ఒక తల్లిని ఎవడు తిట్టినా, వాడు మూర్ఖుడుతో సమానం.. అది ఎవడూ హర్షించడు.. పవన్ తల్లిని, సినీ ఇండస్ట్రీలో ఉండే ఎవరో తిడితే, వెంటనే అందరూ ఖండించారు... మహేష్ కత్తి విషయంలో కూడా, పవన్ వెంటే ఉన్నారు అందరూ... పవన్ తన తల్లిని తిట్టాడు అని బాధపడటంలో తప్పు లేదు... ఎవరైనా బాధ పడతారు... ఈ విషయంలో, అందరూ పవన్ వెంటే ఉంటారు... అయితే, పవన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మాత్రం, ఎవరూ హర్షించరు... ఒక తల్లిని తిట్టమని లోకేష్ చెప్పినా, టీవీ9 చెప్పినా, ABN చెప్పినా, ఎవరు చెప్పినా అది తప్పు... కాని, ఆధారాలు చూపించకుండా, వారు చేపించారు, వీరు చేపించారు అని, ఇది ఒక రాజకీయ కుట్రగా చిత్రీకరించి, తన తల్లిని రాజకీయాలు కోసం వాడుకుంటే, ఎవరూ హర్షించరు.. ఏమైనా ఆధరాలు ఉంటే చూపించి మాట్లాడాలి... గాల్లో, గాలి మాటలు అందరూ చెప్తారు...

pk fans 21042018

ఇలాంటి గాలి మాటలు మాట్లాడే వారు, ప్రతి రోజు సోషల్ మీడియాలో లక్షా తొంబై మంది ఉంటారు... వారి మాటలు పట్టుకుని, తప్పుఒప్పులు బేరీజు వెయ్యలేం... ఏదైనా వాస్తవాలతో మాట్లాడాలి... తన తల్లిని అన్నారని, మూడు రోజుల తరువాత బయటకు వచ్చి హడావిడి చేస్తున్న పవన్ కు, తన ఫాన్స్ చేస్తున్న రచ్చ కనిపించటం లేదా ? తల్లి ఎవరికైనా తల్లే... మరి, అలాంటి మాటలు మాట్లాడారని, మీరు ఇంత బాధపడుతూ, న్యాయ పోరాటం చేస్తా అంటూ, మీ ఫాన్స్ ని రెచ్చగొట్టి టీవీ వాళ్ళ కార్ లు, ఓబి వ్యాన్ లు ధ్వంసం చేపిస్తున్నారే.. మరి, మీ ఫాన్స్ తిట్టే బూతులుకి ఏమి చెయ్యాలి ? ఇప్పుడు ఇష్యూ శ్రీ రెడ్డి ఉదంతం కాబట్టి, ఒకసారి శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్టింగ్ లు కింద , మీ ఫాన్స్ పెట్టే కామెంట్స్ చూడండి..

pk fans 21042018

మీకు వ్యతిరేకంగా ఏమన్నా రాస్తే, మా పైన, మా అమ్మల పైనా, కూతుళ్ళ పైనా, పెళ్ళాల పైనా, మీ ఫాన్స్ బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారు... మరి, ఇది ఎవరు చేపిస్తున్నారు అనుకోవాలి ? మీ అమ్మని తిట్టమని చంద్రబాబు చెప్పాడు, టీవీ వాళ్ళు చెప్పారు అని మీరు అంటున్నారు కదా.. మరి, మీకు వ్యతిరేకంగా ఏమన్నా రాస్తే, మా పైన, మా అమ్మల పైనా, కూతుళ్ళ పైనా, పెళ్ళాల పైనా, మీ ఫాన్స్ తిడుతున్న బూతులు, మీరు చెప్తే రాస్తున్నారా ? మీ పార్టీ వాళ్ళు చెప్తే, ఆ బూతులు తిడుతున్నారా ? మేము ఎవరికి చెప్పుకోవాలి ? సామాన్యలకు, మీ లాగా లీగల్ గా వెళ్ళే స్థోమత కూడా ఉండదు.. మరి మీ ఫాన్స్ నుంచి, ఇలాంటి బూతులకు ఎవరు బాధ్యలు ? ఇది ఎవరి కుట్ర ? దీనికి సమాధానం చెప్తే, మీ తల్లి గారి పై, చేసిన విమర్శలు, వాళ్ళు ఎందుకు చేసారో, మీకు సమాధానం దొరుకుంతుంది... ఇలాంటి చెండాలం అంతా నడిపించే టైం, చంద్రబాబుకి ఉందని మీరు భావిస్తే, మీ తెలివికి వందనాలు... జై హింద్...

రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ సీఎం చంద్రబా బు చేసిన దీక్షలో గుంటూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య కూడా ఆసాంతం పాల్గొన్నారు. రాష్ట్రం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 96 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో పట్టుదలతో ఉదయం గం.5.30కే గుంటూరు నుంచి విజయవాడకు వచ్చారు. దీక్ష ప్రారంభ సమయం కంటే పావు గంట ముందే చేరుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి ఆయన పక్కనే ఆశీనులై సాయంత్రం 7 గంటల వరకు మంచినీళ్లు కూడా ముట్టకుండా, కూర్చున్న చోట నుంచి కదలకుండా దీక్ష నిర్వహించి తాను వయసు రీత్యా వృద్ధుడినేకాని మానసికంగానూ, ఆరోగ్యపరంగానూ యువకుడినేని చాటుకున్నారు.

cbn pattudala 21042018

చంద్రబాబు దీక్ష ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ప్రారంభంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శివరామకృష్ణయ్య పట్టుదలను ప్రశంసించారు. గుజరాత్‌లోని మహాత్మాగాంధీ సేవాగ్రాంలో హిందీ కోర్సు చదివిన శివరామకృష్ణయ్య ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వంటివారు శివరామకృష్ణయ్య శిష్యులే. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో జన్మించిన పావులూరి, ఆచార్య ఎన్‌జీ రంగా సహచరుడిగా గాంధీకి దగ్గరయ్యారు. కావూరులోని వినయాశ్రమంలో కొద్ది కాలం మహాత్మాగాంఽధీతో కలసిపనిచేసే అవకాశం లభించింది.

cbn pattudala 21042018

దీంతో ఆయన మహాత్మాగాంధీ శిష్యుడిగా మారిపోయారు. ఆ తరువాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో గౌతు లచ్చన్న, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో పాల్గొని ఆలీపూర్‌ జైలులో ఉన్నారు. ఎంతో సాధారణ జీవితం గడిపే శివరామకృష్ణయ్య ఈ వయస్సులో కూడా ప్రయాణం చేయాల్సివస్తే కొడుకులో, మనవళ్లో పంపే కార్ల కోసం ఎదురు చూడరు. ఓపిగ్గా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రధాని మోదీకి సద్బుద్ధి కలగచేయాలని, సీఎం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పార్టీలకు అతీతంగా అందరు కలిసి మద్దతు ఇవ్వాలని శివరామకృష్ణయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పుట్టినరోజు అయినా సరే మోదీ మనస్సును గాంధేయ సిద్దాంతాలతో కరిగించాలని దీక్ష చేపట్టడం విశేషమన్నారు.

ఎక్కడో హైదరాబాద్ అనే సిటీ... అది తెలంగాణా రాష్ట్రం... ఎవరో సినిమా ఫీల్డ్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్... తనకు జరిగిన అన్యాయం పై పోరాడుతుంది... అర్ధ నగ్న నిరసన తెలిపింది... పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు, సినిమాల్లో పెద్ద హీరో కాబట్టి, మీరు చొరవ తీసుకోండి అని ఒక మాట అంది... దానికి మన హీరో గారు, మీడియా సమావేశంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, నేనేమి చెయ్యను, వెళ్లి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో, టీవీల ముందు ఈ హడావిడి ఏంటి అంటూ, జుట్టు పైకి ఎగరేసుకుంటూ సమాధానం చెప్పారు... మన హీరో గారి సమాధానానికి, ఆ మహిళ రియాక్ట్ అయ్యింది... నువ్వు కూడా ప్రత్యెక హోదా పై నిరసనలు ఎందుకు, ప్రజా సమస్యల పై నిరసనలు ఎందుకు, వెళ్లి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, ఇంట్లో కూర్చోవచ్చుగా, ఈ హడావిడి ఎందుకు అంటూ, రియాక్ట్ అయ్యి, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసింది...

pavan logic 21042018

ఆ మహిళ చేత ఆ వ్యక్తిగత విమర్శలు చేపించింది నేనే అంటూ, ముంబైలో ఉండే రాం గోపాల్ వర్మ చెప్పాడు... రాం గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ ని ఎలా ఎసుకుంటాడో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం... వర్మకి, మెగా ఫ్యామిలికి ఎప్పుడూ గొడవలే... ఇలాంటి పరిస్థుతుల్లో, పవన్ ఒక సినిమా వాడు, ఆటను బెంగాలి అమ్మాయిలతో మసాజ్ లు చేయించుకుంటాడు అని చెప్పింది ఒక సినిమా అమ్మాయి, వర్మ సినిమా వాడు... శ్రీ రెడ్డి చేసిన ఎదో వ్యాఖ్యలకు, పవన్ స్పందిస్తే, పవన్ స్పందన పై ఆ అమ్మాయి, పవన్ ని వ్యక్తిగతంగా తిడితే, ఈ సినిమా గోలను తీసుకువచ్చి, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్... ఇవన్నీ, చంద్రబాబు చేపించాడు అంటూ ట్వీట్ లు పెట్టాడు...

