నిన్న పోలవరం ప్రాంతంలో, ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా కలకలం. మెటల్‌ రోడ్డు మెల్లమెల్లగా ఉబికి రావడం మొదలైంది. పైకి వస్తున్న నడిరోడ్డుపై చీలికలు,ఒకటీ రెండూ కాదు... అలా సుమారు ఆరు అడుగుల ఎత్తునా రోడ్డు ఉబికి వచ్చింది. రోడ్డు మొత్తం ఖండఖండాలుగా విడిపోయింది. అయితే, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి... ఈ ఘటన జరిగిన రోడ్డు చాలా దూరంగా ఉంటుంది. కడెమ్మ వంతెన వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టుకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ జరిగిన దానికి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అసలు సంబంధమే ఉండదు.

polavaram 04112018 2

అయితే, ఇలాంటి అవకాశాలు కోసం, పేలాలు ఏరుకునే బ్యాచ్ మన రాష్ట్రంలో ఎక్కువ కదా.. వెంటనే విష ప్రచారం మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ లో భూకంపం వచ్చిందని, నిర్మాణం సరిగ్గా చెయ్యటం లేదని, అందుకే ప్రాజెక్ట్ కూలిపోతుందని, చంద్రబాబు వారం వారం సమీక్ష చేసేది ఇదేనా అంటూ మొదలు పెట్టారు. పవన్ ట్వీట్లతో ఏడుస్తుంటే, ఇక మన జగన్ గారు, తమ అవినీతి ఛానెల్ లో ఒకటే ఏడుపు. ప్రాజెక్ట్ నిర్మాణానికి, దీనికి సంబంధం లేదు అని చెప్పినా, అదే ట్యూన్. అసలేం జరిగిందంటే... పోలవరం మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారి చాలా ఏళ్లుగా ఉంది. చిన్నగా ఉన్న రోడ్డును ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా వెడల్పు చేశారు. ప్రాజెక్టులో తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఈ రహదారిని ఆనుకునే, కొంచెం దిగువన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ మట్టితో మరో రహదారి నిర్మించింది.

polavaram 04112018 3

ఈ మట్టి రోడ్డుపై దాదాపు నిమిషానికొకటి వంద టన్నుల లోడ్‌తో ట్రక్కులు తిరుగుతున్నాయి. అతి భారీ యంత్రాలు తిరగడంతో మట్టి రోడ్డు ఒత్తిడికి గురై మెల్లమెల్లగా కుంగుతూ వచ్చింది. దీని ప్రభావం పక్కనే ఉన్న తారు రోడ్డుపై పడింది. లోలోపలే ఒత్తిడి పెరిగింది. అది తట్టుకోలేనంతగా పెరిగి శనివారం ఉదయం ువిస్ఫోటం్‌లా మారింది. మెల్లమెల్లగా ఉబుకుతూ రోడ్డు ముక్కలు ముక్కలుగా మారింది. ఇది భూకంపం కాదని, మట్టి రోడ్డుపై పడిన భారీ ఒత్తిడి వల్ల... పక్కనే ఉన్న తారు రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని ఇంజనీర్లు తెలిపారు. అయితే ఈ రోడ్ దెబ్బ తినటంతో, కేవలం గంట వ్యవధిలోని పోలీసు చెక్‌పోస్టుకు ఎదురుగా ఉన్న డంపింగ్‌యార్డు మీదుగా వాహనాల రాకపోకలకు శనివారం సాయంత్రానికి ర్యాంపు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అధికారులు, ఏజన్సీ వాసులు దానిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ నిన్న మధ్యాన్నం రెండు గంటల నుంచే, అంతా సాధారణ స్థితి నెలకుంది. ఇంత భారీ నిర్మాణం జరుగుతుంటే, చిన్న చిన్న సమస్యలు కూడా, పెద్దవిగా చూపిస్తూ, చంద్రబాబు మీద ఏడ్చే బ్యాచ్ మన రాష్ట్రంలో ఎక్కువ కాబట్టి, అన్నిటికీ వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి.

