ప్రముఖ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ గా‌ బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. ‘సీబీఐ ఇప్పుడు అతి తెలివి బీబీఐ (భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) గా మారిపోయింది. చాలా దురదృష్టకరం’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

cbi 24102018 1

సీబీఐ కార్యాలయాల వేదికగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారి పై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? ఆయన సర్కారు ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ప్రశ్నించారు. ‘అలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడానికి రఫేల్‌ ఒప్పందానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆయన రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపే యోచనలో ఉన్నారా? మోదీకి ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటి?’ అని ఆయన మరో ట్వీట్‌లో నిలదీశారు.

cbi 24102018 1

ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ.. కేంద్ర ప్రభుత్వ చర్య చట్టానికి వ్యతిరేకమని, తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి వాటికి పాల్పడుతోందని మరోసారి ఆరోపించారు. ‘తమకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన ఓ సీబీఐ అధికారిని రక్షించేందుకే.. మరో సీబీఐ అధికారిని మోదీ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా తొలగించింది. భాజపా అగ్ర నేతలతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధాలను కప్పిపుచ్చడానికే ఈ విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆయన ఆరోపణలు చేశారు. అవినీతిపరుల ఇళ్ల పై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. తాను మునగడమే కాదు.. దేశ అత్యున్నత గూఢచార సంస్థ రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కూడా తనతోపాటు కట్టగట్టి లంచాల పంకిలంలో నిలువునా ముంచింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలన్నీ విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకున్నాయి.

సీబీఐలో తలెత్తిన అంతర్యుర్ధం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో తనను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ డెరెక్టర్ అలోక్‌ వర్మ బుధవారంనాడు సవాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వర్మ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈనెల 26న ఆయన పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను తొలగించడంపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పదవి కాలం ముగియకుండానే సస్పెండ్ చేయడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

cbi 24102018 1

ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అలోక్ వర్మ పిటిషన్‌ను స్వీకరించింది. బుధవారం ఉదయం అలోక్ వర్మ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించడానికి అంగీకరించింది. అలోక్ వర్మ పదవీకాలం ఇంకో రెండు నెలలు ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం మధ్యలో తొలగించడానికి వీల్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, తన క్లయింట్‌‌ను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను సెలవుపై వెళ్లాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించడం వల్ల అనేక సున్నితమైన కేసుల విచారణ విషయంలో రాజీపడే అవకాశాలుంటాయని వర్మ తరఫు హాజరైన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టు విన్నవించారు.

cbi 24102018 1

మరోవైపు, తాత్కాలిక సీబీఐ డెరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడంతో ఆయన నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో ఆయన అలోక్ వర్మ పనులన్నీ స్యయంగా చూసుకుంటారు. సీబీఐ తనపై పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆస్థానా ఆశ్రయించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు సైతం తదుపరి విచారణ తేదీ (ఈనెల 29) వరకూ ఆస్థానాపై ఎలాంటి చర్య తీసుకోరాదని ఆదేశించింది. కాగా అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరినీ ప్రభుత్వం సెలవులపై పంపిన విషయం తెలిసిందే.

వచ్చేనెల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (66).. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన తన భార్య వీణా సింగ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, భాజపా ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జీ అనిల్‌ జైన్, ఇతర పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌ వద్దకు వెళ్లారు. అయితే, నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన.. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ (46) కాళ్లను మొక్కారు. రాజకీయ రంగంలోనూ ఆయన కన్నా రమణ్‌ సింగ్‌ చాలా సీనియర్‌. 2003 నుంచి ఆయన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఉంటోన్న విషయం తెలిసిందే.

up 24102018 2

ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1970లో భారతీయ జన సంఘ్‌లో చేరారు. అనంతరం 1976-77 కాలంలో ఆ పార్టీ యువ విభాగ అధ్యక్షుడయ్యారు. మరోవైపు, యోగి ఆదిత్యనాథ్‌ 1972లో జన్మించారు. ‌ ‌కాగా, రాజ్‌నందగావ్ నుంచి రమణ్‌ సింగ్‌ ఇప్పటికి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మేనకోడలు కరుణా శుక్లాను పోటీకి దింపనుంది.

up 24102018 3

నామినేషన్‌ వేసిన అనంతరం రమణ్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి భాజపాను రాష్ట్రంలో నాలుగోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, ఆ రాష్ట్రంలో నవంబరు 12న జరగనున్న మొదటి దశ ఎన్నికలకుగానూ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజే చివరిరోజు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు నవంబరు 20న జరుగుతాయి. ఈ ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.

రెండు రోజుల క్రితం బెజవాడలో బీజేపీ నేతలు, ఆగ్రిగోల్ద్ పేరుతొ చేసిన హడావిడి చూసాం. అందులో అన్నీ అవాస్తవాలు మాట్లాడుతూ, అందరినీ తప్పుదోవ పట్టించారు. ఒక పక్క కోర్ట్ లో కేసు ఉన్నా, అన్నీ అబద్ధాలు చెప్పారు. దీంతో, ఈ కేసు విచారణ చేస్తున్న సిఐడి స్పందించింది. అగ్రిగోల్డ్‌ మోసాలపై అయిదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. అగ్రిగోల్డ్‌పై వస్తున్న ఆరోపణలకు, దర్యాప్తునకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్థ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణల పై మాట్లాడుతూ విమర్శించే వారికి ఆధారం ఉండాలని, సబ్‌రిజిస్ట్రార్‌ విలువ ప్రకారమే ఆస్తులను చూపామని వివరించారు.

cid 24102018 2

అంతా నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ సంస్థ మోసాలపై నమోదైన 14 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశాం. మరో కేసులో వారంలో అభియోగపత్రం దాఖలు చేస్తాం. ఈ సంస్థపై ఐదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బాధితుల వివరాల సేకరణ పూర్తయింది. తెలంగాణ, కర్ణాటకల్లో ఇలా జరగలేదు. న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సాగుతున్నందున విభాగం పనితీరు, దర్యాప్తుపై ఆరోపణలకు ఆస్కారం లేదు. మేము వేసిన అభియోగపత్రాలు, ఆస్తుల అటాచ్‌మెంట్లే విమర్శలకు సమాధానం. నిందితుల్లో బెంగళూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు.

cid 24102018 3

జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించేందుకు 366 ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టుకు సమర్పించామని, త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేయగా రూ.47.42కోట్లు వచ్చిందని తెలిపారు. మృతి చెందిన అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు రూ.7కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. సీబీఐ విచారణ కావాలని కొందరు కోరారని, సీఐడీ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని వివరించారు. జైల్లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారని, మిగతా వారికి బెయిల్‌ వచ్చిందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read