తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న వేళ, తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. దీంతో, ముస్లింలకు కెసిఆర్ మరోసారి టోపి పెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్ట్ తీర్పుతో కెసిఆర్ మోసం బైటపడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 12% రిజర్వేషన్ల పై ముస్లింలకు కెసిఆర్ దగా చేసారని విమర్శలు గుప్పిస్తున్నారు. సుప్రీంకోర్టు కొట్టేస్తుందని తెలిసీ ముస్లింలు,ఆదివాసీలను కెసిఆర్ దగా చేసారని అంటున్నారు. ముస్లింలు,ఆదివాసీల పై టిఆర్ఎస్ కు కపట ప్రేమ అని నేడే బట్టబయలయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక కమిషన్ వేసి అధ్యయనం చేయకుండా మూర్ఖంగా చేసినందుకు ఫలితం, ఇదే అని అంటున్నారు.

kcr 07122018 2

రిజర్వేషన్లు 50%కు మించకూడదని సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.రిజర్వేషన్లు 50శాతానికి కంటే మించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శుక్రవారం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో వాదనలు జరిగాయి. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలని కోరింది. కాగా రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలు జరుగుతున్న వేళ, ఈ రోజు సుప్రీంకోర్ట్ తీర్పే కెసిఆర్ పాలనకు మరణ శాసనం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

kcr 07122018 3

"ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల పై మంజునాధ కమిషన్ వేసిన టిడిపి ప్రభుత్వం. జస్టిస్ మంజునాధ నేతృత్వంలో ప్రత్యేక బిసి కమిషన్ ద్వారా ఏపిలో అధ్యయనం. కానీ తెలంగాణలో అవేమీ పట్టించుకోని కెసిఆర్ మూర్ఖత్వం. ఫలితం తెలంగాణలో ముస్లింలు,ఆదివాసీలకు,బిసీలకు తీరని అన్యాయం. కెసిఆర్ మూర్ఖత్వం తెలంగాణకు శాపం.టిఆర్ ఎస్ ఒంటెత్తు పోకడ తెలంగాణ బడుగుల మనుగడకే శాపం. ఈ మూర్ఖపు పాలన ఇంకా కావాలా..? " అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే, కేసీఆర్ బూటకం బయట పడిందని, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు రక్తపోటు పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సుప్రజ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, ఛాతీ నొప్పితో మోత్కుపల్లి బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు మోత్కుపల్లి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా ఆలేరు నుంచి బరిలో ఉన్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు.

telangana 07122018 2

మరో పక్క, తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదు అవుతోంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ప్రతీ గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదే స్థాయిలో కొనసాగితే పోలింగ్ ముగిసే సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతుందని ఈసీ భావిస్తోంది. అటు పోలింగ్ కేంద్రా వద్ద కూడా క్యూలైన్లు చకచకగా కదులుతున్నాయి. ఓటువేసే ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

telangana 07122018 3

ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, నితిన్, రాజమౌళి, కీరవాణి, విజయశాంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అంతా పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఈసీ చెబుతున్నా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచే జనం క్యూ లైన్లలో నించున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. మహబూబాబాద్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకొస్తుందని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. "ఓటు వేయడం దేశ పౌరులుగా మన బాధ్యత. ఎవరికి వేస్తున్నామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి."

cbn tweet 07122018

తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా అంటూ ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. వారంతా ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ‘ఇవాళ ఎన్నికల రోజు. తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

cbn tweet 07122018

అటు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం కోసం తెలంగాణలోని సోదర, సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండగలో తప్పకుండా పాల్గొనాలి’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు. మరో పక్క తెలంగాణాలో ఓటింగ్ కొనసాగుతుంది. తొలి రెండు గంటలు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు ఊపందుకుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఈవో రజత్‌కుమార్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ వేళ.. తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పైలెట్‌ రోహిత్‌ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆయనపై తల్వార్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే చుట్టు కాంపౌండ్‌ వాల్‌ ఉండటంతో తృటిలో తప్పించుకున్నట్లు సమాచారాం. దాదాపు వంద మంది ఆయనపైదాడికి రాగా.. అందులో పది మంది తల్వార్లతో చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నిమిషాల్లోనే పోలీసులు, కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అయితే తనపై దాడి చేసింది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనంటున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.

trs 07122018 2

కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద శుక్రవారం ఉదయం కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. కాగా... ఈ సమాచారం తెలిసి కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడనుంచి పంపించివేశారు.

trs 07122018 3

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఓటమి భయంతోనే ప్రజాకూటమి నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కూటమి నేతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.90 లక్షల మంది భద్రతా బలగాలు పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. అధికార తెరాస, మహాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read