జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రశ్నించేందుకే జనసేన అన్న పవన్.. రాష్ట్రానికి నష్టకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ గురించి ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పవన్‌కల్యాణ్‌ చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక వైపు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తుంటే మరో వైపు వైకాపా, జనసేన పార్టీలు కేంద్రంలోని భాజపాతో కలిసి లాలూచీ రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు.

pk 05072018 2

ఈసందర్భంగా పవన్‌కు కొన్ని ప్రశ్నలు మంత్రి సంధించారు. ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని.. ఆ బిల్లును కేంద్రం ఆమోదించకుండా నానబెడుతుంటే మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విభజన హామీలను మొత్తం చేసేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే పవన్‌ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ఉత్తరాంధ్రకు ఇచ్చిన రూ.150 కోట్లు ప్రధాని వెనక్కి లాగేసుకున్నా.. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు నాలుగేళ్లు అయినా ఇవ్వకపోయినా.. పవన్‌ ఎందుకు మోదీని విమర్శించరని ప్రశ్నించారు.

pk 05072018 3

విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు తగు సాయం ఇవ్వన్ని కేంద్రాన్ని పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై పవన్‌ తన వైఖరిని ఎందుకు ఇంత వరకు తెలియజేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైల్వేజోన్‌ కోసం తెదేపా ఎంపీలు దీక్ష చేపడితే కనీసం సంఘీభావం తెలపకుండా విమర్శలకు దిగటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటూ పలు ప్రశ్నలు సందించారు. పవన్‌, జగన్‌, మోదీతో కుమ్మక్కులో భాగమే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

జియో టాగింగ్ అంటాడు.... టెక్నాలజీ అంటాడు... ఇవన్నీ జరిగే పనేనా అంటూ ఉంటారు, కొంత మంది... అదే టెక్నాలజీతో ఏంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు చంద్రబాబు... స్మశానాల్లో పెన్షన్ లు తీసుకున్న రోజులు కూడా మనం చూశాం... అంతటి దోపిడీ చూసిన ప్రజలకి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి పెన్షన్ తీసుకున్నారో కూడా మన ముందు ఉంచుతున్నారు... తాజాగా, ఇవాళ లక్ష మంది పేదలకి ప్రభుత్వం ఇల్లు కట్టించింది... ఇవాళ గాంధీ జయంతిని పురస్కరించుకుని గృహప్రవేశాలు జరిగాయి... ఇదో శుభకార్యంగా భావిస్తూ, గృహప్రవేశాలు చేసిన లబ్దిదార్ల దంపతులకు రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నూతన వస్త్రాలను కూడా బహుకరించారు...

houseing 05072018 2

ఇది వరకు మనం చూసాం... ఇందిరమ్మ ఇల్లు అని, ఉన్న పూరి పాకలు పీకి, ఊరి బయట మొండి గోడలతో మమ అనిపించి, కాంట్రాక్టర్ల జేబులు నింపారు.... అది కూడా చాలా తక్కువ... నాలుగు పిల్లర్లు లేపి, ఇవే ఇల్లు అంటూ, బిల్లులు పెట్టుకుని, పేదల డబ్బులు నోక్కేసారు...ఇప్పుడు చంద్రబాబు వచ్చారు... ప్రతి పేద వాడి మొఖంలో భరోసా ఇస్తూ, సొంత ఇంటి కలను నిజం చేస్తున్నారు... ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభించారు.. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యమని చెప్పారు...

ఈ ప్రక్రియ అంతా ఎంత పారదర్శకంగా జరిగింది అంటే... కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించేటప్పుడు, లబ్దిదారులకు ఫోన్ చేసి, ఎవరైనా లంచం అడిగారా అని అడిగి తెలుసుకుంటున్నారు.. ప్రతి ఇంటినీ జియో ట్యాంగింగ్ చేసి, ఫోటోలు తీసి వెబ్సైటులో పెట్టారు. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో... ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి .. ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, ఇవాళ గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... https://apgovhousing.apcfss.in/NTRGReport.do?spell=2 మీకు ఏమన్నా తేడా కనిపిస్తే, వెంటనే మీడియాకు ఎక్కి, చెప్పండి... 3 లక్షల ఇళ్ళ వివరాలు, ఫోటోలతో సహా పెట్టి, రియల్ టైం లో చూపిస్తున్నాడు చంద్రబాబు. ఇక అపోజిషన్ కు సౌండ్ ఎక్కడ ఉంటుంది. అందుకే ఒకడు కాల్చేస్తా అంటుంటే, ఇంకొకడు చొక్కా పట్టుకుని రోడ్ మీదకు లాగుతా అంటున్నాడు.. వీళ్ళు ఇలాంటి డైలాగ్ లు చెప్పి, ప్రజలని రంజింప చెయ్యటం తప్ప, ఏమి చెయ్యలేరు...

