ఏపీ విపక్షం వైసీపీకి కీలక నేత గుడ్‌ బై చెప్పనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ క్రియాశీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారని తెలిసింది. సీఎం చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు జయదేవ్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

aadi 08012019

అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులంతా వైసీపీకి మద్దతివ్వాలని బహిరంగ ప్రకటన చేసిన ఆదిశేషగిరిరావు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఖాతాలో మరో వికెట్ పడిందని అంటున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్‌బాబుకు బాబాయ్‌ అని ఆదిశేషగిరిరావు... అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని‌కారణాలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆదిశేశగిరిరావు... అందుకే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని... ఏ పార్టీలో చేరే విషయం త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.

aadi 08012019

ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప‌లుద‌ఫాలుగా కుటుంబ‌స‌భ్యుల‌తోనూ, స‌న్నిహితుల‌తోనూ చ‌ర్చించిన ఆదిశేషగిరిరావు నేరుగా జగన్‌కు రాజీనామా లేఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్ప‌టికే సోద‌రుడి అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగారు. కాని జగన్ వైపు నుంచి సరైన గౌవరం లేకపోవటంతో, ఇక ఏ మాత్రం పార్టీలో ఉండటం స‌హేతుకం కాద‌ని అందువ‌ల్లే రాజీనామాకు సిద్ధమైన‌ట్టు స‌మాచారం. అయితే త్వరలో టీడీపీలో ఆదిశేషగిరిరావు చేరనున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే ఆదిశేషగిరిరావు మాత్రం, ఈ విషయం పై ఇంకా ఏమి చెప్పలేదు. అర్ధంత‌రంగా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలపై ఈ రోజు మీడియాతో చెప్పనున్నారు.

మోడీ, షా ని తట్టుకోలేక, ఒక్కో పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మోడీ పై ఎదురు తిరిగిన దగ్గర నుంచి, ఎదురు లేదు అనుకున్న, మోడీ-షా పతనం మొదలైంది. తెలుగుదేశం పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కమలానికి కటీఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది. తాజగా, భారతీయ జనతా పార్టీకి మరో ప్రాంతీయ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అస్సాంకు చెందిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) స్థానికి అధికా పార్టీ బీజేపీ నుంచి పొత్తు విరమించుకుంటున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు. పౌరసత్వ (సవరణ) బిల్లు 2016కు వ్యతిరేకంగా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

modi 07012019

బిల్లు విషయంలో ముందుకెళ్తే పొత్తు తెగతెంపులు చేసుకుంటామని గతంలోనే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విస్పష్టంగా చెప్పామని ఏజీపీ ప్రతినిధి దిలీప్ పత్గిరి మీడియాతో చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ఆ బిల్లుపై ముందుకెళ్తామని ప్రకటించడంతో పొత్తుకు మంగళం పలుకుతున్నామని చెప్పారు. ‘‘పౌరసత్వ బిల్లు విషయమై బీజేపీ నుంచి ఏజీపీ వైదొలగాలని క్రిష్ణక్ ముక్త్ సంగ్రామ్ సమితి నేతృత్వంలో 70 సంస్థలు మాపై (ఏజీపీ) ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకుండా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాం. అయితే మంగళవారం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఈ విషయమై ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసుకుని వైదొలగుతున్నట్లు స్పష్టం చేశాం’’ అని పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు.

modi 07012019

పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత్‌లో ఆరేడేళ్లుగా నివసిస్తుంటే..వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐతే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు..ముఖ్యంగా అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏజీపీ.. ఆ మేరకు కమలంతో కటీఫ్ చేసుకుంది.

జనసేన పార్టీ తన అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ నెల 26న తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో విశాఖ పట్నంపై అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందున తొలిజాబితాలో ఈ జిల్లా అభ్యర్థులు కూడా వుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 15 నియోజక వర్గాలు వుండగా అందులో కనీసం నాలుగైదు స్థానాలకైనా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉందంటున్నాయి. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబు పోటీ పడుతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు ఎం.రాఘవరావు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలోను కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి అక్కడ పోటీ ఎవరూ లేరు. అయితే కొత్తగా ఎవరైనా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.విశాఖ పశ్చిమ టిక్కెట్‌ డాక్టర్‌ సునితి, పీవీ సురేశ్‌ ఆశిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి గుంటూరు భారతి, పసుపులేటి ఉషాకిరణ్‌ రంగంలో ఉన్నారు. వీరు కాకుండా కాపునేత ముద్రగడ పద్మనాభం శిష్యుడు తోట రాజీవ్‌ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఎక్కువ పోటీ ఉంది.

