ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం వివధ రూపాల్లో జరుగుతుంది. సెలబ్రిటీలుగా పేరు ఉన్న వారు కూడా, ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో 'జబర్దస్త్' నటుడుకి సంబంధం ఉన్నట్టు, టాలీవుడ్ లింక్‌లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మొన్నటి దాకా, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసుకునే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకు పడగలెత్తాడు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా సంపాదించిన కోట్ల రూపాయాలతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు.

jabardasth 12072018 2

రీసెంట్ గా రిలీజ్ అయిన, షకలక శంకర్ హీరోగా నటించిన శంభోశంకర సినిమాకు కూడా ఫైనాన్స్ చేశాడు. సినిమా నటుడిగా చలామణి అవుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న అతని కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతికి చెందిన ఈ స్మగ్లర్... టీవీ ప్రోగ్రామ్స్‌లో చిన్నచిన్న వేషాలేస్తుంటాడు. ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటూనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలోని చెట్లను నరికి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపించడం ప్రారంభించాడు.

jabardasth 12072018 3

తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో కోట్లాది రూపాయలు కూడబెట్టినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. అతనిపై 20కి పైగా కేసులు నమోదు చేశారు. ఇతనిపై 20 కేసులు నమోదు చేశామని చెప్పిన టాస్క్ ఫోర్స్ అధికారులు, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది.. అయితే మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. విచారణ జరిపి, వీరిని కూడా అరెస్ట్ చేతామని పోలీసులు అంటున్నారు.

విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కొద్దిసేపటికే తమ సహాయ సహకారాలు అందించడానిక పెద్దఎత్తున దాతలు ముందుకొచ్చారు. స్థానికులు, ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్ర అన్న క్యాంటీన్లు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పేదల పట్ల ఉన్న ప్రేమ, అభిమానాలు గమనించిన కొందరు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ముఖ్యమంత్రికి అందజేశారు. దాతలను ముఖ్యమంత్రి అభినందించారు.

anna 12072018 2

• మండవ కుటుంబరావు 1 లక్ష రూపాయలు విరాళం అందజేశారు. దీనికి తోడుగా నెలకు 10 టన్నుల కూరగాయలు అందిస్తామన్నారు. • కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ తన మనవడు పుట్టినరోజు జూలై 14 పురస్కరించుకుని 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. • విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ 25,000 రూపాయలు ప్రకటించారు. • విజయవాడ శాసన సభ్యులు జలీల్ ఖాన్ 25,000 రూపాయల చెక్ ను ముఖ్యమంత్రికి అందజేశారు. • కృష్ణా జిల్లా ఏఐఈ పి.బాబూరావు 10,000 విరాళం అందజేశారు. • ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ జి. కోటేశ్వరరావు 25,000 రూపాయలు విరాళం అందజేశారు. • కార్పొరేటర్లు గాంధీ రూ.10,000/- నాగమణి రూ.2000/- విరాళంగా అందజేశారు.

anna 12072018 3

మొదటి విడతలో 35 పట్టణ ప్రాంతాలలో 100 క్యాంటీన్లు ప్రారంభోత్సవంలో భాగంగా విజయవాడ భవానీపురం 28వ డివిజన్ లో నిర్మించిన అన్న క్యాంటీనును ముఖ్యమంత్రి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విజయవాడ ఏ-కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. నిరుపేదల ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం-భోజనం అందిస్తున్నామన్నారు. సమాజంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని.. తాము రూపాయకే కిలో బియ్యం అందిస్తున్నామన్నారు. రోజుకు 2,15,000 ప్లేట్ల అల్పాహారం, భోజనాలను వడ్డించడం జరుగుతుందన్నారు.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే గడ్కరీ, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా చంద్రబాబు, పోలవరం ప్రాజెక్ట్ లో రావాల్సిన డబ్బులు, అప్రూవల్స్ పై గడ్కరీకి నివేదించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన 2,278 కోట్లను వెంటనే చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్ర బాబు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇంత వరకు 14,141.80 కోట్లు ఖర్చు చేశామని ముఖ్య మంత్రి చంద్రబాబు గడ్కరికి తెలిపారు. దీనికి జాతీయ హోదా రాకముందు 5,135.87కోట్లు ఖర్చుపెట్టా మన్నారు. జాతీయ హోదా లభించిన తర్వాత 9,005.93కోట్లు ఖ ర్చు చేశామన్నారు.

