తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 55 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ, నిన్న తెలంగాణా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కామారెడ్డి 9వ సెషన్స్ జిల్లా జడ్జిగా ఉన్న రమేష్ బాబుని , సిబిఐ ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా తెలంగాణా హైకోర్టు నియమించింది. ఇప్పటి వరకు సిబిఐ ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా ఉన్న మధుసూదన్‍రావును బదిలీ చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసు విచారణ, మధుసూదన్‍రావు చేస్తూ వచ్చారు. రోజు వారీ విచారణ కొనసాగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ముందు ప్రతి శుక్రవారం, జగన్ మోహన్ రెడ్డికి చెందిన 11 కేసులు పైన విచారణ సాగేది. అయితే సుప్రీం కోర్టు, ప్రజా ప్రతినిధుల కేసులు అన్నీ కూడా తొందరగా విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో, రోజు వారీ విచారణను మధుసూదన్‍రావు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు అయితే కేసు అసలు వాదనలు అయితే ఇంకా మొదలు కాలేదు. 12 ఏళ్ళు అవుతున్నా, ఈ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విచారణలో కేవలం డిశ్చార్జి పిటిషన్ల పై మాత్రమే విచారణ సాగుతుంది. ఈ కేసులు ఉన్న వాళ్ళు, కేసు విచారణా లేట్ చేయటానికి ఒకదాని తరువాత ఒకటి, డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ వస్తున్నారు.

jagab 30042022 2

ఈ డిశ్చార్జి పిటిషన్ల పైనే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. సిబిఐ తరుపు వాదనలు విన్న తరువాత, ఈ డిశ్చార్జి పిటిషన్ల పై కోర్టు ఒక నిర్ణయం తీసుకుని, అసలు కేసు విచారణ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఈ నేపధ్యంలో, నాలుగేళ్లుగా ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా ఉన్న మధుసూదన్‍రావు బదిలీ కావటం, కొత్త జడ్జి రావటంతో, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్ల పై వాదనలు మళ్ళీ ముందు నుంచి వాదనలు వినిపించాల్సి ఉంటుందని, న్యాయవాదులు అంటున్నారు. దీని పైన క్లారిటీ రావాల్సి ఉంది అని అంటున్నారు. సహజంగా జడ్జి మధ్యలో మారితే, కొత్త జడ్జి మళ్ళీ ముందు నుంచి కేసు వింటారు. కొన్ని సందర్భాల్లో కొనసాగిస్తారు. మరి కొత్తగా వచ్చే జడ్జి ఏమి చేస్తారు, అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మళ్ళీ మొదటి నుంచి ఈ కేసు వినాల్సి వస్తే మాత్రం, మళ్ళీ జగన్ కేసులు ముందు నుంచి వస్తాయి. అప్పుడు ఈ కేసులు తేలటానికి మరింత సమయం పడుతుంది. మరి ఈ కేసులు విషయంలో ఏమి అవుతుందో చూడాలి. జగన్ క్యాంప్ మాత్రం హ్యాపీగా ఉంది.

అందరి మీద నోరేసుకుని పడిపోయే మంత్రి రోజా, ఈ రోజు కేటిఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి అంత హేళన గా మాట్లాడినా, ఆయనను చాలా సున్నితంగా విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని, ఆంధ్రప్రదేశ్ లో కనీసం నీళ్ళ సౌకర్యం లేదని, కరెంట్ లేదని, రోడ్లన్నీ గుంతల మయమని ఆయన చాలా ఎగతాళి చేసారు. ఏపి ప్రజలంతా తెలంగాణకు తరలి వచ్చి , హాయిగా జీవిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారని, ఆయన హేళన చేసారు. తన మిత్రుడు ఒకరు ఏపి కి వచ్చి చాల ఇబ్బందులు పడ్డారని కేటిఆర్ ఏపి పై తీవ్ర విమర్శలు చేసారు. దీని పైన వైసీపీ నేతలు కేటీఆర్ పైన విరుచుకు పడుతున్న వేళ, వైసీపీ మంత్రి రోజా అందరికీ షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు ఎక్కువ చించుకోకండి అనే విధంగా, రోజా, ఏకంగా కేసీఆర్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవటానికి తాను ప్రగతి భవన్ వచ్చినట్టు ఆమె చెప్పారు. ఒక పక్క ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు, మంత్రులు అందరూ కేటీఆర్ పై విరుచుకు పడుతుంటే, రోజా కూల్ గా, కేసీఆర్ ఇంట్లో ఉండటంతో, నాటకం బయట పడటంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు.

