మన రాష్ట్రంలో ఒకాయన చంద్రబాబుని కాల్చి పడేసి బంగాళాకాతంలో పడేయమంటాడు.. కొత్తగా బయలుదేరిన ఇంకో ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మా ఖర్మ అంటాడు.... చంద్రబాబు లాంటి గ్లోబల్ లీడర్ కి, ఇలాంటి వాళ్ళతో మాటలు పడుతున్నారు అంటే, నిజంగా ఆయన జీవితం ఏంటో ఇలా ఉంది అనుకోవటం తప్ప, ఏమి అనలేము... చంద్రబాబు గ్లోబల్ లీడర్ ఏంటి, అని అనే వాళ్ళు కూడా ఉంటారు... ఆయన గ్లోబల్ లీడర్ ఎందుకు అయ్యారో, బిల్ గేట్స్ ని అడగండి, బిల్ క్లింటన్ ని అడగండి, సిస్కో చైర్మెన్ ని అడగండి, ప్రపంచంలోని టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ వచ్చే దావోస్ కి వెళ్లి, ఎవర్ని అయినా అడగండి చెప్తారు, చంద్రబాబు గ్లోబల్ లీడరో కాదో... వీళ్ళని అడగటం అంత ఇబ్బంది అనుకుంటే, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ లేటెస్ట్ గా ఏమంటున్నారో వినండి...

erik 03062018 2

యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్యసమితి...అలాంటి ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్,మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఏమని ట్వీట్ చేసారో తెలుసా... "చంద్రబాబు నోటి వెంట ఇన్స్పైరింగ్ వర్డ్స్ వింటున్నా.. రియల్ టైం గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, నాలెడ్జ్, అన్నీ కలిస్తేనే, ఈ ప్రపంచం ముందుకు వెళ్తుంది.. ఇన్స్పైరింగ్ అంటూ" ట్వీట్ చేసారు... అంతే కాదు ఐక్యరాజ్యసమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి, ప్రకృతి వ్యవసాయం కోసం పని చేస్తున్నారు. దీని పై కూడా ట్వీట్ చేసారు. "Good to meet the Chief Minister of Andhra Pradesh @ncbn to discuss the state’s ambitious natural farming plans. @UNEnvironment is delighted along with partners, to support this bold initiative to protect climate, biodiversity and ensure food security "

erik 03062018 3

రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో క్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ కూడా పాల్గున్నారు. ఆయన అక్కడ కూడా మాట్లాడారు ‘‘ప్రకృతి సేద్యం విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విధానానికి తన దావోస్‌ పర్యటనలో ఆయన అమిత ప్రాధాన్యతని ఇచ్చారు. అక్కడ జరిగిన సదస్సులో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌, నాణ్యత తదితర అంశాలపై అంత ర్జాతీయ వ్యాపార సంస్థలను కదిలించడానికి ప్రయత్నించారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఎక్కువ కంపెనీలను ఆకర్షించగలిగారు’’ అని ఐరాస ఉపాధి కల్పన విభాగం ఉన్నతాధికారి ఎరిక్‌సోలెన్‌ కొనియాడారు.

మాకు హక్కుగా రావాల్సిన దాని కోసం పోరాడతాం... మాకు రావాల్సింది రాలేదని, బాధ పడుతూ కూర్చోం... మాకు ఉన్న వనరులతో, మా ప్రజలకి కష్టం లేకుండా చేస్తా... అదే విధంగా, మాకు హక్కుగా రావాల్సిన దాని కోసం పోరాటం చేస్తాం... ఇది చంద్రబాబు గత కొన్ని రోజులుగా చెప్తున్న మాట.. పోలవరం ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించామని, 100 శాతం మేమే డబ్బులు ఇస్తాం అంటుంది కేంద్రం.. కాని ఆరు నెలల నుంచి, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇవ్వలేదు... ఎందుకో తెలుసా ? ఈ ఆరు నెలల కాలమే ప్రాజెక్ట్ అతి వేగంగా కట్టే కాలం... వర్షాలు పడితే మళ్ళీ పనులు మందగిస్తాయి.. అందుకే మనల్ని ఇబ్బంది పెట్టటానికి ఈ ప్లాన్ వేసారు... కాని వీరి కుట్రలు ముందే ఊహించిన చంద్రబాబు, దాదాపు 9 వేల కోట్లు ఈ ఏడు మన రాష్ట్ర బడ్జెట్ లో పోలవరం కోసం పెట్టారు... మన డబ్బులే వాడుతూ, పనులు పరుగులు పెట్టించారు.. తద్వారా, టార్గెట్ కి తగ్గట్టు, పనులు పరిగెత్తించారు...

