సైబర్ భద్రతా సవాళ్లను అధిగమించడంలో కొత్తగా ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఒక ముందడుగుగా భావించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బిల్డింగ్ మూడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఆవశ్యకతను ఐటీ అధికారులు వివరించారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు.

cbn hack 24042018 1

సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో క్లిష్టమైన, ప్రధానమైన సమస్యగా మారాయని వివరించారు. ఇలాంటి వాటికి సైబర్ రక్షణ కల్పించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి లైవ్‌లో అందుబాటులో ఉన్న కేంద్ర ఐటీ శాఖ అధికారులు సహాని బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు విషయాలు చర్చించారు. కేంద్ర ఐటీ శాఖ అధికారి సహాని ముఖ్యమంత్రికి వివరిస్తూ సైబర్ భద్రతతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లడం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అందుకు అభినందిస్తున్నానని తెలిపారు.

cbn hack 24042018 1

అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా ఒక ఏకో సిస్టం తయారవుతుందని, ఇప్పటికే సీసీ కెమెరాల పరిజ్ఞానం, డ్రోన్ల పరిజ్ఞానం ఉపయోగించడం, రియల్‌టైమ్ గవర్నెస్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థలను హ్యాక్‌ చేయాలని విద్యార్థులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లకు సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటులు ఎథిక‌ల్ హ్యాకింగ్ చేసి నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ మీద తాను తీసుకున్న చర్యలు ఎంత ఖటినంగా ఉన్నాయో చెప్తుంది... ఎవరన్నా విద్యార్ధులు ట్రై చెయ్యండి, చంద్రబాబు సవాల్ ను స్వీకరించండి...

ముఖ్యమంత్రితో ఉన్న వైరం పక్కన పెట్టి మరీ, ఆదివారం విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు గవర్నర్ నరసింహన్... కేంద్రం పంపించిన రాయబారం తీసుకువచ్చి చంద్రబాబుని కలిసారు గవర్నర్. ముఖ్యంగా కర్ణటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం... చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

delhi 24042018

అయితే దీని పై చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక, గవర్నర్ వెళ్ళిపోయారు...

delhi 24042018

అయితే, ఈ విషయాలన్నీ ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి, గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారు... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...

ఏపీ చేనేతకు బ్రాండ్ అబాసిడర్‌, హీరోయిన్ పూనమ్‌కౌర్ ఏపీ ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. రుషికేష్ గంగానది ఒడ్డున ప్రత్యేకంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కరోలీ బాబా ఆశ్రమంతో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా రావాలని పూనమ్‌కౌర్ కోరుకున్నారు. తెలంగాణాలో ఉంటున్న "కొంత మంది" తెలుగు సినిమా ఆక్టర్ లు, మన సమస్య అసలు పట్టించుకోపోగా, మరి "కొంత మంది" కుట్రలు కూడా చేస్తున్నారు... అలాంటి వారిని చూస్తే, పంజాబీ అమ్మాయి అయిన పూనమ్‌ కౌర్, చాలా మంచి పని చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున ధన్యవాదాలు చెప్తున్నారు. పూనమ్‌ కౌర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతకు బ్రాండ్ అబాసిడర్‌ వ్యవహరిస్తున్నారు... కొన్ని రోజుల కృతం ఆమె పుట్టిన రోజును కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి, చేనేత కార్మికుల మధ్యలో జరుపుకున్నారు... అలాగే, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామాను కలిసిన సందర్భంలో, చేనేత చీర బహుకరించి, చేనేత ప్రాముఖ్యత వివరించారు... ఈ రోజు, ఇలా ప్రత్యెక హోదా ఉద్యమానికి, తనకు తోచిన సాయం చేస్తున్నారు...

