పెద్దనోట్ల రద్దుతో తగిలిన గాయాలు కాలంతో పాటు పెరిగి వికృతంగా కనిపిస్తున్నాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి గురువారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్‌ 8న తీసుకున్న దురాలోచన, దురదృష్టకరమైన నిర్ణయం.. భారతీయ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై చూపిన వ్యతిరేక ప్రభావం ఈరోజుకీ కనిపిస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపించింది. అన్నింటినీ కాలమే మాన్పుతుందని చెబుతుంటారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాలు మాత్రం దురదృష్టవశాత్తూ... కాలంతో పాటు మరింతగా పెరుగుతూ వికృతంగా కనిపిస్తున్నాయి.

manmohan 09112018 2

జీడీపీ దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్దనోట్ల రద్దు షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోయాయి. ఉపాధిపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడింది. ఆర్థిక మార్కెట్లు దుర్బలంగా మారాయి. మౌలిక వసతుల ప్రాజెక్టుల రుణ దాతల్ని, నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యవస్థల వనరులను ఆవిరి చేసింది. దీని ప్రభావాన్ని మనం ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. రూపాయి మారక విలువ తగ్గిపోయింది. ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది.

manmohan 09112018 3

సంప్రదాయ విరుద్ధమైన, స్వల్పకాలిక చర్యలపై ఆధారపడకపోవడం చాలా మంచిది. అలాంటి వాటివల్ల భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లలో మరింత అనిశ్చితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో నిర్దిష్టత, స్పష్టతను పునరుద్ధరించాలి. ఆర్థిక దుస్సాహస చర్యలను, అనాలోచిత ఆర్థిక విధానాలను అమలుచేస్తే వాటి ప్రభావం దీర్ఘకాలంలో దేశంపై ఎలా ఉంటుందోనన్న సత్యాన్ని ఈ రోజు గుర్తుచేస్తుంది’ అని మన్మోహన్‌ పేర్కొన్నారు. ‘ఎలాంటి గాయాన్నైనా మాన్పించే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, నోట్ల రద్దు అలా కాదు. కాలం గడిచేకొద్దీ ఆ గాయం మరింత స్పష్టంగా కనపడుతుంది.’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్రమోడీ సర్కారు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపియేతర పార్టీలని ఏకం చేసే పనిని మరింత వేగవంతం చేశారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో భాగంగా ఆయన పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు.

chennai 09112018 2

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అళ్వార్‌పేట్‌లోని చిత్తరంజన్‌ రోడ్డులో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నివాసానికి చేరుకుంటారు. స్టాలిన్‌, ఇతర డీఎంకే నేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకనున్నారు. అనంతరం సుమారు గంటపాటు స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. 8.50కి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్‌ నేతలు పలువురు పాల్గొననున్నారు.

chennai 09112018 3

మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని ఢిల్లీ వేదికగా చెప్పిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫ్రంట్ రూపకల్పన ప్రయత్నాలను చేస్తున్నారు. రాష్ట్రాలపై ప్రధాని మోడీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్న చంద్రబాబు.. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామి భేటీ అనంతరం. తెలిపారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోగా.. ఐటీ, సీబీఐ దాడులతో పేరుతో.. అందరిని భయపెడుతున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఉత్తరాధిలో బీజేపీయేతర పార్టీలతో ఇప్పటికే కలిసి చర్చలు జరిపిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాదిలోనూమ, చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు చర్చలు జరిపిన అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి.

వైఎస్ జగన్ బాల్య స్నేహితుడు, వైఎస్ ఫ్యామిలీ ఇంట్లో మనిషి అయిన, కడప జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ కిడ్నాప్ అయ్యాడని, ఈ రోజు సాయంత్రం వార్తా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇదంతా మీడియాని డైవర్ట్ చెయ్యటానికి, మంగలి కృష్ణ అనుచరులు ఆడిన డ్రామా అని పోలీసులు తేల్చారు. ఇది అసలు జరిగిన విషయం.. కొద్ది రోజులుగా మంగళి కృష్ణ అనుచరులు హైదరాబాద్‌లోని ఒక వ్యాపారిని బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరంగం సృష్టించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలంటూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మంగళి కృష్ణ అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఆ వ్యాపారి ఇంట్లోకి చొరబడి కారు, వస్తువులు ధ్వంసం చేశారు.

krishna 081112018 2

దీంతో మంగళికృష్ణపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణపై దౌర్జన్యం, దాడి, భూకబ్జా ఆరోపణలపై పలు కేసులు ఉన్నాయి. దేశ, విదేశాల్లో నిర్మాణ వ్యాపారాలు నిర్వహించే దుర్గారావు, ఆయన కుమారుడు సుభాష్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి ఇంట్లో కొందరు చొరబడి కారు, అద్దాలు, లైట్లు ధ్వంసం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్‌ను గుర్తించారు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్, వీరబాబు, ప్రతాప్‌లతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు సమీర్ అంగీకరించాడు. పులివెందులకు చెందిన మంగళికృష్ణ ఆదేశాల మేరకు దాడి చేసినట్లు చెప్పాడు.

krishna 0811120183

వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని మంగళికృష్ణ కొంతకాలంగా బెదిరిస్తున్నాడని సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ ఫిర్యాదు మేరకు మంగళికృష్ణ, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సమీర్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఈనెల 5న అరెస్టు చేశారు. ఈ కేసులో మంగళికృష్ణ ఇవాళ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అనంతరం మంగళికృష్ణకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కృష్ణను కిడ్నాప్ చేశారంటూ అతని అనుచరులు కొంతసేపు హంగామా సృష్టించారు.

ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు.

lagadapati 09112018 2

సెర్చ్ వారెంట్ లేకుండా అర్ధరాత్రి వచ్చి పోలీసులు హడావడి చేస్తున్నారని, ఐపీఎస్ అధికారి నాగి రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని లగడపాటి అన్నారు. పోలీసుల తీరు పై గవర్నర్, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పాత కేసు పట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారెంట్ లేకుండా, అర్ధరాత్రి ఇళ్ళలో చొరబడి సోదాలు చేయమని చట్టం చెబుతోందా అంటూ పోలీసులని ప్రశ్నించారు. సివిల్ కేసుకు సబందించి విచారణకు వచ్చామంటూ పోలీసులు చెప్పటాన్ని, లగడపాటి తీవ్రంగా విభేదించారు.

lagadapati 09112018 3

ఎలాంటి వారెంట్ చూపించకుండా ఇంట్లోకి వచ్చిన పోలీసులతో లగడపాటి వాదనకు దిగారు. సెర్చ్ వారెంట్ ఉంటే చేసుకోండి, కానీ అర్ధరాత్రి పూట ఇళ్ళల్లో చొరబడి, ఫ్యామిలీలు ఉన్న చోట, పిల్లలు ఉన్న చోట, ఈ రాద్ధాంతం ఏంటి అని, ఎవరి ఆదేశాల ప్రకారం ఇలా చేస్తున్నారని లగడపాటి ప్రశ్నించారు. వెస్ట్ జోన్ డీసిపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు హడావిడి చేసారు. తెలంగాణాలో ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి, ఇలాంటి దాడులు ఎక్కువ అయిపోయాయి. ప్రత్యర్ధుల పై, కావాలని విరుచుకుపడుతూ, పాత కేసులు తిరగతోడి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పైన బీజేపీ, ఇక్కడ కేసీఆర్, ఇద్దరూ కలిసి, తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు, సానుభూతి పరుల పై, ప్రతి రోజు ఎదో ఒక హడావిడి చేసి, హంగామా చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read