cbn 03062018 2

ఇప్పుడు మనమే దాబ్బులు ఖర్చు పెడుతున్నాం... కేంద్రం మాత్రం, 6 నెలలుగా రూపాయి ఇవ్వలేదు... దీని వల్ల మనకు వడ్డీ నష్టం.... వడ్డీ సంగతి తరువాత, అసలు కూడా ఇస్తారో లేదో కూడా తెలీదు... ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం పనులు పరుగులు పెట్టాయి... రాష్ట్రప్రభుత్వ సొంత ఖర్చుతో మరో వారంలోపు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తికాబోతోంది. దేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో పూర్తికాబోతున్న తొలి నిర్మాణం ఇది. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయి. ఈ నెల పదో తేదీ లోపు మిగతా ఐదు శాతాన్ని అలవోకగా పూర్తిచేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికి సమాంతరంగా కీలకమైన కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులూ శరవేగంగా జరుగుతున్నాయి...పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం ఒకటి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్లే. ఈ డ్యాం నిర్మాణ పనులు చేపట్టాలంటే దానికి ముందుగా నదీగర్భంలో నిర్మించేదే డయాఫ్రంవాల్‌.

cbn 03062018 3

ఇందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి డయాఫ్రం వాల్‌ నిర్మించాలి. ప్రపంచంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇలాంటి టెక్నాలజీని ఒకటి, రెండు చోట్లే వినియోగిస్తున్నారు. ఆ టెక్నాలజీతోనే పోలవరంలోనూ డయాఫ్రంవాల్‌ నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 1500 మీటర్ల పొడవున రెండు దశల్లో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం విధించింది. మొదటిదశలో ప్రాజెక్టు కుడివైపున 800 మీటర్ల నిడివితో, రెండోదశలో ఎడమవైపున 700 మీటర్ల పొడవున నిర్మించాలని నిశ్చయించింది. 2018 జూన్‌ 10లోపు ఈ పనులు పూర్తిచేసే లక్ష్యంతో ఈ బాధ్యతను బావర్‌ కంపెనీకి అప్పగించారు. ప్రస్తుతానికి వాల్‌ నిర్మాణంలో మరో 25 మీటర్లు (ఐదుశాతం) మాత్రమే పూర్తిచేయాల్సి ఉంది.పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి 2019కల్లా గ్రావిటీ ద్వారా రైతులకు నీరు అందించి తీరతామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. మొత్తం పోలవరం పనుల్లో ఇప్పటికి పూర్తయింది 54 శాతమే అయినా.. ఏడాదిలోపే మిగతా పనులపై దృష్టిపెట్టి.. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వగలమని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు.

రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...

ashok 03062018 2

ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, మళ్ళీ అదే మొదలు పెట్టారు.. 10 రోజుల క్రితం శ్రీకాకుళంలో మొదలైన మ్యూజిక్, విజయనగరం జిల్లా దాటుతున్నా, ఇదే గోల ... నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, రోజు ఇదే పీక్కోటం.. నిన్న అయితే, "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్...

ashok 03062018 3

గత పది రోజుల నుండి, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, పవన్ కొడుతున్న డైలాగ్ చూసి, సోషల్ మీడియాలో కూడా సటైర్లు మొదలయ్యాయి... అయినా పవన్ మాత్రం ఆపటం లేదు... ఇక పవన్ ఈ డైలాగ్ ఆపాలి అంటే, అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి నాకు పవన్ అంటే తెలుసు, పవన్ వల్లే నేను గెలిచాను, పవన్ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది అని చెప్పాలేమో... నేను మీ ఇంటికొచ్చా, మీ వీధికొచ్చా, కోట ముందుకొచ్చా అని తన ఫాన్స్ ను రంజింపజేయడం కోసం సినిమా డైలాగులు చెబుతుంటే, అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి "ఆ.. సరేలే" అంటే కాని, పవన్ ఇగో చల్లారదేమో... తెలుగుదేశంలో గెలిచిన 102 మంది ఎమ్మల్యేలు, 17 మంది ఎంపీలు, మాకు పవనే దేవుడు అనే దాక, ఈయాన ఇలా డైలాగులు చెప్తూనే ఉంటాడేమో...

