ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా అంశం కర్నాటకలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అక్కడి ముఖ్యమంత్రి, ఏపీ అంశాలను కూడా విజయానికి అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహ రచన చేశారు. పదే పదే అంధ్రప్రదేశ్ కు గత సాధారణ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కర్నాటకలోనే తిష్టవేసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఏపీకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలను వంచనకు గురిచేసిన మోడీ, షాలు కర్నాటకకు ఏమి న్యాయం చేస్తారని ఓటర్ల దృష్టికి తేవడం ద్వారా గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

cbn karnataka 2404208

రోజూ ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శ్లాఘిస్తూ బీజేపీపైకి పదునైన అస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వుండి నేరుగా తెలుగుదేశం మద్దతును ప్రత్యక్షంగా కోరకపోయినప్పటికీ, తెలుగుదేశం అభిప్రాయాలకు పెద్ద ఎత్తున విలువనిస్తూ ప్రచార బరిలో ముందున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని కూడా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు కర్నాటక ఓటర్లను మోసం చేయడానికి మళ్ళీ వచ్చారని ఆరోపిస్తున్నారు. నేరుగా ఇరువురు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవకుండానే వారిని ముగ్గులోకి దింపడం ద్వారా గెలుపు దిశగా సిద్దరామయ్య దూసుకుపోతున్నారని చెబుతున్నారు.

cbn karnataka 2404208

ఫలితంగానే ఏ.పి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజల ఓట్ల ద్వారా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా కర్నాటక ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఆ ప్రభావం ఏ.పి పై వుండబోతోందని కూడా చెప్పారు. ఫలితంగానే కర్నాటక లో బీజేపీ గెలవకూడదనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వున్నారని తెలిసింది. తిరుపతి బహిరంగ సభ అనంతరం పూర్తి స్థాయిలో కర్నాటక ఎన్నికలపై దృష్టి సారించాలనే యోచనలో ముఖ్యమంత్రి వున్నారు. అయితే వ్యహం ప్రత్యక్షమా లేదా పరోక్షమే అనే సందిగ్ధత నెలకొందని, త్వరలోనే ఈ విషయమై ఒక స్పష్టతకు వస్తారని తెలిసింది.

దేశంలోనే తొలిసారిగా సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ (ఎపిఎ్‌సఒసి)ను అమరావతిలో ప్రారంభించటం, దానికి టెక్‌ మహీంద్రా భాగస్వామ్యం అవ్వటం పై, టెక్‌ మహీంద్రా సిఇఒ అభినందిస్తూ ట్వీట్ చేసారు. సకల సదుపాయాలు, సరికొత్త టెక్నాలజీలతో కూడిన సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాంప్రదాయిక ఎస్‌ఔస్‌, ప్రెడిక్టివ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ సామర్థ్యాలు, సెక్యూరిటీ కవరేజీ సదుపాయాలతో అన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు ఈ సెంటర్‌ సేవలందిస్తుందని టెక్‌ మహీంద్రా పేర్కొంది. డిజిటలైజేషన్‌కు మారుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలు అధికమవుతున్నాయని, ఇది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే శాఖల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైబర్‌ ముప్పు నుంచి రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఎపిసిఎ్‌సఒసిను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

gurnani 24042018 1

సైబర్‌ సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో టెక్‌ మహీంద్రాకు ఉన్న అనుభవం, నైపుణ్యంతో భారత్‌లో తొలిసారిగా విజయవాడలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు.

gurnani 24042018 1

ప్రభుత్వ సెక్యూరిటీకి దన్నుగా ఎపిసిఎ్‌సఒసి నిలబడనుందని టెక్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ సిపి గుర్నానీ తెలిపారు. టెక్‌ఎంనెక్ట్స్‌ చార్టర్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో అత్యుత్తమమైన సేవలను అందించేందుకు ఈ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ దోహదపడనుందని గుర్నానీ తెలిపారు. అలాగే ఈ రోజు గుర్ననీ ఈ విషయం పై ట్వీట్ చేసారు కూడా "Another step in @tech_mahindra's journey to creating #TechMNxt : Partnering with the ecosystem to create robust securityframeworks.. Congratulations @AndhraPradeshCM @ncbn @naralokesh for being the trailblazers in security"

