వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాను ఎలా రక్తికట్టిస్తున్నారో చూస్తున్నాం... వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని, మొన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైసిపీ ఎంపీలు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

lokesh 05062018 2

అయితే, ఇవన్నీ నకిలీ రాజేనమాలే అని అందరూ మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా, ఎన్నికలు వచ్చే అవకాసం లేదు. సంవత్సరం లోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే, ఏ ఉప ఎన్నికలు జరిపే అవకాసం ఉండదు. అందుకే, ఒక పధ్ధతి ప్రకారం, ఈ స్టొరీ నడిచింది. వీళ్ళు రాజీనామా చేసి, దాదాపు మూడు నెలలు అవుతుంది. అప్పుడే రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు వచ్చేవి, వీళ్ళను ప్రజలు ఎంత నమ్ముతున్నారో తెలిసేది. అయితే, మొన్న కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే, అరగంటలో ఆమోదించారు. వైసిపీ ఎంపీల రాజీనామాలు మాత్రం, మూడు నెలలు అయినా పెండింగ్ లో పెట్టారు.

lokesh 05062018 3

వీళ్ళు ఆడుతున్న డ్రామాల పై, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఏమి నటన...ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు. రాజీనామాల డ్రామా ఆడిన వైసీపీ ఎంపీలకు 'భాస్కర్‌' అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు వారి సొంత కథతో 'ఏ1...అర డజను దొంగలు' సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్‌లో మంత్రి లోకేష్‌ వ్యంగ్ర్యాస్త్రాలు సంధించారు. "ఏమి నటన! YSRCP MPs deserve ‘Bhaskar Awards’ for misleading the public with their resignations drama. In connivance with BJP, they cleverly passed time so as to reach the 1-year threshold before the General elections & ensured that the by-poll situation is avoided! Wah re wah! "I suggest that they invest in making a Tollywood film “A1 మరియు అర డజన్ దొంగలు” based on their own true story."

విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలో పాల్గున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

cbn pk 05062018 2

‘పవన్‌ కల్యాణ్‌ మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడారు. బీజేపీకి టీడీపీ కటీఫ్‌ చెప్పిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని మేం విమర్శిస్తుంటే... పవన్‌ మమ్మల్ని విమర్శిస్తున్నారు. దీనికి కారణమేమిటో చెప్పాలి అని అన్నారు. ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చాం, ఏ కారణం చేత ఇలా చేస్తున్నారో, కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి చుస్తే, బాధ ఆవేదన కలుగుతుంది. ప్రజల కోసం భరించక తప్పదు అని చంద్రబాబు అన్నారు.

cbn pk 05062018 3

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ఉపసంహరించుకున్న తర్వాతే ఆయనలో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిస్వార్థంతో మంత్రి పదవులను తృణప్రాయంగా త్యజించడం.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం తప్పా? రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు అని పవన్ ను ఉద్దేశించి అన్నారు. ‘ప్రజాసేవకే నా జీవితం అంకితం. ప్రతిపక్షాలు.. కొత్త పార్టీలు లేనిపోని విమర్శలు చేసినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. మీ అండదండలుంటే కొండనైనా ఢీ కొడతా. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా’ అని చంద్రబాబు ప్రకటించారు.

ఐదు కోట్ల ప్రజల కోసమే నవనిర్మాణ దీక్ష చేపట్టామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, పథకాల అమలు తీరుపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజానీకం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని.. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని మోదీ అన్ని అంశాలపై హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత మోదీ మాట మార్చారని.. రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే కేంద్రం న్యాయం చేస్తుందని ఎంతో సహనంతో వేచి చూశామని.. హామీల సాధనకు పోరాటమే మార్గమని ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు.

cbn 05062018 2

‘ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా రాజీనామా డ్రామాలు ఆడుతోంది. ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాల నాటకాలు ఆడుతున్నారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే మోదీ, భాజపాపై పోరాడాలి. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగానే వైకాపా నేతలు, పవన్‌ కల్యాణ్‌ నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బలహీన పరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు. అయితే ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయేమో కానీ.. ఏపీలో సాగవు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి.’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

cbn 05062018 3

‘కేంద్రంతో రాజీ లేదు.. ధర్మపోరాటం చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రుణమాఫీ అమలు చేశాం. మహిళా సంఘాల రుణాలు రద్దు చేశాం. సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాం. పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ’ అని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను రాష్ట్రంలో చిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

నవనిర్మాణ దీక్ష జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీనితో భయానక వాతావరణం నెలకొనటంతో సభలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సీఎం చంద్రబాబు వేదికపై ఉన్నచోటే కూర్చున్నారు. ఆయనపై వర్షం పడకుండా సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇచ్చిన వినతిపత్రాలను సెల్‌ టార్చ్‌ వెలుగులో పరిశీలించారు.

cbn 05062018 2

శృంగవరపుకోటలో సోమవారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణదీక్ష సభకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు సభా ప్రాంగణం చిగురుటాకులా వణికింది. రెండువైపులా రేకులు ఎగిరిపోవడంతో అదెక్కడ కూలిపోతుందోనని పలువురు హడలిపోయారు. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా వర్షం నీరు పడడంతో ఆయన కుర్చీ మారగా భద్రతా సిబ్బంది గొడుగుపట్టాల్సి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సభను ప్రారంభించి ఏకధాటిగా 1.20 గంటల పాటు ప్రసంగించారు.

cbn 05062018 3

అయితే కరెంటు పోయిన సందర్భంలో కూడా చంద్రబాబు రెస్ట్ తీసుకోకుండా, సెల్ లోని టార్చ్ లైట్ వేసుకుని, ఆయన వద్దకు వినతి పత్రాలు ఇచ్చే వారిని రమ్మని, సెల్ లైట్ వెలుతురులోనే, అవి చూసి ఆదేశాలు ఇచ్చారు. ఇవి చూసిన ప్రజలు, చంద్రబాబు కమిట్మెంట్ ను మెచ్చుకున్నారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా, చంద్రబాబు పని చెయ్యటం చూస్తుంటే, మన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకూడదు అని, దానికి చంద్రబాబే ఆదర్శం అని అన్నారు. ఒక కమిట్మెంట్.. ఒక అడ్మనిస్ట్రేటర్.. ఒక విజన్.. ఒక దిక్సూచి.. వీటికి అర్ధం ఏంటో, ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read