కాపు రిజర్వేషన్ల అంశం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ తో కమిషన్ వేసి, ఆ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గోవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... అక్కడ నుంచి వివిధ మంత్రిత్వ శాఖలకు, ఈ బిల్ వెళ్ళింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ, ఈ కాపు కోటా పై అభ్యంతరాలను తెలిపింది.

ఇది సాకుగా చూపి కేంద్రం కూడా ఆట ఆడిస్తాం మొదలు పెట్టింది... మొత్తం రిజర్వేషన్లు 50 శా తం మించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది... అయితే, ఈ విషయం పై శుక్రవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్‌ చౌహాన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏపీ తరఫున బీసీ కమిషన్‌ సభ్యుడు వీ.సుబ్రహ్మణ్యం, సీఐడీ డీజీ తిరుమలరావు, ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రానికి వివరించారు.

బీసీ కమిషన్‌ కూడా దీనిని సమర్థించిందని చెప్పారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే, రిజర్వేషన్ ఇచ్చినట్టు చెప్పారు.. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది, రాష్ట్రపతి కూడా ఆమోదించాలా చూడండి అంటూ కేంద్రంలో హోమ శాఖ అధికారులని కోరింది ఏపి ప్రభుత్వం. అయితే, ఈ వాదనలను, సహేతుకమైన కారణాలను లిఖితపూర్వకంగా అందించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్‌ చౌహాన్‌ సూచించారు. కాపు రిజర్వేషన్‌ బిల్లుతో పాటు, భూసేకరణ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ డిపాజిటర్ల పరిరక్షణ బిల్లు, విద్యుచ్ఛక్తి సుంకం చట్టం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదించిన గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ చట్ట సవరణ బిల్లుల్లో పేర్కొన్న పదాలనే తామూ వినియోగించామని, అయినా ఆ బిల్లు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారని, అది కూడా క్లియర్ చెయ్యమని రాష్ట్ర అధికారులు, కేంద్రాన్ని అడిగారు.

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ ఎదురుచూసిన అభ్య‌ర్థుల‌కు ఎట్టకేలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ రోజు డీఎస్సీ ప్ర‌క‌ట‌న‌ చేశారు. 10,351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జులై 7న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 7 నుంచి ఆగస్టు 9వరకు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో డీఎస్సీ నిర్వహణ ఉంటుందని, ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుదని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు వరకు అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 10న ఫైనల్ కీని విడుదల చేస్తామని, అలాగే సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆరు కేటరగిల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ టెట్‌ షెడ్యూల్‌ కూడా మంత్రి విడుదల చేశారు. మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 5 నుంచి మే 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. అలాగే జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 10 నుంచి 21వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 28న ఫైనల్ కీ, జూన్ 30న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు చంద్రబాబు... దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు... ఇలాంటి చంద్రబాబు ముందు, తోక జాడిస్తూ, పార్టీకి, చంద్రబాబుకి చెడ్డ పేరు తీసుకువస్తున్న కొంత మంది సొంత పార్టీ నేతల పై, ఇంకే రేంజ్ లో విరుచుకుపడతారు ? అదే జరిగింది, మాటి మాటికి చిరాకు పెడుతూ, రచ్చకి ఎక్కి, పరువు పొగుడుతున్న వారిని, గత రెండు రోజులు నుంచి, అమరావతి పిలుపించుకుని, లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పంపించారు... నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయించారు...

ముందుగా గురువారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను వాయించారు... బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారు... ఇక, ఆళ్లగడ్డ తగాదా, నెలకు ఒకసారి చంద్రబాబు ముందుకు వస్తుంది... నిన్న అటు సుబ్బారెడ్డిని, అఖిల ప్రియను పిలిపించారు.. ఎన్ని సార్లు మీకు రాజీ కుదర్చను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఖటువుగా హెచ్చరించారు..

సుబ్బారెడ్డిని ఉద్దేశిస్తూ, ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ వాయించారు... ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో, ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గున్తున్నారు... ఈ సందర్భంలో, నిన్న ఆయన ప్రయాణిస్తున్న విమానంలో అతి పెద్ద సాంకేతిక లోపం తలెత్తింది... మానవరహిత పైలట్‌ వ్యవస్థ పని చెయ్యకపోవటంతో, రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో, ల్యాండింగ్ కష్టం అయ్యింది... మూడో సారి అతి కష్టం మీద విమానం ల్యాండ్ అయ్యింది... ఆ టైంలో విమానంలో భయానక పరిస్థితినెలకొన్నా తాను ప్రశాంతంగాఉంటూ, తోటి ప్రయాణికులకు రాహుల్‌గాంధీ ధైర్యం చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఒక ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తటం అనేది మామూలు విషయం కాదని, దీని వెనుక ఎదో కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది...

విమానంలో మానవరహిత పైలట్‌ వ్యవస్థ పని చెయ్యకపోవటం అనేది, అత్యంత ప్రమాదకరమైన అంశమని, రాహుల్ పై కుట్ర జరిగిందన్నది తమ ఆరోపణని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. మరో పక్క ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ, వెంటనే రాహుల్ గాంధీకి ఫోన్ చేసే మాట్లాడారు.. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. ఘటన గురించి తెలిసింది అని, ఇలా ఎందుకు జరిగిందో శాఖా పరమైన ఎంక్వయిరీ జరుగుతుందని చెప్పినట్టు సమాచారం... రాహుల్ గాంధీ కూడా, ప్రధాని మోడీకి, ఘటన జరిగిన తీరు వివరించి, ప్రజల ఆశీర్వాదంతోనే క్షేమంగా బయట పడినట్టు రాహుల్ చెప్పారు..

ఇది ఇలా ఉండగా, విమానంలో సాంకేతికలోపం గురించి తెలిసిన వెంటనే కారణాలేమిటో తెలుసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీసీఏను ఆదేశించినట్లు కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఎవరైనా బాధ్యులని తేలితే తగిన చర్య తీసుకుంటామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరు నిపుణులతో కమిటీని నియమించినట్లు డీజీసీఏ తెలిపింది. రెండు, మూడువారాల్లో నివేదిక వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు విమానం నడిపిన పైలట్‌ను సైతం ప్రశ్నించనున్నట్లు తెలిపింది. మరో పక్క, కర్ణాటకలో జరిగిన విషయం, కుట్ర ఆరోపణలు రావటంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ, అక్కడ తెలుగు వారు అంటున్నారు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థుతుల్లో ఏదీ తీసి పరెయ్యలేమని చెప్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read