కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలో విపక్షాల ఐక్యతకు మరింత ఊతం ఇవ్వనున్నాయి. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో- బళ్లారిని భాజపా నుంచి కాంగ్రెస్‌ కైవసం చేసుకొంది. మిగిలిన అన్ని స్థానాలను ఎవరివి వారు నిలబెట్టుకున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మెజార్టీల్లో భారీ తేడా రావడం విపక్షాల బలాన్ని చాటుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఇలాగే మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగా జయకేతనం ఎగరవేసి భాజపాను పెద్ద దెబ్బకొట్టాయి. బద్ధ శత్రువులైన బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఆ ఎన్నికల్లో కలిసి పోటీచేసి భాజపాను ఓడించడం దేశ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆగర్భ వైరాన్ని పక్కనపెట్టి కలవడం ద్వారా ఎంత పెద్ద శత్రువునైనా ఎదుర్కోవచ్చన్న ధైర్యాన్ని విపక్షాల్లో ఉప ఎన్నికలు నింపాయి.

cbn karnataka 08112018 2

కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లు ఏకమై రాష్ట్రంలో భాజపాను అధికారానికి దూరం చేయగలిగిన తర్వాత విపక్షాల ఏకీకరణ పై దేశవ్యాప్తంగా చర్చ విస్తృతమైంది. 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 312 సీట్లు గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలోని విపక్షాలన్నీ తమ పని అయిపోయిందని జావగారాయి. ఇక ప్రతిపక్షాలకు భవిష్యత్తు ఉండదేమోనన్న వాతావరణం అలుముకొంది. కానీ ఈ ఏడాది మార్చి 11న జరిగిన గోరఖ్‌పూర్‌, పూల్‌పుర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కలిసికట్టుగా ఎదుర్కొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిథ్యం వహించిన స్థానాలను కైవశం చేసుకోవడం సంచలనం రేపింది. ఆ రెండు ఎన్నికలు దేశంలో రాజకీయ పునరేకీకరణకు దారి చూపాయి. కైరానా ఉప ఎన్నిక మరింత బలాన్ని చేకూర్చగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు ఆ పంథా సరైనదేనని ధ్రువీకరించినట్లయింది.

cbn karnataka 08112018 3

దేశంలోని మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. తాజా ఫలితాలు ఆ ప్రయత్నాలకు మరింత ఊతాన్ని ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భావసారూప్య పార్టీలను కూడగట్టే పనిని చంద్రబాబునాయుడు మరింత మనోధైర్యంతో చేయడానికి వీలు కలిగిందని ఆ పార్టీ ఎంపీలు పేర్కొన్నారు. ఒకనాటి మిత్రపక్షమైన శివసేనతో ప్రస్తుతం భాజపాకు పొసగడం లేదు. బిహార్‌లో జేడీ(యూ)తో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ రాష్ట్రీయ లోక్‌ సమత, లోక్‌ జన్‌శక్తి పార్టీలతో ఇంకా లుకలుకలు నడుస్తున్నాయి. తగిన సీట్లు లభించకపోతే ఆ రెండు పార్టీలు బిహార్‌లో ప్రధాన పార్టీ అయిన ఆర్‌జేడీతో జట్టు కట్టడానికి వెనుకాడబోవన్న వాదన ఉంది. తాజా ఫలితాలతో 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్‌ బరిలో దిగడం దాదాపు ఖాయమే. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌తో, ఒడిశాలో బీజేడీతో కాంగ్రెస్‌కు అవగాహనపై ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేకపోయినా కర్ణాటక అనుభవంతో ఆ దిశగా కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేయబోతుందనేది స్పష్టం. అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పొత్తుల ఎత్తుల్లో మరింత స్పష్టత రానుంది. యూపీలో బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు విషయం డిసెంబరు 11 ఫలితాల తర్వాత ఖరారు కానుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 156 లోక్‌సభ స్థానాలున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి గారికి దేముడు ఇచ్చిన సోదరుడు, జగన్ పటాలానికి వేల కోట్లు తవ్వి పెట్టిన బీజేపీ 'గాలి' జనార్ధన రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని కర్ణాటక బీజేపీ అధినేత బీ ఎస్ యడ్యూరప్ప సెలవిచ్చారు. వేట కొనసాగుతున్నది బెంగళూరు పోలీస్ కమీషనర్ సునీల్ కుమార్ చెప్పారు. అంబిడెంట్ తరఫున ఈడీ తో బేరం కుదుర్చుకున్న 'గాలి'- ఆంధ్రాలో జగన్ కేసుల్లో కూడా ఈ డీ తో డీల్ కుదిర్చే ఉంటారన్న అనుమానాలు విస్తృత ప్రచారం లో ఉన్నాయి. అందుకే, జగన్ కేసుల్లో ఈడీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

