ఆంధ్రలను నమ్మక ద్రోహం చేసిన మోడీ-షా ల పతనం, నిజంగా మనకు దీపావళే. అలాగే దేశంలో వ్యవస్థలను అన్నీ నాశనం చేస్తున్న మోడీ వైఖరితో విసుగు చెందిన, దేశ ప్రజల అందరికీ ఇది దీపావళి. కాంగ్రెస్ గెలిచినందుకు కాదు, మోడీ-షా కు చావు దెబ్బ తగిలినందుకు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక విషయానికి వస్తే, కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేస్తోంది. కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించారు. ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. అన్ని పార్టీలు ఏకం అయితే, మోడీ-షా రాజకీయానికి చావు దెబ్బే అని మరోసారి రుజువైంది.

bjp 06112018 2

మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం ఖరారైంది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు తయారైంది. బీజేపీకి చాలా బలమైన ఈ స్థానంలో, ఈసారి ఆ పార్టీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమఖండి అసెంబ్లీ స్థానంతో పాటు బళ్లారి లోక్‌సభ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బళ్లారిలో లక్ష ఓట్లు, జమఖండిలో 40 వేల ఓట్ల మేర కాంగ్రెస్‌ ముందంజలో దూసుకెళ్లింది. మరోవైపు మాండ్య లోక్‌సభ స్థానంలోనూ, రామానగరం అసెంబ్లీ స్థానంలోనూ జేడీఎస్ భారీ ఆధిక్యంతో విజయం ఖాయం చేసుకుంది. రామానగరంలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

bjp 06112018 3

మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామగౌడ సమీప భాజపా అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. మరో లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్ప పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు .తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రతికూలవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు వ్యాఖ్యానించారు. మరోసారి తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని, జేడీఎస్ చీప్ హెచ్‌డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అన్నారు.

 

జాతీయ స్థాయిలో మోడికి వ్యతిరేకంగా బలమైన కూటమిని నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ తరువాత చెన్నైకి వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు యత్నాలకు స్టాలిన్‌ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనతో చర్చల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ రెండు భేటీల కచ్చితమైన తేదీలు వచ్చే వారం ఖరారుకానున్నాయి.

cbn 06112018 2

తదుపరి జనవరిలో దిల్లీలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి భాజపాను వ్యతిరేకించే పార్టీల అగ్రనేతలంతా హాజరుకానున్నారు. డిసెంబరులోనే ఈ సమావేశం నిర్వహించాలని ముందుగా భావించినా, అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీల అగ్రనేతలు తీరికలేకుండా ఉండటంతో జనవరికి వాయిదాపడింది. ఆ భేటీ నాటికి భాజపాను వ్యతిరేకించే పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో తిరిగి వచ్చారు. ఆయనతోపాటు మంత్రులు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఉన్నారు.

cbn 06112018 3

విమాన ప్రయాణంలో వీరి మధ్య కొద్దిసేపు రాజకీయ చర్చలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తన భేటీ గురించి సీఎం మంత్రులకు వివరించారు. ఆ సమావేశం తరువాత భాజపా ఆత్మరక్షణ ధోరణిలో పడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏటా విశాఖపట్నంలో జనవరి చివరివారంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సును ఈసారి అదే సమయానికి నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో చర్చించారు. జనవరిలో దావోస్‌లో జరిగే సదస్సుతోపాటు రాజకీయంగా జాతీయ స్థాయిలో ముఖ్యమైన సమావేశాలుంటాయని సీఎం ప్రస్తావించారు. డిసెంబరులోగాని, ఫిబ్రవరిలోగాని నిర్వహిస్తే ఎలాగుంటుందన్న దానిపై కొద్దిసేపు చర్చించారు. ఎన్‌డీఏ నుంచి బయటికి రావటం, భాజపాపై రాజకీయంగా పోరాడుతున్న నేపథ్యంలో భాగస్వామ్య సదస్సుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండకపోవచ్చని భావించారు.

చంద్రబాబు గత వారం రోజులుగా కదుపుతున్న పావులకు, మోడీ-అమిత్ షా ఫ్యుజులు ఎగిరిపోతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వల్ల కానిది, చంద్రబాబు పూనుకుని, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలని, విపక్ష పార్టీలని ఒక్క తాటి పై తీసుకువస్తున్నారు. ముఖ్యంగా, మోడీ చేస్తున్న అప్రజాస్వామిక పనులు ఎదుర్కోవటానికి, ఏపి చేసిన అన్యాయం, తరువాత ఏపి పై పన్నిన కుట్రలు ఎదుర్కోవటానికి, చంద్రబాబు మోడీ పై యుద్ధం ప్రకటించారు. ఒక్క వారం రోజుల్లోనే, దాదాపుగా 15 పార్టీలను ఏకం చేసారు. ఇదే ఇప్పుడు మోడీ-షాలకు ఇబ్బందిగా మారింది. అందుకే, చంద్రబాబుని జాతీయ స్థాయిలో, విమర్శలు చేసే ప్లాన్ వేసారు. వివిధ రాష్ట్రాల బీజేపీ నేతల చేత చంద్రబాబుని తిట్టుస్తున్నారు.

