గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో అగ్రెసివ్ గా పోస్ట్ లు పెడుతున్నారు... మొన్నటి దాకా జనసేన ట్విట్టర్ ఎకౌంటు నుంచి తన పై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు... అయితే, తాజాగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల పై, గల్లా పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేసారు.. గత రెండు రోజుల నుంచి బీజేపీ నేతలు, చంద్రబాబు మార్ఫింగ్ వీడియోలు ప్లే చేస్తున్నారని, మోడీ ఏ నాడు ప్రత్యెక హోదా ఇస్తామని కాని, చంద్రబాబు చూపిస్తున్నట్టు ఆ వీడియోలో అసలు మోడీ అలా మాట్లాడలేదు అంటూ, తల తిక్క విమర్శలు చేస్తున్నారు... బీజేపీ విమర్శలు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది... ఈ విషయం పై గల్లా ట్వీట్ చేసారు...

galla 01052018 1

మోదీ ప్రసంగానికి సంబంధించి మార్ఫింగ్ చేసిన వీడియోలతో ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన ఆ కథనాన్ని గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఆ సభలో మీరు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు మాట ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గారని మీరే నేరుగా మోదీని నిలదీయొచ్చు కదా!. ఆ రోజు జరిగిన దానికి మీరే సాక్ష్యం. మీరే చెప్పండి ఇవి మార్ఫింగ్ వీడియోలా?’’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మరి దీని పై, పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తారో, లేక జనసేన రిప్లై ఇస్తుందో కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అయితే, మోడీని, బీజేపీని ఎక్కడా విమర్శలు చెయ్యటం లేదు..

galla 01052018 1

మరో పక్క, చంద్రబాబు విమర్శలు ఎలా బదులు ఇవ్వాలో తెలియక, బీజేపీ నేతలు కొత్త పంధా ఎత్తుకున్నారు... అసలు మోడీ, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏ హామీ ఇవ్వలేదు అని, చంద్రబాబు మార్ఫింగ్ వీడియోలు ప్రజలకు చూపిస్తున్నారు అంటూ, ఎదురు దాడికి దిగుతున్నారు.. మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు... ఏ హామీ ఇవ్వనప్పుడు, ప్రత్యెక హోదా, మీ వెంకయ్య చలువే అని మోడీ ఎందుకు చెప్పారు ? అయినా మార్ఫింగ్ అనేది అతి పెద్ద నేరం... మార్ఫింగ్ చేసినట్టు రుజువు అయితే, 3 ఏళ్ళ పైనే జైలు శిక్ష పడుతుంది.. మరి వెళ్లి కోర్ట్ లో, చంద్రబాబు మీద కేసు వెయ్యచ్చుగా ? టీవీ9 ఛానల్, ఇలాగే పవన్ కళ్యాణ్, మా ఛానల్ వీడియో మార్ఫింగ్ చేసారని కేసు పెట్టింది... మీరు, అదే పని చెయ్యవచ్చుగా ?

దుట్టా రామచంద్రరావు, గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు... పోయిన ఎన్నికల్లో వల్లభనేని వంశీతో పోరాడారు... ప్రస్తుతం, వైకాపా రాష్ట్ర రాజకీయ సలహాదారుగా ఉన్నారు... సహజంగా, ఈయన వివాదాల జోలికి వెళ్లరు... ఆయన పని ఆయన చేసుకుంటూ, పార్టీ ఆదేశాలు ప్రకారమే నడుచుకుంటే ఉండేవారు... అయితే, అలాంటి నేత, నిన్న జగన్ చేసిన ప్రకటన పై తిరగబడ్డారు... ఇది పధ్ధతి కాదు అంటూ, హెచ్చరించారు.. సీనియర్లను సంప్రదించకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తే ఎలా అనే ధోరణిలో, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విరుచుకు పడ్డారు.. నిర్ణయం వెనక్కు తీసుకోపోతే, తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.

jagan 01052018

ఇంతకీ విషయం ఏంటి అంటే, నిన్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మకూరులో పర్యటించారు... అది స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం.. అయితే, ఒక సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అంటూ, ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమ చూపించారు... ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు అని, ఆయన సేవలకు గుర్తింపుగా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తా అంటూ ఒక తలతిక్క ప్రకటన చేసారు... అయితే, ఈ ప్రకటన పై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... మీ నాన్న, ఎన్టీఆర్ పేరును కనీసం ఒక ఎయిర్ పోర్ట్ కు పెట్టలేదు, నువ్వు వచ్చి ఒక జిల్లాకు పెడతావా ? ఆ మహానుభావుడుని, ఒక జిల్లాకు పరిమితం చేస్తావా అంటూ విమర్శలు వచ్చయి...

jagan 01052018

అయితే, ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్నారు.. పైగా, ఎప్పుడూ కూల్ గా ఉండే, దుట్టా రామచంద్రరావు లాంటి వారు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఎంతోమందికి జీవనాధారమైన కృష్ణా నది పేర ఏర్పడిన జిల్లా పేరు మార్చితే సహించేది లేదని రామచంద్రరావు అన్నారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలని, స్మారక భవనాలు కట్టుకోవాలని... జిల్లా పేరును మార్చడానికి మాత్రం ఒప్పుకోబోమని తెలిపారు. పేరు మార్పు హామీని జగన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఒకవేళ జగన్‌ తన నిర్ణయం మార్చుకోకపోతే తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.

