దేవినేని అవినాష్ పోటి ఎక్కడి నుంచి...? ప్రస్తుతం ఒక్క బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా ఆ ప్రాంత రాజకీయాల మీద అవగాహన ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను, దేవినేని కుటుంబం అభిమానులను తొలచి వేస్తున్న ప్రశ్న. 2017 లో తండ్రి దేవినేని నెహ్రు మరణం తర్వాత అవినాష్ రాజకీయ భవితవ్యంపై అందరికి ఆసక్తి పెరిగిపోయింది. ఆయన ప్రస్తుత౦ పార్టీలో ఒక బాధ్యత నిర్వహిస్తున్నా ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటి చేస్తారు అనేది చర్చనీయంశంగా మారింది. ఈ నేపధ్యంలో పార్టీ వర్గాల్లో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా బలమైన కుటుంబ నేపధ్యం ఉన్న యువ నాయకులను ఎన్నికల్లో నిలపాలని భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎంపీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేష్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, జేసి పవన్ రెడ్డి... వంటి యువ నేతలు తమ తమ ప్రాంతాల్లో సత్తా చాటుతున్నారు. తన తండ్రి ఆశయాల లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం అవినాష్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడమే కాకుండా స్థానిక నాయకులను కలుపుకుపోతు వర్గ విభేదాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ వర్గాల్లో అవినాష్ పై మంచి అభిప్రాయమే ఉందని తెలుస్తుంది.

avinash 04012019 2

ఇక ఆయన పోటి చేస్తారనే ప్రచారమున్న నియోజకవర్గాల విషయానికి వస్తే... ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలహీనంగా ఉన్న కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాలు గుడివాడ, నూజివీడు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా అవినాష్ ని గుడివాడ నుంచి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 2004 నుంచి కొడాలి నాని ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో 2014 లో నియోజకవర్గంలో బలమైన నేతకు టికెట్ ఇచ్చినా ఆయనను ఓడించడం సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలో గుడివాడ నుంచి ఈసారి కృష్ణా జిల్లా రాజకీయాల్లో... యువ సింహంగా పేరున్న అవినాష్ ని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. గుడివాడ కోటను బద్దలు కొట్టాలి అంటే అవినాష్ సరైన నేత అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అవినాష్ కి యువతలో క్రేజ్ తో పాటు దేవినేని కుటుంబానికి నియోజకవర్గంలో కూడా అభిమానులు ఉండటంతో ఆయన గెలుపుకి కాస్త కష్టపడితే సరిపోతుందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కూడా బల౦గానే ఉండటం అవినాష్ కి కలిసి వచ్చే అంశమనే అభిప్రాయం కూడా వినపడుతుంది. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అనే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాతో పాటు... పార్టీ వర్గాల్లో లో ఎక్కువగానే వినపడుతున్నాయి.

avinash 04012019 3

దీనితో గుడివాడ కోటను బద్దలు కొట్టడానికి అవినాష్ ని ప్రయోగించాలి అనే నమ్మకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో మరో నియోజకవర్గం పేరుని కూడా అధినాయకత్వం పరిశీలిస్తుంది. అదే నూజివీడు నియోజకవర్గం. ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగానే ఉన్నా టికెట్ కోసం ఆశపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. దానికి తోడు విజయవాడ నుంచి వెళ్ళిన కొందరు అక్కడ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అదే విధంగా ఎంపీ మాగంటి బాబు వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇక్కడ సీటు ఇస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ తో పాటు దేవినేని అభిమానులు ఉండటం, సరిహద్దు మైలవరం నియోజకవర్గం ప్రభావం కూడా ఉండటంతో అవినాష్ ని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఇక ఆ రెండు కాకపోతే పెనమలూరు సీటు విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాని ఇక్కడ బోడె ప్రసాద్ కి సీటు ఖరారైనట్టు తెలుస్తున్నా ఆఖరి నిమిషంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటుంది పార్టీ క్యాడర్. ఒక్క పెనమలూరు మినహా నూజివీడు, గుడివాడలో పార్టీకి సమర్ధమవంతమైన నాయకత్వం లేకపోవడంతో వీటిల్లో ఒక దాని నుంచే అవినాష్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్‌ పై కోడి కత్తి దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.

kodikatti 04012019

మరో పక్క ఈ కేసు పై విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా నిన్న మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వివరాలను బుధవారం వెల్లడించారు. విపక్ష నేతపై దాడికి సంబంధించిన కేసులో వాస్తవాలు ప్రకటించాలని భావించి, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ అనుమతితో వివరాలు వెల్లడిస్తున్నట్టు సీపీ పేర్కొన్నారు. దీనిలో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో పార్టీ నాయకుడు ధర్మశ్రీతో మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారమే కోడికత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడిలో జగన్‌కు భుజంపై గాయమైందన్నారు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేసినట్టు తెలిపారు.

