ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న, చిత్ర విచిత్ర విన్యాసాలు అందరూ చూస్తున్నారు. ఊరికే డబ్బా కొట్టుకోవటం కోసం, ఇష్టం వచ్చినట్టు పదవులు ఇస్తున్నారు. లేని పదవులు సృష్టించి మరీ ఇస్తున్నారు. పార్టీ వారికి పదవులు ఇచ్చాం అని చెప్పుకోవటానికి తప్ప, ఆ పదవుల్లో ఉన్న వారు చేసేది ఏమి ఉండదు. నిధులు ఉండవు, చివరకు వారు కూర్చోవటానికి ఆఫీస్ కూడా ఉండదు. ఇంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటుంది. ఇదే క్రమంలో, పదవులు పిచ్చ పట్టుకున్న వైసీపీ ప్రభుత్వం, నిబంధనలు ప్రకారం, అధికారులకు ఇవ్వాల్సిన పదవులని కూడా, సొంత పార్టీ వాళ్లకి ఇచ్చుకుంది. అసలు తమకు రూల్స్ తో పని లేదు, మా ఇష్టం అనే విధంగా వ్యహరించింది వైసీపీ. ఈ క్రమంలోనే, ఈ విషయం తెలుసుకున్న కేంద్రం, అధికారులకు పదవులు ఇవ్వకుండా, సొంత పార్టీ వారికి ఇచ్చుకోవటం పై, షాక్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాయించి పడేసింది. దీంతో కేంద్రం దెబ్బతో, జగన్ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం చీవాట్లతో, వారితో రాజీనామా చేయించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి,కొంత మంది పార్టీ వారికి, స్మార్ట్‌ సిటీ ఛైర్మన్లుగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేసి, నానా హంగామా చేసి, మేమే పదవులు ఇస్తున్నాం అని హడావిడి చేసారు.

padavulu 24032022 2

తీరా చూస్తే, కేవలం అయుదు నెలల్లోనే వారు ఇప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మెన్లుగా, జి.వెంకటేశ్వరరావు, రాజాబాబు, ఎస్‌.పద్మజను అనే వైసీపీ పార్టీ వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే, స్మార్ట్ సిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జారీ చేసిన నిబంధలనలకు విరుద్ధంగా, చైర్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిబంధనలు ప్రకారం, ఛైర్మన్లుగా డివిజనల్‌ కమిషనరు, కలెక్టరు, మునిసిపల్‌ కమిషనరు, పట్టణాభివృద్ధి సంస్థ సీఈవోలలో ఎవరో ఒకరిని మాత్రమే, నియమించాల్సి ఉండగా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం పార్టీ వారిని నియమించారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, వాటిని వెంటనే రద్దు చేయాలని వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం వార్నింగ్ తో, జగన్ మోహన్ రెడ్డి దిగి వచ్చారు. పార్టీ వ్యక్తులను ఆ పదవుల నుంచి రాజీనామా చేపించారు. కేంద్రం దెబ్బకు దిగి రాక తప్పలేదు.

భారత దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల పొత్తులు అనేవి సర్వ సాధారణం. మన రాష్ట్రానికి వస్తే, గత 30 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ, ఎక్కువగా బీజేపీతో కలిసి వెళ్ళింది, 2014లో జనసేన తోడయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా కమ్యూనిస్ట్ లతో, మజిలీస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళేది. 2004లో టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. చివరకు కేసీఆర్ పార్టీని తన క్యాబినెట్ లో కూడా పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయి అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వస్తున్న దగ్గర నుంచి, వైసీపీలో వణుకు మొదలైంది. టిడిపి-జనసేన కలిస్తే, వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ, తెగ కంగారు పడి పోతుంది. జనసేన పార్టీకి పడే ఓటింగ్, చాలా వరకు తెలుగుదేశం పార్టీదే ఉంటుంది. అందుకే టిడిపి ఓటు చీల్చే జనసేన పార్టీ విడిగానే ఉండాలని, టిడిపితో కలిస్తే తమకు ఇబ్బందని, ఇద్దరి ఓటు ఒకటై, తమ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరూ కలిసి తీసుకుంటే, తమ పని అయిపోతుంది అని జగన్ భావిస్తున్నారు. అందుకే టిడిపి-జనసేన పొత్తు అంటూ వార్తలు వస్తున్న దగ్గర నుంచి, వైసిపి వణికిపోతుంది.