modishah 05112018

ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా ఢీకొట్టలేని రాజకీయ పార్టీ నేతలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ అన్నారు. నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం మంచి పరిణామమని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ-చంద్రబాబు ఒక్కతాటిపైకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

modishah 05112018

ఈ నేపథ్యంలో వారిద్దరి పై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెయ్యిమంది చంద్రబాబులు, స్టాలిన్‌లు కలిసి వచ్చినా నరేంద్ర మోడీని ఎదుర్కోలేరని స్పష్టం చేశారు. ఆరోగ్యం, ఆర్థిక రంగాలతోపాటు అన్ని రంగాల్లోనూ భారతదేశాన్ని మోడీ ఉన్నతస్థాయికి తీసుకెళుతున్నారని చెప్పారు. 'మోడీ గొప్ప నాయకుడు. ఎంతమంది శత్రువులు ఏకమైన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మోడీ విజయాన్ని అడ్డుకోలేరు. ప్రజలకు ఆయనపై ఎంతో నమ్మకం ఉంది' అని సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. దీపావళి రోజున టపాసులను కాల్చడం అనేది సంప్రదాయంగా వస్తోందని, బాణాసంచా కాల్చకుండా దీపావళి జరుపుకోవడం కుదరని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాకి తిత్లీ లాంటి భయంకర తుఫాను వస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆ రోజు రాత్రి అంతా పడుకోకుండా, సమీక్ష చేసారు. ప్రాణ నష్టం జరగకుండా, జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాను వచ్చిన రోజు సాయంత్రమే, శ్రీకాకుళంలో వాలిపోయారు. దాదాపు 12 రోజులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంది. సెక్రటేరియట్ మొత్తం అక్కడ నుంచే పని చేసింది. సియం, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, సిబ్బంది, అందరూ అక్కడే ఉండి, అక్కడ బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామం తిరుగుతూ, వాళ్లకి తిండి పెట్టి, బట్టలు ఇచ్చి, రోడ్లు క్లియర్ చేసి, విద్యుత్ ఇచ్చి, నష్టపరిహారం రాసుకుని, అన్నీ పక్కాగా ఉన్న తరువాతే, అక్కడ నుంచి అమరావతి వచ్చారు.

pkk 05112018 2

ఇదే సమయంలో, ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం అడ్రస్ లేడు. ఇక కొత్తగా వచ్చిన హీరో గారు, స్పెషల్ ఫ్లైట్ లలో, కొత్తగా వచ్చిన ఫ్రెండ్ ని ఏసుకుని, రాష్ట్రమంతా తిరుగుతూ, తన కోతి మూకతో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి హడావిడి చేసారు. అసలు ఇప్పటి వరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదు అని బిల్డ్ అప్ ఇచ్చాడు. ఎదో పుస్తకంలో, వాళ్ళ సమస్యలు రాసుకుంటున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చి, బిర్యానీ, పార్సెల్, లక్ష అని రాసుకుని, అడ్డంగా దొరికిపోయి, ఎదో షో చేసి, అక్కడే రాజకీయ నాయకులని తన పార్టీలు చేర్చుకుని, మూడు రోజులు, రోజుకి రెండు గంటలు హడావిడి చేసి, హైదరాబాద్ చెక్కేసాడు.

pkk 05112018 3

అయితే ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులు, ఎన్ని విమర్శలు చేసినా, చంద్రబాబు మాత్రం, తన పని తాను చేసుకుంటూ, అక్కడ ప్రజలని ఆదుకునే విషయం ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఈ రోజు ఏకంగా 520 కోట్ల నష్టపరిహారం, శ్రీకాకుళం ప్రజలకు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, కేవలం 20 రోజుల్లోనే, సహాయక కార్యక్రమాలు పూర్తి చేసి, నష్టపరిహారం కూడా ఇచ్చారు. ఇలాంటి నష్టపరిహారాలు ఇవ్వాలి అంటే, కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది, చంద్రబాబు మాత్రం, 20 రోజుల్లోనే ఇచ్చారు. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలాంటి మంచి పని చేసినందుకు, ఎవరైనా చంద్రబాబుని ప్రశంసిస్తారు, కేంద్రం ఇవ్వనందుకు ప్రశ్నిస్తారు. కాని మన రాష్ట్రంలో ఉండే కోతి మూకకు మాత్రం, ఇవన్నీ కనిపించవు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, బాధితులకు ఇచ్చే చెక్కుల నమూనా మీద, చంద్రబాబు బొమ్మ ఉందని, ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు గొట్టు గాళ్ళకి, బాధితులకు సాయం అందుతుందని సంతోషం లేదు,ముఖ్యమంత్రి ఫోటో ఉందని ఏడుస్తున్నాడు...మరి ప్రతి రోజు మనం వదిలే సినిమా స్టిల్స్ ఏంటి పవన్ ? ఇలా ఉంది, మన రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలే నిర్ణయించాలి.

Advertisements

Latest Articles

Most Read