poonam 2304218

వారం రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, కొన్ని మాటలు ఆసక్తిని రేపాయి... ఆయుధాలు లేని వాళ్లతో యుద్ధం చేయకూడదని గురు గోవింద్‌ చెబుతారు. బలహీనులతో యుద్ధం చేయకూడదంటారు. ఏ వ్యక్తి అయినా ఓ అమ్మాయితో పోరాటం చేస్తున్నాడంటే, అతడు బలహీనుడని అర్థం. దిగజారిపోయిన వ్యక్తే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మోసం చేయాలనుకుంటాడు. అలాగని నేను తిరగబడి కక్ష సాధించేందుకు ఫూలన్‌ దేవిని కాదు కదా? అందుకే మోసం చేసేవాళ్లని దేవుడే చూసుకుంటాడని నమ్ముతాను’’ అని చెప్పారు. ‘‘నేను పోరాడుతున్నప్పుడే నా బలం ఏమిటో నాకు తెలుస్తుంది. ఎవరికీ హాని కల్గించే పనిని నేను చేయను. నాతో యుద్ధం చెయ్‌. ఏం జరుగుతుందో జరుగుతుంది అనుకుంటాను. మిమ్మల్ని ఓసారి కొట్టారనుకోండి. నొప్పి అనిపిస్తుంది. మళ్లీ కొడితే, మళ్లీ మళ్లీ కొడితే నొప్పికి మీరు అలవాటు పడిపోతారు. నా విషయంలో అదే జరిగింది అనుకుంటాను’’ అని స్పష్టం చేశారు.

poonam 2304218

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌కు విద్యా సంస్థలను తీసుకొచ్చారని, అందుకే తనలాంటి వాళ్లు చదువుకోగలిగారని అన్నారు. ఆయన వల్లే తాను నిఫ్ట్ లాంటి జాతీయస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నా అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై తన గౌరవాన్ని రాజకీయం చేయవద్దని, గురు గోవింద్‌ను గౌరవించినట్టే ఆయననూ గౌరవించానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడనని, తాను ఏది మాట్లాడినా దాన్ని రివర్స్‌లో తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

మన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకుని, వారితో డైరెక్ట్ గా కలవకుండా, ప్రజలని కన్ఫ్యుస్ చేస్తూ, బీజేపీ ఎలా గేమ్ ఆడిస్తుందో, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ముల ప్రయోగిస్తుంది... అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులకు విజయావకాశాలు లేకపోవటంతో లోపాయకారిగా జేడీఎస్‌ మద్దతు తీసుకుంటుంది... ముక్కోణ పోటీ సృష్టించి, తద్వారా లబ్ది పొందటానికి, వీలైతే ఎన్నికలు అయిన తరువాత, జేడీఎస్‌ తో కలిసి పనిచెయ్యటానికి కూడా సిద్ధమవుతుంది... సిద్ధరామయ్య ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మాత్రమే సిద్ధరామయ్య పోటీ చేస్తారని ప్రకటించారు. అక్కడ జేడీఎస్‌కు రహస్యంగా మద్దతివ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం...

bjp 23042018

అదే జరిగిన పక్షంలో సామాజిక వర్గాల లెక్కలు చూస్తే అక్కడున్న రెండున్నర లక్షల మంది ఓటర్లలో 70 వేల మంది ఒక్కళిగలు ఉన్నారు. ఓబీసీలు, దళితులు, ముస్లింలు కలిసి లక్షన్నర మంది ఉన్నారు. సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహించే కురుబ సామాజిక వర్గం ఓబీసీ కిందకు వస్తుంది. చాముండేశ్వరీ నియోజకవర్గంలో ఒక్కళిగల కారణంగా సిద్దరామయ్య ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యగా బాదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్యకు చెందిన కురుబ సామాజిక వర్గం బాదామీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడ నుంచి ధైర్యంగా పోటీ చేస్తున్నారు. దీని వల్ల బాగల్కోట్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కూడా నమ్ముతున్నారు. అయితే బాగల్కోట్ ప్రాంతంలో సిద్దరామయ్య ఆటలు సాగవని యడ్యూరప్ప వర్గం సవాలు చేస్తోంది. చాప కింద నీరులా బీజేపీ తన పని చేసుకుపోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

bjp 23042018

సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని జయాపజయాలపై అంచనాకు వచ్చేందుకు ఆరెస్సెస్ శ్రేణుల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఒక్కళిక సామాజిక వర్గం ఓట్లు ఏకమొత్తంగా జేడీఎస్ కు పడిన పక్షంలో ముక్కోణ పోటీ ఖాయమని బీజేపీ అంచనాకు వచ్చింది. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తోంది. జేడీఎస్‌కు బలమున్న ప్రాంతాల్లో తెరవెనుకగా ఆ పార్టీని ప్రోత్సహిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమయ్యాయి. బీజేపీ మద్దతు లభిస్తే తమకు కూడా ప్రయోజనం కలుగుతుందని జేడీఎస్ నేత దేవెగౌడ నమ్ముతున్నారు. సరిగ్గా మన రాష్ట్రంలో లాగే, కర్ణాటకలో కూడా, జేడీఎస్ పని కానిస్తుంది బీజేపీ... మరి వీళ్ళ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read