ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఉత్తరాంధ్రలో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ అశాంతిని సృష్టించకూడదని, ఆ ప్రాంతంలో ఏపీ సర్కారు చేసిన అభివృద్ధి కనబడట్లేదా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ నటుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలా ఆలోచించి మాట్లాడాలని బండారు సత్యనారాయణ సూచించారు. ఆయన కేంద్ర సర్కారుని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. అభివృద్ధిపరంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తే అమలుచేసే తత్వం తెదేపా ప్రభుత్వానికి ఉందన్నారు. ఓడరేవు ప్రాంతంలో కాలుష్య సమస్యకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

bandaru 01072018 2

పవన్ రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని.. ఆయన అన్న పార్టీలో పని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూసిన తర్వాత కూడా బీజేపీని కానీ ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట ఎందుకు అనటం లేదన్న ఆయన.. పవన్ తీరు చూస్తుంటే బీజేపీ స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేయటం గమనార్హం. విశాఖలో మూడు నెలలుగా ఉంటున్న పవన్.. విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సిట్‌ను ఏర్పాటు చేశారని, ఆ నివేదిక ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. త్వరలోనే సిట్‌ నివేదిక వెలుగుచూస్తుందని, అక్రమార్కులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

bandaru 01072018 3

తెదేపా ఏర్పాటుతోనే ఉత్తరాంధ్ర రాజకీయంగా బలోపేతమైందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీరు, ఐటీ రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందన్నారు. భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చాయన్నారు. విశాఖ నగరం జాతీయ స్థాయి అత్యుత్తమ నగరాల్లో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఇదంతా తెదేపా పాలనలో సాగించిన అభివృద్ధి ఫలితమేనని, ఇవేవీ పవన్‌ కల్యాణ్‌కు కనబడడం లేదా? అని నిలదీశారు. కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు సైతం రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని ఏరకంగా పవన్‌ విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు.

నిన్నటి వరకు ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్, ఆయన ఏసీబీ డీజీగా ఉన్న చివరి రోజుల్లో చేసిన పనితో, అవినీతి పరులు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అందినకాడికి దోచుకున్నారు. ముందు మూడు తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని పోగేశారు. కథ అడ్డం తిరగడంతో ఏసీబీకి చిక్కారు. ఆ ఏముందిలే.. ఏసీబీకి చిక్కినా మనం పోగేసిన ఆస్తికి డోకా లేదనే ధీమాతో ఉన్న అక్రమార్కుల వెన్నులో ఇప్పుడు కొత్త చట్టం వణుకుపుట్టిస్తోంది. గత నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. అక్రమాస్తులన్నీ ప్రభుత్వ పరం కానున్నాయి. గతేడాది విశాఖపట్టణం రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సర్వే ఇన్స్పెక్టర్ జీ.ఎల్.గణేశ్వరరావును కొత్త చట్టం కింద తొలికేసుగా తీసుకున్నారు. మరో మూడు అవినీతి తిమింగళాలను కొత్త చట్టం పరిధిలోకి తేనున్నట్టు ఏసీబీ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

rp thakur 01072018

కొత్త చట్టం పరిధిలోకి వెళ్లడం ఖాయమని తెలిసినప్పటికీ.. ఇప్పుడా ముగ్గురు ఎవరనే దానిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. 2017లో అక్రమాస్తుల కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రజారోగ్య శాఖలో పని చేసిన పాము పాండురంగారావు, రాష్ట్రపట్టణ ప్రణాళిక డైరెక్టర్ జీ.రఘు, రహదార్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధర్, రాష్ట్రపరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ సురేష్ బాబు సహా 11 భారీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడిన అక్రమ సంపాదన రూ.2500 నుంచి రూ.3వేల కోట్ల వరకు ఉండొచ్చని అప్పట్లోనే అధికారులు నిర్ధారించారు. రఘు, పాండు రంగారావు కేసుల్లోనే రూ.వెయ్యి కోట్ల వరకు అక్రమాస్తులను అధికారులు సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ప్రత్యేక కోర్టు చట్టం-2016 పరిధిలోకి తెచ్చేందుకు ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

