ఎవడు అనలేదు..మీరు మాత్రం ఒక పక్క మీ మీద జరిగే దుష్ప్రచారాన్ని అది కూడా ఎప్పుడో 5 ,6 నెలల క్రితం జరిగిన దానిని సరిగ్గా ఎన్నికల ముందు తెచ్చి అది కూడా చంద్రబాబుకి అంటగట్టడం చూస్తోంటే ఇలాంటి విషయాల్లోనూ ఇంతగా దిగజారిపోవచ్చా అనిపిస్తోంది.. కానివ్వండి, మీరన్నట్లే దేవుడు ఉన్నాడు అక్కాయి, మీ వెంటే కాదు అందరి వెంటా ఉంటాడు దేవుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, ఎలాంటి దాడి జరుగుతుందో చూస్తున్నాం. అవతల వాళ్ళు సొల్లు, సోది చెప్తుంటే, మనం పోలవరం రికార్డులు, అమరావతి అవార్డులతో వారికి సామాధానం చెప్తున్నాం. విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రలు, నిలదొక్కుకుని, పరిగెడుతుంటే, చూడలేని వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు, పక్క రాష్ట్ర రాబందులు, మన రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్న చెయ్యటానికి రెడీ అయ్యారు. ఢిల్లీ సూత్రదారులు, పన్నిన వికృత క్రీడలో, జగన్ ఒక పావు . ఇక కేసీఆర్ ఏడుపులు సరే సరి. మన రాష్ట్రం చేస్తున్న పనుల్లో సగం కూడా చెయ్యలేడు, చంద్రబాబుతో పోటీ పడలేడు, కియా లాంటి కంపెనీలు తేలేడు, మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమ కార్యక్రమాలు చెయ్యలేడు, అందుకే మన రాష్ట్రం పై ఏడుపు. అందుకే జగన్ లాంటి వాడు ఏపి ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్లాన్. అందుకే ఈ వికృత క్రీడలో, గిఫ్ట్ ఇస్తాను అంటూ జాయిన్ అయ్యాడు.

ktr 15012019

ఇక్కడ జగన్, హైదరాబాద్ నుంచి వచ్చి, పార్టీ టైం రాజకీయాలు చేస్తున్నా, చంద్రబాబు ముందు నిలబడలేక పోతున్నారు. అందుకే కేసీఆర్ హెల్ప్ ఆడుతున్నారు. ఇందులో భగంగానే, కేసీఆర్ అత్యంత ఆప్తుడు అయిన, ఒవైసీనీ కూడా వాడటానికి, జగన్ ప్లాన్ చేసాడు. ఇటీవల, మోడీ పై చంద్రబాబు యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి, అనేక సంక్ష్టేమ పధకాల ద్వరా లబ్ది పొందటం, మోడీ తెచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్ లోని లోపాలు ఎత్తి చూపటంతో, ఏపిలో ముస్లింలు, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జగన్ అలెర్ట్ అయ్యాడు. ఒవైసీ ద్వారా, ముస్లింలు చంద్రబాబు వైపు వెళ్ళకుండా ఉండేందుకు ప్లాన్ చేసాడు. దీనిలో భాగంగా, అమిత్ షా డైరెక్షణ్ లో, కేసీఆర్ ఆదేశాల మేరకు, జగన్‌కు అత్యం త సన్నిహితుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు.

ktr 15012019

ఇప్పుడు ఇక కుట్రలు పరాకాష్టకు తీసుకువెళ్తూ, రహస్యంగా ఎంతో కాలం రాజకీయం చెయ్యలేమని, ఇక అఫీషియల్ గా కలవటానికి రెడీ అయ్యారు. దీనికి ఫెడరల్ ఫ్రంట్ అనే, ఒక మోడీ ముందు వాయించే ఫిడేల్ ఫ్రంట్ పేరుతో రాజకీయం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్‌తో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో రేపు ఉదయం కేటీఆర్‌ బృందం చర్యలు జరపనుంది. జగన్‌ నివాసంలో మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. కేసీఆర్ చెప్తున్న మోడీకి వాయించే ఫిడేల్ ఫ్రంట్ కంటే, చంద్రబాబుని ఎలా ఓడించాలి, ఏపికి జగన్ ని ముఖ్యమంత్రిని చేసి ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనే ప్లాన్ వేస్తున్నారు కేసీఆర్. ఇక వీరందరికీ సరైన బుద్ధి చెప్పాల్సింది ఏపి ప్రజలే...

