శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బీభత్సాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యంక్ష్యంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ``తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమై తీవ్ర నష్టం జరగడంతో మనం అవస్థలు పడుతున్నాం.. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం అడిగిన ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు చేయమంటే మాపై ఐటీ దాడులు చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. వరుసగా ప్రజాప్రతినిధులు రామారావు, ఎంపీ సుజనా చౌదరి, నేడు సి ఎం రమేష్ ఇళ్ళపై ఐటీ దాడులకు పాల్పడ్డారు. ఈ రాజ్యసభ సభ్యులు ఆనాడూ , ఇప్పుడు పూర్తిస్థాయిలో విభజనపై పోరాడారు. ప్రత్యెక హోదా సాధనకోసం శ్రమించారు. ఎన్డీఎ అన్యాయంపైనా గళమెత్తారు. అందరి సహకారం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం రమేష్ నిరాహార దీక్ష చేశారు.న్నారాష్ట్రం కోసం ఇన్నిఆందోళనలు చేసే వారిపైనే ఐటీ, రాజకీయ దాడులు చేస్తున్నారు.బీజేపీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యర్ధిగా కనపడుతున్నారా?

cbn it 12102018 2

తిత్లీ తుపాను నష్టాన్ని ఎదుర్కోవడానికి అందరం నిమగ్నమయితే దాడులు చేయడం ఏమిటి? ఏం చెప్పాలి. ఎవైనా మాట్లాడితే వాళ్ళను మూసేయాలి, మాట్లాడటానికి లేదు అడగటానికి లేదని దాడులు చేస్తారా? విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయలేదు. కేంద్రాన్ని ఎదిరిస్తే ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇంకెవరూ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా తప్పుడు పనులు చేస్తున్నారు. మాపనిలో మేమున్నాం ...తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుండా కేంద్రం కుట్రపూరిత చర్యలను ప్రజలు, దేశం గమనిస్తోంది. ఇది మంచి పద్దతి కాదు... ప్రజాస్వామ్యానికి హానికరం. ఆ విషయాన్ని కేంద్రం గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి.. తప్పు చేస్తున్న వాళ్లకు మాత్రం కేంద్రం నాయకులు అండగా ఉంటున్నారు.

cbn it 12102018 3

మీ ఆసరా, విధానాల వలన చాలామంది విదేశాలకు పారిపోతున్నారు. రాఫెల్ విమానాల కొనుగోళ్ళు పెద్ద స్కాం. ఇష్టం లేనివారిపై దాడులు ...ఇష్టమైన వారిని పక్కన పెట్టుకుని వంత పాడే పరిస్థితి ఉంది. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా . దాడులతో మా ఆత్మస్థైతుఆన్ని ధ్యాసను దేబ్బతీయలేరు, మా పనుల నుంచి పక్క దారి పట్టించలేరు.. రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఉంటే ప్రజలకు సేవచేయనీయకుండా అడ్డుపడుతున్నారు. పని చేయనీయకుండా మానసికంగా మనోభావాలు దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తున్నారు. కేంద్రం చర్యలను ప్రజలు గమనించాలి గుర్త పెట్టుకోవాలి ఎం చేయాలో ఎప్పటికపుడు ఆలోచించుకుని ముందుకు పోతాం. బీజేపీ చెప్పిన పని, హామీ అమలు చేయకుండా ఇంకా అన్యాయం చేస్తున్నారు... అందుకే రాష్ట్రానికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవద్దా ? రాష్ట్రప్రయోజనాలు కాంక్షించే వారంతా ఒక్కతవ్వాలి, అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

తిత్లీ తుపాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. తుపాను తీరం దాటి 24 గంటలు దాటినా జిల్లావాసులు దాని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎటువైపు చూసినా నేలకొరిగిన చెట్లు, కూలిన ఇళ్లు, నీట మునిగిన రహదారులు.. ఇలా పరిస్థితి భీతావాహంగా ఉంది. తుపాను ముప్పు తప్పినప్పటికీ.. వరద పోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

leader 12102018 2

తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు. తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదాకా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండాలన్నారు.

leader 12102018 3

బుధవారం రాత్రి నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం.. గురువారం రాత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గం గుండా శ్రీకాకుళం చేరుకున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులకు 50కేజీల చొప్పున, ముంపు గ్రామాల్లో 25 కేజీల చొప్పున బాధితులకు తక్షణం బియ్యం అందిస్తామని తెలిపారు. పార్టీ యంత్రాంగం, ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆర్‌ అండ్‌ బీకి చెందిన 22 రహదారులను శుక్రవారంనాటికే బాగుచేయాలన్నారు. విద్యుత్తు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించాలన్నారు. ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ... జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను నష్టానికి సంబంధించి చిత్రాలను సీఎం చూశారు. మరణించిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలని అధికారుకు ఆదేశించారు.

ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్‌ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

kidari 123102018 2

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెజ్జింకి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది.

kidari 123102018 3

చనిపోయిన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ అనే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ మరో నలుగురు మావోయిస్టులు కూడా పట్టుబడినట్టు తెలిపారు. వారిని జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ రాజశేఖర్‌కర్మగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వీరంతా మావోయిస్టు పార్టీ దళ కమాండర్లుగా భావిస్తున్నారు. కిడారి, సోమ హత్యల తర్వాత ఏఓబీలో మావోయిస్టుల ఏరివేతకు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్ర, ఒడిశాలు ఒక అవగాహనకు వచ్చాయి. వీరిని సజీవంగా పట్టుకోవటంతో, మావోయిస్టులకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. వీరి నుంచి కిడారి, సోము హత్యకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది.

అనంతపురంలోని, చిన్న పొలమడ గ్రామంలోని ప్రబోధానంద అరెస్టుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీం ప్రబోధానంద అలియాస్‌ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 15న వినాయక నిమజ్జనం సందర్భంగా హత్యతో పాటు విధ్వంసాలు, ఘర్షణలు చోటుచే సుకున్నాయి. వీటన్నింటికీ కారణం చేస్తూ త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానందపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

prabodhanda 12102018 2

ఆయనతో పాటు కుమారులైన యోగానంద చౌదరి, యుగంధర్‌చౌదరిలపై కూడా కేసు పెట్టారు. వీరిపై కేసు నమోదు చేసి దాదాపు నెల కావస్తున్నా అరెస్టులో జాప్యం జరుగుతూ వస్తోంది. గతంలో ప్రబోధానంద అరెస్టుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. కాగా ప్రబోధానందతో పాటు ఆయన కుమారులను అరెస్టు చేసేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రబోధానంద భక్తులపై కూడా నిఘా ఉంచారు.

prabodhanda 12102018 3

విధ్వంసాల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రబోధానంద రెండు పర్యాయాలు సోషల్‌ మీడియాలోకి వచ్చి మాట్లాడారు. ప్రబోధానందకు రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వివిధ కేసులకు సంబంధించి ప్రబోధానంద ఆశ్రమంలోని వందకు పైగా భక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో కొందరిని పోలీస్‌ కస్టడీకి కూడా ప్రయత్నం చేశారు.ప్రబోధానంద ఆశ్రమంలోకి కొందరు భక్తులను పోలీసులు అనుమతించ లేదు. విశాఖపట్నం నుంచి వచ్చిన భక్తులు ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాల మేరకు ఆశ్రమంలోకి భక్తులను అనుమతించేది లేదని వారికి పోలీసులు తెలియచేశారు.

Advertisements

Latest Articles

Most Read