ఆయన ఒక జిల్లాకు సబ్‌కలెక్టర్‌. చాలా మంది ఐఏఎస్ ల లాగా, తన అధికారం చూపించలేదు. ఐఏఎస్ అంటే ప్రజా సేవ చెయ్యటమే అని నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, గురువారం మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అదే సమయంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని నూకలేటివాడ గ్రామం నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌ కోసం ఫోన్‌ వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అక్కడి నుంచి తీసుకురావల్సి ఉంది. దీంతో సబ్‌కలెక్టర్‌ స్వయంగా అంబులెన్సును నడుపుకుంటూ ఆ గ్రామానికి వెళ్లారు. రోగిని వాహనంలో ఎక్కించి తనవెంట వచ్చిన అంబులెన్స్‌ పైలెట్‌ ద్వారా ఆసుపత్రికి పంపించారు.

ambulance 13072018 2

ఎక్కడన్నా చిన్న తప్పు జరిగితే, ఎత్తి చూపే న్యూస్ చానల్స్ , సోషల్ మీడియా ట్రోల్స్ వాళ్ళకి, ఇలాంటివి కనిపించవు. కనిపించినా, ఇలాంటి మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే, ఇక్కడ కూడా రాజకీయ కోణం. అంతే కాని, ఒక యువ ఐఎస్ఎస్ ఆఫీసర్ చేసిన పనిని అభినందిస్తున్నాం అనే స్పృహ ఉండదు. ఒక, సబ్‌కలెక్టర్‌, స్వయంగా ఫీడర్‌ అంబులెన్స్‌ నడుపుకుంటూ మన్యంలోని మారుమూల గ్రామంలోని రోగి ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి దగ్గరుండి రోగిని ఆ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి పంపించారంటే, కచ్చితంగా అభినందించాలి. ఇలాంటి వారు ఎంతో మంది అధికారులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి.

ambulance 13072018 3

ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య కేంద్రాలకు వచ్చేలోగా ప్రసవాలు సంభవించడం, మాతా శిశు మరణాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చంద్రన్న సంచార చికిత్స, 108 వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొండ ప్రాంతాల్లో, కొన్ని ఇరుకుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో చేసేదిలేక వైద్యసేవల కోసం డోలీ కట్టుకుని స్థానికులే ఆరోగ్య కేంద్రాలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఫీడర్‌ అంబులెన్సుల్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతగా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు గాను ద్విచక్ర వాహనాలతో అనుసంధానమై ఉండే 122 ఫీడర్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో, 150 ఎకరాల్లో అత్యాధునిక గిడ్డంగులు నిర్మించి, 10 వేలమందికి ఉపాధి కలిపించే ఆలోచనలో ఉన్నామని సంజీవ్ వివరించారు. స్థానిక రైతులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ ద్వారా విక్రయించుకునేందుకు సహకరిస్తామని, తాము ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో వ్యాపారావకాశాల కల్పనలో రోల్‌మోడల్‌గా ఉన్నామని తెలిపారు. వాల్‌మార్ట్ 50 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉందని, ఏడాదికి 60 శాతం వృద్ది సాధిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే భారతదేశంలో 4 ప్రాంతాల్లో అతిపెద్ద నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, భారీ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ ఏర్పాటు చేసామని చెప్పారు.

walmart 13072018 2

స్మార్ట్ ఫోన్లు,వివిధ కంపెనీలు తయారు చేసే వస్త్రాలు వంటి అనేక ఉత్పత్తులను దేశవ్యాప్తంగా రీటైలర్లకు సరఫరా చేస్తున్నామని, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉత్పత్తులను సేకరించి, వాటిని సరఫరా చేసేందుకు మేము సమర్ధ రవాణా వ్యవస్థ కలిగి ఉన్నామని వివరించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, వాల్‌మార్ట్ తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి, తమ సెంటర్లు నెలకొల్పడానికి అనంతపురము అత్యంత అనుకూల ప్రాంతమని అన్నారు. వాల్‌మార్ట్‌కు ఎంతో కీలకమైన ఆహార శుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని అనంతపురము జిల్లాలో వాల్‌మార్ట్ తమ సెంటర్ ఏర్పాటు చేస్తే చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా వంటి ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మరింత వీలుగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.

