పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, గతంలో జగన్ బావ బ్రదర్ అనిల్ తో, రాంగోపాల్ వర్మ, పార్క్ హయత్ హోటల్ లో చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే... అయితే ఎందుకో కాని, అప్పట్లో ఆ సినిమాను పక్కన పెట్టేసిన వర్మ, ఇప్పుడు మళ్ళీ పక్కన లక్ష్మీ పార్వతిని వేసుకుని, తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. ఈ రోజు సినిమాని మొదలు పెడుతున్నా అంటూ హడావిడి చేస్తున్నారు.

ycp 19102018 2

అయితే జగన్ పార్టీ, ఈ సినిమాకు బహిరంగంగా మద్దతు తెలుపుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా తిరుపతిలోని శిల్పారామం వద్ద వైసీపీ పోస్టర్లు వెలిశాయి. సినిమా ముహూర్తం షాట్‌కు ఆహ్వానిస్తూ వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు. రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందం శ్రీవారిని దర్శించుకున్నారు.

ycp 19102018 3

అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా ఇప్పుడు తిరుపతి నగరంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైసీపీ అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా ఉన్నారు. మామూలుగా వర్మ ఎవరితో సమావేశమయ్యారనేది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు వర్మ హాట్ టాపిక్. తెలుగువారి కీర్తి పతాకను ఎగురవేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ భాగాన్ని తెరమీదకు ఎక్కిస్తానని ఓ పోస్టర్ విడుదల చేసి వర్మ హాడావిడి చేశారు. ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టేశారు. వైసీపీ నేతను నిర్మాతగా ప్రకటించారు.

ఈ దేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారి పై ఐటి దాడులు జరుగుతున్న సీజన్ ఇది. రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు మీడియా సంస్థల పై కూడా ఐటి పంజా విసిరింది. మొన్న, మీడియా టైకూన్‌, క్వింట్‌ న్యూస్‌ పోర్టల్‌, నెట్‌వర్క్‌18 వ్యవస్థాపకుడు రాఘవ్‌ బహ్ల్‌ పై ఐటి దాడులు చేపించిన కేంద్రం, ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ పై ఈడీ దాడులు చేపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు అందుకున్న కారణంగా చూపి ఎన్డీటీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి.. రూ.1637 కోట్లు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిందని.. అలాగే విదేశాల్లో రూ.2732 కోట్లు పెట్టుబడి పెట్టిందని నోటీసులో ఈడీ పేర్కొంది.

ed 19102018 2

ఎఫ్‌డీఐలు రూ.600 కోట్లు మించితే సీసీఈఏ అనుమతి తప్పనిసరి.. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రూ.725 కోట్లు ఎన్డీటీవీ తీసుకున్నట్టు సమాచారం. వీటితోపాటు మరికొన్ని అవకతవకలు ఉన్నట్లు గుర్తించడంతో ఫెమా కింద పలువురు వ్యక్తులతోపాటు కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. మరో పక్క, ఎన్డీటీవీ పై రిలయన్స్ గ్రూప్ యాజమాన్యం రూ.10,000 కోట్ల దావా వేసింది. రఫేల్ జెట్ ఫైటర్స్ డీల్ పై ఎన్డీటీవీ ప్రసారం చేసిన వార్తల్లో నిజం లేదని అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ వాదిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ అహ్మదాబాద్ కోర్టులో దావా వేశారు.

ed 19102018 3

తాము ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయలేదని ఎన్డీటీవీ చెబుతోంది. మీడియాను తొక్కిపెట్టేందుకే రిలయన్స్ దావా వేసిందని ఎన్డీటీవీ చెబుతోంది. ప్రజలకు ఆసక్తికర వార్తలు ఇవ్వటమే తమ విధి అంటోంది. ప్రస్తుతం రఫేల్ డీల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే... ఇది కేవలం తమపైనే కాదు మొత్తం మీడియాను భయపెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ ఈ విధంగా చేస్తోందని ఎన్డీటీవీ పేర్కొంది. నిజాలు నిర్భయంగా చెప్పటానికి తాము భయపడమని వ్యాఖ్యానించింది.

