ఇప్పటికే లోకేష్, అఖిల ప్రియ లాంటి యువ మంత్రులతో ఉన్న ఏపి క్యాబినెట్ లోకి, మరో యువ నాయకుడు వచ్చి క్యాబినెట్ లో చేరనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రేపు జరగనున్న విషయం తెలిసిందే. కేబినెట్‌లోకి ముస్లిం, ఎస్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ను, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. శ్రావణ్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వనున్నారు. ఆయన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.

cbn 010112018 2

సర్వేశ్వరరావుతో పాటు, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించనున్నారు. చెప్పిన మాట ప్రకారమే, చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. కిడారి శ్రావణ్‌కుమార్‌ స్వస్థలం... విశాఖ జిల్లా పెదబయలు మండలం నడింవాడ గ్రామం. ఆయన తండ్రి కిడారు సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా, అరకు ఎమ్మెల్యేగా, శాసనసభలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. శ్రావణ్‌కుమార్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. సివిల్‌ సర్వీసెస్‌కి ఎంపికవడం ఆయన లక్ష్యం. దాన్ని సాధించేందుకు దిల్లీలో ఉంటూ సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్రావణ్‌ 1990 జూన్‌ 14న జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు పెదబయలులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో చదువుకున్నారు. విశాఖలో ఇంటర్మీడియెట్‌ చదివారు.

cbn 010112018 3

ఫరూక్‌ని మంత్రివర్గంలోకి తీసుకుంటే శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌కి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా... ఆయన సేవల్ని పార్టీ కోసం వినియోగించుకోవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. షరీఫ్‌ ఇప్పటికే శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పదవిలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక... 2017 ఏప్రిల్‌ 2న మొదటిసారి మంత్రి వర్గ విస్తరణ చేశారు. ఐదుగుర్ని తొలగించి కొత్తగా 11 మందికి చోటు కల్పించారు. ఇప్పుడు రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి ఆయా వర్గాల సంక్షేమానికి చెందిన శాఖలనే కేటాయిస్తారని అంటున్నారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమం, శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖలను ఇస్తారు. కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు.

పెడన నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. జోగి రమేష్ వర్గం, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 2014 ఎన్నికలు అయిన దగ్గర నుంచి పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్‌గా ఉప్పాల రాంప్రసాద్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జోగి రమేష్ అనే వ్యక్తిని పెడన నియోజకవర్గానికి జగన్ పంపించారు. దీంతో ఇద్దరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది.

jogi 09112018 2

ఇరువురూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మచిలీపట్నం ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బలసౌరీ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బాలసౌరీకి సంబంధించిన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ పోటా పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.

jogi 09112018 3

గొడవకు కారణమైనవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మచిలీపట్నంలో పార్లమెంటరీ నియోజకవర్గ వైకాపా కార్యాలయాన్నిఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా పెడనలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, ఉప్పాల రాంప్రసాద్‌ వర్గాలకు చెందిన వైకాపా కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీగా బయలుదేరారు. పెడన బస్టాండ్‌ సమీపంలో ఇరువర్గాల ర్యాలీలు ఎదురవడంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో జోగి రమేశ్‌కు చెందిన కారు అద్దం ధ్వంసం కాగా, ఉప్పాల వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

అమరావతి... ది పీపుల్స్ కాపిటల్.. చంద్రబాబుని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారు రైతులు... చంద్రబాబు వారి నమ్మకాన్ని పాడుచెయ్యకుండా, పని చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చాయి.. మరో పక్క రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. మరో పక్క హౌసింగ్ పనులు జరుగుతున్నాయి. మరో పక్క సెక్రటేరియట్ టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. అందుకే అమరావతి మీద నమ్మకంతో, బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో, ఒక్క గంట లోనే, అమరావతి బాండ్లు ఓవర్ subscribe అయ్యాయి. అమరావతి మీద ఇన్వెస్టర్స్ కి ఎంత నమ్మకం ఉందో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు సామాన్య ప్రజల వంతు.

amaravati 09112018 2

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నేలపాడు వద్ద చేపట్టే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా జీప్లస్‌ 18 పద్ధతిలో నిర్మించే 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని సీఆర్‌డీఏ కల్పించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే వారికి సహాయపడేందుకు విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లక్ష మందికిపైగా సర్వర్‌తో అనుసంధానం కావడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని, సీఆర్డీఏ అంచనా వెయ్యలేక పోయింది. అమరావతి పై సామాన్య ప్రజలకు ఎన్ని ఆశలు ఉన్నాయో, ఈ ఘటన చెప్తుంది.

amaravati 09112018 3

సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి అయినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక సమస్యలు లేకుండా ఈనెల 15న మరో 300 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని చెప్పారు. ఈసారి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రావన్నారు. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ ఫ్లాట్ల విక్రయం ద్వారా తెలిసిపోతోందని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చారు. అవీ అయిపోతే ప్రాజెక్ట్‌లో మిగిలిన 600అపార్ట్‌మెంట్లకు కూడా బుకింగ్‌ ప్రారంభించాలని సూచించారు.

బీజేపీ యేతర రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరి వెళ్లిన చంద్రబాబు నేరుగా స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు డీఎంకే నేతలు ఘనస్వాగతం పలికారు. భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న కృషిని స్టాలిన్‌ ఇటీవల ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

cbn stalin 09112018 2

ఇటీవల దిల్లీ పర్యటనలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తన ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గురువారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ, తదితర నేతలతో సమావేశమయ్యారు. ఇదే క్రమంలో ఈ రోజు చెన్నైకి బయల్దేరి వెళ్లారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో గంట పాటు చర్చించారు.

cbn stalin 09112018 3

సమావేశం అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్‌ కాలరాస్తోందని ఆరోపించారు. మతవాద బీజేపీని గద్దె దించేందుకే చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే రాహుల్‌ను చంద్రబాబు కలిశారని తెలిపారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం, ఆహ్వానించే పరిణామని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని, ఢిల్లీ లేదా మరో నగరంలో అందరం కలుస్తామని స్టాలిన్‌ తెలిపారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించేందుకు సహకరించాలని స్టాలిన్‌ను కోరామని చెప్పారు. త్వరలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతామన్నారు. స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, విపక్షాలను వేధించేందుకే ఈడీ, ఐటీలను వాడుతున్నారని దుయ్యబట్టారు. మోదీ చర్యలతో ఆర్థికవ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. నోట్ల రద్దు అపహాస్యమైందని, నల్లధనం తెల్లధనంగా మారిందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read