మోదీ ఈ మధ్య చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, అది అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం. దానికి మంత్రివర్గం ఆమోదం పలికిన తరువాత ప్రకటన చేయగా.. వెంటనే పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం కూడా పూర్తయ్యాయి. దీంతో... ఈ చట్టం అమలు చేయడానికి అన్ని దారులూ తెరుచుకున్నాయి. ఇది రాజకీయం కోసం చేసినా, ఓట్లు కోసం చేసినా, ప్రజలకు మంచి కాబట్టి, ఎవరైనా స్వాగతిన్చాల్సిందే. రాజకీయ పార్టీలు ఎవరైనా, ఓట్లు కోసమే చేస్తారు. ప్రజలకు మించి జరిగితే అదే చాలు. ఇప్పుడీ చట్టాన్ని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పోయిన వారం అమలు చేయడానికి నిర్ణయించింది. దీంతో... అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ క్రెడిట్ కొట్టేసింది.

reservation 15012019

అయితే, ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రానికి సంబంధించి ఆయా వర్గాల వివరాలు, రిజర్వేషన్ల అమలులో కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడింది. ఈ బిల్లు గత వారమే పార్లమెంట్‌లో ఆమోదం పొంది.. ఆ తర్వాత రాష్ట్రపతి ఓకే చెప్పినా.. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని పై అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి.

reservation 15012019

నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పెద్దగా అడ్డంకులు లేకుండానే ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది. అన్ని పార్టీలు ఆమోదించటంతో, మిగతా రాష్ట్రాలూ దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా కేంద్రం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా సుధీర్గ చర్చల అనంతరం ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయ సభలతో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లును తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజముద్రతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం చట్టరూపం దాల్చినట్టైంది.

 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న పొలిటికల్ పార్టీ ఏదంటే అనుమానం లేకుండా జనసేన అని చెప్పొచ్చు. బహిరంగ చర్చలకంటే సోషల్ మీడియా ద్వారానే పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యకర్తలు, అభిమానులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. అభిమానులు సైతం సోషల్ మీడియాను వినియోగించుకునే పార్టీ ప్రచారాలను ఉదృతంగా నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీలో కొందరు అదే సోషల్ మీడియా వేదికగా పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలో భాగంగానే జనసేన అధికారిక లెటర్ ప్యాడ్ పై పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారు.

pk 115012019

జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన జనసేన అభిమానులలో గందరగోళం సృష్టించింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థి గా కోగంటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో వచ్చిన జనసేన లెటర్ ప్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది జనసేన అభిమానులు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ మూడు స్థానాలకు ఖరారయింది ఏమో అని అనుకున్నారు. అయితే తరువాత తెలిసిన అంశమేమిటంటే ఇది ఎవరో సృష్టించిన నకిలీ లేఖ అని. దాంతో ఇదే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఖండన ప్రకటనను విడుదల చేసింది.

pk 115012019

మొదట ఈ ప్రెస్ నోట్ చూసి జనసేన శ్రేణులు దాదాపుగా నమ్మేశాయి. సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టాయి. అయితే ఆ లెటర్ విడుదలైన వెంటనే విషయాన్ని పసిగట్టిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం అది నిజమైంది కాదని, అభ్యర్థులను అధ్యక్షుడు మాత్రమే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా ఆధారంగానే ఎక్కువగా ప్రచారాన్ని ప్రకటనలను విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నకిలీ లెటర్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ కేసు ఫైల్ చేయాల్సిందిగా జనసేన లీగల్ వింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ చేసి, ఇది ఎవరు చేసారో బయట పెడితే కానీ, ఇది చేసింది ఎవరో తెలియదు.

Advertisements

Latest Articles

Most Read