భయంకర తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తక్షణమే స్పందించి రూ.1200 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. అలాగే బాధితులను ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు కోరారు. సీఎం పిలుపుతో స్పందించి నటుడు సంపూర్ణేష్ బాబు ముందుకొచ్చారు. సినీ పరిశ్రమ నుంచి మొదటిగా ఆయనే రూ.50 వేలు సాయం అందించారు.

lokesh 161021018 2

ఆ తరవాత విజయ్ దేవరకొండ తన వంతుగా రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ ముందుకొచ్చారు. వీరంతా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు సాయాన్ని అందించారు. ఎన్టీఆర్ అత్యధికంగా రూ.15 లక్షలు ప్రకటించారు. కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు ఇచ్చారు. మరో పక్క మంచు మనోజ్, హీరో నిఖిల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, కోన వెంకట్ కూడా సహాయం చేసారు. తుఫాను బాధితుల్ని ఆదుకోవటానికి వచ్చిన వీరందిరినీ పేరు పేరునా, లోకేష్ ట్విట్టర్ లో ధన్యవాదాలు చెప్పారు. ఇంత కష్ట కాలంలో ఆదుకున్నందుకు, ఏపి ప్రజల తరుపున ధన్యవాదాలు చెప్పారు.

lokesh 161021018 3

కాగా, తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు పరిహారం అందజేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీడిమామిడికి హెక్టారుకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు. అలాగే కూలిపోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1200 ఇవ్వనున్నారు. బోటు కోల్పోయిన మత్స్యకారులకు రూ.2లక్షలు పరిహారం, పూర్తిగా ధ్వంసమైన మోటారు బోట్లకు రూ. 6 లక్షలు అందిస్తున్నారు. ఆక్వా కల్చర్‌కు రూ.30వేలు పరిహారం.. పశువుల శాలల నిర్మాణానికి రూ. లక్ష ఇస్తున్నారు. ధ్వంసమైన ఇళ్లకు రూ. 10 వేలు పరిహారంగా చెల్లిస్తున్నారు. ఇక పూర్తిగా ఇల్లు ధ్వంసమైతే.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు విలువచేసే కొత్త ఇంటిని నిర్మించి ఇస్తారు.

తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతులకు, బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటించారు. తుఫాను, వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం. బాధితులకు తక్షణమే 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటర్‌ పామెలిన్‌ ఆయిల్‌, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లి, అరకిలో పంచదార! మత్స్యకారులకు నిత్యావసరాలతోపాటు 50 కేజీల బియ్యం. తుఫాను, గాలి బీభత్సానికి దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం. అరటికి హెక్టారుకు రూ.30 వేలు, కొబ్బరితోటలు హెక్టారుకు రూ.40వేలు నష్ట పరిహారం. ఒక్కో కొబ్బరిచెట్టుకు రూ.1200 చెల్లింపు. చెట్లను తొలగించే బాధ్యత ఉద్యానవన శాఖ, ఫైర్‌ సర్వీసు విభాగానికి అప్పగింత.

cyclone 15102018 2

జీడిమామిడికి పంట నష్టం కింద హెక్టారుకు రూ.25వేలు చెల్లింపు. కొత్తగా మొక్కలు నాటి, మూడేళ్లపాటు నిర్వహించేందుకు హెక్టారుకు రూ.40వేలు! కొబ్బరి, జీడిమామిడి సాగుచేస్తున్న పెద్ద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ వర్తింపు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు రూ. లక్ష. కొత్త బోట్లు, వలలపై 50% సబ్సిడీ. వలలు కోల్పోయున వారికి రూ.10వేలు. మరబోట్లు కోల్పోయిన వారికి రూ.6 లక్షలు పరిహారం. ఆక్వా రైతులకు హెక్టారుకు రూ.30వేలు పరిహారం.
చనిపోయిన, వైకల్యం పాలయిన గేదెలు, ఆవులకు రూ.30 వేలు చొప్పున... మేకలు, గొర్రెలు మరణిస్తే ఒక్కోదానికి రూ.3 వేలు చొప్పున పరిహారం. పశువుల పాకలు దెబ్బతింటే రూ.10 వేలు, కొత్తగా నిర్మించుకునేందుకు ఉపాధి హామీ కింద రూ.లక్ష. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు చెల్లించాలి. పూర్తిగా ధ్వంసమైతే రూ.లక్షన్నర పరిహారం లేదా అంతకుపైన నష్టం జరిగి ఉంటే ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం కింద కొత్త ఇల్లు మంజూరు.

cyclone 15102018 3

ఈ హామీలు, ఆదేశాలను తక్షణమే అమలు చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కోరారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనలకన్నా పరిహారం కాస్త ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం హామీల అమలుకు విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర విపత్తు స్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) విడుదల, మార్గదర్శకాలకు ప్రత్యేక ఉత్తర్వులు తాజాగా జారీ చేయాల్సి ఉంది. అదే సమయంలో కేంద్ర విపత్తు సహాయ నిధి(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి కూడా నిధులు కోరాల్సి ఉంది. మన్మోహన్‌సింగ్‌ సోమవారం సచివాలయంలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఆండ్రగూడ వద్ద నాలుగు రోజుల కిందట పోలీసుల కాల్పుల్లో తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మీనా అలియాస్ ప్రమీల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆండ్రగూడ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపును విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా హతమార్చారని పేర్కొన్నారు.

maoist 15102018 2

మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు. ఏవోబీలోని ఆండ్రపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లోని గిరిజనులను భద్రతా దళాలు చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని కైలాసం ధ్వజమెత్తారు. కటాఫ్‌ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దురాగతాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చుట్టరికం కోసం వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని బంధుమిత్రుల సంఘం ఆరోపించింది.

