తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, సుజానా చౌదరి పై, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో, విపరీతమైన ప్రచారం జరుగుతుంది.. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి, బీజేపీలో చేరుతున్నారు అంటూ, బీహార్ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, చింతలబస్తీ దేవ్ బ్యాచ్ విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి... గత రెండు రోజుల నుంచి, ఈ ప్రచారం తీవ్రమైంది... సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇదే వార్తా ఉండేలా ప్లాన్ చేసారు, వైసిపీ, జనసేనన, బీజేపీ... ఇన్నాళ్ళు ఈ వార్తలని పెద్దగా పట్టించుకోని సుజానా, ఇప్పుడు దాడి ఎక్కవ అవ్వటంతో స్పందించారు... రెండు రోజుల క్రితం కూడా, ధర్మ పోరాట దీక్షలో పాల్గుని, మోడీచేస్తున్న మోసాన్ని ఎండగట్టారు.. అయినా ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంది..

sujana 03052018 1

ఈ విష ప్రచారం పై, తన ట్విట్టర్ లో స్పందించారు.. ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పోస్ట్ చేసి, "నేను పార్టీ మారటమా ? ఏప్రిల్ 1stలో వేసే జోకులు, మే నెలలో వెయ్యకూడదు... నాకు ఉంది ఒకే పార్టీ, ఒక సిద్ధాంతం, అదే తెలుగుదేశం పార్టీ.. నాకు ఉన్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం, భ్యవిష్యత్తు ఎన్నికలు గెలుస్తాం, కేంద్రాన్ని మేమే శాసిస్తాం" అంటూ, ట్వీట్ చేసారు.. ఈ ట్వీట్ తో పాటు, ఆ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా పోస్ట్ చేసి, చంద్రబాబుతో ఉన్న ఫోటోలు పోస్టు చేసి, అటు బీహార్ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, చింతలబస్తీ దేవ్ బ్యాచ్, నోరు ముపించారు.

sujana 03052018 1

మా నాయకుడు చంద్రబాబు, రాష్ట్రం కోసం ఏమి చెయ్యమంటే అది చేస్తామని, ప్రజల ఆకాంక్ష మేరకు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, కేంద్ర మంత్రి పదవి కూడా వదులుకున్నాని, ఇది చంద్రబాబు పై నాకున్న కమిట్మెంట్ అని, సుజనా చెప్పారు.. మరో పక్క ఇలాంటి వార్తల వెనుక మైండ్ గేమ్ ఉందని, తెలుగుదేశం పార్టీ అంటుంది. సుజనా చౌదరి లాంటి మనిషి, పార్టీని వదిలి వెళ్తారు అనటం ఒక జోక్ అయితే, ఆయన వెళ్లి బీజేపీతో చేరతారు అనటం, ఇంకా పెద్ద జోక్ అని అంటున్నారు.. బుద్ధి ఉన్న వాడు ఎవడైనా, బీజేపీ పార్టీలో చేరతారా అని ప్రశ్నిస్తున్నారు.. ఈ చింతలబస్తీ, బీహార్ బ్యాచ్ కు, బీజేపీ అంటే అమితమైన ప్రేమ కాబట్టి, బీజేపీని రాష్ట్రంలో పైకి లేపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుట్లోదే, ఈ తలకమాసిన ప్రచారం అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి..

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలన్న అంశంపై ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. సీనియర్ బీజేపీ నేత ఎల్ కె అద్వానీ పాల్గొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికిరావాల్సిందిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే మోడీ ఆహ్వానాన్ని, చంద్రబాబు తిరస్కరించారు..

