కొంతకాలంగా సీఎం చంద్రబాబు, టీడీపీ లక్ష్యంగా రెచ్చిపోతున్న వైసీపీ సోషల్‌ మీడియా తాజాగా చంద్రబాబుపై మరో అభ్యంతరకర పోస్టింగ్‌ను పెట్టింది. ఈ నెల 8న బెంగుళూరు వెళ్ళిన సీఎం చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్య రాతలతో పోస్టు చేసింది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యుల ప్లకార్డులను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన సందేశాలు తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ఈ నెల 10న టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి కనకమేడల వీరాంజనేయులు గుంటూరులోని అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

janasena 14112018 2

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వైసీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి కుమార్‌రాజు నవీన్‌కుమార్‌రాజును మంగళవారం అరెస్టు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతల చేతిలో ఉన్న ప్లకార్డుల్లోని అక్షరాలను మార్ఫింగ్‌ చేసి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కొటేషన్లు రూపొందించి కొందరు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దానిని కుమార్‌రాజు తనకు అందుబాటులో ఉన్న అనేక గ్రూపులకు ఫేస్‌బుక్‌ అకౌంట్లకు ఫార్వార్డ్‌ చేశాడు. ఈ మేరకు నమోదైన కేసులో అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో అదనపు ఎస్పీలు వై.టి.నాయుడు, లక్ష్మినారాయణ, వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో అరండల్‌పేట సీఐ వై.శ్రీనివాసరావు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు.

janasena 14112018 3

ఈ కేసు విచారణలో ఉందని, ఆయా ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, అయితే వాటిని సక్రమ మార్గంలో వ్యక్తపరిచవలసిన అవసరం ఉంది. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు నిజాలను వక్రీకరించి రాస్తాం, మార్ఫింగ్ చేసి కించపరుస్తాం అంటే కుదరదు. ఇది అన్ని పార్టీల అభిమానులకూ వర్తిస్తుంది, అభిమానం హద్దు మీరకుండా చూసుకోండి. దురభిమానం ఇలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఒక్కసారి కేసు బుక్ అయితే, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ మీద కేసు బుక్ అయితే, మహా అయితే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకువస్తారు, ఆ కేసు మాత్రం, మీ కెరీర్ ని దెబ్బతీస్తుంది. అప్పుడు జగన్ రాడు, పవన్ రాడు, టిడిపి నాయకులు రారు. మన ఖర్మ మనమే అనుభవించాలి...

ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా తయారైంది ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి! నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. అంచనాలు, లెక్కలు తారుమరవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలలో, శ్రేణులలో ఆందోళన మొదలైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ 2014లో అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయింది వైసీపీ. ఈసారి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, అదే తమకు కలిసివస్తుందనీ ఆ పార్టీ పెద్దలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. అయితే నాలుగు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదు.

jaganoption 14112018

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో తెలుగుదేశంపార్టీ జతకట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరికొన్ని మార్పులు సంభవించాయి. దీంతో వైసీపీ ఎటూ తేల్చుకోని పరిస్థితిలో చిక్కుకుంది. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చీరాగానే.. 10 టెన్ జన్‌పథ్‌కీ, పులివెందుల పౌరుషానికీ పోటీ అంటూ సవాళ్లు విసిరారు జగన్. దీంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది. పైగా వైసీపీలో ఉన్న నేతల్లో 90 శాతం వరకు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మరోవైపు బీజేపీతో చేతులు కలిపితే ప్రజలు హర్షించే స్థితిలో లేరు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం తమను నమ్మించి మోసం చేసిందనే భావనలో ఏపీ ప్రజలున్నారు. అసలు జగన్‌ను నడిపిస్తున్నదే బీజేపీ అనీ, కేసుల నుంచి బయటపడేందుకే ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీతో ఎలాంటి బంధం లేదని వైసీపీ పెద్దలు పదేపదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

jaganoption 14112018

అటు వామపక్ష పార్టీలేమో జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాయి. ప్రజాపోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాయి. బీజేపీయేతర కూటమిలోకి రావాలని సీపీఐ, సీపీఎం నేతలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే కమ్యూనిస్టులు వైసీపీతో కలిసి రానట్టే! మరోవైపు జగన్, పవన్‌ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలను జనసైనికులు అంగీకరించడం లేదు. అసలు ఆ పార్టీ శ్రేణులు వైసీపీతో కలిసేందుకు సుముఖంగా లేవు. అయినా, ఇప్పుడు వైసీపీకి ఇది ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా, జగన్ కాని వైసీపీ కాని, తిరిగి ఏమి అనటం లేదు. విడి విడిగా వెళ్తే, పవన్ కు పోయేది ఏమి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక 5 సీట్లు గెలిస్తేనే ఎక్కువ అనుకునే పరిస్థితి ఉంది. కాని జగన పరిస్థితి అలా కాదు, ప్రతిపక్షాల ఓట్లు చీలి పొతే, అది జగన కు పెద్ద మైనస్ అవుతుంది. అందుకే ఇప్పుడు జగన్ కు, పవన్ తో వెళ్తేనే ఉపయోగం. అటు బీజేపీ కూడా ఇదే కోరుకుంటుంది.