ద‌ళారీల్లేరు. పైర‌వీలు అస‌లే లేవు. సిఫార‌సులు ఊసే లేదు. లంచం మాటే లేదు. అంతా ఆన్‌లైన్‌. అందుకే ల‌క్ష్యం ల‌క్ష‌లు దాటింది. 3 ల‌క్ష‌ల మందికి పైగా ముఖ్య‌మంత్రి యువ‌నేస్తాల‌య్యారు. వీరంతా నిరుద్యోగ‌భృతి అందుకుంటూనే, వివిధ రంగాల‌లో నైపుణ్యం సాధించి..ఉద్యోగులై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో కీల‌క భాగ‌స్వాములు కానున్నారు. ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కం అమ‌లుకు కోసం మంత్రి నారా లోకేష్ రూపొందించిన అత్యంత ప‌క‌డ్బందీ పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ ఇస్తున్న స‌త్ఫ‌లితాలు ఇవి. ప‌థ‌కం ప్రారంభించిన 36 రోజుల్లో 3 ల‌క్ష‌ల 20 మందికి పైగా యువ‌త ఈ ప‌థ‌కానికి ఎంపిక‌య్యారు. ఇది దేశంలో ఏ రాష్ట్రమూ సాధించ‌ని రికార్డు. ఇప్ప‌టివ‌ర‌కూ అర్హుల సంఖ్య 3 లక్షల 20 మందిగా న‌మోద‌య్యారు. ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కం వెబ్‌సైట్‌ని 5 వారాల‌ క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆవిష్క‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కూ 3 లక్ష‌ల 20 మంది యువ‌త ప‌థ‌కానికి అర్హ‌త సాధించారు. స్వచ్ఛందంగా భృతి వదులుకున్న వారు 10,378 కాగా..వీరుకూడా పొర‌పాటున ఈ ఆప్ష‌న్ ఎంచుకున్నారేమోన‌ని 1100 నుంచి ఫోన్ చేసి ఆరాతీసి..పొర‌పాటున అని చెబితే వారినీ అర్హుల జాబితాకు మార్చుతున్నారు.

వివిధ స‌మ‌స్య‌ల‌పై ద‌ర‌ఖాస్తుదారుల నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఫిర్యాదుల్లో 1,24,324 ప‌రిష్క‌రించ‌గా, 35,767 పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా అతిత్వ‌ర‌లో ప‌రిష్క‌రించి వారికి భృతిని అంద‌జేయ‌నున్నారు. ఇప్పటి వరకూ 1,70,413 మంది ఖాతాల్లో నిరుద్యోగ‌భృతి జ‌మ అయ్యింది. వీరంద‌రికీ న‌వంబ‌ర్ 1 నుంచి భృతి ఖాతాల‌కు నేరుగా జ‌మ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువు లేదు.యువ‌నేస్తం ప‌థ‌కానికి ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి గ‌డువు లేదు. అయితే ప్ర‌తీనెలా 25వ తేదీ మాత్రం ఆ నెల‌కు సంబంధించిన ల‌బ్ధిదారుల ఎంపిక‌కు క‌టాఫ్‌గా నిర్ణ‌యించారు. అలా చేయ‌డం వ‌ల్ల 25వ తేదీలోగా వ‌చ్చేఅర్హుల‌కు త‌రువాతి నెల 1వ తేదీ నుంచి భృతి నేరుగా ఖాతాలో జ‌మ‌చేయ‌నున్నారు. అంత‌కుమించి ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసే చివ‌రి తేదీ అంటూ ఏదీ లేద‌ని ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి యువ‌నేస్తం ప‌థ‌కం ప్రారంభానికి ముందే యువత చాల సులభంగా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే విధంగా వెబ్‌సైట్‌ని రూపొందించారు.