మన దేశ ప్రధానిలాగే 4 వేల కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టే స్థోమత లేదు... మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా, దేశంలో అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల పేపర్లలో, టీవీల్లో యాడ్ లు ఇచ్చేన్ని డబ్బులు రాష్ట్రానికి లేవు.. మా ఆంధ్ర రాష్ట్రానికి ప్రచారం చేసేది ఇలాంటి ప్రపంచ మేధావులే... చరిత్రలో ఎప్పుడు జరగని పనులు చేస్తున్నా, విప్లవాత్మకమైన పనులు, దేశానికే కాక, ప్రపంచానికే ఆదర్శమైన పనులు చేస్తున్నా, అది చెప్పుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకోండి. గుంటూరులో వ్యవసాయానికి సంబంధించి అతి ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుందని ఎంత మందికి తెలుసు ? నిన్న సోషల్ మీడియాలో కొంత మంది ప్రముఖులు ట్వీట్ చేసే దాకా, ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో, మన గుంటూరులో జరుగుతుందని చాలా మందికి తెలియదు. అందుకే అంటుంది, మన రాష్ట్రానికి ఇలాంటి వారే ప్రచారకర్తలు అని.

prakrutivyvasayaam 2

రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. రెండేళ్లలో 1.63 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని, 2024 నాటికి 60 లక్షల మంది ప్రకృతి సేద్యం చేసేలా చూడాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఇందుకోసం, ఇప్పుడు కాదు, మొన్న దావోస్ వెళ్ళినప్పుడే బీజం పడింది. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/dn1YPwgA-IU . ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో)తో పాటు, అనేక దేశాలతో అప్పుడు చర్చించారు.. నెలల వ్యవధిలోనే, అది ఆచరణలోకి తీసుకువచ్చే కార్యరక్రమం చేసారు చంద్రబాబు. ఇప్పుడు వీరంతా గుంటూరు వచ్చారు. చంద్రబాబు చేస్తున్న కృషికి అభినందన తెలుపుతూ, అక్కడ ప్రసంగించటమే కాదు, ట్వీట్ల రూపంలో, ప్రపంచానికి ఇక్కడ జరుగుతున్న అద్భుతాన్ని తెలియచేసారు..

prakrutivyvasayaam 3

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) ఇండియా సమన్వయకర్త యూరి మాట్లాడుతూ ప్రకృతి సేద్యం అమలు చేయటంలో సీఎం, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అభినందించారు. అజీమ్‌ ప్రేమ్‌జీ పిలాంతరి సంస్థ సీఈవో అనంత పద్మనాభన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చేస్తున్న ప్రకృతి సేద్యం మనకు గర్వకారణమన్నారు. నైరోబీ ఈడీ రవిప్రభు మాట్లాడుతూ పెట్టుబడి లేని వ్యవసాయ సేద్యంకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎఫ్‌ఏవో అధినేత శ్యామ్‌ఖడ్గే మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినా రైతులకు లాభాలు రాకపోవటానికి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటమే కారణమని పేర్కొన్నారు.

prakrutivyvasayaam 4

ఎఫ్‌ఏవో, ఫ్రెంచ్‌ ప్రభుత్వం ప్రకృతి సేద్యానికి సహకరిస్తాయన్నారు. అడయాన్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ తమ బ్యాంకు పీఎన్‌బీ 158 సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇతర సంస్థలతో కలసి పని చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ప్రతినిధి పవన్‌ సుఖదేవ్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 420 మిలియన్ల మంది డయాబెటీస్‌, 670 మిలియన్ల మంది ఒబిసిటీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రపంచ పోషకాహార సంస్థ నివేదికలు ఇచ్చిందన్నారు. మరో ప్రతినిధి సన్నీవర్గీస్‌ మాట్లాడుతూ రసాయనిక మందులతో నీరు కలుషితమై వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇండోనేషియా మాజీ మంత్రి డాక్టర్‌ పుంటోరా మాట్లాడుతూ తమ దేశంలో ఇపుడిప్పుడే ప్రకృతి సేద్యాన్ని అమలు చేస్తున్నారని, రాష్ట్రం ముందంజలో ఉందని అభినందించారు.

Advertisements

Latest Articles

Most Read