ఇప్పటికే అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి, అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. ఇదేదో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేది కాదులేండి. మందుబాబులకు సంబంధించినది. రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. ‘హోలోగ్రామ్స్‌’ సంస్థకు ఎక్సైజ్‌ శాఖ బకాయిపడడంతో సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా మూడు రోజులుగా డిపోల నుంచి మద్యం నిల్వలు దిగుమతి చేసుకోలేకపోయింది. సరఫరా లేక రిటైల్‌ మద్యంషాపులు చాలావరకు ఖాళీ అయిపోయాయి. ఏడాది క్రితం పాలసీ ప్రవేశపెట్టిన కొత్తలో హెచ్‌పీఎఫ్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించని కారణంగా షాపుల్లో మద్యం కొరత ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితి పునరావృతమైంది.

excise 090872018 2

సరఫరా నిలిచిపోయిందిలా..!: రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేసింది. డిస్టిలరీలు, మద్యం డిపోలు, షాపులు, ఎక్సైజ్‌ స్టేషన్లు అన్నిటిలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి, అమ్మకాలను, ఉత్పత్తి, దిగుమతులను దానికి అనుసంధానం చేసింది. సీసా తయారైన వెంటనే డిస్టిలరీలో హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ వేసి స్కాన్‌ చేస్తారు. అక్కడి నుంచి ఆ సీసా అమ్మే వరకూ ఏ షాపులో, ఎప్పుడు అమ్మారు అనే వివరాలన్నీ ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. గత 17 నెలల నుంచి హోలోగ్రామ్స్‌కు సంబంధించిన సొమ్ము దాదాపు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.

excise 090872018 3

ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా ఎక్సైజ్‌ అధికారులు స్పం దించకపోవడంతో మద్యం డిపోల్లో సేవలు ఆపేసింది. మరో పక్క, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులపై దాడులు నిర్వహించింది. అనధికారంగా మద్యం విక్రయిస్తున్న 187 బెల్టులపై కేసులు నమోదుచేసి, 189 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. 405.28 లీటర్ల లిక్కర్‌, 6.5 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 5 లీటర్ల నాటుసారా, మూడు వాహనాలు సీజ్‌ చేసినట్లు చెప్పారు.

ఆదివాసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని, ఎన్నడూ లేని విధంగా ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పాడేరు మండలం అడారిమెట్టలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గిరిజనులకు వరాలు ప్రకటించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పింఛను, చంద్రన్న బీమా అందుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.

cbn 09082018 2

ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ప్రకటించారు. గిరిజనులపై ఉన్న ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. గిరిజనుల కోసం తాము చేస్తున్న కృషి చూసి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు తెదేపాతో కలిశారని సీఎం వివరించారు. బాక్సైట్‌పై అప్పుడు రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... గిరిజనులకు నష్టం జరుగుతుందనే తాను సీఎం అయ్యాక బాక్సైట్‌ను రద్దు చేశానని తెలిపారు. అనుమతులు పొందినవారు న్యాయస్థానినికి వెళ్లారు, కేంద్ర ప్రభుత్వం నాపై ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని వివరించారు.

cbn 09082018 3

గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్‌ జోలికి వెళ్లనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అవకాశాలు వస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఆదివాసీ యువతకు ఉందని, గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 15 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రూ. 2,564 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గిరి గోరుముద్దలు, బాల సంజీవని వంటి పథకాలు తీసుకొచ్చామని, ఆదివాసీ ప్రాంతాల్లో త్రాగునీటి కోసం రూ. 397 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

cbn 09082018 4

గిరిజన ప్రాంతాల్లో 153 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 26 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు పెట్టామని, గిరిజన ప్రాంతాల్లో 20 లక్షల దోమ తెరలు పంపిణీచేశామని, గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ కనెక్టివిటీ పెంచుతామని చంద్రబాబు తెలిపారు. 2005, 2007లో బాక్సైట్‌ మైనింగ్‌కు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుమతులిచ్చారని, 8,237 ఎకరాలు పెన్నా ప్రతాప్‌రెడ్డి, జిందాల్‌ కంపెనీకి అప్పగించారని, ఇష్టానుసారంగా ఒప్పందాలు చేసుకున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. హైకోర్టు నిర్మాణ పనులు దక్కించుకునేందుకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా రెండు సంస్థలకంటే తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హైకోర్టు భవనం స్ట్రక్చర్‌ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ వంటి పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు.

amaravati 09082018 2

భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆకృతిని రూపొందించింది. జీ+7 విధానంలో నిర్మిస్తారు. మొత్తం 12 లక్షల చ.అ. నిర్మితప్రాంతం ఉంటుంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లను వాహనాలు నిలిపేందుకు కేటాయిస్తారు. మరో పక్క, శాసనసభ భవనానికి ఎత్తైన టవర్‌తో ఉన్న ఆకృతిని ఇప్పటికే ఖరారు చేశారు. దీని పై కసరత్తు జరుగుతుంది. శాసనసభ భవనం ఎత్తు.. దానిపై నిర్మించే టవర్‌తో కలిపి 250 మీటర్లు ఉంటుంది. 210 మీటర్ల ఎత్తున టవర్‌లో వీక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. దానిని వ్యూయింగ్‌ డెక్‌గా పిలుస్తారు. ఒకేసారి 150 మంది ఆ డెక్‌పై నిలబడి రాజధానిని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

amaravati 09082018 3

అక్కడి నుంచి 250 మీటర్ల ఎత్తు వరకు వెళ్లేందుకు పారదర్శకంగా అద్దాలతో రూపొందించిన లిఫ్ట్‌ ఉంటుంది. అందులో టవర్‌ చిట్ట చివరికి వెళ్లి అక్కడి నుంచి రాజధాని మొత్తాన్ని చూడవచ్చు. టవర్‌ చివరికి వెళ్లాక లిఫ్ట్‌ ఐదు నిమిషాలు ఆగుతుంది. దీనిలో ఒకేసారి 30 మంది వెళ్లేందుకు వీలుంటుంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌లో 276 మీటర్ల ఎత్తు నుంచి నగరం మొత్తాన్ని వీక్షించే వీలుంది. ‘‘అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం టవర్‌ ఎత్తుని కూడా ఆస్థాయికి పెంచేలా ఆకృతిలో మార్పులు చేస్తామని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

amaravati 09082018 4

వచ్చే నెల 15 నాటికి డ్రాయింగ్స్‌ అందజేస్తారని, అప్పటి నుంచి అంచనాల రూపకల్పనకు వారం పది రోజులు పడుతుందని, వచ్చే నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వెల్లడించారు. శాసనసభ భవనంలో 9 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సుమారు రూ.38 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో సుమారు రూ.28 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. మరో రూ.10 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ నిధుల్ని వివిధ మార్గాల్లో సమీకరించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది.

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే రీసౌండ్ ఇంకా బీజేపీ నేతల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రం పై విరుచుకు పడ్డారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామన్నకేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

galla 09082018 2

జీఎస్టీ వల్ల ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.2600 కోట్లు నష్టపోతుందని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టం ప్రకారం న్యాయం చేయాలని జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌పై జీఎస్టీ 5శాతం మాత్రమే ఉండాలని, ఎండుమిర్చి, చింతపండు, పసుపు పంటలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

galla 09082018 3

లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా టీడీపీ పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు సూచనతో క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను లోక్‌సభలో ప్రస్తావిస్తున్నారు ఎంపీలు. అలాగే కాపు రిజర్వేషన్లపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.

Advertisements

Latest Articles

Most Read