alliance 23032022 2

ఈ పొత్తుని ఎలాగైనా బ్రేక్ చేయాలని, రెచ్చగొట్టటం మొదలు పెట్టింది. పొత్తు పెట్టుకుంటే తప్పు అయినట్టు, మీకు దమ్ము లేదు, సింగల్ గా రావాలి, గుంపుగా ఎందుకు, ఒక్కరే పోటీ చేసే దమ్ము లేదా ? ఇలా వైసీపీ నాయకులు రెచ్చగొడుతూ,పొత్తు ఎదో పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ లేకుండా రాగలడా ? దీనికి వైసీపీ దగ్గర జవాబు లేదు. ఇక బీజేపీలోని ఒక వర్గం ఏమి తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ ని సియం క్యాండిడేట్ చేస్తాం, మాకు ఎవరితో పత్తు ఉండదు అని వీళ్ళే ప్రకటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి అటు పవన్ మీద ఒత్తిడి తెస్తూ, ఇటు టిడిపిని రెచ్చగొడుతూ, టిడిపి-జనసేన కలవకుండా, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సియం అవ్వాలి అనే ఉద్దేశంతో, వైసీపీ, బీజేపీలోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుని ప్రజలలోకి వెళ్తే తప్పు ఎలా అవుతుంది ? చీకటి ఒప్పందాలు చేసుకుని, డబ్బులతో కులాల మధ్య తగువులు పెట్టే వారిని పెట్టుకుంటే తప్పు కానీ ?

పెగాసిస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయింది. వైసీపీ చేసిన అతి ప్రచారం , వాళ్ళు చేసింది ఫేక్ అని, తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా నిరూపించటంతో, ఇప్పుడు వైసీపీ అడ్డంగా ఇరుక్కుంది. దీంతో ఒక రోజులునే, పెగాసిస్ పైన వైసీపీ సైలెంట్ అయిపొయింది. ముఖ్యంగా పెగాసిస్ పైన తెలుగుదేశం పార్టీ, 8 ఆధారాలు బయట పెట్టింది. అందులో మొదటిది ఆర్టిఐ రిపోర్ట్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్ కు అత్యంత ప్రీతి పాత్రుడు గౌతం సవాంగ్ గారే, అసలు ఇప్పటి వరకు తాము పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ కొనలేదు కొనలేదు కొనలేదు అంటూ కుండ బద్దలు కొడుతూ ఇచ్చిన ఆర్టిఐ రిప్లై. దీనికి మించిన తిరుగులేని ఆయుధం మరొకటి లేదు. ఇక రెండో అతి ముఖ్యమైన అంశం, ఎన్నికల ముందు వైవీ సుబ్బా రెడ్డి నా ఫోన్ ని చంద్రబాబు ట్యాప్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు, తరువాత ఎన్నికల్లో గెలవగానే కేసు వెనక్కు తీసుకున్నారు, ఇలా ఎందుకు చేసారని టిడిపి ప్రశ్నిస్తుంది. ఇక మూడో అంశం సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యిందని ఎన్నికల ముందు అమరావతి హైకోర్టులో కేసు వేసారు, ఆ కేసు విచారణకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దీంతో, మీకు ఈ కేసు పై ఇంట్రెస్ట్ లేకపోతే మాకెందుకు అని, హైకోర్టు కేసు కొట్టేసింది.

pegasus 23032022 2

ఇక నాలుగో అంశం, మమతా బెనర్జీ అన్నట్టు వైసిపీ ప్రచారం చేస్తుంది. అయితే ఎక్కడా కూడా మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన రికార్డు లేదు. కేవలం గాలి వార్తలు ఆధారంగా వైసీపీ ఇంత హడావిడి చేస్తుంది. ఇక మరో అంశం, ఈ పెగాసిస్ పైన పిచ్చ కధనాలు అన్నీ సోషల్ మీడియాలో రాసి, అవి డబ్బులు పెట్టి మరీ ప్రోమోట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. డబ్బులు పెట్టి ఎందుకు ప్రోమోట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. మరో అంశం పెగాసిస్ పైన అసలు పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి చెప్పటం, ఢిల్లీలో వద్దు అంటే, ఇక్కడ మాత్రం గోల చేయాలి అంట. ఎందుకో మరి ? ఇక చివరి అంశం, ఈ పెగాసిస్ తయారు చేసిన NSO సంస్థ, ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే ఇచ్చే సాఫ్ట్వేర్ అని, ఎక్కడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే రికార్డు ఉంటుంది కదా ? ఒక్క మమతా బెనర్జీ చెప్పింది అంటూ, ఎక్కడో వచ్చిన గాలి వార్త పట్టుకుని, ఇన్ని ఆధారాలు ఉన్నా సరే, వైసీపీ ఎంత గట్టిగా ఫేక్ చేసిందో అర్ధం అవుతుంది.