pavan logic 21042018

నిన్ను అలా రియాక్ట్ అవ్వమని చంద్రబాబు చెప్పాడా ? నువ్వు అలా రియాక్ట్ అయితే, ఆ అమ్మాయి ఎవరో రియాక్ట్ అయ్యింది... ఇదంతా జరిగింది హైదరాబాద్ లో... అయితే, పవన్ వచ్చి, చంద్రబాబుని నిందిస్తున్నాడు... నిన్ను గెలిపించింది ఇందుకేనా చంద్రబాబు అంటున్నాడు ? నువ్వు రొచ్చులో ఉండే హైదరాబాద్ లో, ఎవరు ముఖ్యమంత్రి ? అసలు హైదరబాద్ లో జరిగే దానికి, చంద్రబాబుకి ఏమిటి సంబంధం... హైదరాబాద్ లో మీరు రోడ్డున పడి కొట్టుకుంటే, చంద్రబాబుని ఎందుకు గెలిపించాడు అంటావ్ ఏంటి ? ఈ తింగర లాజిక్ లు ఏంటి ? చంద్రబాబు ఎదో చేసాడని గాలి మాటలు కాకుండా, ఏదన్నా ప్రూఫ్ ఉంటే బయట పెట్టు... లేకపోతే నువ్వు ఉండే హైదరబాద్ లో, ఉండే ముఖ్యమంత్రి చేత, ఎంక్వైరీ వేపించు... ఢిల్లీలో నీ గుట్టు ఎవడి చేతిలో ఉందో, అతని చేత బాబు పై సిబిఐ ఎంక్వైరీ వేయించు... అంతే కాని, ఈ తింగరి లాజిక్ లు బయట పెట్టి, మా ముఖ్యమంత్రి టైం వేస్ట్ చెయ్యమాక...

మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మా పార్టీలో చేరుతున్నారు అంటూ హడావిడి చేస్తున్న బీజేపీ బ్యాచ్ కి, తాజాగా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు... లక్ష్మీనారాయణ ఇమేజ్ తో, చంద్రబాబు వోటు చీల్చి, చంద్రబాబుని మళ్ళీ సియం అవ్వకుండా చేస్తాం అంటూ, హడావిడి చేస్తున్న బీజేపీ నేతకలు, ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది... ఒక పక్క బీజేపీ నేతలు ప్రత్యెక హోదా అవసరం లేదు అని ప్రచారం చేస్తుంటే, లక్ష్మీనారాయణ మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అంటూ, తాజాగా వ్యాఖ్యలు చేసారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

lakshmi 21042018

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. సుస్థిర ప్రభుత్వం, మంచి పరిపాలన ప్రజలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరాలని దేవుడిని కోరుకున్నాని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీలపై వివిధ మార్గాల్లో... రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వినిపిస్తోందని, తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు మీడియాకు వెల్లడిస్తానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలపై అధ్యయనం చేసిన తరువాత... తన ప్రణాళికను ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

lakshmi 21042018

జీవితం చాలా సుఖంగా అనిపించింది. ఆ క్షణంలోనే రిజైన్ చేయలని భావించి మరుసటి రోజే తన ఉద్యోగానికి రిజైన్ చేశానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఆ క్షణంలోనే డిసైడ్ అయి.. తన పదవికి రాజీనామా చేసి సామాజిక సేవ చేయాలని భావించాను అన్నారు. ఎన్నో గొప్ప కేసులలో దర్యాప్తు చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగ కాలంలో మంచి పదవి… రూ.3లక్షల జీతం, కారు, డ్రైవర్, ఇలా ఎక్కడికి వెళ్లినా గౌరవం ఇవన్నీ తనకు చాలా సుఖం అనిపించిందని అన్నారు. అందుకే సుఖం అని భావించిన ఆ క్షణంలోనే రిజైన్ చేయాలని భావించినట్లు వెల్లడించారు లక్ష్మీనారాయణ. అలాగే సామాజిక చేయాలన్న భావనతోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఇటీవల వీఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read