రేపల్లె దగ్గర ఉన్న ఆనగాని రంగారావు నగర్ లో ఆనందం తాండవిస్తుంది. నాలుగు తరాల నుంచి నిలువ నీడకు నోచుకోని యానాది కుటుంబాలకు పక్కాగృహ నిర్మాణం పూర్తి కాగా గురువారం గృహప్రవేశ మహోత్సవం జరిగింది. ఎక్కడో మట్టి డొంకల్లో చుట్టూ గుడిసెల్లో భయం భయంగా రోజులు గడుపుతున్న 33 కుటుంబాల గిరిజనులకు నగరం పంచాయతీలోని కాపులపాలెంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవాస ప్రాంతానికి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తండ్రి పేరు మీదగా అనగాని రంగారావు నగర్ అని నామకరణం చేశారు. అంతటితో విడిచి పెట్టకుండా ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ స్కీమ్ లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ 33 పక్కా గృహ నిర్మాణాలకు మంజూరు ఇచ్చారు.

house 05072018 2

తమంత తాముగా ఇళ్ళు కట్టుకునే స్తోమత లేని గిరిజనులకు విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆరనైజేషన్ స్వచ్చంద సంస్థ బాసటగా నిలిచింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ప్రభుత్వం అందించిన నిధులకు తోడు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిధులు, తమ సొంత నిధులను జోడించి వీఆర్వో సంస్థ ఇళ్లు సముదాయం నిర్మించింది. ఇళ్ళలో నుంచి వచ్చే వ్యర్థ జలాలు నేలమీద కనిపించకుండా ఆండర్ గ్రౌండ్ పైప్లైన్ల ద్వారా బయటకు నడిచే ఏర్పాటు చేశారు. కాలనీలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటల్లోకి వ్యర్థ జలాలు మళ్పించే విధంగా పైప్లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఇళ్ళను గురువారంలబ్దిదారులకు అందచేస్తారు.

గృహ సముదాయ నిర్మాణానికి ముందు పల్లంగా ఉన్న ఇళ్ళ స్థలాలను మెరక చేయడం, రోడ్లకు మట్టితోలటం, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించటం పనులను షిఫర్డ్ సంస్థ నిర్వహించింది. కాలనీలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది. ఊరిబయట నుంచి అనగాని రంగారావు నగర్లోకి దారితీసే ప్రధాన రహదారిని కూడా సీసీ రోడ్లుగా నిర్మించారు. ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అనగానికి రుణపడి ఉంటామని అంటున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళల్లో గృహప్రవేశాలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ఈసారి అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశా చేపట్టింది.

ఒక పక్క కంపెనీల ప్రారంభోత్సవాలు.. మరో పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు.. మరో పక్క పేదల ఇళ్ళ ప్రారంభోత్సవాలు.. ఇలా సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం అన్నీ దూసుకుపోతున్నాయి. ఈ రోజే మూడు లక్షల ఇళ్ళ గృహప్రవేశాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ నెల 11న మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల పదకొండున వంద అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 50వేల జనాభా పైబడిన అన్ని పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తొలిదశలో 100 అన్న క్యాంటీన్లు ఈ నెల 11న ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

cbn 05072018 2

203 క్యాంటీన్ల ఏర్పాటుకు బడ్జెట్లో రూ. 200 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 36 లక్షలను మంజూరు చేసింది. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాల కొరత ఉండటంతో అన్నింటినీ ప్రారంభించడం సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న 100 ప్రాంతాల్లో ఇప్పటికే పనులు పూర్తవుతున్నాయి. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో ఇప్పటికే రెండు క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 100 క్యాంటీన్లు వారంలో ఆరు రోజులపాటు నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తాయి. అయితే ఆదివారం మాత్రం వీటికి సెలవుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి మొత్తం రూ.15లు ఒక్కరి నుంచి వసూలు చేస్తారు. అంటే పూటకు రూ.5లు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

cbn 05072018 3

ఈ ఒక్కొక్క క్యాంటీన్లలో ఉదయం 300 మందికి టిఫిన్, మధ్యా హ్న భోజనం 360 మందికి, రాత్రి భోజనం 240 మందికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్యాంటీన్ల ప్రారంభం అనంతరం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి వీటిని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆహారం ఇలా... వారంలో 6 రోజులపాటు పనిచేసే అన్న క్యాంటీన్లల్లో అందించే ఆహార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం అల్పాహారంగా ఇడ్లీ లేదా పూరి, మంగళవారం ఇడ్లీ, ఉప్మా, బుధవారం ఇడ్లీ, పొంగలి, గురువారం ఇడ్లీ, హరి, శుక్రవారం ఇడ్లీ, ఉప్మా, శనివారం ఇడ్లీ, పొంగలి అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్లేటుకు మూడు ఇడ్లీ లేదా మూడు పూరి, అదే విధంగా ఉప్మా, పొంగలి 200 గ్రాములు ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజునంలో అన్నంతో పాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చ డి అందించనున్నారు. మధ్నాహ్నం, రాత్రి భోజనంలో అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, సాంబారు 120 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందించనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ క్యాంటీన్లు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి.

Advertisements

Latest Articles

Most Read