ఎప్పుడూ స్లో గేర్ లో ఉండే చంద్రబాబు, ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు. ఒక పక్క జాతీయ స్థాయిలో మోడీ, షా లకు చుక్కలు చూపిస్తూనే, రాష్ట్రంలో కోడి కత్తి పార్టీ, కోతి మూక పార్టీకి చెక్ పెడుతున్నారు. వీళ్ళనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా చంద్రబాబు ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన రెండు రోజుల పర్యటన శనివారం ముగిసింది. సాయంత్రం వరకూ పార్టీ సమీక్షలు జరిపారు. తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలవరకూ పార్టీ నేతలతో మాట్లాడారు. పనితీరు సరిగా లేని నాయకులను మందలించారు.

cbn 04112018 2

ఐక్యంగా పనిచేయాలని, పక్క నియోజకవర్గాలనూ పట్టించుకోవాలని హితవు పలికారు. కొందరు నాయకుల పేరు చెప్పకుండానే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే వారిని మార్చేస్తానని స్పష్టం చేశారు. నాయకుల పనితీరు మొత్తం నాకు తెలుసు. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అక్కడ ఉంచుతా అని అన్నారు. జిల్లాను పట్టించుకోవడం లేదంటూ మంత్రులకు చురకలంటించారు. ‘మంత్రి శిద్దా రాఘవరావు తన వర్గానికి ప్రాధాన్యమిస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నారాయణకు మొహమాటం ఎక్కువ.. ఈ ఇద్దరూ సీరియస్‌గా తీసుకోని కారణంగా జిల్లాలో విభేదాలు పెరుగుతున్నాయి’ అని అధినేత వ్యాఖ్యానించారు.

cbn 04112018 3

మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిని మందలించారు. ‘మీకు చాలాసార్లు చెప్పా, మారడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా అక్కడి ఎమ్మెల్యే స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లను మందలించారు. ‘ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన మహా నాయకులు అయిపోతున్నారా? ప్రధాని అయిన తర్వాత మోదీకి అహం పెరిగిందని స్పష్టమవుతోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందరినీ ఒకేలా చూడాలి. అహం చేరకూడదు. నేను ఒక్క ప్రకటన చేస్తే మీరు కింద కార్యకర్తల పక్కన కూర్చుంటారు’ అని హెచ్చరించారు. ఇకనైనా మారాలని, లేకుంటే తానే మారుస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

తెలుగు ప్రజలందరికీ నమస్కారములు... మోడీ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందాం..

మోడీ నియంతృత్వ విధానాల వల్ల నేడు దేశం విపత్కర పరిస్తితులను ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ కూనీ అవుతోంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటున్నది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. డీమానిటైజేషన్‌ వల్ల రెండు కోట్ల మందికి ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. సెక్యులరిజం ప్రమాదంలో పడింది. రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం హరిస్తోంది. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయలేదు. ప్రత్యేక హోదాను నిరాకరించింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను అణగదొక్కుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది.

తెలుగువారి హక్కుల పరిరక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సెక్యులర్‌ వ్యవస్థ సంరక్షణకోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నడుంబిగించారు. రెండు దఫాలు ఢిల్లీకి వెళ్లి మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించే జాతీయ, ప్రాంతాయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనతో తెలుగువారి ప్రతిష్ట దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. వైఎస్‌ఆర్‌ పార్టీ, జనసేన మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించకపోగా.. ఆ రెండు పార్టీలు తెలుగుదేశంపై చేస్తున్న దాడి మోడీ నియంతృత్వానికి వంతపాడటం కాదా.?

1. సేవ్‌ నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించారు. 2. మోడీ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని దేశంలోని ప్రధాన పక్షాలన్నీ స్వాగతిస్తుంటే.. వైసీపీ, జనసేన ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. మోడీతో వారి లాలూచీకి ఇది తాజా నిదర్శనం కాదా.? ఈ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టవా.? కేవలం వారి పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే ముఖ్యమా.? 3. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదు. పార్టీలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు, స్వలాభం కోసం పుట్టిన పార్టీలు, పుఘలో పుట్టి మఘలో మాయమయ్యాయి. విధానాలు, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీలు మాత్రమే సుధీర్ఘకాలం మనగలిగాయి. తెలుగుదేశంపై ఎన్నో దాడులు చేసినప్పటికీ గత 36ఏళ్ల నుంచి దినదినాభివృద్ధి చెందుతోందంటే కారణం.. తెలుగుదేశం విధానాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిందని రుజువవుతోంది.

4. తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సమగ్రాభివృద్ధి కోసం, కేంద్రం యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. నాడు తెలుగువారిని కేంద్ర ప్రభుత్వం వీపుమీద కొడితే.. నేడు మోడీ ప్రభుత్వం తెలుగువారి కడుపు కొడుతున్నది. 5. స్వర్గీయ ఎన్టీరామారావు గారి విధానాలను నేడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ.. మోడీ నియంతృత్వంపై పోరాడుతున్నారు. 6. కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమించటాన్ని.. ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందని బీజేపీ, వైసీపీ, జనసేన నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌లో అవినీతి చక్రవర్తి అయిన కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా పెట్టుకున్న బీజేపీ.. తెలుగుదేశానికి నీతి బోధ చేయటం హాస్యాస్పదం. ఎన్టీఆర్‌ను హింసించి అవమాన పరిచిన వైఎస్‌ కుమారుడి పార్టీలో లక్ష్మీపార్వతి చేరడం వల్ల ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోంది. 7. పురందేశ్వరిగారు కాంగ్రెస్‌ పార్టీలో చేరినపుడు ఎన్టీఆర్‌ ఆత్మక్షోభించలేదా.? కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న పురందేశ్వరిని బీజేపీలో చేర్చుకున్నపుడు ఎన్టీఆర్‌ ఆత్మగుర్తుకు రాలేదా.?