maoist 15102018 3

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల తర్వాత ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు పోలీసులు. బెజ్జింకి ప్రాంతంలోని అడవుల్లో తమకు తారసపడ్డ నక్సల్స్‌పై కాల్పులు జరపడంతో మీనా చనిపోయింది. మీనా మృతికి సంతాపం తెలుపుతూ.. ఇప్పుడు కైలాసం పేరుతో ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య తర్వాత దీనికి కారణాలపై ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయని మావోయిస్టులు.. మీనా ఎన్‌కౌంటర్‌పై ఆడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

ఉదయం టీవీల్లో స్క్రోలింగ్ చూసాం.. 10 వేల మంది కంటే ఎక్కువ వస్తే బ్యారేజికి ఇబ్బంది, వేరే చోటు చూసుకోండి అని పోలీసులు నోటీసు ఇస్తే, పవన్ సొంత ఛానల్, పవన్ ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కబద్దార్ పోలీస్ అంటూ, ఒక్కొక్క పిల్లోడి తోక ఊపుడులు చూసాం.. కట్ చేస్తే, పవన్ కవాతు అని చెప్పి, కారులో వెళ్ళిపోయాడు. ఇదేంటి అండి కవాతు అని చెప్పి, పాపం అంత మంది ఫాన్స్ ని నడిపిస్తున్నాడు, మరి పవన్ ఎందుకు నడవకుండా కారులో వెళ్ళిపోతున్నాడు. రిసార్ట్ దీక్ష లాగా, ఇప్పుడు కారులో కవాతు చేస్తున్నారా అని విమర్శలు రాగానే, ఇక్కడ మాత్రం పోలీసులు చెప్పారని, పవన్ బుద్ధిగా పాటించారని సమర్ధించుకున్నారు. సరే, ఇది వదిలేద్దాం. ఇక గాల్లో పిడి గుద్దులు గుద్డుతూ పవన్ సాధించింది ఏంటి ?

kavathu 115102018 2

కవాతు అంటూ హడావిడి చెసి, దానికి త్రివిక్రమ్ చేత డైలాగులు రాపించారు, రామ జోగయ్య శాస్త్రి చేత పాటలు రాపించారు, తమన్ మ్యూజిక్ ఇచ్చాడు, టీజర్ అన్నాడు, ట్రైలర్ అన్నాడు, ఇవన్నీ ట్విట్టర్ లో పవనే పోస్ట్ చేసాడు, చివరకు సినిమా వచ్చే సరికి, మరో అజ్ఞాతవాసి చేసి చూపించాడు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. పవన్ కి ప్రస్తుతం ముగ్గురు టార్గెట్. మూడు బాగా అచ్చు వచ్చే నెంబర్ అనుకుంటా, అందుకే చంద్రబాబు, లోకేష్, చింతమనేని అనే పేర్లు తప్ప, వేరే పేరులే ఆ నోట్లో నుంచి రావటం లేదు. ఇప్పటి వరకు తిట్టినట్టే వీళ్ళను తిట్టాడు. ఇక ఎన్నో జ్ఞాన గుళికలు కూడా వదిలాడు. పంచాయతీ రాజ్ మంత్రి కావాలి అంటే, పంచాయతీలో గెలవకుండా ఎలా అన్నాడు ? మరి నువ్వు ఇప్పటి వరకు ఏం గెలిచావ్ అంటే సమాధానం ఉందా పవన్ ?

kavathu 115102018 3

ఒక కానిస్టేబుల్‌ కొడుకు సీఎం కాలేడా? అని పవన్ అడుగుతున్నాడు. టీ అమ్మే వాడు ప్రధాని అయ్యారు పవన్ గారు, దానికి చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి, శ్రీకాకుళం ఆపదలో ఉంటే, సంబరాలు చేసుకుంటున్న మిమ్మల్ని, సియం ఎలా చేస్తారు ? మీ అన్న కూడా ఇవే డైలాగ్ లు చెప్పి, అమ్మేశాడు. ఇప్పుడు మీరు. ఇవన్నీ సరే, నక్సల్స్ ని సమర్ధిస్తూ, ఒక ఎమ్మల్యే, ఒక మాజీ ఎమ్మల్యే హత్యలను సమర్ధిస్తున్న నువ్వు, ఏం సందేశం ఇస్తున్నావ్ ? మొన్నటి దాక నా మీద ఐటి రైడ్లు జరిగాయి అని గోల చేసిన నువ్వు, ఇప్పుడు మోడీని ఎదురుస్తున్న చంద్రబాబు పై ఐటి దాడులు చేస్తుంటే, వాటిని సమర్ధిస్తూ, మోడీ భక్తుడుని అని నిరూపించుకున్నావ్. శ్రీకాకుళం తుఫాను మీద ఒక్క మాట లేదు ? ఒక జిల్లా నాశనం అయితే, వారికి కనీస సానుభూతి ప్రకటిద్దాం అనే స్పృహ లేదు. ఇక మోడీ అనే మాట నోట్లో నుంచి వస్తే ఒట్టు. కేంద్రం చేస్తున్న అన్యాయం, విభజన హామీల పై ఒక్క మాట లేదు. జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో తేల్చిన 73 వేల కోట్ల గురించి ఎక్కడా లేదు. ఇవన్నీ మాట్లాడకుండా, కారులో కవాతు చేసి, లోకేష్, చంద్రబాబు మీద రాజకీయ ఆరోపణలు చేసి, సాధించింది ఏమిటి ?

Advertisements

Latest Articles

Most Read