roja 29042022 2

అయితే బయటకు వచ్చిన రోజా, మీడియాను చూసి కవర్ చేసారు. రోజా మాట్లాడుతూ, కేటీఆర్ ఒక్కసారి వచ్చి ఏపిలో పర్యటించాలని , అప్పుడే ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అభివృద్ధి అర్ధమవుతుందని ఆమె చెప్పారు. పొరుగు రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో ఏపినే ఆదర్శంగా తీసుకుంటున్నాయని కూడా చెప్పారు. కేటీఆర్ వస్తే ఏపిలో రోడ్లన్ని తిప్పి చూపిస్తామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సచివాలయ వ్యవస్థ చూసే, తమిళనాడులో కూడా ఆ వ్యవస్థ పెట్టారని, మా జగన్ పాలన అంటే ఇలా ఉంటుందని కూడా రోజా చెప్పారు. తనను కెసిఆర్ ఒక కూతురు లా చూసుకుంటారని కూడా చెప్పారు. ఒక పక్క మన రాష్ట్రాన్ని కెసిఆర్,కేటీఆర్ అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వారి దగ్గరకు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళడం ఏంటో, .అని ప్రజలు అనుకుంటుంటే, వైసీపీ నేతలు మాత్రం, మేమేదో మీడియా ముందు కేటీఆర్ ని తిడుతున్నట్టు షో చేస్తుంటే, రోజా వెళ్లి మొత్తం పాడు చేసారని, నాటకం ప్రజలకు అర్ధమై పోతుంది కదా అని బాధ పడుతున్నారు పాపం...

విజయసాయి రెడ్డి ఏం చెప్పారో , ఏం చేసారో తెలియదు గాని ఒక్క రోజులోనే విజయ సాయి రెడ్డికి,  జగన్  అత్యంత కీలక పదవి ఇచ్చి, అందలం ఎక్కించారు. నిన్నమొన్నటి దాక వైసిపి పార్టీలో విజయ సాయి రెడ్డి పని అయిపోయిందని, జగన్ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారని, వార్తలొచ్చిన నేపద్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం  ప్రజలకే  కాక , వారి సొంత పార్టీలో వారికి కూడా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ  చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఏకంగా సజ్జలకు ఉన్న అధికారాలనే కొట్టేసారు. నిన్నటి  వరకు పార్టీ పై పూర్తి పట్టు  సజ్జలకే ఉండేది. అంటే, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఇలా అన్ని బాధ్యతలు, ఇపుడు ఆ వ్యవహారాలు కొన్ని విజయ సాయి రెడ్డి  గ్రిప్ లోకి వచ్చేసాయి.  విజయ సాయి రెడ్డి కి అసలు పార్టీలో నే స్థానం ఉండదని , జగన్ కి అతని  పై నమ్మకం పోయిందని  అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క రాత్రిలోనే సీన్ అంతా మారిపోయింది. పార్టీ పై పూర్తి పట్టు విజయసాయి రెడ్డికే  దక్కింది. దీని  వెనక ఉన్న కథ ఏమిటో వైసిపి నేతలకే అర్ధం కావట్లేదు. అయితే జగన్ ఆక్రమస్తుల గుట్టు అంతా విజయసాయి రెడ్డి కి తెలుసనీ, ఒక వేళ ఆయనను పక్కన పెడితే అప్రూవర్ మారతనని  జగన్ను బెదిరించి ఉంటాడని , అందుకే రాత్రికి రాత్రే ఆయనకు పదవులు ఇచ్చి నోరు మూపించారని టిడిపి నేతలు వాపోతున్నారు.

ప్రతి ఆంధ్రుడు సిగ్గు పడాలి.. పక్క రాష్ట్రం వారు మనలని హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉండే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు విని, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని, సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళాడని, అక్కడ దారుణమైన రోడ్డులు చూసి, నీళ్ళు లేక, కరెంటు లేక ఇబ్బంది పడ్డానని చెప్పాడని, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తే కానీ తనకు ఊపిరి ఆడ లేదని చెప్పాడని, ఆంధ్రప్రదేశ్ లో నరకం అంటే ఏంటో కనిపించిందని, తెలంగాణాలో ప్రశ్నిస్తున్న వారిని, బస్సులు వేసి ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, అక్కడ పరిస్థితి చూసి ఎలా ఉందో, ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉందో వారికే తెలుస్తుంది అంటూ, కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాంటి వాటికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు అంటే, మన పరిస్థితి రోజు రోజుకీ ఎలా ఉంటుందో చూస్తేనే అర్ధం అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read