తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల ఎంపికకు ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తమకు ఆమోదమేనని ప్రకటించారు.

cbn 12112018 2

మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, ప్రభుత్వ విప్‌గా చాంద్‌భాషాల నియామకానికి కూడా ఈ సందర్భంగా సీఎం పచ్చజెండా ఊపారు. తన నిర్ణయమే అంతిమమైనప్పటికీ ఏకాభిప్రాయంతో ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే అందరితోనూ మాట్లాడాలంటూ ఈ రెండు వర్గాల శాసనసభ్యులు, పార్టీ నాయకులకు కబురు పంపారు. శనివారం ఉదయాన్నే ఉండవల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోడానికి కారణాలను వివరించారు. దీంతో అప్పటిదాకా మంత్రి పదవులు ఆశించిన శాసనసభ్యులు చల్లబడి సీఎం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. సీఎం వద్ద సమావేశానికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, చాంద్‌భాషా ఒకింత అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రసారమాధ్యమాలతో మాట్లాడినప్పుడు తమకూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని వారన్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు వేదిక వద్దకొచ్చిన చంద్రబాబు ముందుగా ఫరూక్‌, శ్రావణ్‌ను తన కార్యాలయంలోకి పిలిపించారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

cbn 12112018 3

అనంతరం మైనారిటీల నేతలు 15మందితో ప్రజావేదిక లోపలి కార్యాలయంలో సమావేశమయ్యారు. వైకాపా నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తే, గవర్నరు అభ్యంతరం చెబుతారనే సంకేతాలున్నాయని వెల్లడించారు. ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తున్న ఫరూక్‌కు అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం అభిప్రాయానికి నేతలంతా మద్దతు పలికారు. మండలి ఛైర్మన్‌ పదవి నుంచి ఫరూక్‌ను తప్పిస్తున్నందున షరీఫ్‌కు అవకాశమివ్వాలని కొందరు సూచించగా చంద్రబాబు అంగీకరించారు. తనకూ ప్రభుత్వ విప్‌గా అవకాశమివ్వాలని చాంద్‌భాషా కోరారు. అనంతపురంనుంచి ఇప్పటికే ముగ్గురు విప్‌లుగా ఉన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరకు సుముఖత తెలిపారు. దీంతో ఉదయం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న నేతల వైఖరిలో మార్పు కన్పించింది.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారం పై, ముఖ్యంగా జీవీఎల్ చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఫైర్ అయ్యారు. దేశంలో తొలి 10 స్థానాల్లో ఉండే నేరగాళ్లు, రాజకీయ అబద్ధాలకోరు ఎవరని గూగుల్‌లో వెతికితే ప్రధాని నరేంద్రమోదీ పేరు వస్తోందని కుటుంబరావు వ్యాఖ్యానించారు. హిందూత్వాన్ని అడ్డం పెట్టుకుని పట్టణ ఉగ్రవాదం మొదలుపెట్టిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీ వాళ్లను చూసి వీధి కుక్కలు కూడా అసహ్యించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయరన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటారని, ఆయన ట్వీట్లపై వచ్చే స్పందన ఒక్కసారి పరిశీలించుకుంటే అతని స్థాయి ఏంటో తెలుస్తుందన్నారు. ‘కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవడానికి కూడా జీవీఎల్ పనికిరాడు. పనికిమాలిన వెదవలను రాష్ట్రంలోకి రానివ్వడమే ఎక్కువ’ అని కుంటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ప్రజల డబ్బులు వృధా చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని ఫైర్ అయ్యారు.

gvl 12112018 2

‘‘రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలకు సీఎం చంద్రబాబునాయుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తుంటే భాజపాకు వృథా ఖర్చులా కనిపిస్తోంది. 2012 నుంచి ప్రధానిగా పగ్గాలు చేపట్టే వరకూ నరేంద్రమోదీ దేశం మొత్తం విమానంలో పర్యటించారు. ఆ ఖర్చులు గుజరాత్‌ ప్రభుత్వం భరించిందా? లేక భాజపానా? గుజరాత్‌ ప్రభుత్వ ఖర్చులతోనే దేశమంతా తిరిగి, రాష్ట్ర ప్రయోజనాల కోసమని పద్దుల్లో రాశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర కార్యాలయ శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎలా వచ్చారు? రక్షణ శాఖ విమానంలో కాదా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తోంది. దీనిపై భాజపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? లాటరీ గెలుచుకున్నట్లుగా వచ్చిన ఎంపీ పదవిని అడ్డంపెట్టుకుని జీవీఎల్‌ నరసింహరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు’’ అని పేర్కొన్నారు.