cbn gadkari 12072018 2

ఇందులో కేంద్రం నుంచి 6,727.26 కోట్లు తిరిగొచ్చాయన్నారు. ఇంకా 2,278.67 కోట్లు జమకావా ల్సుందన్నారు. ఈ మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా 2019డిసెంబర్‌ నాటికల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమైన పనులన్నిం టిని వచ్చే ఏప్రిల్‌లోనే పూర్తి చేయ గలమన్నారు. 1941లోనే ఈ ప్రాజెక్ట్‌కు సమగ్ర నివేదిక తయారు చేశారన్నారు. 1983లో దీనికి 884కోట్లు అంచ నాలేశారన్నారు. 1987నాటికి 2,665కోట్లకు అంచనాలు పెరిగాయన్నారు. 2005లో కేంద్ర జలవన రుల సంఘం 10,150కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపిందన్నారు. 2009లో దీనికి అనుమతులిచ్చారన్నారు.

cbn gadkari 12072018 3

2010నాటికి అంచనా వ్యయం 16,010కోట్లకు చేరిందన్నారు. భూసే కరణ కోసం 2,900కోట్లు అవసరమౌతాయని అంచనాలేశా రన్నారు. కాగా నూతన చట్టం మేరకు ఇది 31వేల కోట్లకు పెరిగిందన్నారు. దీంతో మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం 57,940 కోట్లకు చేరిందన్నారు. పోలవరం కుడికాలువ పనులు 93శాతం పూర్తయ్యాయన్నారు. ఎడమకాలువ త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఇంతవరకు తాను 56శార్లు ఈ ప్రాజెక్ట్‌పై సమీక్షించానన్నారు. స్వయంగా సందర్శించడం ఇది 25వ సారిగా ఆయన చెప్పారు. పనులు మరింత వేగం గా పూర్తయ్యేందుకు కొంతమొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించా లని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం స్వయంగా పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని నిధుల మంజూరు, విడుదల విషయంలో రాజకీయాలకు తావులేదని గడ్కరీ పునరుద్ఘాటించారు. అనంతరం నిర్మాణ ప్రగతిపై అదికారుల్తో సమీక్షించారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలసి గడ్కరి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం పనుల తీరు పట్ల గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచుతామన్నారు. నిర్మాణ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ప్రశంసనీయమన్నారు. దేశంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్ట్‌ను తాము పూర్తి చేసి తీరుతామన్నారు.

gadkari 12072018 2

గతంలో తానొచ్చేసరికి కూడా ఇక్కడ కొన్ని సమస్యలుండేవ న్నారు. తన పర్యటన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో వాటిని పరిష్కరించుకున్నా రన్నారు. ఈ సారి కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు నాలుగు రోజులు ఇక్కడే ఉండి పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరించు కోవాలని ఆయన సూచించారు. ఆ స్థాయిలో పరిష్కారం లభించని పక్షంలో సమస్యల నివేదికతో ఢిల్లికి రావాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో ఉన్న సమస్యలు.. వాటి పరిష్కారానికి ఎలా ముందుకు సాగనున్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర అధికారులను దిల్లీకి ఆహ్వానించారు. కూర్చుని తేల్చేద్దామని చెప్పారు. ‘మా అధికారులకు ఇప్పటికే చెప్పా. మళ్లీ చెబుతా. మీరు దిల్లీ వచ్చి ఏ కాగితాలు కావాలో అన్నీ సమర్పించి సమస్యలు పరిష్కరించుకోవాల’ని సూచించారు. మూడు రోజుల్లో నాకు సమర్పిస్తే తాను ఆమోదించి 8 రోజుల్లో ఆర్థికశాఖకు పంపుతామన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి, తాను కలిసి సంయుక్త భేటీ ఏర్పాటు చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ఎందుకు అంచనాలు పెరిగాయో ఆయనకూ వివరించి ఆమోదం తెచ్చుకుందామన్నారు.

gadkari 12072018 3

కేంద్ర మంత్రి ప్రాజెక్టు చూసిన తర్వాత అక్కడే రాత్రి 9 గంటల వరకు దాదాపు 90 నిమిషాల సేపు అధికారులతో సమావేశమయ్యారు. సవరించిన అంచనాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘ఎంత సమయం తీసుకోవచ్చు’ అని కేంద్రమంత్రిని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ ప్రశ్నించగా తనకు ఈ రోజు వేరే కార్యక్రమం ఏమీ లేదని ఎంతసేపయినా తనకు సమ్మతమేనని చెప్పి సమావేశం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల వల్లే సేకరించే భూమి విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టే, మా అధికారులని, ఢిల్లీ పంపిస్తామని, మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తారని, అన్ని వివరాలు ఇస్తామని, మీరు చెప్పినట్టు, 8 రోజుల్లో అన్నీ క్లియర్ చేస్తే సంతోషమని చంద్రబాబు బదులిచ్చారు. మీరు రెడీ అంటే, వచ్చే సోమవారం నుంచే, ఈ ప్రక్రియ మొదలు పెడదామని, చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read