పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వారు ఎవరైనా, ముందుగా చెప్పేది, అతనికి స్థిరత్వం లేదని. అనేకసార్లు, తాను చేసిన పనులతో, అదే నిజం అని నిరుపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్తూ కూడా, ఈ అలవాటు మాత్రం మానటం లేదు. హడావిడి చెయ్యటం, సడన్ గా సైలెంట్ అయిపోవటం, పవన్ కు ఇది మామూలు విషయం. అందుకే పవన్ ను ఎవరూ, సీరియస్ పొలిటిషియన్‌గా తీసుకోరు. అతని సినిమా ఫాన్స్, ఆహా, ఓహో అని చెప్పటమే కాని, ప్రజలకు మాత్రం, తాను పార్ట్ టైమ్ పొలిటిషియన్‌ లాగానే కనిపిస్తున్నారు. తెలంగాణా ఎన్నికలు ముందు, ప్రజల నుంచి దూరమైన పవన్, అమెరికా పర్యటన అంటూ 15 రోజులు వెళ్లి, మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చి, పది రోజులు అయినా, సమీక్షలకే పరిమితం అయ్యారు.

pk 09012019

ఇప్పుడు ఆయన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోరాట యాత్రను కూడా ఆపేశారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. ఇప్పటికీ నాకు సమయం సరిపోవడం లేదు అనే కారణం చెబుతున్నారు. అధికారంలో ఉన్నా .. ప్రతిపక్షంలో ఉన్నా సమయంతో పోటీ పడి రాజకీయాలను చక్క బెట్టుకోవాలి. అంతే కానీ.. ప్రతీ దానికి సమయం లేదని తప్పించుకోవడం రాజకీయం అనిపించుకోదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓ వైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే… పార్టీని నడుపుతున్నారు. ఆయన ఒక్కో జిల్లాకు పదుల సార్లు వెళ్లారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర యాత్ర ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో నడిచారు కలుస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు కూడా సిద్దం అవుతున్నారు. మరి ఇద్దరితో పోలిస్తే.. పవన్ కల్యాణ్.. ఏమంత బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలున్నాయి…? పదమూడు జిల్లాలు. ఈ పదమూడు జిల్లాలో తిరగడానికి కూడా.. పవన్ కల్యాణ్‌కు సమయం సరిపోలేదు.

pk 09012019

పోరాటయాత్ర చేస్తా.. కవాతు ద్వారా.. రాజకీయం చేస్తా అన్నాడు. కానీ ఐదు జిల్లాలు తిరిగే సరికే సమయం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి కాబట్టి.. పోరాటయాత్ర నిలిపివేసి.. ఆయన జిల్లాలలో అంశాల వారీ సమస్యలు తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారట. కనీసం పదమూడు జిల్లాల్లో పర్యటించలేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది పవన్ కల్యాణే. గత మేలో శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర చేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలు తిరిగేసి ఇక సమయం లేదని ఆగిపోవడం ప్రణాళిక లేని రాజకీయం అవుతుంది. కనీసం పార్టీ కార్యక్రమాల్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉంటే.. ప్రజలు ఎలా అధినేతను ఎలా నమ్ముతారంటూ జనసేనలోని ద్వితియ శ్రేణి నాయకులు అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనించిన పవన్‌ కల్యాణ్‌ ఆ తరహా రాజకీయాన్ని ఇక్కడ అమలు చేయాలని కొన్నినెలలుగా భావిస్తున్నారు. జేడీఎస్‌ ఆదర్శంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఏపీలో రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ జేడీఎస్‌ జాక్‌ పాట్‌గా సీఎం పీఠాన్ని పొందడమే పవన్‌ చూశాడు కానీ.. దానివెనుక కష్టాన్ని చూడలేదు. దానివెనుక ఉన్న దశాబ్దాల పార్టీ నిర్మాణాన్ని గమనించలేదు. జేడీఎస్‌ పార్టీ ఒక కుటుంబ పార్టీనే. అయితే ఆ కుటుంబీకులకు నిరంతరం రాజకీయమే వృత్తి. ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. నెలల తరబడి విరామాలు తీసుకోలేదు. అవేమీ గమనించకుండా అసలైన టైంలో టైమ్ లేదు అనడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

లోక్‌సభలో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడాన్ని చంద్రబాబు స్వాగతించారు. తాము ఆ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాలు, బిల్లు లు ఆమోదించి పంపామని గుర్తు చేశారు. కేంద్రం తనకు కావాల్సింది చేసుకుని రాష్ట్రాల సిఫార్సులను విస్మరిస్తోందని విమర్శించారు. ఈబీసీ బిల్లును కేంద్రం ఒక రోజులో తెచ్చిందని, ఒకవేళ వారికి దీనిపై చిత్తశుద్ధి ఉంటే ముందే తీసుకొచ్చి అందరితో సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

modicbn 09012019

బుధవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. భాజపా తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు సామాజిక వెనుకబాటుతనం రిజర్వేషన్లే ఉన్నాయని, ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్లు కొత్తగా తెచ్చారని అన్నారు. దేశంలో సంఘ్ పరివార్.. కుట్రల కేంద్రంగా మారిందని, ఆ కుట్రలను అమలు చేసే కేంద్రంగా భాజపా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. రిజర్వేషన్లు మంచికోసమే అయితే తాము తప్పకుండా స్వాగతిస్తామని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడతామంటే ఎదిరిస్తామని హెచ్చరించారు. కుట్ర కోణాలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.

