చైతన్య రాధసారధి నందమూరి హరికృష్ణ గారు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు. అయితే ఆయాన నిన్న తన అభిమానులని ఉద్దేశించి లేఖ రాసారు. ఈ రోజు ప్రెస్ కి రిలీజ్ చెయ్యమని కోరారు కూడా..

letter 29082018 2

మరో నాలుగు రోజులల్లో హరికృష్ణ పుట్టిన రోజు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం. పుట్టినరోజు జరగనున్న నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పుట్టినరోజున అభిమానులకు సందేశం ఇవ్వాలని ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికి వచ్చింది. ‘‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు."

letter 29082018 3

"వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో జన్మదినం చేసుకోవల్సిన తమ అభిమాన నటుడు, చివరి లేఖ బయటకు రావటంతో, అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను నార్కెట్ పలిలోనే హాస్పిటల్ కు తరలించినా, ఫలితం దక్క లేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా, ఆయన దేహం చికిత్సకు స్పందించలేదు. ఆయన మరణ వార్తా విని, తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు సోక సముద్రంలో మునిగిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్ట వశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

వెలగపూడి సచివాలయంలో, పెద్ద వర్షం పడి జల్లు లోపాలకి కొడితేనో, ఏసి పైప్ లైన్ బ్లాక్ అయ్యి, నీళ్ళు లోపలకి వస్తేనో, హడావిడి హడావిడి చేసేసి, సచివాలయం కూలిపోతుంది అనే బ్యాచ్ ని చూస్తున్నాం. 6 బ్లాకుల అతి పెద్ద సచివాలయంలో, ఒక రూమ్ లో చిన్న సమస్య వస్తేనే, అమరావతిని ఎగతాళి చేసే బీజేపీ నేతలు, వారు అధికారం ఉన్న రాష్ట్రంలో, ముచ్చటపడి కట్టుకున్న కొత్త ఎయిర్ పోర్ట్ లో, వర్షానికి జలపాతం వచ్చింది. అసోంలోని గువహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా వేసిన రూఫ్‌ నుంచే నీళ్లు కురుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

airport 28082018 2

దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షం పడడంతో విమానాశ్రయ రూఫ్‌ నుంచి నీళ్లు ఏకంగా షవర్‌ నుంచి వస్తున్నట్లుగా కిందకు పడుతున్నాయి. సీలింగ్‌లోని ఏసీ వెంట్స్‌, లైట్‌ సాకెట్లు, సీలింగ్‌ టైల్స్‌కు మధ్య ఉన్న సందుల నుంచి షవర్‌లో నుంచి నీళ్లు పడుతున్నట్లుగా నీళ్లు కిందకు కురిశాయి. దీంతో అక్కడంతా తడిసిపోయి గందరగోళంగా మారింది. సిమెంట్‌ స్లాబ్‌ నుంచి ఇంత ఎక్కువగా నీళ్లు కారుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

airport 28082018 3

విమానాశ్రయంలోని ప్యాసింజర్‌ లాంజ్‌ను ఇటీవలే కొంత పొడిగించారు. బ్యాగేజీ చెకింగ్‌ ప్రాంతంలో రూఫ్‌ నుంచి కారిన నీళ్లు ఇలా సీలింగ్‌ నుంచి కురవడంతో ప్రయాణికులు వీడియోలు తీశారు. చాలా మంది పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్‌ సిన్హా, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో ఈ వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరారు. ఈ వీడియో రెండ్రోజుల కిందటిదని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షం వల్ల రూఫ్‌ నుంచి నీళ్లు లీకయ్యాయని, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారని చెప్పారు. నీళ్లు లీకవ్వడం వల్ల విమానాశ్రయంలోని పరికరాలేమీ పాడవ్వలేదని తెలిపారు.

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆయనే స్వయంగా కార్ నడుపుతున్నట్టు తెలుస్తుంది. AP28BW 2323 కార్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన పరిష్తితి విషమంగా ఉందని, శ్వాస తేసుకొవటానికి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. సంఘటనా స్థలం చూసిన వారు, కార్ అదుపుతప్పి, కార్ బోల్తా పడి, ఆక్సిడెంట్ అయినట్టు చెప్తున్నారు.

ప్రమాదంలో ఆయన కార్ లో నుంచి రోడ్డు పై పడ్డారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదోమో అనే అక్కడి వారు చెప్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారును హరికృష్ణే నడుపుతున్నట్టు సమచారం. హరికృష్ణను హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రమాద సమాచరం తెలిసిన వెంటనే హరికృష్ణ సోదరి పురందేశ్వరి ఆస్పత్రికి బయలుదేరారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జనకిరామ్‌ మృతిచెందారు.

Advertisements

Latest Articles

Most Read