8. దేశరక్షణ వ్యవస్థతో సహా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. న్యాయవ్యవస్థల్లోను రాజకీయ జోక్యం చేసుకున్నారు. మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 9. ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని క్యాబినేట్‌ మంత్రులే మనీ లాండరింగ్‌ అన్నారు. డిమానిటైజేషన్‌తో వందలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. అస్తవ్యస్థమైన జీయస్‌టీతో వేలాది కంపెనీలు మూతబడి లక్షలాది యువత ఉపాధికి గండి కొట్టారు. 10. కర్నాటక ఎన్నికల్లో గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఢిల్లీలో గవర్నర్‌ జనరల్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరును కోర్టు తప్పుపట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో చూశాం.

11. సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల్లో అవినీతి లొసుగులున్న నాయకులతో అనైతిక పొత్తు పెట్టుకొని రాజకీయంగా లబ్దిపొందేందుకు బీజేపీ వెంపర్లాడుతుంది. 12. కేంద్రంలోని బీజేపీకి న్యాయస్థానాలంటే లెక్కలేదు. ఎన్నికల కమిషన్‌ అంటే గౌరవం లేదు. అవినీతిని పెంచి పోషిస్తున్నారు. 13. విదేశాల్లో దాకున్న ధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు. ఆ పని చేయకపోగా.. బ్యాంకులకు టోకరా పెట్టిన వ్యక్తులకు అండగా నిలిచి విదేశాలకు పంపిస్తున్నారు. 14. రాఫెల్‌ డీల్‌లో కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులే చెప్పారు. పేదవారికి అండగా నిలవాల్సిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవస్థలను పెంచి పోషిస్తోంది. 15. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి 15 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకోవటాన్ని దేశ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు.

మోదీ చెప్పిన అచ్చేదిన్‌ బీజేపీ నాయకులకు, బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకుని పారిపోయిన అవినీతి పరులకు తప్ప ప్రజలకు రాలేదు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువస్తున్నారు. మోడీ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని రక్షించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. లౌకిక వ్యవస్థను నిలబెట్టుకుందాం. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకుందాం. దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం.

దాదపుగా సంవత్సర కాలంగా, అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతికి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ రానుందని సమాచారం. సినిమాలు, సీరియళ్లు, మ్యూజిక్‌ తదితర రంగాల్లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అగ్రగామిగా ఉంది. మన దేశంలో ముంబై కేంద్రంగా సినిమాలు, సీరియళ్లను నిర్మిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సోనీ అంటే ఒక బ్రాండ్‌. అంత పెద్ద బ్రాండ్‌ రాష్ట్రానికి వస్తే అది గేమ్‌ చేంజర్‌గా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

sony 04112018 2

ఎప్పటి నుంచో ఈ సంస్థను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నెలలోనే మరోసారి ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈసారి ఏదో ఒక ఒప్పందం జరిగే దిశగా చర్చలు ఉంటాయని తెలుస్తోంది. అమరావతిలో ఒక స్టూడియో నిర్మిస్తే, దానికి పూర్తి సహకారం అందించేందుకు సోనీ ఆసక్తి కనబరుస్తోంది. సాంకేతికంగా, వ్యాపారపరంగా అవకాశాలను తీసుకొచ్చేందుకు సహకరిస్తానంటోంది. ముంబై స్టూడియోల్లో తమ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు, సీరియళ్లను కూడా ఇక్కడికే తీసుకొస్తామంటోంది.

sony 04112018 3

సోనీ లాంటి సంస్థ వ్యాపార అవకాశాలు ఇచ్చేందుకు, సాంకేతిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే...స్టూడియో నిర్మాణం తాము చేపడతామని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు ముందుకొస్తున్నట్లు తెలిసింది. మరో పక్క గన్నవరం మేథాటవర్స్‌లో ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ర్టీట్‌ నెలరోజుల్లోనే విస్తరణకు సిద్ధమైంది. ప్రారంభ సమయంలో సుమారు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా త్వరలోనే అది విస్తరణ బాటకు సిద్ధమైంది. మరో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతామని ప్రభుత్వానికి మాటిచ్చింది.

Advertisements

Latest Articles

Most Read