rp thakur 01072018

పోయిన నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను నెల రోజుల్లోగా ప్రభుత్వపరం చేస్తారు. చరాస్తులను కోర్టు కస్టడీలో పెట్టి స్థిరాస్తుల పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయనున్నారు. ఆరు నెలల్లోగా కేసులో చార్జిషీటు దాఖలు చేయడంతో పాటు ఏడాది లోగా విచారణ పూర్తి చేస్తారు. విచారణలో కేసులో పట్టుబడిన అధికారి, ఉద్యోగికి శిక్ష పడితే స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. ఒక వేళ శిక్ష పడకుంటే 5శాతం వడ్డీతో ప్రభుత్వం సంబంధితులకు ఆస్తులను అప్పగిస్తుంది. ఇప్పటి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించే అధికారం లేకున్నా అనుభవించే అధికారం మాత్రం వీరికి ఉండేది. పైగా చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరాల్సి వచ్చేది. కొత్త చట్టంలో ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఇప్పటి వరకు బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా చట్టం అమలులో ఉంది. ఇప్పుడు ఏపీ ఈ తరహా చట్టం ప్రయోగించిన మూడో రాష్ట్రంగా ఉండబోతోంది.

రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన కచ్చితంగా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాలతో ఉన్నారు. అలా వస్తే.. వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు. పార్టీ పరంగా కసరత్తు కూడా ప్రారంభించారు. డిసెంబర్ అంటే.. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనేదే ఏపీ అధికార పార్టీ భావన. ఇటీవలి కాలంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను మూడు నెలల కిందటే ప్రారంభించారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. 40 నియోజకవర్గాలలో పార్టీ వెనుకబడి ఉందని నిర్దారించుకుని వాటిపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.

cbnoperation 01072018 2

ఈ నేపధ్యంలోనే, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చంద్రబాబు టీమ్‌లను రంగంలోకి దించారు. ఒక్కో జిల్లా బాధ్యతను ఇద్దరు ప్రొఫెసర్లకు అప్పగించారు. సర్వేలో నిష్ణాణుతులైన ప్రొఫెసర్లకు చంద్రబాబు స్వయంగా తయారు చేసారు. ఈ ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరి స్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారి పై ఉన్న ఆరోపణలు, అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొంటున్నారా లేదా? ఎమ్మెల్యే అందరినీ కలుపుకుని వెళ్తున్నారా? ఇసుక తవ్వకాల్లో తల దూర్చుతున్నారు? ప్రజలు ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు? టికెట్‌ ఇస్తే మళ్లీ గెలుస్తారా? వంటి అనేక ప్రశ్నలతో టీడీపీ ప్రొఫెసర్లు విశ్లేషణాత్మక సమచారాన్ని సేకరిస్తున్నారు.

cbnoperation 01072018 3

ప్రస్తుతం జరుగుతున్న సర్వే నివేదిక అందాక, వచ్చే నెలలో చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం కాబోతున్నారు. ఆ నివేదికలోని అంశాలను వారి ముందుంచుతారని సమాచారం. నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్‌పై ఆశలు వదులుకోలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సర్వే పూర్తయ్యింది. అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యే సరికి పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఒక అంచనాకు వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సమావేశంకానున్నారని తెలిసింది. జులై నెలలో వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఢిల్లీలో భేటీకానున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు పురోగతి ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పలు హామీలను పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ నాయకులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. కడపతో పాటు ఖమ్మం జిల్లాలోని బయ్యారంలోనూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నది.  ఏపీకి సంబంధించి ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.

babu kcr 01072018 2

మరో పక్క కెసిఆర్, చంద్రబాబు కలవకుండా మోడీ పాచిక వేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చి ఆయన చంద్రబాబు వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమైతే వారి ఖాతాలో 30కి పైగా సీట్లు ఉంటాయని, ఎన్నికల తర్వాత వారి నిర్ణయం కీలకమవుతుందని భావించిన మోదీ భేదోపాయం ప్రయోగించారు. ఏ ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంగానే ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడి చేసినా అది పురుడుపోసుకోలేకపోయింది. అందుకే కెసిఆర్ ప్రతి విషయంలో మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఎన్నికల సమీపిస్తున్న వేళ, విభజన హామీల అమలు పై, ఎదో చేస్తున్నాం అనే బిల్డ్ అప్ ఇవ్వటం కోసం, ప్రధాని ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి, ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది.

babu kcr 01072018 3

మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

Advertisements

Latest Articles

Most Read