pk 07012019

విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి వైసీపీ నుంచి వచ్చిన గంపల గిరిధర్‌, రాహుల్‌ టిక్కెట్లు ఆశిస్తున్నారు. భీమిలి నుంచి విద్యాసంస్థల అధినేత అలివర్‌ రాయ్‌తో పాటు ముత్తంశెట్టి కృష్ణారావు పేరు వినిపి స్తోంది. పెందుర్తి నుంచి ప్రస్తుతానికి మండవ రవికుమార్‌ ఉన్నారు. ఇంకా మరికొందరు పార్టీలోకి వచ్చే అవకాశం వుందని, అభ్యర్థి ప్రకటనకు కొంత సమయం పడుతుం దని చెబుతున్నారు. గాజువాకకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి ఉన్నారు. వీరిలో చింతలపూడి పేరు బాగా వినిపిస్తోంది. అనకా పల్లి ఎంపీ స్థానానికి కూడా ముత్తంశెట్టి కృష్ణారావు పేరు పరిశీలనలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి సీతారామ్‌ పేరు వినిపిస్తోంది. అయితే సీనియర్‌ నేత దాడి వీరభద్రరావును స్వయంగా పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

pk 07012019

ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా ఆయన నిర్ణయంపైనే అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. ఇక నర్సీపట్నం నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తవారు వచ్చే అవకాశం వుందని సమాచారం. చోడవరం నుంచి పీవీఎస్‌ఎన్‌ రాజు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకెవరూ పోటీ లేరు. ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, మాడుగులకు పూడి మంగపతిరావుల పేర్లు వినిపిస్తున్నాయి. పాయ కరావుపేటకు నక్కా రాజారావు, శివదత్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఏజెన్సీలో మాజీ మంత్రి బాలరాజు అరకు పార్లమెంటుకు గానీ, పాడేరు అసెంబ్లీకి గాని పోటీ చేయాలని భావిస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గానికి గంగులయ్య ప్రయత్నిస్తున్నారు.

‘ప్రధాని మోదీవన్నీ అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబుపైనా చేసినవ్యాఖ్యలు అనుచితం. ఆయనకు అహం బాగా పెరిగిపోయింది. ఆయనకు తగ్గట్లే రాష్ట్రంలోని భాజపా నాయకులు ముఖ్యమంత్రిని పట్టుకుని... మోసకారి, అబద్ధాల కోరని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు’ అని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ధ్వజమెత్తారు. భాజపాను భారతీయ జుమ్లా (మోసపూరిత హామీలతో పొద్దుపుచ్చే) పార్టీగా అభివర్ణించారు. అబద్దాల ప్రధానిగా నరేంద్రమోదీ, తప్పుడు పార్టీగా భాజపా చరిత్రలో నిలిచిపోతాయని కుటుంబరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.1,050 కోట్లకు యూసీలు ఇవ్వలేదని ఐదు పార్లమెంటు స్థానాల వీడియో సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించడం పచ్చి అబద్దమని పేర్కొన్నారు.

kutumbrao 07012019 2

నీతిఆయోగ్‌ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు 2018 డిసెంబరు 18న పంపిన లేఖలో ఏపీ ప్రభుత్వం రూ.1,049.34 కోట్లకు యూసీలు ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొందని, రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావుకు ఇచ్చిన జవాబులో 2018 జనవరి వరకు రూ.946.50 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి చెప్పారని కుటుంబరావు వివరించారు. ఆ తరువాత ఇచ్చిన యూసీలను కూడా క్రోడీకరించి నీతిఅయోగ్‌ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిందని తెలిపారు. నీతిఆయోగ్‌ ఛైర్మన్‌గా ఉన్న ప్రధాని నరేంద్రమోదీకి లేఖ తెలియదంటే ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా నడుపుతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం కూడా తెలియదంటే పీఎంవో నిర్వాకమో, భాజపా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని విమర్శించారు. విద్యాపన్ను కింద వసూలుచేసిన రూ.82 వేల కోట్లు ఇప్పటివరకు ఎందుకు ఖర్చు చేయలేదో నరేంద్రమోదీ చెబుతారా? అని ప్రశ్నించారు.

kutumbrao 07012019 3

యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించడం ప్రధానికి తెలియదా? భాజపా పాలిత రాష్ట్రాలకు యూసీలు ఇస్తేనే నిధులిస్తున్నారా? గుజరాత్‌, మహారాష్ట్ర ఎన్ని యూసీలు ఇచ్చిందని భారీగా నిధులిస్తున్నారని కుటుంబరావు ధ్వజమెత్తారు. ఏపీ పట్ల వివక్షకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ‘అహంకారాన్ని, అహంభావాన్ని సహించబోమని ఎన్టీఆర్‌ అనాడే చెప్పారు. ఆయన పోరాడింది దిల్లీపైన. ఆ రోజు దిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు భాజపా ఉంది. భాజపా, కాంగ్రెస్‌ కలిసే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాయి. భాజపా ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతోంది. కాంగ్రెస్‌ ఇస్తామంటోంది. అలాంటి కాంగ్రెస్‌తో తెదేపా స్నేహపూర్వకంగా ఉంటే తప్పా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ ఏ కూటమిలో ఉంటే తెదేపా దానితోనే ఉంటుంది’ అని కుటుంబరావు స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read