gvl 12112018 3

‘‘ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం ఇస్తామని ప్రధాని మోదీ ఆర్భాటంగా చెప్పారు. ఇందుకోసం పీఎస్‌బీ లోన్స్‌ ఇన్‌ 59 వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించారు. దీని కింద రాష్ట్రంలో ఎంత మందికి రుణాలిచ్చారో చెప్పగలరా? పీఎస్‌బీ లోన్స్‌ను క్యాపిటా వరల్డ్‌ సంస్థకు ఇచ్చారు. అవి కూడా షా పేరుతో ఉన్న వారివే. ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉంటుందా? రుణాల కోసం లక్షల దరఖాస్తులు వస్తే ఆ ఒక్క సంస్థకే పెద్ద మొత్తంలో రుణాలేలా ఇస్తారు? ఇది ఆర్థిక ఉగ్రవాదం కాదా? దీనిపై లోతైన దర్యాప్తు జరపాలి...’’ అని కుటుంబరావు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో టాప్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రానుంది. జపాన్ పానసోనిక్ దిగ్గజమైన 'యాంకర్ ఎలక్ట్రానిక్స్' ఆంధ్రప్రదేశ్ లో తన ఉత్పత్తి కార్మాగారాన్ని తెరవబోతుంది. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. అయితే దీంతో ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండువేల ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఇందులో 70 శాతం మహిళలకు కేటాయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 8 ఫ్యాక్టరీల్లో కంపెనీకి 9వేల మంది ఉద్యోగులున్నారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ వెంచర్లో ఈ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.

anchor 1112018 2

ఈ కంపెనీలో ఫ్యాన్లు, కేబుల్ వైర్స్, స్విచ్ బోర్డులు, స్విచ్ డేరింగ్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తామని యాంకర్ ఎలక్ట్రానిక్స్ ఎండి వివేక్ శర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ 2020 నాటికి సిద్ధం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వైరింగ్ మార్కెట్లో దాదాపు 36శాతం వాటాను కంపెనీ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో ఈ వాటాను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వివేక్ తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 28శాతం పుంజుకొని రూ.2,980కోట్లుగా నమోదయ్యింది.

anchor 1112018 3

వార్షిక వృద్ధి రేటు 13శాతం పెరిగింది. రానున్న ఐయిదేళ్లలో కంపెనీ వార్షిక వృద్ధిరేటు 20 శాతానికి మంచి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని యాంకర్ ఎండి వివేక్ పేర్కొన్నారు. డబుల్ డిజిట్ వృద్ధి రేటు సాధించడానికి తగు ప్రణాళికలు కూడా రూపొందించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న 5 ఏళ్ళల్లో కంపెనీ వార్షిక వృద్ధి రేటు (CAGR) 20 శాతంకు మించి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని యాంకర్ ఎండీ వివేక్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వైరింగ్ మార్కెట్లో దాదాపు 36 శాతం వాటాను యాంకర్ దక్కించుకుంది. రానున్న రెండేళ్ళల్లో ఈ వాటాను మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్టు వివేక్ తెలిపారు.

ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా బీజేపీ ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు, మోడీ-షాలకు వ్యతిరేకంగా తయారయ్యాయి. ఆశ్చర్యంగా ఈ జాబితాలో జగన్, పవన్, కేసీఆర్ మాత్రమే లేరు. జగన, పవన్ లకి అసలు మోడీ అంటే, ఎందుకు అంత భయమో తెలియదు. కనీసం ఒక్క మాట కూడా, మోడీని అనరు. కేంద్రంలో సమస్య అయినా, చంద్రబాబునే తిడతారు. ఇక విభజన హామీల గురించి అయితే, మాట మాట్లడాలి అంటే భయం. జగన్, పవన్ చేస్తున్న ఈ పోరాటాల పై ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా విసుగు చెందాయి. ఎంత భయపడినా, కనీసం మాట వరుసకు అయినా మోడీ అనే మాట వీరి నోట్లో నుంచి ఎందుకు రాదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే అంశం పై జగన్, పవన్ లను నిలదీస్తున్నారు.

jagan 12112018 2

నోట్ల రద్దు, ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని మోదీని జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిలదీశారు. ‘చాలా పోరాటాలు చూశాం. కానీ భాజపాపై జగన్‌ చేస్తున్న మౌన పోరాటం లాంటివి ఎప్పుడూ చూడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాను ఓడించండని ఆయన ఎందుకు ప్రజలకు విజ్ఞప్తి చేయరు. భాజపాపై మౌనవ్రతం పాటించే ఆయన చంద్రబాబుపై మాత్రం అంతెత్తున లేస్తారు’ అని అని విమర్శించారు. జగన్ చేస్తున్న వీరోచిత పోరాటానికి, మౌన పోరాటం అని పేరు పెట్టారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ ప్రాంతీయ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని భాజపా ప్రయత్నిస్తోందని అన్నారు.

jagan 12112018 3

"ఓట్ల కోసమే ఆ పార్టీ ప్రాంతాల పేర్లను మారుస్తోంది. మళ్లీ అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని తెరపైకి తెచ్చింది. భాజపాను ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల ముందు కూటములవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే మంచిది. రాంవిలాస్‌ పాసవాన్‌, నితీష్‌ కుమార్‌, శివసేన నేతలను వెలుపలకు తీసుకొచ్చి ఎన్‌డీఏను బలహీనపర్చాలి.’ అని రాఘవులు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read