modicbn 09012019

ఆర్థికంగా పేదలకు రిజర్వేషన్లను స్వాగతించాలని, కాపుల రిజర్వేషన్లపై డిమాండ్ చేయాలన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చడంపై ప్రశ్నించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సామాజిక తరగతుల మార్పుపై డిమాండ్ల గురించి ఒత్తిడి చేయాలన్నారు. పార్టీలో గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వమవుతుందని ఆయన అన్నారు. అవినీతిపరులే అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ఎద్దేవాచేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తని ఆయన విమర్శించారు. జగన్ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని, చాలా మంది అవమానాలకు గురయ్యారని అన్నారు. కేంద్రం ఏపీకి రూ.75 వేల కోట్లు ఇవ్వాలని జయప్రకాశ్ కమిటీ చెబితే జగన్ ఎందుకు నోరు మెదరపరని ప్రశ్నించారు.

ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్‌ కల్పించే కీలకమైన ఈడబ్ల్యూఎస్ బిల్లు లోక్‌సభలో చర్చకు వచ్చిన నేపథ్యంలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. బిల్లుపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు. మంగళవారం పార్లమెంటులో ఆమెను కలిసి వినతి పత్రం అందించారు. కానీ ఆమె సానుకూలంగా స్పందించలేదు. ఈ బిల్లుపై తమకు అనేక సందేహాలున్నాయని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామ్మోహన్‌ తెలిపారు. బిల్లుపై సెక్షన్లవారీగా చర్చ జరిపి ఓటింగ్‌ చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

speaker 09012019 2

ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల కు చెందిన అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీలను సస్పెండ్‌ చేయడంతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రజల గొంతును వినిపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల తరఫున ఈ అంశంపై చర్చించడానికి వీలుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వినతిపత్రంలో కోరారు. కాగా.. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు నిరసనలను కొనసాగించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీజీ విగ్ర హం దగ్గర, పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు ప్లకార్డులు పట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

speaker 09012019 3

వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల సభ్యుల విషయంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ఒక్కో రకంగా స్పందించారు. తెదేపా, అన్నాడీఎంకే సభ్యులపై నిబంధనల కొరడా ఝళిపించి సస్పెండ్‌ చేసిన ఆమె అదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల సభ్యుల విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదు. వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 42 మంది ఎంపీలపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేసిన స్పీకర్‌ మరో నలుగురిపై చర్య తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగిన తెదేపా సభ్యుడు ఎన్‌.శివప్రసాద్‌, అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు పి.వేణుగోపాల్‌, పార్టీ సభ్యులు రామచంద్రన్‌, కె.గోపాల్‌లను 374-ఎ నిబంధన కింద సభ నుంచి రెండురోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ సభ్యులు అదే వెల్‌లోకి వచ్చి సభా కార్యకలాపాలు అడ్డుకున్నా చర్యలు తీసుకోలేదు.

కందనవోలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. నగరంలో ప్రతిష్ఠాత్మక స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేసారు. కర్నూలు సర్వజన వైద్యశాల వద్ద క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇందులో సర్జికల్‌, మెడికల్‌, రేడియేషన్‌, అంకాలజీ తదితర విభాగాలన్నీ అందుబాటులో ఉంటాయి. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులతో సహా పరిశోధనలకు అవకాశం కల్పించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నారు. మొదటి దశలో 120 పడకలతో: రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలులో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

kurnool 0902019

టాటా ట్రస్ట్‌ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించగా ప్రభుత్వం ఆమోదించింది. జీ ప్లస్‌1 తరహాలో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. దీనికిగాను సర్వజన వైద్యశాలలో పది ఎకరాలు కేటాయించారు. ఇందులో 1.5 ఎకరాల్లో భవన నిర్మాణాలు ఉంటాయి. కింది భాగంలో బయటి రోగుల(ఓపీ) విభాగంతోపాటు వైద్య పరీక్షల నిమిత్తం ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌తో సహా ప్రయోగశాలలు ఉంటాయి. మొదటి దశలో 120 పడకలతో ఏడాదిలోగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.120 కోట్లు మంజూరయ్యాయి. జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం ఓర్వకల్లు నుంచే దీనికి పునాదిరాయి వేస్తారు.

kurnool 0902019

అందరూ మాట్లాడతారు... కొంత మందే పనిచేస్తారు. తమది పనిచేసే ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఓర్వకల్లులో విమానాశ్రయం, సౌర పార్కులను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జలధార’, ‘మా ఊరి బాట’ పథకాలకు పైలాన్‌ ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ చివరి ఊపిరి ఉన్నంత వరకూ పేదల కోసమే పనిచేస్తానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలొచ్చినా పేదలెవ్వరూ కష్టపడకుండా ఉండాలని ముందుకెళుతున్నానన్నారు. కర్నూలుకు చరిత్రలో ఎప్పుడూ రానన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నారు. విమానాశ్రయంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు.

Advertisements

Latest Articles

Most Read