ఇప్పటికే రాష్ట్రంలో కియా మోటార్స్‌, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌ వంటి పరిశ్రమలు రాగా తాజాగా మరో ఆరు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో రూ.4,332 కోట్ల పెట్టుబడులతో వీటిని నెలకొల్పబోతున్నారు. మొత్తం 12,071 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక్కడ సచివాలయంలో సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 10 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఈ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

companies 1312018

చిత్తూరు జిల్లాలో.. జపాన్‌కు చెందిన టీహెచ్‌కే కంపెనీ చిత్తూరు జిల్లాలో రూ.802 కోట్లతో పెద్ద పెద్ద భవనాలను శుభ్రపరిచే పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 600 మందికి ఇందులో ఉపాధి కల్పించనున్నారు. బీ ఇదే జిల్లాలో దుస్తుల తయారీలో పేరున్న అర్వింద్‌ కంపెనీ రూ.760 కోట్లతో కర్మాగారాన్ని ప్రారంభించనున్నది. 9,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడే శ్రీసిటీలో ఫ్లేవర్స్‌, ఫ్రాగ్రెన్సెస్‌ ఇండియా రూ.525 కోట్ల పెట్టుబడితో ఐస్‌ క్రీమ్‌లు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు, సుగంధాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుచేయనున్నది. ఇందులో 450 మందికి అవకాశం లభిస్తుంది.

companies 1312018

అనంతపురం, విశాఖ జిల్లాల్లో.. అద్దాల తయారీలో ప్రపంచ స్థాయి ఉత్పాదక కంపెనీగా పేరొందిన సెయింట్‌ గొబైన్‌ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో 180 ఎకరాల్లో అద్దాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. మొత్తం 1,300 మందికి ఉపాధి లభిస్తుంది. డూవూన్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ సంయుక్తంగా రూ.210 కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసే కియా కార్ల విడిభాగాల ఉత్పత్తి కర్మాగారంలో 350 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే జిల్లాలో డాంగ్‌-ఎ హనుంగ్‌ సంస్థ కూడా కియా కార్ల విడిభాగాల ఉత్పత్తికి మరో కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది.

విశాఖ విమానాశ్రయంలో తనపై దాడి కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న అంతా చంద్రబాబుకి కూడా కోర్ట్ నోటీసులు ఇచ్చిందని, జగన్ మీడియా ప్రచారం చేసింది. కాని చంద్రబాబుకి నోటీసులు ఇవ్వమని జగన్ తరుపు లాయర్ కోరినా, కోర్ట్ మాత్రం ఏపి ప్రభుత్వానికి అదే విధంగా, తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలకి కూడా నోటీసులు ఇచ్చింది. సిట్‌ దర్యాప్తును ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ దర్యాప్తు పురోగతిని సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.

jagan 14112018 2

హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ(ఉత్తర సబ్‌డివిజన్‌) సహాయ పోలీసు కమిషనర్‌, ఐదో పట్టణ పోలీసుస్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీ ఉన్నారు. విచారణను రెండు వారాలకు కాకుండా వారానికే వాయిదా వేయాలని జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను సున్నితంగా తోసిపుచ్చిన ధర్మాసనం.. దర్యాప్తు ఎక్కడికి వెళుతుందో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. హత్యాయత్న ఘటనపైనే వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి వేసిన వ్యాజ్యంపైనా హైకోర్టు మరోసారి విచారించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీసు అధికారి కోర్టుకు హాజరై సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించారు

jagan 14112018 3

మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ప్రతిపక్ష నేత కాబట్టి జగన్‌పై జరిగిన దాడిన ప్రజలకు ముఖ్యమంత్రి వివరించాల్సిన అవసరం ఉంది కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. అప్పటికే వైకాపా నేతలు పలువురు ధర్నాలకు దిగారని వివరించారు. దర్యాప్తును నియంత్రించడం, ఏ దిశలో జరగాలో తెలిపే వ్యాఖ్యలను సీఎం, డీజీపీ చేయలేదని అన్నారు. జగన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు దాడి ఘటన డ్రామా అని సీఎం చెప్పాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇరువైపులా వాదనలు, సిట్‌ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దర్యాప్తును ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి తప్ప మిగిలిన ప్రతివాదులకు నోటీసులిస్తున్నామని పేర్కొంది.

Advertisements

Latest Articles

Most Read