తెలంగాణలో ముందస్తు ఎన్నికల జ్వరం రాజకీయపార్టీలను అతలాకుతలం చేస్తోంది... ఇప్పటికే అసెంబ్లీని రద్దు చెయ్యటం, ఎన్నికల తేదీల పై హడావిడి, ఐటి రైడ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకుంటే, మరో నెలలో తెలంగాణాలో ఎన్నికలు వస్తాయి. కాగా, తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ముఖాముఖిన తలపడబోతున్నారని ప్రచారం జరుగుతున్నా, టిడిపికి ఈ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించబోతోంది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టిడిపి తెలంగాణ సెంటిమెంట్‌ దండిగా ఉన్న 2014 ఎన్నికల్లోనే బిజెపితో కలసి 20సీట్లను గెలుచుకోగలిగింది.

jagann 02102018 2

అయితే తరువాత రోజుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, ఇంకా ఆ పార్టీ బలమేమీ తగ్గలేదు. ఇప్పుడు అన్ని సీట్లను గెలుచుకోలేకపోయినా,టిఆర్‌ఎస్‌ల గెలుపు, ఓటముల పై ప్రభావం చూపగలదు. దీంతో, టిడిపిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కెసిఆర్‌ కసరత్తులు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్‌ కనుక గెలిస్తే, రాబోయే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కెసిఆర్‌ కీలకమైన పాత్ర పోషిస్తారని, ఆ పార్టీకి చెందిన నాయకులు, వైకాపాకు చెందిన నాయకులు చెబుతున్నారు. డిసెంబర్‌ లోపు..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే కెసిఆర్‌ ఆంధ్రా పై దృష్టిసారిస్తారని, ఆంధ్రాలో ఆయన ప్రచారం చేసినా చేయవచ్చునని చెబుతున్నారు.

jagann 02102018 3

ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే జగన్‌ నయమని ఆయన చెప్పబోతున్నారని కెసిఆర్‌ కనుక మళ్లీ తెలంగాణలో గెలిస్తే, ఇక్కడ చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవని, టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్‌ కనుక ఘనవిజయం సాధిస్తే, ఆ ప్రభావం ఆంధ్రా రాజకీయాల పై ఖచ్చితంగా ఉంటుందని వారు చెబుతున్నారు. బిజెపితో అంటకాగుతున్న కెసిఆర్‌ తమకు కామన్‌ శత్రువు అయిన చంద్రబాబును ఓడించడానికి, ఆంధ్రాలో పర్యటిస్తారని, అదే సమయంలో జగన్‌ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ కూడా రంగంలోకి దిగారు. అవసరం అయిన చోట ఫైనాన్సు చెయ్యటానికి కూడా సిద్ధమయ్యారు. మిషన్ భాగీరధ కాంట్రాక్టు తీసుకున్న తన నాయకులని, కెసిఆర్ కు తగు సహాయం చెయ్యమని ఆదేశించారు. ఈ బాధ్యత అంతా విజయసాయి రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. కెసిఆర్ గెలుపు కోసం, తన సామాజిక వర్గ పెద్దలని సపోర్ట్ చెయ్యమని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్లు అందరూ , కెసిఆర్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. జగన్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...

వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పై మాట్లాడే ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ మరోసారి ఢిల్లీ నుంచి, ఏపి విషయాలు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పై జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఐటీ కంపెనీల పేరుతో ఏపీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రోత్సాహకాల ముసుగులో షెల్‌ కంపెనీలు సృష్టించారని విమర్శించారు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ స్వయంగా చూస్తున్న ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీలేవన్నారు. ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారని చెప్పారు.

gvl 021020108 2

వేల కోట్లు చేతులు మారాయని చెప్పడానికి 2014 నుంచి విడుదలైన జీవోలే ఉదాహరణ అన్నారు. ఐటీ శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లబోతున్నామని ప్రకటించారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో.. వాటి వివరాలు ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమంటే ఇవ్వడం లేదని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వద్దకు చేరాల్సిన సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2014 నుంచి 2020 వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జీవోలు విడుదల చేశారని జీవీఎల్ ఆరోపించారు. అనేక సంస్థలను తెచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల డబ్బులు దండుకున్నారని వివరించారు.