gali 08112018 2

ఇది ఇలా ఉండగా, బళ్ళారి లోని 'గాలి' రాజప్రాసాదాలను అధికారులు గాలించారు. కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు లోని జగన్ రాజప్రాసాదం నేల మాళిగలో గాలివారు దాక్కుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గాలివారు దొరికితే తప్ప, అక్కడా...ఇక్కడా గాలి ఎంత బలంగా వీస్తున్నదనే విషయం బయటపడే అవకాశం లేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వచ్చిన ఆరోపణ నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

gali 08112018 3

ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కనిపించకుండాపోయిన గాలి ఆచూకీ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. గాలి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాలి జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండు రోజులు గడిచినా గాలి ఎక్కడుంది తెలియకపోవడంతో మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై కామెంట్లు చేయడంపై సెటైర్లు వేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... రోజా వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన... రోజా మహాతల్లి... నా మీద ఎందుకు మండి పడుతుందో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పారు. మళ్లీ సీఎం కావడానికి రాహుల్ ను కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని అన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉన్న బలం చాలని చెప్పారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం ఆరాటపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారని చెప్పారు.

roja 08112018 2

మహాకూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని అన్నారు. స్వామి ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టని, ఆయనతో తనకు రాజీ ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.

roja 08112018 3

దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైందని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ భాజపాకు భంగపాటు తప్పదని జేసీ పేర్కొన్నారు.

అంతర్జాతీయ వేడుకలకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఎఫ్‌1హెచ్‌2ఓ(పవర్‌ బోట్‌ రేస్‌) ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులు, పోటీల నిర్వాహకుల ప్రతినిధులతో సమావేశమైంది. దీనికి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. సమావేశానికి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ హాజరుకాలేదు. ఈ పోటీలను తిలకించేందుకు సుమారు లక్ష మందికిపైగా వస్తారు.

vij 08112018 2

దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, సీటింగ్‌, భద్రత, ఆతిథ్యం తదితరాల ఏర్పాట్లను ఉప సంఘం సమీక్షించింది. ప్రస్తుతానికి 50వేల మందికి సరిపడేలా సీటింగ్‌ ఏర్పాట్లుజరిగాయని, కనీసం మరో 50వేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సమావేశంలో నిర్ణయించారు. వీఐపీ, వీవీఐపీ పాస్‌ల జారీ బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. సమావేశానంతరం హోంమంత్రి చినరాజప్ప, కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రధానంగా పోటీలు జరగనున్న ప్రాంతాన్ని 12విభాగాలుగా విభజించి.. ఒక్కోదాంట్లో ఎవరెవరికి ఏ ఏర్పాట్లుచేయాలనేదీ ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

vij 08112018 3

మరో పక్క, విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు ‘అమరావతి ఎయిర్‌ షో’ నిర్వహించనున్నారు. 25న ప్రదర్శనకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ) సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రదర్శనకు ఆతిథ్యమివ్వనుంది. 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో యూకే బృందం, గ్లోబల్‌ స్టార్స్‌ బృందాలు విన్యాసాలు చేయనున్నాయి.రాష్ట్రంలోని వారసత్వ సంపద, ప్రముఖ పర్యాటక కేంద్రాల మీదుగా ‘టూర్‌ హెరిటేజ్‌’ పేరుతో సుదీర్ఘ సైకిల్‌ యాత్రను ఈ నెల 16న విజయవాడలో ప్రారంభించనున్నారు. అదే విధంగా, ఈ నెల 9న ‘వివిధ రంగాలపై సోషల్ మీడియా ప్రభావం’ అంశంపై విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ, సినీ నటి దివ్య స్పందన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. 10న నిర్వహించే బహుమతుల వేడుకకు బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హాజరవుతారని వెల్లడించింది.

Advertisements

Latest Articles

Most Read