రాష్ట్రంలోని పల్లెపల్లెకూ ఎల్‌ఈడీ వెలుగులు రాబోతున్నాయి. ఇందుకు ఉద్దేశించిన చంద్రకాంతి పథకాన్ని రాష్ట్ర ప్రజలకు నేడు సీఎం చంద్రబాబు అంకితం చేసారు. ఈ కార్యక్రమం కోసం ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడి వెళ్లారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో చంద్రకాంతి కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. పంచాయతీల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపడం ద్వారా గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాసిరకమైన వీధి దీపాల వల్ల ఒకవైపు పంచాయతీ నిధులు వ్యయం, మరోవైపు అధిక విద్యుత్‌ వినియోగమవుతోంది. దీంతో గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

led 24042018

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎ్‌సఎల్‌ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రకాంతి పేరుతో వీధిలైట్లు స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పట్టణాల్లో 6.2 లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చి 133 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేశారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ప్రాజెక్టు పూర్తి చేసి దేశంలోనే గ్రామీణ ఎల్‌ఈడీలో ముందుండాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. సీఎంతోపాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌ ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. 12,918 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే ఎల్‌ఈడీ లైట్లును అమర్చి తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే నంబరు వన్‌గా నిలిపినందుకు సీఎం అధికారులను ప్రశంసించారు.

led 24042018

జూన్‌ కల్లా 15 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను అమర్చాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొన్నారు. అక్టోబరు నాటికి మిగిలిన లైట్లన్నీ అమర్చుతారు. పంచాయతీలు రానున్న పదేళ్ల వరకూ ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే విద్యుత్‌ చార్జీల ఆదాతో ఈ ప్రాజెక్టును నిర్వహించేలా చర్యలు తీసుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీల్లో ఈఈఎ్‌సఎల్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా 3 లక్షల ఎల్‌ఈడీ వీఽఽధి దీపాలు అమర్చారని మంత్రి లోకేశ్‌ తెలిపారు. దేశంలో మరెక్కడా ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. వీటివల్ల ఏటా 333 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదాతో పంచాయతీలకు రూ.500 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని అంచనా. ఈ దీపాలన్నీ ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. వేసవి ఉదయం 5.30కి ఆరిపోయి.. సాయంత్రం 6.30కి వెలుగుతాయి. సీజన్‌ మారాక టైమ్‌ను మరోసారి సెట్‌ చేస్తారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...

pk 24042018

ఇక గత నలుగు రోజులుగా అయితే, కల్లు తాగిన కోతిలా, ట్విట్టర్ లో పడి హడావిడి చేస్తూ, బజారు మనుషుల కంటే హీనంగా, ప్రవర్తిస్తున్నాడు.. ఇవి పక్కన పెడితే, ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది.... అది అయిపోయిన తరువాత ఈ నెల 23 న చిత్తూరు పర్యటన అంటూ హడావిడి చేసాడు... అది కాన్సిల్ అయ్యింది అని, పవనే స్వయంగా ట్విట్టర్ లో చెప్పాడు... 15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో హోదా పై నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ నడుస్తుంది...

pk 24042018

ముందుగా ఇక పవన్, హోదా పై ఏ రకమైన ఉద్యమాలు చెయ్యడు... కేవలం ఎవరన్నా ఉద్యమాలు చేస్తే, వారికి సహకరిస్తాడు... ఇక నుంచి, రాష్ట్ర ప్రభుత్వం పై మాత్రమే దాడి చేస్తాడు... అయితే 23 న చిత్తూరు పర్యటన వాయిదా వెయ్యటానికి కారణం కూడా ఉంది... ఇదే చిత్తూరు జిల్లా తిరుపతిలో, చంద్రబాబు ఈ నెల 30న మోడీకి వ్యతిరేకంగా పెద్ద సభ పెడుతున్నారు... ఇది అతి పెద్ద సభ... దీనిని ఆపమని, మోడీ గవర్నర్ ను కూడా పంపించాడు... కాని చంద్రబాబు మాత్రం, వెనక్కు తగ్గలేదు... వెంటనే వైసిపీ రంగంలోకి దిగింది, ఈ నెల 30న నయవంచన సభని వైజాగ్ లో పెడుతున్నట్టు చెప్పింది... పవన్ కూడా, 30వ తారీఖే చిత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు... అటు జగన్ చేతే, ఇటు పవన్ చేతే బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఇది... వీలైతే, 30వ తారీఖే పవన్ పై చెప్పులతో కాని, రాళ్ళ దాడి కాని ప్లాన్ చేసారు... చంద్రబాబు తిరుపతిలో పెట్టే మీటింగ్ డైవర్ట్ చెయ్యాలని, ఇద్దరికీ ఆదేశాలు వచ్చాయి... చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ఎలా అయితే డైవర్ట్ చేసారో, 30న తిరుపతిలో జరిగే చంద్రబాబు మీటింగ్ డైవర్ట్ చెయ్యటానికి, జగన్, పవన్ పోటీ పడుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read