వెబ్‌సైట్ లాంచ్ అయిన త‌రువాత‌..భూమి నిబంధ‌న‌, పాత పీఎఫ్ అక్కౌంట్లు క‌లిగి ఉండ‌టం,బ్యాంకు అక్కౌంట్లు మ‌నుగ‌డ‌లో లేక‌పోవ‌డం, డిగ్రీల స‌ర్టిఫికెట్ల‌ను త్వ‌ర‌గా నిర్ధారించ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి.వీటినీ ప‌రిష్క‌రించారు. స‌మ‌స్య ఏదైనా ప‌రిష్కారమే ల‌క్ష్యంగా ప‌థ‌కాన్ని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ..ఇత‌ర రాష్ట్రాలకు ఆద‌ర్శంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిలుస్తోంది. ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కానికి ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో అర్హులలో అత్య‌ధిక‌శాతం పురుషులే ఉండ‌టంతో..మ‌హిళ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. నిరుద్యోగ‌భృతి అంటే నెల‌నెలా రూ.1000 చెల్లింపు ఒక్క‌టే కాద‌ని, నైపుణ్యశిక్ష‌ణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్ద‌డం కూడా ఇందులో భాగమ‌నే విష‌యంపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌నున్నారు. దీనికోసం సాధికారమిత్ర‌లు ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయ‌నున్నారు.అలాగే దరఖాస్తు చేసుకునేందుకు సహకారం ఇవ్వనున్నారు.

బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ఆ నాలుగు పార్టీలు టీడీపీనే టార్గెట్ చేశాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నారని అన్నారు. తితలీతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క బీజేపీ నేత పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. పైగా పక్క రాష్ట్రం తాజా మాజీ మంత్రి కేటీఆర్.. పవన్‌కల్యాణ్‌ను అభినందించారని, రాజమండ్రిలో కవాతు బాగా చేసి, చంద్రబాబుని బాగా తిట్టారని ప్రశంసించారని, ఇదేమి రాజకీయం అని అన్నారు.

ktr 19102018 2

మరో పక్క జనసేన కవాతు, టీవీల్లో లైవ్ వెయ్యాలి అంటూ, రాం మాధవ్ ఫోన్లు కూడా చేసారని, టిడిపి నాయకులు చెప్పటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. వీళ్ళందరూ కలిసి, ఏం సాధిస్తారు ? మన పై ఇంత కక్ష చూపించే బదులు, ప్రజలకు చెయ్యాల్సినవి చెయ్యచ్చు కదా, ఎక్కడ కేటీఆర్, ఎక్కడ రాం మాధవ్, ఎక్కడ పవన్, అందరూ కలిసి మన పై దాడి చేస్తున్నారని అన్నారు. తితలీ తుఫానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదన్నారు. వీళ్లంతా కలిసి పని చేస్తున్నారని చెప్పడానికి ఇవే రుజువులు అని పేర్కొన్నారు.

ktr 19102018 3

బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీలు టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయని.. అదంతా మనకే లాభమని వివరించారు. వాళ్లే తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలన్నారు. ప్రజాభిమానమే తెలుగుదేశానికి నైతిక బలంగా అభివర్ణించారు. ఇందుకోసం తానొక్కడినే కష్టపడితో కుదరదని, పార్టీ మొత్తం కష్టపడితే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి బాగా పెరుగుతుందని సూచించారు. తితలీ బాధితులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాభిమానం ప్రభుత్వంపై ఉందన్నారు. అది ఓర్వలేకే ప్రత్యర్థి పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని తెలిపారు. ప్రజలకు మనలను దూరం చేయాలని విపక్షాలు కుట్రలు చేస్తుంటే.. ప్రజలు మనస్ఫూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.

Advertisements

Latest Articles

Most Read