బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయనను లక్ష్యం చేసుకొని ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకొని విచక్షణ లేకుండా కొట్టారు. పోలీసులు ఎంత వారించినా వదిలిపెట్టకుండా, ఆ వ్యక్తిని పట్టుకుని, పది మంది బీజేపీ నేతలు కలిసి కొట్టారు. అనంతరం అతడిని ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రిపాటి ఉమామహేశ్వరరావు అని తేలింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

kannaa 04072018 2

పోలీసులు ఆయనను ప్రశ్నించినప్పుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, రాష్ట్రం పై కేంద్రం చేస్తున్న పనులకు విరక్తి చెంది, అలాగే ఏపీకి జరుగుతున్న నష్టం, కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని, ఆవేశంతోనే చెప్పు విసిరానని ఆయన చెప్పాడు. వెంటనే అక్కడ బీజేపీ కార్యకర్తలు కొట్టారని, నేను చేసింది తప్పు అయితే, వారు చేసింది కూడా తప్పే అని, పోలీసులు వారిని కూడా అరెస్ట్ చెయ్యాలని అన్నారు. అయితే, ఈ విష్యం పై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించి, వారి కుటుంబ నేపధ్యం గురించి ఆరా తీస్తున్నారు.

kannaa 04072018 3

ఈ దాడిపై టీడీపీ నేత బీదా రవిచంద్ర మాట్లాడుతూ.. అది ఓ వ్యక్తి చేసిన ఘాతుకం కాదని, తనకు తెలిసినంత వరకు అతను మా ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. అయితే, ఈ దాడి బీజేపీ నేతలు మదంతో చేస్తున్న వ్యాఖ్యల పర్యావసానమే అని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడకుండా, గుజరాత్ బాస్ లకు దాసోహం అయ్యి, వారి భజన చేస్తూ, వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, ప్రజలు ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పటానికి రెడీ అవుతా ఉండగా, ఉమామహేశ్వరరావు మాత్రం, ఆవేశంతో, చెప్పులతో దాడి చేసారు. ఇలాంటి వారికి, ఓటుతో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినట్టు, వీరిని కూడా చెయ్యాలి. అంతే కాని, ఇలాంటి దాడులు చేస్తే, ఇలాంటి వారికి మరిన్ని అవకాశాలు మనమే ఇచ్చినట్టు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన అస్ట్రమ్ (ASTRUM)కంపెనీ... కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉన్న అస్ట్రమ్ (ASTRUM)కంపెనీ.. ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్ల పెట్టుబడి,1000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్న అస్ట్రమ్ (ASTRUM)కంపెనీ... తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల లో కంపెనీ ఏర్పాటు కు అంగీకరించిన అస్ట్రమ్ (ASTRUM)... ఆడియో పరికరాలు,ఎల్ఈడి లైట్లు,సెల్ ఫోన్ మరియు ల్యాప్ టాప్ యాసిసరీస్,కంప్యూటర్ కంపోనెంట్స్ ,గేమ్ కంట్రోలర్స్ తదితర కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ లో ఉన్న అస్ట్రమ్ (ASTRUM)... ప్రస్తుతం షేన్ జెన్ (shenjen) లో ఉన్న ఫ్యాక్టరీ లో వివిధ కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తున్న అస్ట్రమ్ (ASTRUM)...

electronics 04072018 2

మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రెటరీ విజయానంద్ మరియు అస్ట్రమ్ (ASTRUM)కంపెనీ సిఈఓ మనోజ్.. కంపెనీ సిఈఓ మనోజ్ కుమార్ ,డైరెక్టర్ అలోక్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుంది... రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు... కేవలం నాలుగేళ్లలో దేశంలో తయారు అవుతున్న 100 ఫోన్లలో ప్రస్తుతం 26 ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయి... ఫాక్స్ కాన్ ఒక్క చోటే ఇప్పుడు 15,300 మంది మహిళలు పనిచేస్తున్నారు... సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది...

electronics 04072018 3

త్వరలోనే రిలయన్స్ జియో ఎలక్ట్రానిక్స్ పార్క్ ని తిరుపతిలో ఏర్పాటు చేయబోతోంది.సుమారుగా 25 వేల మందికి అక్కడ ఉపాది వస్తుంది... శ్రీ సిటీ లో ఫ్లెక్స్ ట్రానిక్స్ ప్రారంభం కాబోతోంది అక్కడ మరో 6,600 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి... అమరావతిలో ఇన్వెకాస్ చిప్ డిజైన్ పార్క్ ఏర్పాటు చేస్తుంది.చిప్ డిజైనింగ్ లో 5 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి... దేశంలో వియోగిస్తున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్ లో తయారు అవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం... దానికి అనుగుణంగా దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఇచ్చాం,రాయితీలు కల్పిస్తున్నాం... ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్ నుండి బ్యాటరీ తయారీ వరకూ అన్ని ఓకే చోట తయారు అయ్యేలా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం... ఒక్క సెల్ ఫోన్స్ మాత్రమే కాకుండా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ తయారీ త్వరలో ఏపీ లో ప్రారంభం కాబోతోంది... త్వరితగతిన కంపెనీ ఏర్పాటు కు పూర్తి సహకారం అందిస్తాం - మంత్రి నారా లోకేష్

బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ప్రజలు తిరగబడుతున్నారు. అలిపిరిలో సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకే నిరసన గళం వినిపించిన ఆంధ్రులు, సిగ్గు లేకుండా గుజరాతీ సోది చెప్తున్న రాష్ట్ర బీజేపీ నేతల పై కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మా మోడీ లక్షల లక్షల కోట్లు ఇచ్చాడు అంటూ హేళన చేస్తున్నారు. ఎంత సేపు మోడీ, అమిత్ షా భజన, వాళ్ళ స్క్రిప్ర్ట్ ప్రకారం నడుచుకోవటమే కాని, వీరికి ఈ రాష్ట్రంలో పుట్టిన కనీస విశ్వాసం లేదు. ప్రతి రోజు టీవీల ముందుకు రావటం, మీకు అవి ఇచ్చాం, మీకు ఇవి ఇచ్చాం, మా మోడీ పెట్టిన బిక్ష ఇది అంటూ, ఆంధ్రులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే, వీరి ప్రతాపాలు టీవీల్లో మాత్రమే, గ్రౌండ్ లెవెల్ లో, ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు.

kanna 04072018

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు కావలిలో పర్యటన చేస్తున్నారు. ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కావలిలో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయన పై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పు విసిరిన ఉమామహేశ్వరరావుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం, అతను ఎవరో తెలియదు అని, ఒక వేళ బీజేపీనే ఇలా చేపించి, రాచ్చ చేస్తుందేమో అని, పోలీసులు ఈ విషయం పై కూడా విచారణ చెయ్యాలని చెప్తున్నారు.

kanna 04072018

మరో పక్క కేంద్రం ప్రతి రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొడుతూనే ఉంది.. నా చేతిలో అధికారం ఉంటే, నిన్ను ఎన్ని అయినా అంటాడు, నీ బాధని వెటకారం చేస్తాను, హేళన చేస్తాను అంటూ, గత సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం... బాధ్యత, భయం అనేది లేకుండా, అధికార మదంతో బ్రతికేస్తారు... ఈ విషయంలో, మన బీజేపీ నాయకులు, నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.. 2 సీట్లు నుంచి, ఇక్కడ వరకు వచ్చిన బీజేపీ, గతాన్ని మర్చిపోయి, చంద్రబాబు లాంటి నాయకుడుని, 13 జిల్లాల నాయకుడికి, ఒక జాతీయ పార్టీ సమాధానం చెప్తుందా అంటూ హేళన చెయ్యటం చూసాం.. మీ మోఖాలకి, పెద్ద రాజాధాని కావాలా ? మయసభ కట్టుకుంటారా, అంటూ అమరావతి పై హేళన చెయ్యటం చూసాం.. విభజన హామీలు కోసం పోరాటం చేస్తుంటే, మీకు 85 శాతం అన్ని హామీలు ఇచ్చేసాం, లక్షల కోట్లు ఇచ్చాం అంటూ, మాట్లాడటం చూస్తున్నాం... ఇవన్నీ అధికార మదంతో మాట్లడే మాటలే... అందుకే ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి పట్టించిన గతి, ఈ బీజేపీకి కూడా పట్టించటానికి రెడీ అయ్యారు.

నిన్న జీవీఎల్ మాట్లాడిన మాటలు, ఈ రోజు కేంద్రం సుప్రీం కోర్ట్ లో వేసిన అఫిడవిట్ పై ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. నిన్న జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ, డీపీకి చెందిన ప్రతి వెధవ తమను భయపెట్టాలనుకుంటున్నారని, తాము భయపడే ప్రసక్తే లేదని, సోషల్ మీడియా పచ్చ చొక్కాలు జాగ్రత్తా అంటూ, నోటికి ఏది వస్తే అది మాట్లడారు. దీని పై కుటుంబరావు ధీటుగా స్పందించారు. బీజేపీ వాళ్లను వెధవ అంటే ఆ పదాన్ని కూడా అవమానించినట్లే అవుతుందన్నారు. బీజేపీ వాళ్లను వెధవ అని ఆ పదాన్ని తక్కువు చేసే ఉద్దేశం లేదన్నారు. బీజేపీని అందరూ భారతీయ జుమ్లా పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. జుమ్లా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

gvl 04072018 2

రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. సాగరమాల కింద రూ.1800 కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసం రాష్ట్రానికి కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కుటుంబరావు స్పష్టంచేశారు. కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఊసేలేదన్నారు. సాగరమాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3750 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 592 ప్రాజెక్టుల్లో ఏపీకి 104 ప్రాజెక్టులు కేటాయించామని చెప్పడం అబద్ధమన్నారు. కేంద్రానికి మేం రాసిన ఉత్తరాలు చూపిస్తారు.. మీ ఉత్తరాలు ఎందుకు చూపించరని నిలదీశారు.

gvl 04072018 3

ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వచ్చాక ప్రధాని ఇంతవరకు నోరు విప్పలదేన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయం తెలుసు కాబట్టే ఆయన నోరు విప్పలేకపోతున్నారని అన్నారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‌ ఏం హీరోనో తనకు అర్థం కావట్లేదనన్నారు కుటుంబరావు. సినిమా స్క్రిప్ట్‌ మాదిరిగా డైలాగులు చెబితే సరిపోతుందని ఆయన అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తుల వ్యక్తిత్వాలపై బురద చల్లి.. ఆ బురదను తానే అంటించుకున్నారని విమర్శించారు. విశాఖలో తిరుగుతూ రైల్వేజోన్‌పై ఒక్క మాటైనా పవన్‌ మాట్లాడారా? అని ప్రశ్నించారు. అలాగే తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుకు తాను నోటీసులు పంపినట్టు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read