బ్రతిమాలాం... భయపెట్టాం... కేసులు పెడతాం అని చెప్పాం.. కొడుకుని జైలు పాలు చేస్తాం అని బెదిరించాం... రాష్ట్రంలో రావణ కాష్టం చేస్తామని చెప్పాం... రాష్ట్రంలో రెండు పార్టీలని ఆధీనంలో ఉంచుకుని, ఇది మా బలం అని చంద్రబాబుకి చూపించాం... రాష్ట్రానికి రావలసిన డబ్బులు ఆపెస్తున్నాం... అమరావతిని ఇబ్బంది పెట్టాం... పోలవరం అడ్డుకుంటున్నాం... ఇన్ని చేస్తున్నా, చంద్రబాబు ఎందుకు లొంగటం లేదు ? ఏంటి చంద్రబాబు ధైర్యం ? మొన్న ఢిల్లీలో, నేషనల్ మీడియా ముందు ఉతికాడు... నిన్న తిరుపతిలో, వీడియోలు చూపించి మరీ వాయిస్తున్నాడు... ఇలా అయితే, ఎలా ? చంద్రబాబుని నిలువరించటం ఎలా ? ఇది ఢిల్లీ పెద్దలు పడుతున్న మదనం...

cbn 01052018 2

ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు మాత్రం చేసిన అన్యాయానికి రగిలిపోతున్నారు... అందరికీ అర్థమయ్యేలా అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీ ప్రసంగ వీడియోలను ప్రదర్శించారు. గోవిందుడి సాక్షిగా ప్రధాని చేసిన బాసలను గుర్తు చేశారు. దిల్లీ చిన్నబోయేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మిస్తామని, దేశ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని, విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ నూటికి నూరుశాతం అమలు చేస్తామని ప్రధాని మోదీ 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు సభికులందరికీ వీడియోలద్వారా చూపించారు. అంతే కాదు, ఒక అడుగు ముందుకేసి, కర్ణాటక ఎన్నికల్లో మనకు అన్యాయం చేసిన వారిని ఓడించండి అని పిలుపు కూడా ఇచ్చారు చంద్రబాబు...

cbn 01052018 3

కేవలం ప్రత్యేక హోదా విషయమే కాదు.. పోలవరం, అమరావతి నిర్మాణం, విభజన చట్టం అమలు విషయాలను ఆయన లెక్కలతో సహా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెబుతూ.. అటు కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోవడాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత సహాయం చేసిందో లెక్కలతో సహా చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేం... అని చెబుతూనే కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడాన్ని ఆయన ఎత్తి చూపారు. ఇవన్నీ, ఢిల్లీ పెద్దలకు నచ్చటం లేదు.. చంద్రబాబు మరింత దూకుడుగా వెళ్తే, ఇబ్బందులు ఉంటాయనే విషయం వారే చెప్తున్నారు.. చంద్రబాబు వెంట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, అనే విషయం గ్రహించి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు...

ఢిల్లీలో ఉండే ప్రధాన మోడీ ఉలిక్కిపడి లేవాలని, ఢిల్లీ దిగి రావాలని, దేవదేవుడి సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని, చేసిన హామీలను మరచి, మాయమాటలు చెప్పడం సరికాదని, ప్రధానికి ఆ వెంకటేశ్వరుడే గుర్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో గళమెత్తారు... అయితే, చంద్రబాబు నిన్న తిరుపతిలో మాట్లాడిన మీటింగ్ మొత్తం, ట్రాన్స్‌లేట్ చేసి పంపాలని, రాష్ట్ర బీజేపీ నేతలకు, ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చయి... ఆయన దాదాపు 2 గంటలు మాట్లాడారని, మొత్తం ట్రాన్స్‌లేట్ చెయ్యాలంటే టైం పడుతుందని చెప్పినా, ఢిల్లీ నాయకులు మాత్రం అర్జెంటుగా, చంద్రబాబు స్పీచ్ ట్రాన్స్‌లేట్ చేసి పంపించమని ఆదేశాలు ఇచ్చారు..

cbn 01052018 1 1

ఇదంతా ఎందుకు అని ఆరా తీస్తే, ఈ రోజు నుంచి ప్రధాని మోడీ, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గుననున్నారని, చంద్రబాబుకి అక్కడ నుంచే సమాధానం చెప్తారని, బీజేపీ వర్గాలు అంటున్నాయి... ఎన్నికలు అయ్యే లోపు, దాదాపు 5 రోజుల పాటు మోడీ కర్ణాటకలో ప్రచారం చెయ్యనున్నారు... అయితే, కర్ణాటక ఎన్నికల్లో, రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిని ఓడించాలని, అక్కడ తెలుగువారికి చంద్రబాబు పిలుపు ఇచ్చిన నేపధ్యం, అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కర్ణాటకలో, బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటం, ఇవన్నీ బీజేపీ అధిష్టానం గమినిస్తుంది... కర్ణాటకలో దాదాపుగా కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి...

cbn 01052018 1 1

రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహం పై చంద్రబాబు చేస్తున్న పోరాటానికి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు మద్దతు పలుకుతున్నారు... అలాగే కర్ణాటకలో కూడా, తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్తున్నారు... ఈ నేపధ్యంలో, అక్కడ గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోటానికి, మోడీ, చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి... అందుకే, నిన్న చంద్రబాబు స్పీచ్ అంత అర్జెంటుగా ట్రాన్స్‌లేట్ చేసి పంపించమన్నారని చెప్తున్నారు... మరో పక్క, పక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, కర్ణాటకలో ఎందుకు అంటూ, కర్ణాటక బీజేపీ నేతలు మండి పడుతున్నారు... ప్రధాని మోడీకి ఈ విషయం చెప్పి, చంద్రబాబు ప్రస్తావన లేకుండా, కేవలం కర్ణాటక పై మాత్రమే మాట్లాడాలని కోరతామని చెప్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read