modi cbn 03052018 2

అయితే, డైరెక్ట్ గా మోడీ మీద ఉన్న కోపం చూపించకుండా, రాలేక పోవటానికి గల కారాణాలు, లెటర్ రూపంలో రాసారు.. ఇలా రాయకపోతే, మళ్ళీ గాంధీ అంటే, చంద్రబాబుకి ఇష్టం లేదు అనే మరో కట్టు కధ అల్లుతారని, ఈ ప్రచారం ఎందుకు అనే ఉద్దేశంతో చంద్రబాబు లెటర్ రాసారు... "మీ నుంచి ఆహ్వానం అందింది.. కాని మాకు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని రావటం కుదరదు. మహత్మా గాంధీ అంటే మాకు చాలా గౌరవం. అందుకే గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని, చేస్తున్న స్వచ్చ భారత్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. ఈ విషయంలో మద్దతు ఉంటుంది. సమావేశంలో తీసుకున్న నిర్నయాలు మాకు తెలియచేయండి అంటూ, చంద్రబాబు తరుపున, ఆయన సెక్రటరీ సతీష్ చంద్ర ఉత్తరం రాసారు.

modi cbn 03052018 1

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి, మోడీ రాష్ట్రానికి చేస్తున్న మోసం పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు... మరో పక్క చంద్రబాబు ఒక్కరే, మోడీతో డీ కొడుతున్నారు... జాతీయ స్థాయిలో కూడా, అన్ని విపక్షలని మోడీకి వ్యతిరేకంగా ఏకం చేస్తారు, ఫ్రంట్ పెడతారు అని వార్తలు కూడా వస్తున్నాయి...ప్రస్తుతం రాష్ట్రం ఉన్న నేపధ్యం, ప్రజల్లో ఉన్న మూడ్ చూసి, ప్రధాని మోడీతో కలిసి సమావేశం అయితే, అవి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి, చంద్రబాబు ఇలా మీటింగ్ కు వెళ్ళకుండా, తిరస్కారించారు అనే వార్తలు వస్తున్నాయి.. అదే టైంలో, సామాఖ్య స్పూర్తికి ఇబ్బంది కలగకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రల్లో చేసే, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు...

ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా.. మన జగన్ మోహన్ రెడ్డి, తన సత్తా ఏంటో తెలిసి, చంద్రబాబుని డీ కొట్టటం నా వల్ల కాదని, కోట్లు ఖర్చు పెట్టి, తెచ్చుకున్న సలహాదారుడు... సోషల్ మీడియాని ఫేక్ చేసి పెట్టటంలో దిట్ట... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కనికట్టు చేసే గారిడీ వాడు టైపు... అయితే ఎన్ని చేసినా, ఎంత మందిని తెచ్చుకున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనోడి రాత మారలేదు అనుకోండి, అది వేరే విషయం... అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కూడా, ఒక కొత్త సలహాదారుడు వచ్చాడు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇతన్ని తీసుకోచ్చారో కాని, కనీసం ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడ లేని ఇతను, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, నా సత్తా చూపిస్తా అంటూ, అప్పుడే ఛాలెంజ్ లు చేస్తున్నాడు...

pk dev 01052018

ఈ రోజు, హైదరాబాద్‌లో తమ పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, జనసేన పార్టీకి, రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ అనే వ్యక్తి పనిచేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ అతన్ని పరిచయం చేసారు.. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్‌కు సహకరిస్తారన్నారు. అయితే, అసలు ఈ దేవ్ అనే అతను ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చాడు ? అతని ప్రొఫైల్ ఏంటి ? ఇలాంటి వివరాలు ఏమి తెలియవు... పేరు కూడా, కేవలం దేవ్ అని మాత్రమే చెప్పి, పూర్తి పేరు కూడా చెప్పకుండా , ఎందుకో మరి దాస్తున్నారు...

pk dev 01052018

ఈ సందర్భంగా దేవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. "జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయనాయకుడు కాదు. ఆయనకు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్‌కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.