walmart 13072018 3

దేశంలోని అన్ని ప్రాంతాలకూ రవాణా మార్గాలు కలిగి ఉండటం మా రాష్ట్ర విశేషమని, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభానికి పూర్తీ సహకారం అందిస్తామని చెప్పారు. "ఏపీ మీకు గ్లోబల్ సోర్సింగ్ సెంటర్‌గా ఉంటుంది. మేము వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యదిక వృద్ది నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈ ఉత్పత్తులను వాల్‌మార్ట్ బ్రాండ్ ద్వారా అందించవచ్చు. రాష్ట్రంలో మీకు స్నేహపూర్వక వాణిజ్య వాతావరణం ఉంటుంది. ఇక్కడ పూర్తి పారదర్శక ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత త్వరలో వాల్‌మార్ట్ తన కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాం" అని చంద్రబాబు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డితో చెప్పారు.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఇటీవలే అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు ఈ పెరిగిన జీతం వచ్చే నెలలో అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించారు. ఇప్పటివరకూ అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తూ వచ్చారు. తాజాగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన సభలో అధికారికంగా ప్రకటించారు.

angawadi 13072018 2

ఈ బీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే.. రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు చంద్రన్నబీమా ద్వారా ఆ కుటుంబానికి అందజేస్తారు. జిల్లాలో ఆశావర్కర్లు 3,082 మంది పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిపి సుమారు 12వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ చంద్రన్నబీమా వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే వేతనాలు పెంచిన సీఎం తాజాగా చంద్రన్నబీమా వర్తింపజేయడం తో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి పరిటాల సునీతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

angawadi 13072018 3

7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు ఇటీవలే చంద్రబాబు పెంచారు. అలాగే ఆశా వర్కర్లకి నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పుడు వీరికి పెరిగిన జీతాలకు తోడు, ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో, చంద్రన్న భీమా కూడా తోడయ్యింది.

మన రాష్ట్రంలో విద్యార్ధులకు, అమెరికాలో చదువుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. అక్కడ మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చెయ్యాలని, అక్కడ మంచి ఉద్యోగం చెయ్యాలని, ఇలా అనేక కలలు కంటూ ఉంటారు. కాని, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మధ్య తరగతి కుటుంబాలకు, ఎంతో భారం. ఇవన్నీ చూసిన చంద్రబాబు, కొన్ని కార్పొరేషన్ల ద్వారా, కొంత మంది విద్యార్ధులకు ఫీజ్ లు కట్టి, విదేశాల్లో చదివిస్తున్నారు. అయితే, ఇది కొంత మందికి మాత్రమే వీలు ఉంటుంది. దీన్ని కూడా అధిగమించి, తల్లి తండ్రుల పై భారం తగ్గించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న అడుగు వేసింది. అమెరికాలోని ఒహోయో రాష్ట్రంతో, కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి 75 శాతం ఫీజ్ రాయతీ ఇస్తారు.

university 13072018 2

అంటే, ఇప్పుడు అక్కడ ఫీజ్ 20 లక్షలు ఉంటే, 15 లక్షలు రాయతీ వస్తుంది. విధ్యార్ధులు 5 లక్షలు కడితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న 272 యూనివర్సిటీలలో, ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీజ్ రాయతీ, ఎంఎస్ కోర్స్ కు మాత్రమే ఉంది. మిగిలిన కోర్స్ లకు కూడా, త్వరలోనే, ఈ ఒప్పందంలో చేర్చనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో సెమిస్టర్ కు, ఒక్కో విద్యార్ధికి 4 లక్షల వరకు అదా అవుతుంది. ఈ ఫీజ్ రాయతీ పొందటానికి, ముందుగా ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖకు ధరఖాస్తు చేసుకోవాలి, తరువాత అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా స్క్రీనింగ్ చేసి, విధ్యార్ధులను తమ యూనివర్సిటీలలో చేర్చుకుంటాయి.

university 13072018 3

ఈ వివరాలు అన్నీ గంటా శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. త్వరలోనే, అమెరికాలోని మరిన్ని రాష్ట్రాలతో కూడా ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. అలాగే చైనా, కెనడా, యుకే తో కూడా, ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటామని, ఆ చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. అందరూ మంచి చదువు, చదువుకోవాలనే ముఖ్యమంత్రి సంకల్పం కోసం, విద్యా శాఖ కృషి చేస్తుందని చెప్పారు. అలాగే, అమరావతి, వైజాగ్, తిరుపతిలో, ప్రముఖ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా కృషి జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ ని అప్గ్రేడ్ చెయ్యటం మొదలు పెట్టామని, అన్ని స్కూల్స్ లో, అన్ని రకాల ఆధునిక వసతలు కలిపిస్తున్నామని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read