kodikatti 04012019

విపక్ష నేతపై దాడికి సంబంధించి గతేడాది అక్టోబర్ 18 పథకం రూపొందించాడని, అయితే దసరా సందర్భంగా జగన్ 17నే హైదరాబాద్ వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. జగన్‌పై దాడికి యత్నించిన శ్రీనివాస్, హత్యాయత్నానికి ఉపయోగించిన ఆయుధం కోడికత్తికి రెండు సార్లు పదును పెట్టించాడని తెలిపారు. త్వరలోనే తాను టీవీల్లో కనిపిస్తానంటూ సహచరుల వద్ద పేర్కొన్నాడన్నారు. ఇదే విషయాన్ని హేమలత, షేక్ అమ్మాజీలకు చెప్పినట్టు తెలిపారు. దాడి చేసినప్పుడు శ్రీనివాస్ వద్ద లభించిన లేఖను విజయదుర్గతో పాటు మరో ఇద్దరితో రాయించి, జెరాక్స్ తీయించి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలనుకునే ఈ ఘటనకు పాల్పడినట్టు సీపీ తెలిపారు. దీనిలో భాగంగానే జగన్‌తో సెల్ఫీ తీయించుకుంటానని నమ్మబలికి వైసీపీకి చెందిన ఒక నాయకుని ప్రయేయంతో జగన్ బస చేసిన వీఐపీ లాంజ్‌కు చేరుకున్నట్టు విచారణలో వెల్లడైందన్నారు.

విభజన హామీలు అమలు చెయ్యలేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది కేంద్రం. హామీలు అమలు గాలికి వదిలేసి, హక్కుగా వచ్చేవి కూడా ఇవ్వకుండా, కక్ష సాధిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్ట్ లను అడ్డుకుంది. కేంద్రం ఎంత అడ్డుకున్నా, చంద్రబాబు తనకు ఉన్న అనుభవం, పలుకుబడి, గుర్తింపుతో, ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నారు. ఇదే కోవలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ పారిశ్రామిక వేత్తలను కలిసి, మన రాష్ట్రంలో పెట్టుబడులు గురించి వివరిస్తూ, పెట్టుబడులు తెస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం కన్ను పడింది. కక్ష సాధింపులకు ఇది పరాకాష్ట. చివరకు మన సొంతగా నిలబడతాం అంటున్నా, కేంద్రం కుదరదు అంటుంది.

davos 04012019 2

ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం ఇదే తొలిసారి. దావోస్‌ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా... నలుగురికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు.

davos 04012019 3

ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే దేశానికి లాభం కాదన్నట్లుగా ఉంది మోదీ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదన్నమాట అయితే..

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకోవలసి వచ్చిందని నవ్యాంధ్ర హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 24వ తేదీలోగా తగిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లపాటు ఇచ్చిన కేంద్రం.. 2017-18 సంవత్సరానికి కేటాయించిన రూ.350 కోట్లను గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్రప్రభుత్వ ఖాతాలో జమ చేసి.. అదే నెల 15వ తేదీన వెనక్కి తీసేసుకుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గత ఏడాది జూన్‌ 13వ తేదీన ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

court 04012019

ఈ పిటిషన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. కొణతాల తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 46 (2) (3) ప్రకారం.. వెనుకబడిన ఏడు జిల్లాలకు కేటాయించిన నిధుల్ని ఇచ్చినట్లే ఇచ్చి.. కేవలం రాజకీయ కారణాల వల్ల వెనక్కి తీసుకుందని, దీనివల్ల ఆయా జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలోని అంతరార్థం తెలియడం లేదన్నారు. అందువల్ల ఆ నగదును తక్షణం రాష్ట్రానికి ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

court 04012019

అదేవిధంగా ప్రజల కోసం పోరాడుతూ, కోర్టును ఆశ్రయించిన తమకు ప్రభుత్వం కూడా మద్దతివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు పిటిషనర్‌ వాదనను తాము సమర్థిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం.. ఆ రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలియజేస్తూ, అందుకు కారణాలను వివరిస్తూ.. హైకోర్టు సెలవులు ముగిసిన అనంతరం 24వ తేదీకల్లా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల క్రితం, మోడీ ఈ విషయం పై రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరి, ఇదే విషయం కోర్ట్ కి చెప్తారో, అసలు ఏమి చెప్తారో చూడాలి..

Advertisements

Latest Articles

Most Read