హాయ్ ఐ యాం దేవ్.. ఐ డోంట్ నో తెలుగు.. ఐ వర్క్డ విత్ ఇంటర్నేషనల్ పార్టీస్... జనసేనని ఒక ఊపు ఊపటానికి వచ్చా... నా టాలెంట్ అంతా బయటకు తీస్తా... చూపిస్తా... చూపిస్తా... ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా ? దేవ్ అంటూ, జనసేన పార్టీకి సలహాదారుడుగా పని చేసిన వ్యక్తి... ఆ రోజు ఇవన్నీ చూసి, విని, అవును అనుకుంటా, పవన్ చాలా గట్టి వాడిని తీసుకొచ్చాడు... దేవ్ లో ఆ కాన్ఫిడెన్సు చూడండి, ఇక విజయం మనదే అంటూ, జనసేన పార్టీ డ్రీం మిషన్ ఎక్కింది... సీన్ కట్ చేస్తే, 24 గంటల్లో మొత్తం మారిపోయింది... దేవ్ కాదు...వాసు దేవ్...వ్యూహ కర్త కాదు..కార్య కర్త... ఇంగ్లీష్ వాడు కాదు..తెలుగు వాడు... మీరనుకొన్న ఈ దేవ్ మామూలు వాడు కాదు ... పూర్తి పేరు వాసుదేవ్... హైదరాబాద్ చింతలబస్తీ కుర్రాడు.. మోడీ పంపిన మన కిషన్ రెడ్డి మనిషి. తెలుగు రాదు అన్నాడు ఎందుకంటే...మాట్లాడితే తెలిసిపోతుందిగా తెలంగాణ వాడని..

bjp 03052018 2

ఈ చింతలబస్తీ దేవ్ ను తీసుకోవచ్చి, ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ఉన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు పవన్.. మనం చేసే పనులు ఎవరికీ తెలియవు అనుకుంటే అది అజ్ఞానమే... చింతలబస్తీ నుంచి వచ్చినా, చికాగో నుంచి వచ్చినా, అది వేరే విషయం.. ఎవరి పార్టీలు వారివి... వీళ్ళకు దమ్ము లేదు కాబట్టి సలహాదారులని పెట్టుకుంటారు... ఇది ఎవరికీ అభ్యంతరం కాదు... కాని, ఇక్కడ ఆడుతున్న అతి పెద్ద ఆట చూస్తుంటే, రాష్ట్రం ఏమైపోతుందో అని భయం వేస్తుంది... మొన్నా ఆ మధ్య, పవన్ ట్విట్టర్ వార్ మొదలు పెట్టిన ఏప్రిల్ 20 తారీఖు, రెండు మూడు రోజుల ముందు, పవన్, కిషన్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది...

bjp 030520183

ఇప్పుడు అదే కిషన్ రెడ్డి మనిషి, పవన్ కళ్యాణ్ సలహాదారుడు అయ్యాడు... ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అని నమ్మాల్సి వస్తుంది... ఒక పక్క మోడీకి పర్సనల్ గా పని చేసిన వ్యక్తి, జగన్ సలహాదారుడు అయ్యాడు.. అదే ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు బీజేపీ పార్టీకి పని చేస్తూ, బీజేపీ పార్టీలో ఉన్న మనిషి, ఇప్పుడు పవన్ దగ్గర చేరాడు... పవన్ రాజకీయం మొత్తం నేనే నడిపిస్తా అంటున్నాడు... అంటే ఏంటి ఇది ? బీజేపీ చెప్పినట్టు, జనసేన, వైసిపీ నడవాలి... ఆపరేషన్ గరుడ పాత్రధారులు వీరంతా... అక్కడ బీజేపీ ఏమి చెప్తే, వీరంతా అది చేస్తారు... ఇది విషయం... ఇలాంటి రాజకీయం నడుస్తుంది మన రాష్ట్రంలో.. చంద్రబాబు అనే ఒక్కడిని ఎదుర్కోవటానికి, ఇంత మంది వస్తున్నారు... వీళ్ళకు దమ్ము లేదని తెలుసు, వీలకు సలహాదారులని కూడా, నియమిస్తున్నారు బీజేపీ పెద్దలు...

Advertisements

Latest Articles

Most Read