ప్రజల ప్రాణాలు ఒక వైపు.. గాలి వార్తలు ఒక వైపు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రణాలను అజెండాగా తీసుకుంటే, అధికార వైసీపీ గాలి వార్తలను ఆధారంగా తీసుకుంది. గత పది రోజులుగా అసెంబ్లీ జరుగుతున్న తీరు పరిశీలిస్తే, వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, టిడిపి ట్రాప్ లో మాత్రం పడలేదు. పది రోజుల క్రితం, జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం సృష్టించాయి. యుక్త వయసులో వాళ్ళు కూడా చనిపోవటంతో, అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇవి కల్తీ సారా మరణాలు అని మొదట చెప్పారు. చనిపోయిన వారి లక్ష్యనాలు చూసి అందరూ అదే అనుకున్నారు. తరువాత దీని పైన తెలుగుదేశం పార్టీ ఆందోళన మొదలు పెట్టింది. ఇవి కల్తీ సారా మరణాలు అని తేలటంతో, అసెంబ్లీలోనే తేల్చుకోవటానికి టిడిపి సిద్ధం అయ్యింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ధైర్యంగా చర్చ పెట్టాల్సింది పోయి, నిస్సిగ్గుగా, అవన్నీ సహజ మరణాలు అని, తెలుగుదేశం పార్టీ స్మశానానికి వెళ్లి అక్కడ సవాలు తెస్తుంది అంటూ, ఎదురు దా-డి చేసారు. అయినా తెలుగుదేశం పార్టీ ఆగలేదు. అక్కడకు చంద్రబాబు వెళ్లారు. బాధితులతో మాట్లాడారు, అక్కడ వారికి టిడిపి శాసనసభ సభ్యులు వెళ్లి పరామర్శించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం కూడా అందించారు.

jagan 23032022 2

చివరకు టిడిపి ఆందోళన, కల్తీ సారాతో పాటుగా, కల్తీ జే-బ్రాండ్స్ మద్యం వైపుకు కూడా మళ్ళింది.సరిగ్గా ఇక్కడే అసలు కధ మొదలైంది. జే-బ్రాండ్స్ మద్యం, వైసీపీకి అతి పెద్ద ఆదాయ వనరు. అందుకే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలుగుదేశం పార్టీ ఈ టాపిక్ ను వదలక పోవటంతో, ఇది ప్రజల్లోకి వెళ్లి పోవటంతో, దీని నుంచి ఎలాగైనా డైవెర్ట్ చేయటానికి, పెగాసిస్ అనే ఒక కట్టు కధను తెర పైకి తెచ్చింది. ఎక్కడా కూడా మమతా చెప్పినట్టు రికార్డు లేకపోయినా, రచ్చరచ్చ చేసింది. ఇలా ఫేక్ చేస్తే, చంద్రబాబు ట్రాప్ లో పడతారని అనుకుంది, అయినా టిడిపి లెక్క చేయలేదు, కల్తీ మద్యం పైనే ఉంది. దీంతో అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టారు. అయినా టిడిపి డైవెర్ట్ అవ్వలేదు. బాటిల్ మూత అడ్డు ఉంటే, చంద్రబాబు ఒక కాలుకు చెప్పు, ఒక కాలుకి బూటు వేసుకున్నారని ఫేక్ చేసారు. అయినా టిడిపి డైవెర్ట్ అవ్వలేదు. ఈ రోజుకీ కల్తీ మద్యం పైనే టిడిపి గట్టిగా నిలబడింది. దీంతో వైసీపీ ఎంత ట్రాప్ చేయాలని చూసినా, టిడిపి మాత్రం వాళ్ళ ట్రాప్ లో పడలేదు.

Advertisements

Latest Articles

Most Read