gvl 021020108 3

ల్యాండ్‌లు నామమాత్రపు ధరలకు ఇచ్చి.. మూడేళ్ల తర్వాత కమర్షియల్‌ రేట్లకు అమ్ముకోవచ్చని కూడా చెప్పారని తెలిపారు. తక్కువ ధరకు భూమిచ్చి ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా వీలు కల్పించారని ఆరోపించారు. ఐటీ శాఖలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్‌ సమాధానం చెప్పాలని కోరారు. జీవోల పేరుతో ప్రజలను మాయ చేశారని వ్యాఖ్యానించారు. తాము అడిగిన సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అయితే ఇదే కేసులో పోయిన వారం లోకేష్, చంద్రబాబు పై కోర్ట్ కి వెళ్తే, ఈ కేసు కనీసం అడ్మిట్ కూడా చేసుకోకుండా, కోర్ట్ కేసు కొట్టేస్తాం అంటే, కేసు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్యాలను భుజాన వేసుకుని రాష్టమ్రంతటా తిరుగున్నారని విమర్శించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ, జనసేనలపై నిప్పుల చెరిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక కష్టనష్టాలు ఎదురవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి 1500 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా నిలిపారని కొనియాడారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ బీజేపీ, వైసీపీ, జనసేనపార్టీలు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.

bjp 02102018 2

జగన్, పవన్‌లు బీజేపీకి చెందిన జెండా, అజెండాను చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కళ్లకు కనబడే అభివృద్ధిని కళ్లుండీ చూడలేక పోతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరగలేదో ఆ మూడు పార్టీలు నిరూపించాలని, దీనిపై రాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పవన్‌కు ఏమైందో అర్థం కావడం లేదని, కేంద్రం నుంచి రావాల్సినవి అడగకుండా మళ్లీ ప్రశ్నించడానికే పుట్టానంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 18 విభజన హామీలపై పల్లెత్తు మాటకూడా మాట్లాడని పవన్ రాష్ట్రంలో రెండు మూడు సీట్లు గెలుచుకుని రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని విమర్శించారు. అన్న చిరంజీవి పిఆర్‌పిని హోల్‌సేల్‌గా అమ్మేస్తే, పవన్ రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని ఆరోపించారు.

bjp 02102018 3

దళితులపై జగన్ కపటప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందుతున్నారంటే చంద్రబాబు చేస్తున్న కృషి, చూపుతున్న చొరవేనని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఖర్చుచేయని విధంగా తెలుగుదేశం హయాంలో దళితుల సంక్షేమం కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అమరావతి దళితుల కంచుకోట అని, వారి అభ్యున్నతి కోసమే అమరావతి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ధర్మపోరాట దీక్షకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తిరిగి మొత్తం 15 సీట్లు గెలవడం ఖాయమని మంత్రి జవహర్ స్పష్టంచేశారు.

జగన్‌ పర్యటనతో విజయనగరం వైసీపీలో గ్రూపు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తనను, కోలగట్లను దీవించాలని జగన్‌ బహిరంగ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో కోలగట్ల వర్గంలో హర్షాతి రేకాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్‌ ప్రకటనతో అవనాపు బ్రదర్స్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీనికి కారణం వారు ఈ టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. బొత్సా కూడా వీరికి భరోసా ఇచ్చారు. జగన్ తో మాట్లాడానని, పదవి నీకే అని భరోసా ఇచ్చినట్టు కూడా చెప్పారు. మరో పక్క విజయనగరంలో వైసీపీ జెండాను ప్రప్రథమంగా పట్టుకుంది వారి తండ్రి అవనాపు సూరిబాబే అని, మాకు జరిగిన అవమానం ఇది అని వారు అంటున్నారు.

botsa 02102018

తండ్రి మరణాంతరం కూడా విక్రమ్‌, విజయ్‌ పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతూ వస్తున్నారు. కోలగట్లకు ఎమ్మెల్సీ పదవి ఉన్నందున తమకు ఈ సారి టిక్కెట్టు వస్తుందని వారు భావించారు. దీనికి తోడు బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చి బొత్స అనుచరులుగా మెలుగుతూ వస్తున్నారు. అయితే సోమవారం విజయనగరంలో పాదయాత్ర సందర్భంగా మూడు లాంతర్లు వద్ద బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్‌ తన ప్రసంగం చివర్లో వచ్చే ఎన్నికల్లో తనను, కోలగట్లను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. దీంతో కోల గట్ల వర్గం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

botsa 02102018

ఈ నిర్ణయంతో బొత్సకు కూడా చెక్‌ పెట్టినట్టే. ఇంత వరకు బీసీ నినాదంతో అవనాపు సోదరులను ముందుంచి కోలగట్లకు చెక్‌ పెట్టాలని ఆయన చూశారు. అంతేగాకుండా ఈయన వర్గం చేపడుతున్న కార్యక్రమాలకు అవనాపు సోదరులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ వచ్చారు. విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఏ కార్యక్రమం జరగాలన్నా.. అందుకు వారు ఆర్థిక సాయం అందించేవారు. ఇంతలో జగన్‌ వచ్చే ఎన్నికల టిక్కెట్టు విషయంలో స్పష్టతనివ్వడంతో వారు నిరాశకు గురయ్యారు. దీంతో గ్రూపుల గోల మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read